ఆంగిక రసాయనం

ఆంగిక రసాయనం, కర్బన రసాయనం అనేవి రెండూ 'ఆర్గానిక్‌ కెమెస్ట్రీ' కి ప్రత్యామ్న్యాయమయిన తెలుగు పేర్లు. 'ఆర్గానిక్‌' అనే విశేషణం ఉంటే జీవికి, జీవన ప్రక్రియలకి సంబంధించిన రసాయనాల అధ్యయనం అనే అర్ధం స్పురిస్తుందని మొదట్లో జేకబ్‌ బెర్‌జీలియస్‌ (Jon Jacob Berzelius)అనే స్వీడన్ దేశపు శాస్త్రవేత్త సా.శ. 1800 ప్రాంతాలలో, ఈ పేరుని ఎంపిక చేసేరు. కాని బెర్‌జీలియస్‌ శిష్యుడే - వోలర్ (Wohler) - అనే కుర్రాడు - జీవి సహాయం కాని, జీవన ప్రక్రియల నిమిత్తం కాని లేకుండానే - ప్రయోగశాలలో, గాజు పరీక్ష నాళికలో - యూరియా అనే రసాయనాన్ని సృష్టించేడు. యూరియా ప్రాణుల మూత్రం (urine) లో కనిపించే ముఖ్యమైన రసాయనం. అంత వరకు 'ఆర్గానిక్‌' పదార్ధంగా చెలామణీ అయిన యూరియా (urea) ప్రయోగశాలలో, 'ఇనార్గానిక్‌' రసాయనాలతో తయారయేసరికి బెర్జీలియస్ ప్రతిపాదించిన 'ఆర్గానిక్‌', 'ఇనార్గానిక్‌' అనే విభజనకి పురిట్లోనే సంధి కొట్టింది. కాని అప్పటికే 'ఆర్గానిక్‌', 'ఇనార్గానిక్‌' అనే పేర్లు అలవాటయిపోవటంతో అవే అలా పాతుకుపోయాయి.

Methane, CH4; the line-angle structural formula shows four carbon-hydrogen single bonds (σ, in black), and the typical 3D shape of tetrahedral molecules, with ~109° interior bond angles (in dashed-green).

ఇటీవలి కాలంలో 'ఆర్గానిక్‌ కెమెస్ట్రీ'ని 'కార్బన్‌ కెమెస్ట్రీ' అనమని కొందరు ప్రతిపాదించేరు. ఎందుకంటే 'ఆర్గానిక్‌ కెమెస్ట్రీ' లో కర్బనం అనే పేరుగల మూలకం ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఎంత ప్రముఖమంటే ఈ శాఖలో అధ్యనం చేసే ప్రతి పదార్ధపు బణువు (molecule) లోనూ తప్పకుండా కనీసం ఒక్క కర్బనం అణువు (atom) అయినా ఉండి తీరుతుంది కనుక. ఈ తర్కాన్ని దృష్టిలో పెట్టుకుని 'ఆర్గానిక్‌ కెమెస్ట్రీ'ని కర్బన రసాయనమనీ, 'ఇనార్గానిక్‌ కెమెస్ట్రీ' వికర్బన రసాయనమనీ తెలుగులో పిలవచ్చు. లేదా అలవాటయిన పాత పద్ధతినే వాడదలుచుకుంటే 'ఆర్గానిక్‌ కెమెస్ట్రీ'ని ఆంగిక రసాయనమనీ, 'ఇనార్గానిక్‌ కెమెస్ట్రీ' అనాంగిక రసాయనమనీ అనేయవచ్చు.

కర్బన రసాయనం లో అనేక రకాల పదార్థాలు తారసపడతాయి. ఉదకర్బనాలు (hydrocarbons) జాతిలో కేవలం ఉదజని, కర్బనం మాత్రమే ఉంటాయి. జీవులలో కనిపించే పదార్థాలలో కర్బనంతో పాటు ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం కనిపిస్తూ ఉంటాయి. మరొక జాతి పదార్థాలలో కర్బనంతోపాటు లవజనులు (halogens) కనిపిస్తూ ఉంటాయి. ఇటీవలి కాలంలో కర్బనంతో పాటు క్షార లోహాలు (alkaline metals), క్షారమృత్తిక లోహాలు (alkaline-earth metals)కలిసిన పదార్థాలని కూడ కర్బనలోహ రసాయనం (organometallic) అనే పేరుతో ఈ వర్గంలో చేర్చి అధ్యయనం చేస్తున్నారు.


To be supplied
Line-angle representation
To be supplied
Ball-and-stick representation
To be supplied
Space-filling representation
Three representations of an organic compound, 5α-Dihydroprogesterone (5α-DHP), a steroid hormone. For molecules showing color, the carbon atoms are in black, hydrogens in gray, and oxygens in red. In the line angle representation, carbon atoms are implied at every terminus of a line and vertex of multiple lines, and hydrogen atoms are implied to fill the remaining needed valences (up to 4).


Periodic table of elements of interest in organic chemistry. The table illustrates all elements of current interest in modern organic and organometallic chemistry, indicating main group elements in orange, and transition metals and lanthanides (Lan) in grey.

మూలాలుసవరించు

వేమూరి వేంకటేశ్వరరావు, నిత్యజీవితంలో రసాయనశాస్త్రం, ఇ-పుస్తక్ం, కినిగె ప్రచురణ