అమ్మ చెప్పింది
అమ్మ చెప్పింది గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో 2006 లో విడుదలైన చిత్రం. ఇందులో శర్వానంద్, సుహాసిని, నాగేంద్రబాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను గుణ్ణం ఊర్మిళ, సాయి కొర్రపాటి నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.
అమ్మ చెప్పింది | |
---|---|
దర్శకత్వం | గుణ్ణం గంగరాజు |
రచన | గుణ్ణం గంగరాజు |
నిర్మాత | గుణ్ణం ఊర్మిళ, కొర్రపాటి సాయి |
తారాగణం | నాగేంద్ర బాబు, శర్వానంద్, తనికెళ్ళ భరణి, సుహాసిని, కృష్ణ భగవాన్, శ్రేయ రెడ్డి, ఎల్.బి.శ్రీరామ్ |
ఛాయాగ్రహణం | సందీప్ గుణ్ణం |
కూర్పు | మోహన్ రామారావు |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
విడుదల తేదీ | జూలై 28, 2006 |
భాష | తెలుగు |
కథ
మార్చుబోస్ పూర్తిగా మానసిక పరివర్తన చెందని యువకుడు. అతని తండ్రి రాకెట్ సెంటర్ లో శాస్త్రవేత్త. తల్లి అతన్ని గారాబంగా చూసుకుంటూ ఉంటుంది. అతని సోదరుడు చదువులో ముందుంటాడు. బోస్ ని కాలనీలో అందరూ చిన్నచూపు చూస్తుంటారు. ఐఎస్ ఐ సంస్థ తన తండ్రి పనిచేసే రాకెట్ సెంటర్ లో ఓ కార్యక్రమం సందర్భంగా బాంబు పేలుడుకు కుట్ర చేస్తారు. బోస్ సాహసాలతో వారిని అడ్డుకోవడంలో సహాయపడతాడు. అతని తల్లి అతన్ని చూసి గర్విస్తుంది.
తారాగణం
మార్చు- బోస్ గా శర్వానంద్
- సుహాసిని, బోస్ తల్లి
- నాగేంద్రబాబు
- తనికెళ్ళ భరణి
- వంటవాడిగా కృష్ణభగవాన్
- రజియాగా శ్రియా రెడ్డి
- ఎల్. బి. శ్రీరామ్
- పవన్ మల్హోత్రా
- గంగాధర్ పాండే
- సుమన్
- దేవదర్శిని
- నర్సింగ్ యాదవ్
నిర్మాణం
మార్చుగుణ్ణం గంగరాజు ముందు సినిమాలు లిటిల్ సోల్జర్స్ (1996), ఐతే (2003), అనుకోకుండా రోజు (2005) బాక్సాఫీసు వద్ద అంతగా విజయవంతం కాలేకపోయాయి. గంగరాజు ఒక ఇంటర్వ్యూలో తన ముందు సినిమాల్లో ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ కాలేకపోయానని చెప్పాడు.[1]
సంగీతం
మార్చుఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.
వస్తావా నాతో , గానం: శ్రేయా ఘోషల్, హరీష్ రాఘవేంద్ర
ఎవరేమైనా అన్నీవినకు, గానం.బాంబే జయశ్రీ
ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ , గానం.హరీష్ రాఘవేంద్ర , ఎల్ బి శ్రీరామ్
తిరుపతి పెంచిన మీసం , గానం.కీరవాణి
మాటలతో స్వరాలే , గానం: ప్రణవి
అమ్మగా కోరుకుంటున్నా, గానం: ప్రణవి
డాట్ డాష్ , రచన: ఎం ఎం కీరవాణి
జనగణమన , గానం: హరీష్ రాఘవేంద్ర .
మూలాలు
మార్చు- ↑ "Chitchat with Gangaraju Gunna". Idlebrain.com. 2006-07-27. Retrieved 2008-03-08.