అలా మొదలైంది (సినిమా)

(అలా మొదలైంది నుండి దారిమార్పు చెందింది)

అలా మొదలైంది నందినీ రెడ్డి దర్శకత్వంలో 2011లో విడుదలైన చిత్రం. ఇందులో నాని, నిత్య మేనన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా దర్శకురాలిగా నందినీ రెడ్డికి మొదటిది.[2] ఈ సినిమాను కె. ఎల్. దామోదర ప్రసాద్ శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. వివేక్ కూచిభొట్ల ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. కల్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. మార్తాండ్. కె. వెంకటేష్ కూర్పు బాధ్యత వహించగా అర్జున్ జెనా కెమెరామెన్ గా పనిచేశాడు.

అలా మొదలైంది
Ala Modalaindi movie poster.jpg
దర్శకత్వంనందినీ రెడ్డి
స్క్రీన్ ప్లేనందినీ రెడ్డి
కథనందినీ రెడ్డి
నిర్మాతకె. ఎల్. దామోదర ప్రసాద్
తారాగణంనాని
నిత్యా మీనన్
స్నేహా ఉల్లాల్
కృతి కర్బంద
రోహిణి
ఉప్పలపాటి నారాయణరావు
ఆశిష్ విద్యార్థి
తాగుబోతు రమేశ్
ఛాయాగ్రహణంఅర్జున్ జెనా[1]
కూర్పుమార్తాండ్. కె. వెంకటేష్
సంగీతంకల్యాణి మాలిక్
విడుదల తేదీ
2011 జనవరి 21 (2011-01-21)
భాషతెలుగు

కథసవరించు

గౌతం బెంగళూరు వెళుతుండగా ఒక వ్యక్తి అతన్ని అపహరిస్తాడు. గౌతం అది ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. ఆ కిడ్నాపర్ గన్ గురి పెట్టె పాట పాడమనీ, లేదా కథ చెప్పమని బెదిరిస్తాడు. అప్పుడు గౌతం తన కథ చెప్పడం ప్రారంభిస్తాడు.

తారాగణంసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం - నందినీ రెడ్డి
  • మాటలు - లక్ష్మీ భూపాల్
  • సంగీతం - కల్యాణి మాలిక్

పాటలుసవరించు

మూలాలుసవరించు

  1. "Ala Modalaindi film review - Telugu cinema Review - Nani & Nitya Menon". www.idlebrain.com. Archived from the original on 2019-12-09. Retrieved 2020-06-24.
  2. "Ala Modalaindi - Nani, Nitya Menon, Sneha Ullal, Kriti Kharbanda and others - 123telugu.com". www.123telugu.com. Retrieved 2020-06-24.