అల్లూరి (2022 సినిమా)

అల్లూరి 2022లో రూపొందుతున్న ఫిక్షనల్ బయోపిక్ సినిమా. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్‌ వర్మ దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, సుమన్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ ను 2022 జులై 1న,[2] ట్రైలర్‌ను జులై 4న విడుదల చేశారు.[3]

అల్లూరి
దర్శకత్వంప్రదీప్ వర్మ
రచనప్రదీప్ వర్మ
కథప్రదీప్ వర్మ
నిర్మాతబెక్కెం వేణుగోపాల్
తారాగణం
ఛాయాగ్రహణంరాజ్ తోట
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంహర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాణ
సంస్థ
లక్కీ మీడియా
విడుదల తేదీs
23 సెప్టెంబరు 2022 (2022-09-23)(థియేటర్)
7 అక్టోబరు 2022 (2022-10-07)(ఓటీటీ)[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

అల్లూరి సీతారామరాజు (శ్రీవిష్ణు) నిజాయితీ గల పోలీస్ ఇన్స్పెక్టర్. తన నిజాయితీ వల్ల తరచుగా బదిలీలు అవుతూ వైజాగ్ చేరుకుంటాడు. అక్కడ ఎంపీ కొడుకు ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన అతడికి జనం మధ్య శిక్ష వేస్తాడు, దింతో చట్టాన్ని అతిక్రమించి అతను చేసిన పనికి ట్రాఫిక్ కు బదిలీ అవుతాడు. ఆయన నిజాయితీని గుర్తించిన ఒక పోలీస్ కమిషనర్ (సుమన్) అతడిని హైదరాబాద్ కు రప్పిస్తాడు. హైదరాబాద్ వచ్చిన అతడికి ఏయే సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు ? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • సమర్పణ : బెక్కెం బబిత
 • బ్యానర్: లక్కీ మీడియా
 • నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రదీప్ వర్మ
 • సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
 • సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే
 • ఎడిటర్ : ధర్మేంద్ర కాకరాల
 • ఆర్ట్ డైరెక్టర్ : విఠల్ గోశాల
 • ఫైట్స్ : రామ్ క్రిషన్
 • సాహిత్యం : గోసాల రాంబాబు
 • సౌండ్ ఎఫెక్ట్స్ : కె రఘునాథ్

మూలాలు

మార్చు
 1. "'అల్లూరి' ఓటీటీలోకి వచ్చేశాడు". 7 October 2022. Archived from the original on 8 October 2022. Retrieved 8 October 2022.
 2. Namasthe Telangana (1 July 2022). "'అల్లూరి' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్‌.. మొద‌టి సారిగా పోలీస్ పాత్ర‌లో శ్రీవిష్ణు". Archived from the original on 4 July 2022. Retrieved 4 July 2022.
 3. V6 Velugu (4 July 2022). "గ్రాండ్గా శ్రీవిష్ణు 'అల్లూరి' టీజర్ విడుదల". Archived from the original on 4 July 2022. Retrieved 4 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Andhra Jyothy (23 September 2022). "మాస్ యాక్షన్ సినిమా" (in ఇంగ్లీష్). Archived from the original on 8 October 2022. Retrieved 8 October 2022.