ప్రధాన మెనూను తెరువు
కార్టూన్‌లలో, ప్రొఫానిటీ తరచుగా ప్రత్యామ్నాయ పదాలతో చూపించబడుతుంది (గ్రావ్‌లిక్సస్‌), నాన్‌ స్పెసిఫిక్‌ సెన్సర్‌షిప్‌ పద్ధతిలాగా.

ఊతపదం అంటే అవమానం, దురుసు, అసభ్యం, అపవిత్రం చేయడం, అగౌరవాన్ని చూపడం వంటివాటిని సూచించేవిగా సమాజంలో భావించే పదాలు, సైగలు, ఇతర సామాజిక అలవాట్లను సూచించేది.[1]

ప్రొఫేన్‌ అనే విశేషణాన్ని (లాటిన్‌: ముందు, ఆలయం బయట అని అర్థం) వాస్తవానికి చర్చికి సంబంధించని వస్తువుల గురించి పేర్కొనేందుకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు కోట నగరంలోకెల్లా అతి పాతదైన అపవిత్ర కట్టడం. కానీ స్థానిక మఠం ఇంకా పాతది, అత్యంత పాత కట్టడం, లేదా చర్చిలను డిజైన్‌ చేయడంతో పాటు అతను ఎన్నో అపవిత్ర కట్టడాలను కూడా డిజైన్‌ చేశాడు. కాలక్రమేణా ఈ పదం అర్థం ప్రస్తుత రూపానికి మారింది.

ఊతపదాల పరిభాషను సూచించేందుకు సాధారణంగా వాడే ఇతర పదాలు: శాపనార్థాలు, ఒట్టు పెట్టడం, విమర్శలు, తప్పుడు మాటలు, దైవదూషణ, అప్రస్తుత పదజాలం, అశ్లీలత, తప్పుడు మాటలు, చవకబారు, గట్టి, అవకాశం, చెడు, పెద్దలకు మాత్రమే పరిమితమైన భాష తదితరాలు.

గణాంకాలుసవరించు

టేప్‌ రికార్డర్లలో రికార్డయిన సంభాషణ ప్రకారం సగటున రోజూ మాట్లాడే మాటల్లో 80 నుంచి 90 పదాలు, అంటే మొత్తం పదాల్లో 0.5 శాతం నుంచి 0.7 శాతం దాకా ఇలాంటి ఊతపదాలే ఉంటాయి. వాటి వాడకం 0 శాతం నుంచి 3.4 శాతం మధ్య మారుతుంటుంది. వీటితో పోలిస్తే ఉత్తమ పురుష బహూవచన సర్వనామాలు (మేము, మా, మాకు సంబంధించిన వంటివి) మొత్తం మాట్లాడే పదాల్లో 1 శాతం దాకా ఉంటాయి.[2]

1986, 1997, 2006ల్లో అమెరికాలో ఈ ఊతపదాలపై జరిగిన పరిశోధనలో ఒక విషయం తేలింది. మొత్తం 70 విభిన్న ఊతపదాల్లో ఒకే పదాల సమూహానికి చెందిన టాప్‌ టెన్‌ పదాలను పదేపదే వాడారు. అత్యంత ఎక్కువ వాడిన అపవిత్ర పదాల్లో ఫక్‌, షిట్‌, హెల్‌, డామ్‌, గాడ్డామ్‌, బిచ్‌, బోనెర్‌, సక్స్‌ ఉన్నాయి. ఈ ఎనిమిది పదాలు మొత్తం ఊతపదాల్లో దాదాపు 80 శాతాన్ని ఆక్రమించాయి.[2] ఫక్‌, షిట్‌ వంటివే వాటిలో మూడో వంతు నుంచి సగం దాకా ఆక్రమించేశాయి.[2] ఇక 'ఓ మైగాడ్‌' అనే పదబంధం మహిళల మాటల్లో 24 శాతం దాకా చోటుచేసుకుంది.[2]

దైవదూషణా ఊతపదంసవరించు

ఈ పదం అసలు అర్థం దైవదూషణ, దైవద్రోహం, లేదా దేవుని పేరు (భగవాన్‌, దేవా)ను వృథాగా పలకడాన్ని సూచిస్తుంది. అయితే మతం, మత చిహ్నాల వంటివాటి పట్ల లౌకిక తటస్థతను కూడా ఇది సూచిస్తుంది. అదే సమయంలో దైవదూషణంటే మతం, మత చిహ్నాలపై పెద్దపెట్టున నిందాత్మకంగా వాడే పదాలకు సూచిక. దీన్ని పాపకార్యంగా భావిస్తారు.

దైవదూషణాత్మక ఊతపదాల నే అసలు అర్థంలో ఊతపదాలు పురాతన హాస్య సంప్రదాయాల్లో భాగాలుగా ఉంటూ వచ్చాయి. అవి ప్రధానంగా దేవతలు, దేవీ రూపాలను నిందిస్తూ హాస్యం పండించేవి.[3][4] 'గర్గంతువా, పంటాగ్రుయెల్‌ ' నుంచి దీనికి ఒక ఉదాహరణను చెప్పవచ్చు. క్రైస్ట్‌! చూడిటు. ఇది మెరె డే ... మెర్డే ... షిట్‌, దేవుని తల్లి.[5][ఆధారం యివ్వలేదు]

ఊతపదాలపై శాస్త్రీయ పరిశోధనసవరించు

ఒట్లు పెట్టుకోవడం, తిట్టడం వంటి భాషారూపాలు మానవ భాషలన్నింట్లోనూ ఎప్పటి నుంచో ఉంది. ఇవన్నీ నియమిత విధులను నిరర్తిస్తాయి. ఇవి శాస్త్రీయ పరిశోధనలకు కూడా అంశాలుగా మారాయి. చింపాంజీల్లో కూడా ఇందుకు దగ్గరగా ఉండే ప్రవర్తనను మనం గమనించవచ్చు.[6] బైబిల్‌లో కూడా ఒకచోట పురుషులను గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు వాడిన పదాలను చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. వారు తమ సొంత మలాన్నే తింటారు. స్వమూత్రపానం చేస్తారు అంటూ సాగుతుంది. ఇలాంటి రాతలున్న వాటిలో ఇప్పటిదాకా ఇదే అతి పురాతన గ్రంథం. ఇలాంటి పదాలను వాడుతూ మనుషులు రాసి, అందుబాటులో ఉన్న పురాతన గ్రంథం ఇదే.[6] ఊతపదాలు కేవలం నొప్పి కలిగినప్పుడు వచ్చే స్పందనలు మాత్రమే కాదని, ఒక అధ్యయనంలో తేలింది. నొప్పి నుంచి ఉపశమనానికి కూడా అది దోహదం చేస్తుందట. దాంతోపాటు జనాలు ఎప్పుడైనా గాయపడితే ఊతపదాలు వాడాల్సిందిగా నేను వారికి సలహా ఇస్తాను అని అనుకునే మానసిక స్థితికి ఇది వారిని తీసుకెళ్తుందట.[7] అయితే, ఊతపదాలను మితిమీరి వాడితే వాటి లాభదాయక ప్రభావం బాగా క్షీణిస్తుంది.[7] తమ భాషాజాలం, విద్యాభ్యాసాలను గురించి గర్వపడే వారు కూడా ఇలాంటి అశ్లీల పదాలు, తప్పుడు భాషాజాలంపై మంచి అవగాహననే కలిగి ఉంటారని భాషాపరమైన పలు పరిశోధనలు తేల్చాయి.[6] ఊతపదాల వాడకం కోపాన్ని అదుపు చేసుకోవడానికి విస్తృతంగా వాడుకలో ఉన్న పద్ధతి.[6] కాకపోతే దీన్ని ఎవరూ అంతగా హర్షించరు. అమెరికాలో వాడే ఊతపాదాలపై జరిగిన ఒక పరిశోధన, మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా శాపనార్థాలు పెడతారు. ఆ మహిళలు మరీ స్థిమితం తప్పిన వారైతే తప్ప. లైబ్రేరియన్లు, యూనివర్సిటీ, డేకేర్‌ సెంటర్ల సిబ్బంది కంటే వర్సిటీ వాతావరణమే పిల్లలను శాపనార్థాలు పెట్టేలా ప్రోత్సహిస్తుందట.[6]

పని స్థలాల్లో ఊతపదాలుసవరించు

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో పని స్థలాల్లో ఊతపదాల వాడకం పలు సందర్భాల్లో అత్యంత తప్పుడు ప్రవర్తన కిందకు వస్తుంది. ముఖ్యంగా పై అధికారుల విషయంలో దురుసుతనంగా, కింది సిబ్బందిపై ప్రయోగిస్తే వేధింపుగా పరిగణనలోకి వస్తుందట. అయితే ఇతర సందర్భాల్లో మాత్రం తక్షణ ఉద్వాసనకు ఇది దారి తీయదట.[8] ఒక యూకే సైట్‌ ప్రకారం పని మర్యాదల విషయంలో నిజానికి రోజువారీ జీవితంలో ఊతపదాల వాడకం మామూలే. కాకపోతే ఆ క్రమంలో కార్యాలయంలో ఎవరినీ నొప్పించకుండా మనం జాగ్రత్త పడాలి. అప్పుడు ఊతపదాలు వాడినా ఎవరికీ పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే, వీటిలో కూడా పలు రకాలున్నాయి. వాటి గురించి వివరంగా చెప్పుకోవడానికి బదులు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారన్న దానితో పెద్దగా నిమిత్తం లేకుండా మరీ దారుణంగా తోచే పదాలను పరిహరిస్తే మేలు.[9] సహోద్యోగుల మధ్య ఊతపదాలు, శాపనార్థాల వాడకం విషయానికి వస్తే, ఆ సైట్‌ ఇలా చెబుతోంది: వినడానికి కాస్త కొత్తగా తోచినా, ఊతపదాల సరైన వాడుక చాలావరకు మీరు ఏ పరిశ్రమలో, ఎలాంటి వ్యక్తులతో పని చేస్తున్నారన్న వాటిపై చాలావరకు ఆధారపడుతుంది. ఊతపదాల వాడుక చాలా సాధారణంగా జరిగిపోయే తరహా పని స్థలాల్లో కూడా అందులో విధిగా మనం పాల్గని తీరాల్సిన అవసరమేమీ లేదు.[9] సాధారణంగా ఈ ఊతపదాలు, శాపనార్థాల వాడకం ఉన్నతాధికారులు, క్లయింట్లు తదితరుల సమక్షం వంటి కొన్ని పొసగని సందర్భాల్లో మరిన్ని సమస్యలకు దారి తీసే ప్రమాదముందని ఆ సైట్‌ వివరించింది. పైగా క్లయింట్ల కంటే తామే మంచివారిమి, పవిత్రులమూ అన్న తరహా అర్థాన్ని కూడా వీటి వాడకం ఇస్తుందట. తద్వారా మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది.[9]

తమ సర్వేలో పాల్గన్న మొత్తం 308 మంది యూకే సీనియర్‌ మేనేజర్లు, డైరెక్టర్లలో దాదాపు 36 శాతం మంది తమ పని స్థలా సంస్కృతిలో భాగంగా ఊతపదాలు, శాపనార్థాలను వాడతామని అంగీకరించినట్టు ద గార్డియన్‌ వెల్లడించింది. కాకపోతే తప్పుడు, పరుష ప్రవర్తనగా తోచే, వివక్షాపూరితంగా వాడినవిగా అన్పించే పదప్రయోగాలకు దూరంగా ఉంటే మంచిదని హెచ్చరించింది. బెన్‌ విల్మోట్‌ (చార్టర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పర్సనెల్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) వ్యాఖ్యతో ఆ వ్యాసం ముగిసింది: వేధింపులు, పరుష ప్రవర్తనలకు సంబంధించిన మెరుగ్గా రూపొందించిన పాలసీల ద్వారా, యజమానులు తమ పని స్థలాల్లో వృత్తిపరమైన భాషాజాలమే వాడుకలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే భాషకు ఇలాంటి ప్రవర్తనకు దారి తీయించే సత్తా ఉంటుంది.[10]

తీవ్రతసవరించు

ప్రజల అభిప్రాయం ప్రకారం పలు బ్రిటిష్‌ ఊతపదాలు, శాపనార్థాల్లోని తీవ్రతల మధ్య సారూప్యతపై బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ కమిషన్‌, ఇండెపెండెంట్‌ టెలివిజన్‌ కమిషన్‌, బీబీసీ, అడ్వర్టైజింగ్‌స్టాండర్డ్స్‌ అథారిటీల తరఫున అధ్యయనం జరిగింది. ఈ సంయుక్త అధ్యయనం ఫలితాలను 2000 డిసెంబరులో డిలీట్‌ ఎక్స్‌ప్లెటివ్స్‌?'' అనే వ్యాసంలో ప్రచురించారు. ఇందులో ఊతపదాలు, శాపనార్థాల తీవ్రతను బట్టి సంబంధిత పదాలను అవరోహణ క్రమంలో పేర్కొన్నారు.

ఇలాంటి సర్వేనే 2009లో న్యూజిలాండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ చేసింది. దాని ఫలితాలను 2010 మార్చిలో వాట్‌ నాట్‌ టు స్వియర్‌ పేరుతో ఒక వ్యాసంగా ప్రచురించారు. దాని ప్రకారం, ఇలాంటి శాపనార్థాలు, దైవదూషణలు, ఇతర ఊతపదాల వంటివి ప్రసారాల్లో వస్తే వాటిని ఏ మేరకు అంగీకారయోగ్యమైనవిగా ప్రేక్షకులు భావిస్తారో' ఈ సర్వే ఫలితాలు తెలిపాయి.

అంతర్జాతీయ సహాయక భాషలుసవరించు

కొన్ని ప్రత్యేకమైన అంతర్జాతీయ సహాయక భాషలు సాధారణంగా ఇలాంటి ఊతపదాలు, శాపనార్థాలను, వాటికి సంబంధించిన వ్యక్తీకరణలను అరువు తెచ్చుకోవడం, లేదా వాటికోసం కొత్త పదాలను సృష్టించడం వంటి పలు వ్యూహాలను అనుసరిస్తుంటాయి.

భాషల మధ్యలో చూస్తే, అంతర్జాతీయంగా ప్రబలంగా వాడుకలో ఉండే లక్షణమే ఇలాంటి పదాలను చేర్చుకోవడానికి, అనుసరించడానికి ప్రాతిపదిక. ఏదైనా ఇతర పదం, పదబంధానికి సంబంధించి ఇదే సిసలైన ఊతపదంగా కూడా మెల్లిగా వాడుకలోకి వచ్చినా ఆశ్చర్యమేమీ లేదు. అలా, కన్నో (కంట్‌), మెర్డా (షిట్‌), పిపి (పీ-పీ) వంటి పదాలను భిన్న భాషల్లో వాడవచ్చు. కులో (యాస్‌, లేదా బట్‌), దాని నుంచి వచ్చిన ఇంకులర్‌ (బట్‌ ఫక్‌ చేయడం) వంటివి కూడా ఇలా భిన్న భాషల్లో వాడుకలో ఉండే వ్యక్తీకరణలే. ఫ్యుటెర్ ‌ (టు ఫక్‌)ను ఎక్కువగా ఇంగ్లిష్‌ పదంగా వాడతారు. ఉదాహరణకు ఫ్యుటె టె) (ఫక్‌ యూ), లేదా మీ ఆటోమొబైల్‌ ఎస్‌ ఫుటైట్‌! (మై కార్‌ ఈజ్‌ ఫక్‌డ్‌ అప్‌)[ఉల్లేఖన అవసరం]

ఎస్పెరాంటో కోసం ఎస్పెరాంటో ప్రొఫైనిటీని చూడండి.

ప్రొఫానిటీని ఎక్కువగా కలిగి ఉన్న పుస్తకాలు, నాటకాలు మరియు సినిమాలుసవరించు

 • ఉబు రోయ్‌ బై ఆల్ఫ్రెడ్‌ జారీ
 • ఉలిస్సెస్ ‌ బై జేమ్స్‌ జాయ్స్‌[11]
 • ది క్యాచర్‌ ఇన్‌ ద రై బై జె.డి.సాలింగర్‌[12][13]
 • గ్లెన్‌గ్యారీ గ్లెన్‌ రాస్‌ బై డేవిడ్‌ మామెట్‌[ఉల్లేఖన అవసరం]
 • టామ్‌ క్లాన్సీ యొక్క రకరకాల పుస్తకాలు
 • ది బిగ్‌ లీబోవ్‌స్కీ బై ది కోయెన్‌ బ్రదర్స్‌
 • ఫ్రాన్‌కియోస్‌ రాబెలియాస్‌ యొక్క రకరకాల పుస్తకాలు[ఉల్లేఖన అవసరం]
 • స్లాటర్‌ హౌస్‌ -5 బై కుర్ట్‌ వోన్నెగట్‌
 • South Park: Bigger, Longer & Uncut బై మాట్‌ స్టోన్‌ మరియు ట్రె పార్కర్‌
 • ఫ్రెష్‌ బై బోయాజ్‌ యాకిన్‌
 • ది స్వాషన్‌కు రిడెంప్షన్‌ బై ఫ్రాంక్‌ డారాబాంట్‌
 • ది థిక్‌ ఆప్‌ ఇట్ ‌ బై ఆర్మాన్‌డో లానాసి
 • లేడీ చాటర్‌ర్లేస్‌ లవర్‌ బై డి.హెచ్‌.లారెన్స్‌
 • పిగ్మలేషన్‌ (ప్లే) బై జార్జ్‌ బెర్నార్డ్‌ షా - ది యూజ్‌ ఆఫ్‌ బ్లడీ[14]
 • గాన్‌ విత్‌ ది విండ్‌ బై మార్గరెట్‌ మిచెల్లి మరియు ది ఫిల్మ్‌ - ఫ్రాంక్లీ, మై డియర్‌, ఐ డోంట్‌ వివ్‌ ఎ డామ్‌, 1939లో చెప్పినది, అమెరికాలోని పెద్ద సినిమాల్లో తొలిసారి ప్రొఫానిటీని ఉపయోగించింది ఇక్కడే.[15]

ప్రొఫానిటీపై మత సంబంధం దృక్కోణంసవరించు

తరువాతి రోజు సెయింట్ల యేసు క్రీస్తు చర్చిసవరించు

ది ఎల్‌డిఎస్‌ చర్చ్‌ అధికారికంగా చెప్పినట్లు ప్రొఫానిటీ అనేది మర్యాద లేకపోవడం లేదా పవిత్రమైన అంశాలకు వ్యతిరేకమైనది. ఇందులో దేవుడు ఇచ్చిన ఎవరైనా వ్యక్తి గురించి సంబంధం లేని సాధారణ వ్యాఖ్యలు చేయడం. ఇందులో ఏదైనా అసభ్యకరమైన మాటలు లేదా ప్రవర్తన కూడా కలిసి ఉంటాయి.[16]

వీటిని కూడా చూడండిసవరించు

 • దైవనింద
 • ప్రొఫానమ్‌
 • డామ్‌నేషన్‌
 • స్పానిష్‌ ప్రొఫానిటీ
 • భాష ఆధారంగా ప్రొఫానిటీ
 • ఇంగ్లిష్‌ ఫ్రొఫానిటీలోని విభాగాలు
 • లాటిన్‌ ప్రొఫానిటీ
 • ఎత్నిక్‌ స్లర్స్‌ జాబితా
 • మృదు ప్రమాణం
 • అశ్లీలత
 • అమెరికన్‌ సైన్‌ భాషలో ప్రొఫానిటీ
 • ప్రొఫానిటీలో సైన్స్‌ ఫిక్షన్‌
 • ఏడు అసభ్య పదాలు
 • స్వేర్‌ ఫిల్టర్‌
 • వెర్బల్‌ తిట్లు

గమనికలుసవరించు

 1. ప్రొఫేన్‌ నిర్వచనం, ఎంఫిసిస్‌ ఆన్‌ ఒరిజినల్‌, మెరియమ్‌-వెబ్‌స్టర్‌ ఆన్‌లైన్‌ డిక్షనరీ, జైన్‌5, 2007న బయటకు తీయబడింది
 2. 2.0 2.1 2.2 2.3 జే టి.(2009). ది యుటిలిటీ అండ్‌ యుబిక్విటీ ఆఫ్‌ టాబూ వర్డ్స్‌. పర్‌స్పెక్టివ్‌ ఆన్‌ సైకలాజికల్‌ సైన్స్‌, 4:153-161. doi:10.1111/j.1745-6924.2009.01115.x
 3. బాక్‌హిటిన్‌ 1941, పరిచయం పి.5-6
 4. మెలెటిన్‌స్కీ, ఎలెజార్‌ మోయిసీవిచ్‌ ది పోయెటిక్స్‌ ఆఫ్‌ మిత్‌ (గుయ్‌ లానోయ్‌ అనువించారు మరియు అలెగ్జాండ్రె సాడెట్‌స్కీ) 2000 రూట్‌లెడ్జ్‌ ఐఎస్‌బిఎన్‌ 0415928982 పి.110
 5. ఫ్రాన్‌కోయిస్‌ రాబెలియాస్‌, గార్‌గాన్‌టువా బుక్‌, చాప్టర్ ‌17: ఫ్రెంచ్‌లో పదాలు మెరీ డి (మదర్‌ ఆఫ్‌ అని అర్థం) మెర్డీ అనే శబ్దంతో పలుకుతాయి. దీని అర్థం షిట్‌.చాప్టర్‌ 16 యొక్క పూర్తి సారాంశం, రాబెలియాస్‌ మరియు హిస్‌ వరల్డ్ ‌ ఎట్‌ గూగుల్‌ బుక్స్‌
 6. 6.0 6.1 6.2 6.3 6.4 Angier, Natalie (25 September 2005), "Cursing is a normal function of human language, experts say", New York Times
 7. 7.0 7.1 Joelving, Frederik (12 July 2009), "Why the #$%! Do We Swear? For Pain Relief", Scientific American
 8. స్వేరింగ్‌ ఇన్‌ ద వర్క్‌ప్లేస్‌
 9. 9.0 9.1 9.2 వర్క్‌ ఎటిక్వెట్‌ - స్వేరింగ్‌ ఇన్‌ ది వర్క్‌ప్లేస్‌
 10. Matt Keating (2006-06-03). "Should swearing be tolerated in the workplace?". London: Guardian. Retrieved 2010-05-12. Cite news requires |newspaper= (help)
 11. Ellmann, Richard (1982). James Joyce. New York: Oxford University Press. pp. 502–04. ISBN 0-1950-3103-2.
 12. "Art or trash? It makes for endless, debate that cant be won". The Topeka Capital-Journal. 1997-10-06. Retrieved 2007-12-20. Another perennial target, J.D. Salinger's "Catcher in the Rye," was challenged in Maine because of the "f" word.
 13. Ben MacIntyre (2005-09-24). "The American banned list reveals a society with serious hang-ups". The Times. London. Retrieved 2007-12-20.
 14. పైగ్మాలియాన్‌, యాక్ట్‌ 3. ఎలిజా యొక్క వాక్‌? నాట్‌ బ్లడీ లైక్‌లీ
 15. "Raw Dialog Challenges all the Censors": 92. Cite journal requires |journal= (help)Life Magazine: 92. 10 June 1966. Missing or empty |title= (help); |access-date= requires |url= (help)
 16. ఎల్‌డిఎస్‌.ఓఆర్‌జి- స్టడీ బై టాపిక్‌ - ప్రొఫానిటీ

సూచనలుసవరించు

మరింత చదవడానికిసవరించు

 • ఎడ్వర్డ్‌ సాగ్రెయిన్‌. ది అనాటమీ ఆఫ్‌ డర్టీ వర్డ్స్‌. 1962
 • బిల్లీ బ్రైసన్‌. ది మదర్‌ టంగ్‌, 1990.
 • రిచర్డ్‌ ఎ స్పియర్స్‌. ఫర్‌బిడ్డెన్‌ అమెరికన్‌ ఇంగ్లిష్‌. 1990
 • స్టెర్లింగ్‌ జాన్సన్‌. వాచ్‌ యువర్‌ ఎఫ్‌...కింగ్‌ లాంగ్వేజ్‌. 2004.
 • జెఫ్రీ హ్యుజెస్‌ స్వేరింగ్‌. 2004.
 • రూత్‌ వాజన్‌రిబ్‌, ఎక్స్‌ప్లెటివ్‌ డిలీటెడ్‌: ఎ గుడ్‌ లుక్‌ ఎట్‌ బ్యాడ్‌ లాంగ్వేజ్‌. 2005
 • జెస్సీ షీల్డ్‌లోవర్‌, ది ఎఫ్‌-వర్డ్‌. 2009 (3వ ఎడిషన్‌)

బాహ్య లింకులుసవరించు