అహ్మద్ పటేల్ (ఆగష్టు 21, 1949) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అగ్ర నాయకుడు. వీరు కాంగ్రెస్ అధ్యక్షురాలు మరియు నాయకురాలైన సోనియా గాంధీకి ప్రస్తుత రాజకీయ కార్యదర్శి.[1][2][3] ప్రస్తుత INC (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) యొక్క కీలక మేధో వర్గంలో ఉన్నారు. పార్టీకి జాతీయ స్థాయిలో నిర్ణయాత్మక విధానాలు నిర్వహించే కీలక నాయకులలో ఒకరు. సోనియా గాంధీతో పాటుగా పని చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ 15వ లోక్‌సభకి తిరిగి ఎన్నుకోబడునట్లు చేయుటలో ప్రముఖ పాత్ర వహించారు.

Ahmed Patel

నియోజకవర్గము Bharuch, Gujarat, India

వ్యక్తిగత వివరాలు

జననం (1949-08-21) 1949 ఆగస్టు 21 (వయస్సు: 70  సంవత్సరాలు)
Bharuch, Gujarat India
రాజకీయ పార్టీ INC
జీవిత భాగస్వామి Memoona Ahmed
నివాసము New Delhi
మతం Muslim

బాల్య జీవితంసవరించు

అహ్మద్ పటేల్, మహమ్మద్ ఇషక్జీ పటేల్ మరియు హవాబెన్ మొహమ్మద్ భాయ్ దంపతులకు గుజరాత్‌లో భరూచ్ సమీపంలోని పారిశ్రామిక నగరమైన అంక్లేశ్వర్ కి దగ్గరి గ్రామమైన పిరామన్‌లో జన్మించారు.

వీరు శ్రీ జయేంద్ర పురి ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల, భరూచ్ (సౌత్ గుజరాత్ యూనివర్సిటీ) లో B.Sc, మరియు M.S. బరోడా యూనివర్సిటీలో చేశారు.

రాజకీయ జీవితంసవరించు

అహ్మద్ పటేల్ 2005లో రాజ్యసభకి నాలుగవ సారి పోటీ లేకుండా ఎన్నుకోబడ్డాడు. గుజరాత్ లోని కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ వ్యవహారాలలో కీలక పాత్ర పోషించారు.

సోనియా గాంధీకి కుడిచేయి వంటి వ్యక్తి మరియు వ్యూహరచనా నైపుణ్యత గలిగిన ప్రథమ వ్యక్తి అయి ఉండి కూడా, అహ్మద్ పటేల్ 15 వ లోక్ సభ[4] కాలంలో ప్రభుత్వం నుంచి వైదొలగుటకు యోచించాడు. వీరు ప్రజా దృష్టిని[5] ఆకర్షించుటకు ఇష్టపడరు మరియు ప్రసార మాధ్యమాలకు దూరంగా వుంటారు.

ఎహ్సాన్ జఫ్రీ తరువాత గుజరాత్ లోక్ సభ సభ్యుని[6] గా ఎన్నుకోబడిన రెండవ ముస్లిం అన్నది, ఆతను తన రాజకీయ జీవితంలో సాధించిన ఉన్నతి. సంజయ్ గాంధి చేత గుర్తింపబడిన కొద్దిమంది రాజకీయ వేత్తలలో ఒకరైన వీరు ఇందిర, రాజీవ్ మరియు సోనియాల దగ్గర పలుకుబడి కలిగిన వ్యక్తి. నమ్మదగ్గ విషయం ఏమిటంటే, ఇతను ఇందిర మరియు రాజీవ్ గాంధి ద్వారా ఇవ్వబడిన మంత్రి పదవులను తిరస్కరించాడు, దానికి కారణం, తనెప్పుడు మంత్రుల[6] చుట్టు వుండే చెత్త రాజకీయాల నుండి దూరంగా ఉండాలనుకోవడం మరియు జనబాహుళ్యానికి తక్కువ కనపడాలని కోరుకోవడం.


ఇతనిని ఇందిరా గాంధీకి మూడవ కొడుకుగా పరిగణిస్తారు.

నిర్వహించిన పదవులుసవరించు

 • వ్యవసాయవేత్త; నిర్వహణా ధర్మవ్యవహర్త, గుజరాత్ రాహత్ సమితి; అధ్యక్షుడు
 • గుజరాత్ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ కార్యవర్గం, 1977-82
 • గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం, జనవరి 1986 నుండి అక్టోబరు 1988 వరకు
 • అధ్యక్షుడు, సాంస్కృతిక వికాస మండలి, అంక్లేశ్వర్, భరూచ్ జిల్లా;
 • నిర్దేశకుడు, (i) ఇండియన్ ఎయిర్ లైన్స్, జూలై 1992 నుండి మే 1993 వరకు
 • భరూచ్ జిల్లా సహకార బాంక్ సెప్టెంబరు 1977 నుండి నేటి వరకు;
 • ప్రధాన కార్యదర్శి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గం, సెప్టెంబరు 1985 నుండి జనవరి 1986 వరకు మరియు మే 1992 నుండి అక్టోబరు 1996 వరకు


 • కార్యదర్శి, జవహర్ భవన్ ట్రస్ట్, 1988 ఆగష్టు 25 నుండి నేటి వరకు
 • సంయుక్త కార్యదర్శి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గం, సెప్టెంబరు 1983 నుండి డిసెంబెర్ 1984 వరకు


 • ప్రధానమంత్రి యొక్క పార్లమెంట్ కార్యదర్శి, జనవరి-సెప్టెంబరు 1985
 • కోశాధికారి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గం, 1996 అక్టోబరు నుండి
 • మరియు ఈ క్రిందివాటిలో సభ్యుడు కూడా,

(i) ఆరవ లోక్ సభ, 1977-79,

(ii) ఏడవ లోక్ సభ, 1980-84,

(iii) ఎనిమదవ లోక్ సభ, 1985-89,

(iv) కాంగ్రెస్ నిర్వాహక సమితి, ఏప్రిల్ 1992 నుండి నేటి వరకు

(v) అధీన శాసన సమితి 1994-96,

(vi) రైల్వే కార్యవర్గ సమితి, 1995-96, (vii) సమాచార కార్యవర్గ సమితి, 1996 -97,

(viii) రైల్వే మంత్రివర్గ సలహా కార్యవర్గ సమితి, 1993-97,

(ix) ఆలీగర్ ముస్లిం యూనివర్సిటీ యొక్క ధర్మాసనం 1995-98,

(x) పెట్రోలియం మరియు సహజవాయువు కార్యవర్గ సమితి

(xi) పౌర విమానయాన మంత్రివర్గ సలహా కార్యవర్గ సమితి; ఆగస్టులో రాజ్య సభకు ఎన్నిక కాబడ్డారు.

వివాదంసవరించు

UPA ప్రభుత్వానికి జూలై 2008 లో జరిగిన కీలక విశ్వాస పరీక్షలో, వోట్ల కొరకు డబ్బు అనే కుంభకోణంలో అహ్మద్ పటేల్ పేరును చేర్చారు. ఈ ఉదంతం మొత్తం లోకసభ స్పీకర్ ఆధ్వ్యరంలో విచారణకు ఆదేశించడమైనది. ఐతే, ఈ ఉదంతంలో అతని పాత్ర లేదని నిర్ధారించడమైనది.[7]

ఒక స్థానిక పార్టీ నాయకుడు ఆయనను ' ఆదివాసీల యొక్క భగవంతుడు అని సంబోధించడంతో వివాదంలో చిక్కుకొన్నాడు.

కానీ, అది ఆ స్థానిక నాయకుడి యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దానితో అహ్మద్ పటేల్ కు ఎటువంటి సంబంధము కానీ, లేక అతని ప్రమేయం కానీ లేవు.[8]

వ్యక్తిగత జీవితంసవరించు

1976 లో అహ్మద్ పటేల్ కు, మెమూనా అహ్మద్ తో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు కలరు.

సూచనలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-09-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-30. Cite web requires |website= (help)
 2. http://week.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/theWeekContent.do?sectionName=Current+Events&contentId=5615251&programId=1073754900&pageTypeId=1073754893 &contentType=EDITORIAL&BV_ID=@@@
 3. http://www.hindu.com/2008/07/09/stories/2008070960991200.htm
 4. http://indiatoday.intoday.in/election2009/index.php?option=com_content&task=view&id=44012&Itemid=1&sectionid=90&secid=71
 5. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2007-10-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-08. Cite web requires |website= (help)
 6. 6.0 6.1 http://timesofindia.indiatimes.com/Cities/Ahmedabad/Gujarat-results-comforting-for-backroom-boy-Ahmed-Patel/articleshow/4549013.cms
 7. http://timesofindia.indiatimes.com/Cash-for-vote_No_evidence_against_Amar_Singh/articleshow/3565254.cms
 8. http://timesofindia.indiatimes.com/Cities/Ahmed-Patel-is-god-for-tribals/articleshow/4446208.cms