అలకాపురి హిందూ మతంలో "'అలక"' (సంస్కృతం: अलक) అనే పౌరాణిక నగరం. ఇది కుబేరుడు నివాసము. కుబేరుడు యక్షుల రాజు, సంపదకు యజమాని. అతని సేవకులను యక్షులు అని పిలుస్తారు.[1] మహాభారతం ఈ నగరాన్ని యక్ష రాజ్యం రాజధానిగా పేర్కొంది. దేవతల రాజు ఇంద్రుడు రాజధానికి అమరావతి నిర్మాణంలో, సంపదలో, మొత్తం శోభలలో ఈ నగరం ప్రత్యర్థి. ఇది కాళిదాసు ద్వారా విరచితమైన ప్రసిద్ధ మాటలు కవితల గ్రంథం అయిన మేఘదూతలో పేర్కొనబడింది.[2] సంస్కృతంలో అలక అంటే గిరజాల, జుట్టు, కుచ్చు అని అర్థం.[3] అలకా అనేది హిందూ బాలికలకు కూడా ఒక సాధారణ పేరు.[3]

కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడు. విశ్రవసువుకి జన్మించాడు కాబట్టే ఈయనను వైశ్రవణుడు అని పిలుస్తారు. వైశ్రవణుడు పూర్వ జన్మలో గుణనిధి అనే పేరుతో జీవిస్తూ తన జీవిత చివరి కాలంలో ఉపావాస దీక్ష చేసి శివాలయంలో దీపారాధన చేస్తూ ప్రాణం విడిచాడు. ఈ పుణ్యఫలంవల్ల మరుజన్మలో వైశ్రవణుడిగా జన్మించడు. అతను ఈశ్వరానుగ్రహం పొందడానికి కాశీ నగరానికి వచ్చి గంగాతీరంలో తీవ్రమైన తపస్సు చేశాడు. అతని కఠోర తపస్సుకు మెచ్చిన శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుని అమిత ప్రకాశాన్ని చూడలేక వైశ్రవణుడి కళ్లు మూతపడ్డాయి. దీంతో శివయ్య పాదాలను దర్శించుకోడానికి తనకు చూపు ప్రసాదించమని అతడు వేడుకున్నాడు. అర్థనారీశ్వరుని దర్శించి పార్వతి వంక చూసి అసూయపడ్డాడు. దీనిని గ్రహించిన ఆమె ఏ కంటితో వంకరగా చూసాడో ఆ కన్ను పోతుందని శాపం ఇచ్చింది. అసూయ ఎలాంటి వారికైనా ప్రమాదకారి అని చెప్పడానికి ఇలా చేసినట్లు చెబుతుంది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు అతనిని ఆశీర్వదించి నవనిథులకు అధిపతిని చేసారు. కైలాసానికి సమీపంలో అలకానగరం రాజధాని అవుతుందని చెప్పి అక్కడికి రావలసినదిగా పరమేశ్వరుడు అతనిని ఆజ్ఞాపించాడు పరమేశ్వరును ఆజ్ఞ ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ అలకాపురిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు.[4]

మూలాలు

మార్చు
  1. (Kramrisch, Stella). 1994. The Presence of Siva, p.137
  2. Meghadūta
  3. 3.0 3.1 Meaning and origin of name Alaka
  4. "కుబేరుడికి అంత సంపదలెలా వచ్చాయో తెలుసా?". Samayam Telugu. Retrieved 2020-06-27.
"https://te.wikipedia.org/w/index.php?title=అలకాపురి&oldid=4010642" నుండి వెలికితీశారు