అర్జున్ సింగ్ గుర్జర్

భారతీయ ఉద్యమకారుడు

అర్జున్ సింగ్ గుర్జర్ (1910 – 1947) భారత స్వాతంత్ర్య సమర యోధుడు. అతను హర్యానాలోని సిర్సాలో జన్మించాడు.[1]

స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర మార్చు

అర్జున్ సింగ్ తండ్రి రామ్ కరణ్ గుర్జర్ ఆర్థిక పరిస్థితి బాగుండేది కాదు. దాంతో అతనికి చదువుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి.

గుర్జర్ హిందీలో పరిజ్ఞానం సంపాదించాడు. పట్టణ ప్రాంత రాజకీయ వాతావరణం అతనికి స్ఫూర్తి నిచ్చింది. దాంతో అతను కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కావడం మొదలు పెట్టాడు. 1935-36 సమావేశాల్లో అతను అధికారికంగా కాంగ్రెసు పార్టీలో చేరాడు. పార్టీలో క్రియాశీల కార్యకర్తగా మారాడు.

సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం మార్చు

స్వాతంత్ర్య పోరాటంలో అతని పాత్ర పెరుగుతూ పోయింది. పట్టణంలో అతని పరపతి ప్రతిష్ఠ పెరిగింది. గౌరవనీయమైన స్థానాన్ని పొందాడు. 1941 లో వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో అతనిని అరెస్టు చేసారు. ఫిరోజ్‌పూర్‌ లోని జిల్లా జైలులో కఠినమైన జైలు శిక్ష అనుభవించాడు.  జైలు నుండి విడుదలైన తర్వాత, 1942 లో మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. అతడిని మళ్లీ అరెస్టు చేశారు. ముల్తాన్‌లోని పాత సెంట్రల్ జైలులో ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. స్వాతంత్య్రం సాధించే వరకు పోరాటంలో అతను ముందు వరుసలో ఉన్నాడు. [2]

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొద్ది రోజులకే గుర్జర్ మరణించాడు.

మూలాలు మార్చు

  1. Gurjar, Arjun Singh. "Arjun Singh Gurjar news archive - The Bahamas". من الأشهر اليوم؟ | Who is popular today? (in ఇంగ్లీష్). Retrieved 2022-05-31.
  2. Gupta, Jughal Kishore (1991). History of Sirsa Town. Atlantic Publishers. p. 214.