అలాస్కా గణేశ దేవాలయం

ఉత్తర అమెరికాలోని ఎంకరేజ్‌లో ఉన్న హిందూ దేవాలయం.

అలాస్కా గణేశ దేవాలయం, ఉత్తర అమెరికాలోని ఎంకరేజ్‌లో ఉన్న హిందూ దేవాలయం.[1] ఈ దేవాలయంలో వినాయకుడితోపాటు దుర్గ, రాముడు కొలువై ఉన్నారు.[2][3]

అలాస్కా గణేశ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:అలాస్కా
ప్రదేశం:ఎంకరేజ్‌
అక్షాంశ రేఖాంశాలు:61°09′34″N 149°57′17″W / 61.159402°N 149.954632°W / 61.159402; -149.954632

చరిత్ర మార్చు

1995లో డౌన్‌టౌన్ ఎంకరేజ్‌ ప్రాంతంలో పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి హిందువులు ఒకప్రాంతంలో సమావేశమవడం ప్రారంభించారు. 1999లో, ఎంకరేజ్ చర్చ్ ఆఫ్ రిలిజియస్ సైన్స్‌లో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. శివయ్య సుబ్రహ్మణ్యస్వామి గణేషుడి విగ్రహాన్ని విరాళంగా అందించాడు. దాంతో 2000లో అలాస్కాలోని గణేశ దేవాలయం నాన్ ప్రాఫిట్ ఛారిటీ, మతపరమైన సంస్థగా నమోదు చేయబడింది.[4] 2003లో, రాస్ప్‌బెర్రీ రోడ్‌లో దేవాలయాన్ని నిర్మాణంకోసం ఒక ఆస్తిని కొనుగోలు చేసి, పునరుద్ధరించారు. ఆ తరువాత అనేక దేవతామూర్తులను ప్రతిష్ఠించి, 2011లో ప్రారంభించారు.[5] ఈ ఆలయం ఉదయం 12:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల మధ్య ప్రజలకు తెరిచి ఉంటుంది.[6]

మూలాలు మార్చు

  1. "Sri Ganesha Temple, Alaska". Sakalam - Hindu Blog. Retrieved 2022-04-03.
  2. "Sri Ganesth Temple of Alaska Timings and Address". templesinindiainfo. 10 April 2018. Retrieved 2022-04-03.
  3. "Sri Ganesha Temple of Alaska". protibeshi. Archived from the original on 2020-02-13. Retrieved 2022-04-03.
  4. "Sri Ganesha Temple of Alaska". charitynavigator. Retrieved 2022-04-03.
  5. Thompson, Chris (15 September 2015). "Chris Thompson: A visit to the northernmost Hindu temple in the world". adn. Retrieved 2022-04-03.
  6. "Sri Ganesha Temple Of Anchorage, Alaska". Retrieved 2022-07-03.