అయస్కాంత చికిత్స

ఆధునిక వైద్య విధానాల వెల్లువలో ప్రాచీన కాలపు ప్రకృతి వైద్య విధానాలెన్నో మరుగున పడుతూ వచ్చాయి. కాకపోతే మందుల దుష్ప్రభావాల గురించిన అవగాహన పెరిగే కొద్దీ మనిషి మళ్లీ ప్రాచీన చికిత్సల వైపు మొగ్గుచూపుతున్నాడు. పరిస్థితి సర్జరీదాకా వచ్చినప్పుడు ఆధునిక వైద్యాలు ఎలాగూ తప్పవు. కానీ, మిగతా పరిస్థితుల్లో ప్రకృతి వైద్య విధానాల ద్వారానే సమస్యనుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఆక్యు ప్రెషర్ , మాగ్నెట్ థెరపీ వంటి వైద్య విధానాలతో కొంత అవగాహన ఏర్పరుచుకుంటే ఇంటివద్దే కొన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చునంటున్నారు నిపుణులు. అందులో భాగంగా 'మాగ్నెట్ థెరపీ' గురించిన వివరాలు, వాటి ప్రయోజనాలను తెలియచేస్తున్నారు ప్రకృతి వైద్య చికిత్స నిపుణులు డాక్టర్ వై. కృష్ణమూర్తి.

అయస్కాంత ఉంగరం

వైద్య విధానం

మార్చు

భూమి అతిపెద్ద అయస్కాంత క్షేత్రం. కాకపోతే అది నేరుగా వైద్య చికి త్సలకు ఉపయోగపడదు. అందుకే అయస్కాంతాలను ప్రత్యేకంగా తయారుచేసి వైద్య చికిత్సలకు ఉపయోగించడం జరుగుతూ ఉంది. అయస్కాంతానికి సహజంగానే ఇనుమును ఆకర్షించే గుణం ఉంటుంది. మన శరీరంలోని హిమోగ్లోబిన్‌లోని ' హీమ్' ఇనుమే కదా:! ఆ ఇనుమును ప్రభావితం చేయడం ద్వారా అయస్కాంతం పలురకాల వ్యాధుల్ని నయం చేస్తుంది.

ఏ కారణంగానైనా శరీరం వ్యాధిగ్రస్తమైనప్పుడు ఒక్కోసారి శరీరంలోని కొన్ని భాగాలకు రక్తప్రసరణ సరిగా జరగదు. ఈ స్థితిలో హిమోగ్లోబిన్ అవసరమైనంత అందక ఆ భాగం లో పోషణ సరిగా జరగదు. దీనివల్ల ఆయాభాగాలు బిగుసుకుపోవడం గానీ, వాపు, నొప్పి వంటి సమస్యలు గానీ మొదలవుతాయి. ప్రత్యేకించి ఎముకలకు, కీళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలకు చాలాసార్లు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలే కారణం కావచ్చు. మాగ్నెట్ థెరపీ ద్వారా లివర్‌ను ఉత్తేజితం చేస్తే శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. అయస్కాంత వైద్యం సహాయంతో రక్తప్రసరణ పెరిగి అక్కడ నిలిచిపోయిన చెడురక్తం గుండెకు వెళ్లి శుద్ధి అవుతుంది. దీనివల్ల కీళ్ల నొప్పి, వాపు, పెళుసుతనం ఇవన్నీ తొలగిపోతాయి.

బెల్టు రూపంలో....

మార్చు

లో-పవర్, మీడియం-పవర్, హైపవర్ అంటూ మూడు రకాల అయస్కాంతాల్ని మనం తయారుచేసుకుంటున్నాం. మూడేళ్ల లోపు పిల్లలకు లో-పవర్ అయస్కాంతాలు, 3నుంచి 13 ఏళ్లలోపు పిల్లలకు మీడియం-వవర్ అయస్కాంతాలు, 13 ఆ పై వయస్కులకు హై-పవర్ అయస్కాంతాలను ఉపయోగించడం ద్వారా పలు రకాల వ్యా«ధు లు నయమవుతాయి. అయస్కాంతాలను ఉపయోగించి రూపొందించే కొన్ని రకాల బెల్టులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మ్యాగ్నెటిక్ హెడ్‌బెల్టు, థైరాయిడ్ బెల్టు, నీ- బె ల్టు, సర్వైకల్, లంబార్ స్పాండిలోసిస్ బెల్టులు ఇలా పలురకాలుగా లభిస్తున్నాయి.

అధిక రక్తపోటు, మధుమేహాలకూ...

మార్చు

అలాగే అ«ధిక రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించే బెల్టులు కూడా ఇప్పుడు లభిస్తున్నాయి. మధుమేహాన్ని అదుపు చేయడానికి పాంక్రియాస్ పైన రోజూ రెండు గంటల సేపు ఒక మూడు మాసాల పాటు కట్టుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల పాంక్రియాస్ ఉత్తేజితమై, ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధం అవుతుంది. మూడునుంచి ఆరు మాసాల పాటు ఈ చికిత్స తీసుకుంటే ఇన్సులిన్ గానీ, మాత్రలుగానీ అవసరం లేకుండానే మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. అలాగే అధికరక్తపోటును నియంత్రించే విధానాలు కూడా మాగ్నెట్ థెరపీలో ఉన్నాయి.

పాదాలను అయస్కాంతాల మీద పెట్టడం ద్వారా రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఒకవేళ లివర్ సమస్యల కారణంగా అధికరక్తపోటు వచ్చిఉంటే కిడ్నీలకు మాగ్నెట్ థెరపీ ఇవ్వవలసి ఉంటుంది. కాకపోతే అయస్కాంత చికిత్స తీసుకోవడంతో పాటు క్రమం తప్పని వ్యాయామం, ఆహార నియమాలు కూడా పాటించవలసి ఉంటుంది. మధుమేహం నియంత్రణలోకి రావడం మాత్రమే కాదు, మధుమేహం వల్ల కలిగే దృష్టి సమస్యలు, పెరిఫెరల్ న్యూరోపతి వంటి నాడీ సంబంధిత సమస్యలు, రక్తనాళాల సమస్యలు కూడా తొలగిపోతాయి.

పెయిన్‌కిల్లర్స్‌తో పనిలేదు

మార్చు

ఒంటి నొప్పులనగానే పెయిన్‌కిల్లర్స్‌కు సిద్ధమైపోతారు. ఎక్కువ కాలం ఈ మాత్రలు వేసుకుంటే ఎన్ని దుష్ప్రభావాలు ఉంటాయో దాదాపు అందరికీ తెలుసు. కానీ, నొప్పిని భరించలేక వాటిని అలా ఏళ్ల పర్యంతం వాడుతూనే ఉంటారు. ఏ దుష్ప్రభావాలూ లేకుండా కేవలం మాగ్నెట్ థెరపీతోనే పలురకాల ఒంటినొప్పుల్ని, కీళ్లనొప్పుల్ని, నడుము నొప్పిని తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఈ నొప్పులకు ఒకవేళ శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలే కారణమైతే వాటిని తొలగించడానికి లివర్‌ను ఉత్తేజితం చేయవలసి ఉంటుంది.

అందుకు మాగ్నెట్ థెరపీతో పాటు మాగ్నెట్ జలం కూడా సేవించవలసి ఉంటుంది సమస్య తీవ్రంగా ఉంటే ప్రకృతి చికిత్సలోని మరికొన్ని ఇతర విధానాలు కూడా పాటిస్తే సమస్య చాలా వేగంగా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. చెవి సంబంధిత సమస్యలు కూడా మాగ్నెట్ థెరపీ ద్వారా తొలగిపోతాయి. చికిత్సా విధానాల్లో నేరుగా అయస్కాంతాన్ని ఉపయోగించడమే కాకుండా, అయస్కాంత జలం, అయస్కాంత తైలాలతో కూడా చికిత్సలు ఉంటాయి.

వనరులు

మార్చు

- రెడ్ క్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్,హైదరాబాద్,