ఆండ్రూ జాన్‌ స్ట్రాస్ ‌, ఎంబిఇ (1977మార్చి2న జన్మించాడు) ఒక ఇంగ్లిష్‌ క్రికెటర్‌. తన కౌంటీక్రికెట్‌లో మిడిలెసెక్స్‌ కౌంటి క్రికెట్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు మరియు ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌, స్ట్రాస్‌ సాధారణంగా బ్యాక్‌ఫుట్‌ మీద ఆడి పరుగులు చేయడాన్ని ఇష్టపడతాడు, ఎక్కువగా కట్‌ మరియు పుల్‌ షాట్లు ఆడతాడు. స్ట్రాస్‌ కవర్స్‌లో మరియు స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేయడంలోనూ బాగా పేరెన్నికగన్న ఆటగాడు.

ఆండ్రూ స్ట్రాస్‌
Andrew Strauss.JPG
Strauss being interviewed at the end of the Lord's Test match v Pakistan in August 2010
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Andrew John Strauss
ఇతర పేర్లు Levi, Mareman, Straussy, Muppet[1]
ఎత్తు 5 ft 11 in (1.80 m)
బ్యాటింగ్ శైలి Left-handed
బౌలింగ్ శైలి Left-arm medium
పాత్ర Opening batsman, England captain
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు England
టెస్టు అరంగ్రేటం(cap 624) 20 May 2004 v New Zealand
చివరి టెస్టు 3 January 2011 v Australia
వన్డే లలో ప్రవేశం(cap 180) 18 November 2003 v Sri Lanka
చివరి వన్డే 26 March 2011 v Sri Lanka
ఒ.డి.ఐ. షర్టు నెం. 14
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1998–present Middlesex (squad no. 6)
2002 MCC
2007-08 Northern Districts
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 82 124 208 251
సాధించిన పరుగులు 6,084 4,151 14,715 7,577
బ్యాటింగ్ సగటు 43.14 36.09 42.28 32.94
100s/50s 19/24 6/27 38/67 10/49
ఉత్తమ స్కోరు 177 158 177 163
బాల్స్ వేసినవి - 6 126 6
వికెట్లు - 3
బౌలింగ్ సగటు - 46.66
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు
మ్యాచ్ లో 10 వికెట్లు
ఉత్తమ బౌలింగ్ 1/16 -
క్యాచులు/స్టంపింగులు 94/– 56/– 186/– 89/–
Source: cricinfo, 9 March 2011

1998లో స్ట్రాస్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2003లో వన్డే అంతర్జాతీయ (ఓడిఐ) అరంగేట్రం శ్రీలంకలో చేశాడు. చాలా వేగంగా ప్రఖ్యాతి సాధించి, టెస్టు ఆటగాడి స్థాయికి ఎదిగాడు. 2004లో గాయపడ్డ మైకేల్‌ వాన్‌ స్థానంలోలార్డ్స్‌లో న్యూజిలాండ్‌పై తొలిసారి టెస్టు మ్యాచ్‌ ఆడాడు.[2] అందులో 112 మరియు 83 (రనౌట్‌) పరుగులు చేసి ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా లభించింది. లార్డ్స్‌ మైదానంలో టెస్టుల్లో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు, అరంగేట్రంలోనే రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ ఘనతకు చేరువగా వచ్చాడు.[3][4] తన తొలి విదేశీ పర్యటనలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ ఘనతకు చేరువగా వచ్చాడు. 2004 డిసెంబరులో పోర్ట్‌ ఎలిజబెత్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో (126 మరియు 94 నాటౌట్‌) అమోఘంగా రాణించాడు.[5] 2007 సమయంలో ఫామ్‌ సరిగా లేని కారణంగా స్ట్రాస్‌ జట్టులో స్థానం కోల్పోయాడు. శ్రీలంకలో పర్యటించే ఇంగ్లండ్‌ టెస్టు బృందంలోతనకు స్థానం లభించలేదు. దీంతో తాత్కాలికంగా క్రికెట్‌ నుంచి కొంత విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.[6] ఇంగ్లండ్‌ జట్టు పేలవ పర్యటనల కారణంగా, 2008లో న్యూజిలాండ్‌ పర్యటన కోసం తిరిగి స్ట్రాస్‌ను జట్టులోకి పిలిచారు. దీని తర్వాత తనని తాను నిరూపించుకుని కెరీర్‌లో ఉత్తమంగా న్యూజిలాండ్‌తో మూడో మరియు ఆఖరి టెస్టులో 177 పరుగులు చేశాడు. 2008లో మరో మూడు సెంచరీలు కూడా సాధించాడు.

2006లో కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌కు ఉపనాయకుడిగా పనిచేసిన స్ట్రాస్‌, 2008-09 సీజన్‌లో తాత్కాలికంగా ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌ అయ్యాడు. వెస్టిండీస్‌ పర్యటన తర్వాత కెవిన్‌ పీటర్సన్‌ రాజీనామా చేయడంతో స్ట్రాస్‌కు ఈ అవకాశం లభించింది.[3] మూడు సెంచరీలు చేసిన స్ట్రాస్‌ 2009లో సారథ్యాన్ని నిలబెట్టుకున్నాడు. 2009 యాషెస్‌లో స్ట్రాస్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు 2-1తో యాషెస్‌ సిరీస్‌ను గెలుచుకుంది. ఈ సిరీస్‌లో స్ట్రాస్‌ 474 పరుగులు చేశాడు. ఇరు జట్లలోనూ మరే ఆటగాడూ ఇన్ని పరుగులు సాధించలేదు.[7] ఈ సిరీస్‌లోనే లార్డ్స్‌లో జరిగిన టెస్టులో స్ట్రాస్‌ 161 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇంగ్లండ్‌ జట్టు 75 ఏళ్ల తర్వాతలార్డ్స్‌లో యాషెస్‌ టెస్టు గెలవడంలో కీలక భూమిక పోషించాడు.[8]

వ్యక్తిగత జీవితంసవరించు

దక్షిణాఫ్రికాలో జన్మించిన స్ట్రాస్‌ ఆరేళ్ల వయసులో ఇంగ్లండ్‌కు వచ్చాడు.[9] తొలుత ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో కాల్‌ఫీల్డ్‌గ్రామర్‌ పాఠశాలకు క్రికెట్‌ ఆడాడు.[10][11] తిరిగి ఇంగ్లండ్‌ వచ్చాక, కాల్డికాట్‌ పాఠశాల[12] లో, రాడ్లీ కళాశాల[13]లో చదువుకున్నాడు. 1995 మరియు 1998 మధ్య కాలంలో హాట్‌ఫీల్డ్‌ కళాశాల, డర్హమ్‌ విశ్వవిద్యాలయం పరిధిలో ఆర్థికశాస్త్రంలో విద్యను అభ్యసించి 2.1 సాధించాడు.[3] ఆస్ట్రేలియా నటి రూత్‌ మెక్‌డొనాల్డ్‌ను 2003లో స్ట్రాస్‌ పెళ్ళి చేసుకున్నాడు. వీరు మార్లోలో నివశిస్తారు. వీరికి ఇద్దరు కొడుకులు శామ్‌ (2005 డిసెంబరు 4న జన్మించాడు) మరియు లూకా (2008 జూలై 14న జన్మించాడు).[14] ప్రైమరీ క్లబ్‌ జూనియర్స్‌కు స్ట్రాస్‌ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. ఇది అంధ క్రికెటర్లకు నిధులను అందించే స్వచ్ఛంద సంస్థ. దీనికి నిధులు సమకూర్చేందుకు స్ట్రాస్‌ అంధుల క్రికెట్‌లో మ్యాచ్‌ కూడా ఆడాడు. కళ్లకు గంతలు కట్టుకుని ఆడి, రెండో బంతికే అవుటయ్యాడు.[15] స్ట్రాస్‌కు అనేక ముద్దుపేర్లు ఉన్నాయి. స్ట్రాసీ, లెవి, జోహాన్‌తో పాటు లార్డ్‌ బ్రాకెట్‌, మేర్‌మేన్ ‌, ది జనరల్‌, జాజర్‌ మరియు మప్ఫెట్‌ అనే పేర్లతోనూ సుపరిచితం.[3][16]

క్రీడా వృత్తిసవరించు

దేశవాళీ కెరీర్‌సవరించు

1996 నుంచి డర్హమ్‌ యూనివర్శిటీ క్రికెట్‌ జట్టు మరియు మిడిలెసెక్స్‌ సెకండ్‌ ఎలెవన్‌కు ఆడాడు. 1998లో తొలిసారి మిడిలెసెక్స్‌ ప్రథమ ఎలెవన్‌కు అరంగేట్రం చేసి, తన తొలి ఫస్ట్‌క్లాస్‌ ఇన్నింగ్స్‌లో 83 పరుగులు చేశాడు.[17] ఇది కాకుండా, తన కెరీర్‌కు మంచి ఆరంభాన్నిచ్చాడు. తొలి రెండు ఫస్ట్‌క్లాస్‌ సీజన్లలో వరుసగా 24, 30.5 సగటున పరుగులు చేశాడు.[18] రెండేళ్ల తర్వాత చేసిన 111 నాటౌట్‌ వరకూ స్ట్రాస్‌ కెరీర్‌లో సెంచరీ లేదు.[19] తర్వాత స్ట్రాస్‌ కెరీర్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. 2001, 2002, 2003లలో వరుసగా 45 సగటుతో 1211, 48 సగటుతో 1202, 51 సగటుతో 1529 పరుగులు చేశాడు.[18] దీంతో 2002లో మిడిలెసెక్స్‌కు సారథిగా ఎంపికయ్యాడు. అంగస్‌ ఫ్రేజర్‌ రిటైర్‌మెంట్‌తో స్ట్రాస్‌కు ఈ అవకాశం వచ్చింది. ఈ పదవిని 2004 సీజన్‌ వరకూ నిలబెట్టుకున్నాడు.[20]

అంతర్జాతీయ క్రీడా జీవితంసవరించు

అరంగేట్ర ఏడాది (2003-2004)సవరించు

ఇంగ్లండ్‌ జట్టు ఉపఖండ పర్యటనలో భాగంగా స్ట్రాస్‌కు తొలి అంతర్జాతీయ క్రికెట్‌ అనుభవం వచ్చింది.[21] కానీ ఆ పర్యటనలో అతడు కేవలం 12వ ఆటగాడి పాత్రను మాత్రమే పోషించాడు. తనని తాను దీర్ఘకాలిక ఆట (టెస్టు)లో మెరుగైన వాడిగా భావించినా, స్ట్రాస్‌కు ఆశ్చర్యకరంగా వన్డే జట్టులో స్థానం లభించింది.[22] అయితే అతడు ప్రధాన జట్టులోకి ఎంపిక కాలేదు. కేవలం ఒక టూర్‌ మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఆ మ్యాచ్‌లో 51 పరుగులు సాధించడంతో పాటు 146 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. నెమ్మదిగా ఆడిన, నాణ్యమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.[23] బంగ్లాదేశ్‌ నుంచి జట్టు శ్రీలంకకకు చేరింది. టూర్‌ మ్యాచ్‌లో 83 పరుగులు చేయడం ద్వారా ఓపెనర్‌ విక్రమ్‌ సోలంకిపై ఒత్తిడి పెంచాడు. ఈ మ్యాచ్‌లో సోలంకి ఐదు బంతులు ఆడి డకౌట్‌ అయ్యాడు.[24] ఫలితంగా స్ట్రాస్‌కు ఇంగ్లండ్‌ తరఫున అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇదే మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన శ్రీలంక బౌలర్‌ దినుషా ఫెర్నాండో బౌలింగ్‌లో స్ట్రాస్‌ కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా (బౌలర్‌కే క్యాచ్‌ ఇవ్వడం ద్వారా) అవుటయ్యాడు.[25] దీంతో ఈ పర్యటనలో మిగిలిన మ్యాచ్‌లకు స్ట్రాస్‌ను ఎంపిక చేయలేదు.

స్ట్రాస్‌కు మరో అవకాశం వెస్టిండీస్‌ పర్యటనలో వచ్చింది. టెస్టు బృందంలో గాయపడ్డ మార్క్‌ బుచర్‌ స్థానంలో ఆడేందుకు పిలిపించినా,[26] కేవలం వన్డే జట్టులో మాత్రమే అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, ఇంగ్లండ్‌ ఉత్కంఠభరిత విజయంలో 29 పరుగులు చేశాడు.[27] ఇది మినహాయిస్తే, రెండో వన్డే రద్దయిన తర్వాత ఐదో వన్డే వరకూ స్ట్రాస్‌ కేవలం పది పరుగులు మాత్రమే చేశాడు.[28] కానీ తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌కు సమానంగా పరుగులు సాధించాడు. ఇదే మ్యాచ్‌తో అద్భుతమైన అంతర్జాతీయ క్యాచ్‌ అందుకున్నాడు.[29] చివరి మ్యాచ్‌లో 66 పరుగులు సాధించి ఇంగ్లండ్‌ విజయానికి దోహదపడ్డాడు. ఈ విజయంతో జట్టు సిరీస్‌ను సమం చేయగలిగింది.[30]

 
అరంగేట్రంలోనే సెంచరీ చేసినందుకు స్ట్రాస్‌ లార్డ్స్‌ యొక్క గౌరవ బోర్డులో చేరాడు

2004 సీజన్‌ ప్రారంభానికి స్ట్రాస్‌ తిరిగి సొంతగడ్డపైకి వచ్చాడు. నెట్స్‌లో వాన్‌కు మోకాలి గాయం కావడంతో స్ట్రాస్‌కు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది.[31] వాన్‌ లేని కారణంగా ఖాళీ అయిన ఓపెనింగ్‌ స్థానానికి మార్క్‌ బుచర్‌ను ప్రమోట్‌ చేయాలనేది ప్రాథమిక ఆలోచన. మిడిలార్డర్‌లో కాలింగ్‌వుడ్‌ ఆడటానికి దీనివల్ల అవకాశం లభిస్తుంది. అయితే బుచర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వెళ్లి ఆడేందుకు నిరాకరించాడు. దీంతో స్ట్రాస్‌ను ఓపెనింగ్‌ చేయమని అడిగారు. దీనివల్ల కాలింగ్‌వుడ్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు.[32][33] వాన్‌కు గాయం కావడం స్ట్రాస్‌కు కలిసొచ్చింది. తన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో అందరికంటే అత్యధికంగా 112 పరుగులు చేశాడు.[34] రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు సాధించి రనౌట్‌ అయ్యాడు. ఈ అవుట్‌కు నాసిర్‌ హుస్సేన్‌ కారణం.[35] ఈ ఇన్నింగ్స్‌ స్ట్రాస్‌ను ఒక ఉన్నత జాబితాలోకి చేర్చింది. లార్డ్స్‌లో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన రెండో ఇంగ్లండ్‌ ఆటగాడిగా ఘనత సాధించాడు.[36] ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 15వ ఆటగాడు. 1993లో గ్రహం థోర్ఫ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడు స్ట్రాస్‌. అరంగేట్రంలో సెంచరీతో పాటు అర్ధసెంచరీ సాధించిన నాలుగో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ స్ట్రాస్‌.[37][38] ఇదే టెస్టులో స్ట్రాస్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి క్యాచ్‌ అందుకున్నాడు. సైమన్‌ జోన్స్‌ బౌలింగ్‌లో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ క్యాచ్‌ను అంఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన కృషికి ఫలితంగా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.[34] స్ట్రాస్‌ ఈ ప్రదర్శనతో మైకేల్‌ వాన్‌ స్థానాన్ని ఆక్రమించాడు. వాన్‌కు స్థానం కల్పించడం కోసం హుస్సేన్‌ తప్పుకోవాల్సి వచ్చింది. ట్రెస్కోథిక్‌కు జతగా స్ట్రాస్‌ ఓపెనర్‌ స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు.[39] సిరీస్‌లో తర్వాతి మ్యాచ్‌ల్లో పెద్దగా ఫామ్‌ను చూపించాలేకపోయాడు.[40] రెండో టెస్టులో అర్ధసెంచరీతో పాటు మూడో టెస్టులో తొలిసారి అంతర్జాతీయ డక్‌ను రుచిచూశాడు.[41]

తర్వాత జరిగిన నాట్‌వెస్ట్‌ ముక్కోణపు టోర్నీలో ఇంగ్లండ్‌ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఇందులో స్ట్రాస్‌ అజేయంగా 44 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.[42] ఇదే సిరీస్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఓడిపోయిన మ్యాచ్‌లో స్ట్రాస్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో కలిసి 226 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తన తొలి అంతర్జాతీయ సెంచరీని కచ్చితంగా 100 పరుగులతో సాధించాడు.[43] లార్డ్స్‌లో తనకు ఎదురులేదని నిరూపిస్తూ స్ట్రాస్‌ వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులోనూ సెంచరీ చేశాడు. అయితే ఇదే మ్యాచ్‌లో రాబర్ట్‌కీ 221 పరగులు సాధించాడు ఈ ఇద్దరూ కలిసి వెస్టిండీస్‌పై రెండో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్య రికార్డును నెలకొల్పారు.[44] ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో జరిగిన మూడో టెస్టులోబ్రయాన్‌ లారా టెస్టుల్లో పదివేల పరుగలు పూర్తి చేశాడు. స్ట్రాస్‌ ఐదు గంటలకు పైగా క్రీజులో నిలబడి 90 పరుగులు సాధించి, పది పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు.[45] 2004 సీజన్‌ చివరి పర్యటనలో నాట్‌వెస్ట్‌ చాలెంజ్‌ తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌పై స్ట్రాస్‌ అజేయంగా 44 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు.[46] కానీ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో రెండేసి పరుగులు మాత్రమే చేశాడు.[47] తర్వాత, 2004 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో సొంతగడ్డపై స్ట్రాస్‌ జింబాబ్వేతో మ్యాచ్‌లో రాణించాడు.[48] తర్వాత పాత శత్రువు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 42 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేశాడు.[49] ఏదేమైనా ఫైనల్లో ట్రెస్కోథిక్‌ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ అందరూ విఫలం కావడంతో ఫైనల్లో వెస్టిండీస్‌పై విజయం సాధించలేకపోయారు.[50]

యాషెస్‌కు మార్గం (2004-2005)సవరించు

 
లార్డ్స్‌లో బంగ్లాదేశ్‌పై బ్యాటింగ్‌ చేస్తున్న స్ట్రాస్‌

అక్టోబరులో చాంపియన్స్‌ ట్రోఫీలో రన్నర్స్‌గా నిలిచిన తర్వాత నవంబరులో ఆఫ్రికా పర్యటనకు వెళ్లారు. జింబాబ్వేలో తొలుత పర్యటించారు. 2003 ప్రపంచకప్‌ తర్వాత ఏర్పడిన రాజకీయ వాతావరణం కారణంగా అక్కడ పర్యటనలు జరగలేదు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ 4-0తో విజయం సాధించినప్పటికీ, స్ట్రాస్‌ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు.[47] ఆఖరి మ్యాచ్‌లో స్ట్రాస్‌ ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. మూడు పరుగులు ఇచ్చాడు.[51] తర్వాత ఇంగ్లండ్‌ జట్టు స్ట్రాస్‌ పుట్టిన దేశం దక్షిణాఫ్రికాలో ఆడేందుకు వెళ్లింది. ఇక్కడ ఐదు టెస్టుల సిరీస్‌తో వారిని కొత్త ఏడాదిలోకి తీసుకెళ్లింది. పురుటి గడ్డపై స్ట్రాస్‌కు చక్కటి ఆరంభం లభించింది. రెండో బంతికే గ్రేమ్‌ స్మిత్‌ క్యాచ్‌ అందుకున్న స్ట్రాస్‌, 126 పరుగులతో విదేశాల్లో తొలి సెంచరీ సాధించాడు. అంతేకాదు, రెండో ఇన్నింగ్స్‌లో జట్టులో స్కోరులో సగానికిపైగా పరుగులు తానే చేసి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. ఈసారి కూడా రెండు సెంచరీల రికార్డుకు కొద్ది దూరంలో ఆగిపోయాడు. 94 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. అంతేకాదు, స్వదేశంలో, విదేశంలోనూ ఆడిన తొలి టెస్టులోనే సెంచరీలు చేసిన ఏడో ఆటగాడిగా ఘనత సాధించాడు.[52][53] బాక్సింగ్‌డే టెస్టులో సెంచరీతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్ట్రాస్‌ కేవలం 25 పరుగలు చేశాడు. జట్టులో ఇదే టాప్‌ స్కోర్‌. ఈ మ్యాచ్‌లో ఇక ఇంగ్లండ్‌ ఓటమి తప్పదనుకున్న స్థితిలో స్ట్రాస్‌ 136 పరుగులు చేశాడు. అంతే కాకుండా ట్రెస్కోథిక్‌తో కలిసి 273 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.[54] ఇంగ్లండ్‌ ఓడిపోయిన మూడో టెస్టులోనూ స్ట్రాస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ తరఫున వేగంగా వెయ్యి పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా కూడా ఈ మ్యాచ్‌లో ఘనత సాధించాడు. కేవలం 19 ఇన్నింగ్స్‌లో స్ట్రాస్‌ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు.[55] నాలుగో టెస్టులో స్ట్రాస్‌, సిరీస్‌లో తన మూడో సెంచరీని సాధించాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ గెలిచింది.[56] ఆఖరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ డకౌట్‌ అయ్యాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ 3-1తో విజయం సాధించింది.[56][57] ఆఖరి టెస్టులో రెండు డకౌట్‌లు అయినప్పటికీ, స్ట్రాస్‌ ఈ సిరీస్‌లో 656 పరుగులతో ఇంగ్లండ్‌ జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో అతడి సగటు 72.88. కెరీర్‌లో తొలిసారి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు కూడా అందుకున్నాడు.[58] దీని తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోయింది. ఈ సిరీస్‌లో స్ట్రాస్‌ విఫలమయ్యాడు. అత్యధికంగా చేసిన పరుగులు కేవలం 35.[47] టెస్టుల్లో తాను సాధించిన పరుగులతో వార్తల్లోకి వచ్చాడు. భవిష్యత్‌లో ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు జస్టిన్‌లాంగర్‌కు దీటుగా ఆటగాడు దొరికాడని భావించారు.[59]

ఈ పర్యటన తర్వాత ఇంగ్లండ్‌ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌ ఆడింది. స్ట్రాస్‌ తన సొంత మైదానంలో లార్డ్స్‌లో ఆడిన ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ చేశాడు.[60] దీని తర్వాత జరిగిన నాట్‌వెస్ట్‌ సిరీస్‌లో బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలపై విజయాలతో జోరును కొనసాగించి, గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచింది.[61] వ్యక్తిగతంగా స్ట్రాస్‌ బంగ్లాదేశ్‌పైత తోలి ఆఖరి మ్యాచ్‌లలో వరుసగా 82 నాటౌట్‌, 98 పరుగులు సాధించాడు.[47] ఒక వన్డేలో అత్యధికంగా 128 బంతుల్లో 152 పరుగులు చేశాడు.[62] కానీ ఆస్ట్రేల్రియాపై మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 25కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. టైగా ముగిసిన ఫైనల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు.[47] తర్వాత ఇంగ్లండ్‌ జట్టు ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో స్ట్రాస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కిందకు దిగి 18 పరుగులు చేశాడు. ఇక్కడ ఇంగ్లండ్‌ 100 పరుగుల విజయం సాధించింది.[63] నాట్‌వెస్ట్‌ చాలెంజ్‌లో ఓడిపోయింది. ఇక్కడ రెండు సార్లు 50కి చేరువలో పరుగులు సాధించినా, స్ట్రాస్‌ పెద్దగా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు.[47]

ది యాషెస్‌ (2005)సవరించు

 
నాలుగో టెస్టులో 129 పరగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా స్ట్రాస్‌ క్యాచ్‌ను మైకేల్‌ క్లార్క్‌ అందుకున్నాడు.

2005 యాషెస్‌ సిరీస్‌కు వెళ్లే సమయానికి ఇంగ్లండ్‌ 1980ల నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు. అయితే అప్పటికి వరుసగా ఆరు సిరీస్‌లలో ఓటమిలేని జట్టుగా ఫామ్‌లో ఉంది. దీంతో ఈ సిరీస్‌ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుందని ఆస్ట్రేలియా కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అంచనా వేశాడు. ఇంగ్లండ్‌ చివరిసారి యాషెస్‌ గెలిచిన తర్వాత ఇదే అతి కఠినమైన పోరాటంగా అభివర్ణించాడు.[64] ఇది ఇంగ్లండ్‌ జట్టుతో పాటు స్ట్రాస్‌ మీద కూడా ఒత్తిడి పెంచినట్లుంది. లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్టులో జట్టు ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 190 పరుగులు చేస్తే, అందులో స్ట్రాస్‌ కేవలం 2 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేస్తే అందులో 37 తనవి. తొలి ఇన్నింగ్స్‌లో పాంటింగ్‌ క్యాచ్‌ను స్ట్రాస్‌ పట్టాడు.[65] రెండో టెస్టు మరింత నాటకీయంగా సాగింది. స్ట్రాస్‌ ఈ మ్యాచ్‌లో మెరుగ్గా కనిపించాడు. ట్రెస్కోథిక్‌తో కలిసి 112 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్ధసెంచరీకి రెండు పరుగుల దూరంలో షేన్‌వార్న్‌ స్పిన్‌కు అవుటయ్యాడు.[66] ఈ పునాదితో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. స్ట్రాస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఎక్కువ ఆసక్తికరంగా సాగింది.[67] రెండో రోజు ఆట ముగియడానికి నాలుగు బంతుల ముందు షేన్‌వార్న్‌ బౌలింగ్‌లో రఫ్‌ ప్రాంతంలో పడిన బంతి స్ట్రాస్‌ లెగ్‌స్టంప్‌ను పడగొట్టింది.[68][69] ఈ ఇన్నింగ్స్‌లో చేసింది ఆరు పరుగులే అయినా చాలా కీలకం అయ్యాయి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచింది.[66] ఈ ఆరు అంకె ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో జరిగిన తర్వాతి టెస్టులోనూ స్ట్రాస్‌ను వెంటాడింది. వాన్‌ ఈ మ్యాచ్‌లో సిరీస్‌లో తొలి సెంచరీని సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్ట్రాస్‌ తన కెప్టెన్‌ అడుగుజాడల్లో నడచి 106 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియాకు 371 పరుగుల లక్ష్యం ఎదురయింది. అయితే ఆస్ట్రేలియా ఆఖరి వికెట్‌ దగ్గర మ్యాచ్‌ను కాపాడుకుని డ్రా చేయగలిగింది. దీంతో సిరీస్‌ 1-1తో సమానంగా ఉంది.[70]

 
యాషెస్‌ గెలిచిన తర్వాత ట్రాఫాల్గర్‌ స్క్వేర్‌ వద్ద ఇంగ్లండ్‌ సంబరాలు

నాలుగో టెస్టులో స్ట్రాస్‌ సెంచరీ భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఇందులో తాను చేసింది 35 పరుగులు. అయితే రెండు కీలక క్యాచ్‌లు అందుకుని ఆస్ట్రేలియా 218 పరుగులకు ఆలౌట్‌ కావడంలో భాగం అయ్యాడు. ముఖ్యంగా హార్డ్‌ హిట్టర్‌గిల్‌క్రిస్ట్‌ కొట్టిన బంతిని స్లిప్స్‌ నుంచి దూరంగా ఎగిరి అందుకున్నాడు. ఇది ఆ వేసవికే అద్భుతమైన చిత్రంగా మిగిలింది.[71] ఫాలోఆన్‌ ఆడించిన తర్వాత ఇంగ్లండ్‌కు 129 పరుగుల లక్ష్యం ఎదురయింది. కానీ బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడిలో పడ్డారు. మూడో వికెట్‌ పడేవరకూ క్రీజులోఉన్న స్ట్రాస్‌ ఆ మ్యాచ్‌లో నమోదైన నాలుగు 20ల్లో ఒకటి సాధించి జట్టు టెస్టును గెలిచి, సిరీస్‌లో ఆధిక్యాన్ని అందుకోవడంలో సహకరించాడు.[72] చివరి టెస్టును డ్రాగా ముగించినా యాషెస్‌ గెలిచే పరిస్థితిలో, స్ట్రాస్‌ అద్భుతమైన దృక్పథంతో తొలి రోజు మొత్త బ్యాటింగ్‌ చేశాడు. ఏడు భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 129 పరుగులు చేసి,[73] ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన ఒకే ఆటగాడిగా నిలిచాడు.[74] మరోసారి మైదానంలోనూ చెప్పుకోదగ్గ క్యాచ్‌ అందుకుని పాంటింగ్‌ను అవుట్‌ చేయడం[73] ద్వారా తన విలువను నిరూపించుకున్నాడు.[74] అదే విధంగా ఫాస్ట్‌బౌలర్‌ మెక్‌గ్రాత్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దురదృష్టవశాత్తు స్ట్రాస్‌ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన చూపించలేకపోయాడు. సిరీస్‌లో మరో రోజు ఆట మిగిలుండగా వార్న్‌ స్పిన్‌కు అవుటయ్యాడు. కాటిచ్‌కు క్యాచ్‌ ఇచ్చి కేవలం ఒక్క పరుగుతోనే పెవిలియన్‌కు చేరాడు. అయితే దక్షిణాఫ్రికాలోనే జన్మించి ఇంగ్లండ్‌కు ఆడుతున్న మరో సహచరుడు కెవిన్‌ పీటర్సన్‌ సెంచరీతో నిలబడి ఆస్ట్రేలియాకు విజయం దక్కకకుండా అడ్డుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ 2-1తో సిరీస్‌ను గెలిచి, 18 సంవత్సరాల తర్వాత తొలిసారి యాషెస్‌ సిరీస్‌ను గెలిచింది.[73]

బ్యాటింగ్‌ కంటే బౌలింగ్‌ ఎక్కువ ఆధిపత్యం కనబరచిన ఈ సిరీస్‌లో స్ట్రాస్‌ 39.30 సగటుతో పరుగులు సాధించాడు. మొత్తం 393 పరుగులతో నాలుగో అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లండ్‌ ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టులో జస్టిన్‌ లాంగర్‌ ఒక్కడే స్ట్రాస్‌కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అది కూడా కేవలం ఒక్క పరుగే. సిరీస్‌లో రెండు సెంచరీలు, ఆరు క్యాచ్‌లు సాధించిన ఒకే ఆటగాడు స్ట్రాస్‌. బెల్‌ ఒక్కడే స్ట్రాస్‌ కంటే ఎక్కువ క్యాచ్‌లు పట్టాడు.[74] కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌, కోచ్‌ డంకన్‌ ఫ్లెచర్‌లకు ఓబిఇ, మిగిలిన జట్టుకు స్ట్రాస్‌తో సహా ఎమ్‌బిఇ పురస్కారాలు నూతన సంవత్సర గౌరవ జాబితాలో లభించాయి.[75][76]

ఆసియా జట్లను ఎదుర్కోవడం మరియు ఆరంభంలో సారథ్యం (2005-06)సవరించు

తర్వాతి శీతాకాలంలో ఇంగ్లండ్‌ జట్టు పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లింది. యాషెస్‌ గెలిచిన ఉత్సాహంలో ఉన్న జట్టు అప్పటికి ఆరు సిరీస్‌లలో ఓటమి (రెండు టెస్టుల్లో మాతమ్రే ఓడింది) ఎరగదు.[77] పర్యటనను స్ట్రాస్‌ తడబాటుతోనే ప్రారంభించాడు. రెండు ఐదులు, ఒక ఆరు[78][79] మాత్రమే టూర్‌ మ్యాచ్‌ల్లో చేశాడు. చివరి వార్మప్‌ ఇన్నింగ్స్‌లో మాత్రం 56 పరుగులు చేశాడు.[78] తన బ్యాటింగ్‌ సమస్యలతో స్ట్రాస్‌ ప్రదర్శన మెరుగుపడలేదు.[80] మొదటి రెండు టెస్టుల్లో కేవలం 44 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టెస్టులో జట్టు ఓడిపోయింది. రెండో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తనకు మొదటి బిడ్డ పుట్టడంతో పాకిస్థాన్‌ పర్యటన నుంచి ముందే వెనక్కి వచ్చాడు. అప్పటికి అతడి సగటు కేవలం 11 పరుగులు.[81] పర్యటనలో జట్టు ఆఖరి మ్యాచ్‌ కూడా ఓడింది.[82] మళ్లీ వన్డేల కోసం స్ట్రాస్‌ తిరిగి వచ్చాడు. టూర్‌ మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.[83] అయితే తొలి వన్డేలో థర్డ్‌మ్యాన్‌ దిశగా పరుగుల వర్షం కురిపిస్తూ 94 పరుగులు చేసి ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.[84] తక్కువ స్కోర్లు నమోదైన ఆఖరి మ్యాచ్‌లోనూ 26 పరుగులు చేశాడు.[85] ఈ వన్డేలోనూ ఇంగ్లండ్‌ గెలిచింది. కానీ ఈ రెండింటి మధ్యలో రెండు సార్లు డకౌట్‌ అయ్యాడు.[86]

క్రిస్ట్‌మస్‌ తర్వాత మార్చిలో ఇంగ్లండ్‌ జట్టు భారత్‌ పర్యటనకు వెళ్లింది. అక్కడ ట్రెస్కోథిక్‌ ఒత్తిడితో కూడిన అనారోగ్యంతో జట్టునుంచి వైదొలిగి వెనక్కు వచ్చాడు. దీంతో స్ట్రాస్‌కు జతగా 21 ఏళ్ల సంవత్సరాల అలిస్టర్‌ కుక్‌ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో స్ట్రాస్‌ మాదిరిగానే ఈసారి కుక్‌ కూడా ఘనతను పునరావృతం చేస్తూ ఒక అర్ధసెంచరీ, సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో స్ట్రాస్‌ చేసిన 28, 46 పరుగులు పరుగులు కుక్‌ ఇన్నింగ్స్‌లో నీడలోకి వెళ్లిపోయాయి. ఈ టెస్టు డ్రాగా ముగిసింది.[87] మూడో టెస్టులో కుక్‌తో చెలరేగి ఆడి 128 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు. దీంతో సిరీస్‌ సమం అయింది.[88] తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది. వాన్‌ మోకాలి గాయంతో తప్పుకోవడంతో ఈ సిరీస్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.[89] ఈ సిరీస్‌లో స్ట్రాస్‌ ఒకే ఒక్కసారి రెండంకెల స్కోరు 61 పరుగులు చేశాడు.[47] అది కూడా రెండో వన్డేలో. ఫ్లింటాఫ్‌ విరామం కోరుకోవడంతో ఆఖరి వన్డేకు స్ట్రాస్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ మ్యాచ్‌ రద్దయింది. గౌహతిలో ప్రేక్షకుల అల్లరి దీనికి కారణం.[90] తర్వాతి మ్యాచ్‌లో ఫ్లింటాఫ్‌ పన్నెండో ఆటగాడిగా ఉన్నాడు.[91] స్ట్రాస్‌ ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. భారత్‌ తొలుత బ్యాటింన చేసినా, స్ట్రాస్‌ బెల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కండరాల నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వైదొలిగాడు.[92] ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్‌లో జట్టు గెలిచిన ఒకే ఒక్క మ్యాచ్‌ ఇది. ఆఖరి మ్యాచ్‌లో స్ట్రాస్‌ కేవలం 25 పరుగులు చేశాడు.భారత్‌ జట్టు ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.[93]

రెండేళ్ల పాటు అద్భుత విజయాలు సాధించిన ఇంగ్లండ్‌, ఈ సారి శీతాకాలం ఒక్క సిరీస్‌ విజయం కూడా లేకుండా వెనక్కు వచ్చింది. తర్వాత శ్రీలంక జట్టు వచ్చి, ఉపఖండ జట్ల ఆధిపత్యం కేవలం భారత ఉపఖండానికి మాత్రమే పరిమితం కాదని నిరూపించింది. ఫ్లింటాఫ్‌కు తిరిగి సారథ్య బాధ్యతలు అప్పగించడంతో స్ట్రాస్‌ పూర్తిగా తన బ్యాటింగ్‌పై దృష్టి కేంద్రీకరించగలిగాడు. మరోసారి ట్రెస్కోథిక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంబించిన స్ట్రాస్‌, అర్ధసెంచరీకి రెండు పరుగుల దూరంలో లంచ్‌కు ముందు ఆఖరి బంతికిమురళీధరన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తర్వాత కుక్‌ వచ్చి ఆడాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో నువాన్‌ కులశేఖర, ఫ్లింటాఫ్‌ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను స్ట్రాస్‌ అందుకోవడం ద్వారా ఆ జట్టు ఆలౌటయింది. దీంతో ఇంగ్లండ్‌కు ఫాలోఆన్‌ ఆడించే అవకాశం లభించింది. కానీ దీనిని ఆ జట్టు సద్వినియోగం చేసుకోకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.[94] రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఆధిక్యం సాధించడంతో పాటు విజయం సాధించింది. ఇక్కడ స్ట్రాస్‌ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోరు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాట్‌ప్యాడ్‌ వివాదాస్పద క్యాచ్‌తో అవుటయ్యాడు.[95][96] మూడో టెస్టులో మరో అర్ధసెంచరీ సాధించాడు. కానీ ఈ మ్యాచ్‌లో జట్టు 134 పరుగుల ఓటమిని ఆపలేకపోయాడు.[97] మరోసారి స్ట్రాస్‌కు వన్డేల్లో సారథ్యం అవకాశం వచ్చింది. శ్రీలంకతో ఉత్కంఠభరితంగా సాగిన వన్డేలో ఇంగ్లండ్‌ 2 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ట్రెస్కోథిక్‌తో కలిసి 59 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పాడు.[98] ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ వైట్‌వాష్‌ అయింది. స్ట్రాస్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా అర్ధసెంచరీ చేయలేకపోయాడు.[99] అయితే ఈ సిరీస్‌లో ముఖ్యంగా ఇంగ్లండ్‌ బౌలింగ్‌ విభాగం చాలా బలహీనంగా కనిపించింది.[100]

వన్డేల్లో వైట్‌వాష్‌ అయినప్పటికీ, స్ట్రాస్‌ మీద నమ్మకం అతడి పూర్తిస్థాయి అధికారిక కెప్టెన్‌గా నియమించారు. పాకిస్థాన్‌ వేసవి పర్యటనతో పాటు యాషెస్‌, ప్రపంచకప్‌లతో ఇంగ్లండ్‌కు చాలా బిజీ షెడ్యూల్‌ ఉంది.[101] టెస్టు సారథ్యం రాగానే, తన తొలి మ్యాచ్‌ తన అభిమాన లార్డ్స్‌ గ్రౌండ్‌లో ఆడాడు. ఇక్కడ మరోసారి సెంచరీ సాధించాడు. ఈసారి రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులు చేశాడు.[102] అయితే తన బౌలర్లకు విజయం కోసం కేవలం 80 ఓవర్లు మాత్రమే అందుబాటులో ఉంచాడనే విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయలేకపోయారు.[103] రెండో టెస్టులో అన్ని అంశాల్లోనూ నాటకీయ మార్పులు చేశాడు. అద్భుతమైన ఫీల్డింగ్‌తో పాకిస్థాన్‌ను 250 లోపు పరుగులకు నియంత్రించారు. ఇంగ్లండ్‌ చేసిన 461 పరుగుల్లో స్ట్రాస్‌ 42 చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో మూడు రోజుల్లోనే విజయం సాధించింది.[104][104] మూడో టెస్టులో చెప్పుకోదగ్గ నాటకీయ పరిణామాలు లేకపోయినా, ఇంగ్లండ్‌ టెస్టులో గెలిచింది. ముందు మూడు ఇన్నింగ్స్‌ మాదిరిగా ఎక్కడా సెంచరీలు రాలేదు. స్ట్రాస్‌ మాత్రం 116 పరుగులతో సెంచరీ చేశాడు. దీంతో కెప్టెన్‌గా తొలి టెస్టు సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం సంపాదించాడు.[105] కెప్టెన్‌గా స్ట్రాస్‌ తొలి టెస్టు సిరీస్‌ వివాదంతో ముగిసింది. ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కొందరు కామెంటేటర్లు ఓవల్‌ గేట్‌ను రిఫర్‌ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో అంపైర్లు డారెల్‌ హెయిర్‌ మరియు బిల్లీ డొక్ట్రోవ్‌ బంతిని పరివీలించారు. బంతి టాంపర్‌ అయిందని గుర్తించారు. ఈ ఆరోపణలతో అవమానపడ్డ పాకిస్థాన్‌, తమ నిరసనను తెలుపుతూ టీ విరామం తర్వాత మైదానంలోకి రాకూడదని నిర్ణయించుకుంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. తర్వాత పాక్‌ ఆటగాళ్లు మైదానానికి వస్తామన్నా, అంపైర్లు తమ నిర్ణయానికి కట్టుబడ్డారు.[106] రెండేళ్ల తర్వాత ఈ నిర్ణయంలో మార్పు జరిగింది. పాకిస్తాన్‌ ఫిర్యాదు మేరకు ఫలితాన్ని డ్రాగా మార్చారు.[107] కానీ 2009 ఫిబ్రవరిలో తొలి నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటన వచ్చింది.[108] దీంతో ఈ సిరీస్‌ ఫలితం 3-0గానే ఉంది. ఈ సిరీస్‌కు స్ట్రాస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు.[109] సిరీస్‌లో ఇంగ్లండ్‌ తరఫున స్ట్రాస్‌ ఎక్కువ పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ యూసుఫ్‌ మాత్రమే స్ట్రాస్‌ కంటే ఎక్కువ పరుగులు చేశాడు.[110]

వన్డే జట్టుకు కూడా స్ట్రాస్‌ సారథ్యం కొనసాగింది. అయితే ఒకే ఒక్క టి20 మ్యాచ్‌లో అతడి ప్రదర్శన సరిగా లేదు. డకౌట్‌ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మరో రెండు ఓవర్లు మిగిలుండగానే పాకిస్థాన్‌ నెగ్గింది. వన్డే సిరీస్‌ ఆరంభమయ్యే సమయానికి కూడా స్ట్రాస్‌ అదృష్టం అలాగే ఉంది.[111] రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన తర్వాత, మూడో వన్డేలో 50 పరుగులు చేశాడు.[47] కానీ ఇంగ్లండ్‌ జట్టు ఓడిపోయింది.[112] నాలుగో మ్యాచ్‌లో స్ట్రాస్‌ 78 పరుగులు సాధించడంతో ఇంగ్లండ్‌ 8 వికెట్ల విజయం సాధించింది.[113] దీంతో సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసింది.[114] తర్వాతి నెలలో ఇంగ్లండ్‌ జట్టు మరోసారి ఉపఖండానికి వెళ్లింది. భారత్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ ఆడింది. మూడు మ్యాచ్‌ల్లో స్ట్రాస్‌ రెండు అర్ధసెంచరీలు చేశాడు. కానీ జట్టు సరిగా ఆడేలేదు.[47] దీంతో ఈ టోర్నీలో వెస్టిండీస్‌పై విజయం మినహా జట్టు ఏమీ సాధించలేకపోయింది.[115]

ఫామ్‌లో తగ్గుదల (2006-07)సవరించు

చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత ఆండ్రూ ఫ్లింటాఫ్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సంపాదించుకోగానే తిరిగి కెప్టెన్సీ అతడికి ఇచ్చారు.[116] స్ట్రాస్‌ పర్యటనను చాలా చెత్తగా ప్రారంభించాడు. నాలుగు ఇన్నింగ్స్‌లోకలిపి కేవలం 71 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ప్రదర్శన కూడా చాలా చెత్తగా ఉంది. తొలి రెండు టెస్టులను కోల్పోయిన తర్వాత, పదే పదే సారథ్యం ఫ్లింటాఫ్‌, స్ట్రాస్‌ల చేతులు మారడం వల్ల డ్రెస్సింగ్‌రూమ్‌లో విభేదాలు ఏర్పడ్డాయని వార్తలు వినిపించాయి. కానీ స్ట్రాస్‌ వీటిని కొట్టిపారేశాడు.[117] దీని తర్వాత జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో 88 పరుగులు చేశాడు.[118] కానీ తర్వాతి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ వివాదాస్పద నిర్ణయాలతో అవుటయ్యాడు. 42 పరుగుల వద్ద క్యాచ్‌ మరియు పరుగులేమీ చేయకుండా ఎల్బీడబ్ల్యుగా అవుటయ్యాడు. కానీ రీప్లేలలో ఈ నిర్ణయాలు తప్పని తేలింది.[119] బాక్సింగ్‌ డే టెస్టులో స్ట్రాస్‌ ఈ సిరీస్‌లో గుర్తుంచుకోదగ్గ ఒకే ఒక్క ఘనత 50 పరుగులు చేశాడు.[120] అయితే ఈ మ్యాచ్‌లోనే వార్న్‌ 700 వికెట్ల మైలురాయిని చేరుకోవడంతో దీనికి పెద్దగా గుర్తింపు రాలేదు.[121] దీని తర్వాత వార్న్‌ మరొక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌తోనే ఇంగ్లండ్‌ యాషెస్‌ను కోల్పోయింది.[120] సిరీస్‌ను వైట్‌వాష్‌గా కోల్పోవడంతో పాటు, ఆఖరి ఇన్నింగ్స్‌లో బ్రెట్‌లీ బౌన్సర్‌ స్ట్రాస్‌ తలకు బలంగా తగలడంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది.[122] జట్టుకు ఆదర్శంగా నిలవాల్సిన స్ట్రాస్‌, కాలింగ్‌వుడ్‌లలో ఆత్మవిశ్వాసం లోపించిందని ఈ సిరీస్‌ తర్వాత కోచ్‌ డంకన్‌ ఫ్లెచర్‌ వ్యాఖ్యానించారు.[123] ఏడాది చివరినాటికి స్ట్రాస్‌ ఫామ్‌ను కోల్పోవడంతో పాటు, అంపైర్ల తప్పు నిర్ణయాలు కూడా పరిగణనలోకి తీసుకుని స్ట్రాస్‌ను 2006 విజ్డన్‌ ఫార్టీలోకి ఎంపిక చేశారు.[124]

టెస్టు సిరీస్‌ తర్వాత కామన్వెల్త్‌ బ్యాంక్‌ ముక్కోణపు సిరీస్‌కు వార్మప్‌గా ఇంగ్లండ్‌ ఒక టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడింది. ఈ ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌కు స్ట్రాస్‌ను ఎంపిక చేయలేదు. కానీ వన్డే సిరీస్‌లో మాత్రం ఆడాడు. సాధారణంగా ఇంగ్లండ్‌ వన్డేల కంటే టెస్టుల్లోనే ఎక్కువ ఆధిపత్యం కనబరిచే జట్టు. ఈ సిరీస్‌లో ఆరంభంలో కొన్ని ఓటములు ఎదురైనా, గెలిచిన జట్టు నిలిచే స్థితిలో ఆఖరి దశలో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.[125] ఈ మ్యాచ్‌లో స్ట్రాస్‌ చేసిన 55 పరుగులు సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన.[47] ఈ సమయంలో స్ట్రాస్‌ వన్డేలో పూర్తిగా ఫామ్‌నుకోల్పోయిన అంశానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. కేవలం బ్యాటింగ్‌ విభాగంలో ప్రత్యామ్నాయాలు లేనందువల్లే స్ట్రాస్‌ను కొనసాగిస్తున్నట్లు కోచ్‌ చెప్పారు.[126] ఆఖరి మ్యాచ్‌లో చేసిన అర్ధసెంచరీ స్ట్రాస్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచలేకపోయింది. తొలి ఫైనల్లో డకౌట్‌ అయ్యాడు. రెండో మ్యాచ్‌లో కేవలం ఆరు పరుగులే చేశాడు.[47] పాంటింగ్‌, మైక్‌ హస్సీల వికెట్లు తీసుకోవడంలో కీలకం అయ్యాడు.వారిద్దరినీ సింగిల్‌ అంకె స్కోర్లకే పరిమితం చేయడం వల్ల డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఇంగ్లండ్‌కు కలిసొచ్చి విజయం సాధించింది. దీంతో మూడో ఫైనల్‌ అవసరం రాలేదు.[127] పూర్తిగా పేలవమైన పామ్‌కారణంగాప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలో స్ట్రాస్‌కు జట్టులో స్థానం దక్కలేదు. సూపర్‌ ఎయిట్‌ దశలో శ్రీలంకతో మ్యాచ్‌ సమయానికి స్ట్రాస్‌ జట్టులోకి వస్తాడని కామెంటేటర్లు భావించారు.[128] కానీ పాత శత్రువు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ వరకూ వేచి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులే చేశాడు. పాంటింగ్‌ను రనౌట్‌ చేసినా, టీవీ రీప్లేల్లో నాటౌట్‌గా వచ్చింది.[47][129] ఇక్కడి నుంచి నాకౌట్‌ దశలో ఇంగ్లండ్‌ ఓటమితో ఇంటి ముఖం పట్టేవరకూ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. తర్వాత రెండేళ్ల వరకూ స్ట్రాస్‌ మళ్లీ ఇంగ్లండ్‌ తరఫున వన్డే క్రికెట్‌ ఆడలేదు.[47]

రెండు ఫార్మాట్‌లలోనూ పేలవ ఫామ్‌ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడుడ. పూర్తిగా టెస్టుల మీద దృష్టి సారించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో అతడిని 43 టెస్టుల తర్వాత జట్టు నుంచి తొలగించారు.[130]

జట్టు నుంచి తొలగింపు మరియు న్యూజిలాండ్‌లో పుంజుకోవడంసవరించు

2007 ఏడాది మొత్తం స్ట్రాస్‌ పేలవ ప్రదర్శన కొనసాగింది. 27 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు కేవలం 96 పరుగులు.[6] స్ట్రాస్‌ భారత్‌, వెస్టిండీస్‌లపై టెస్టు మ్యాచ్‌లు ఆడినప్పటికీ వన్డే జట్టులో మాత్రం స్థానం కోల్పోయాడు. 2007 ఆఖర్లో శ్రీలంక పర్యటనకు స్ట్రాస్‌ను ఎంపిక చేయలేదు. తన స్థానంలో మైకెల్‌ వాన్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. దీంతో స్ట్రాస్‌ కొంతకాలం క్రికెట్‌ నుంచి విరామం తీసుకుంటున్నానని ప్రకటించాడు. సుదీర్ఘమైన, అలసిపోయిన చిరాకు కలిగించిన 12 నెలలుగా ఈ సమయాన్ని అభివర్ణించాడు. అయితే ఒకవేళ తను కోరుకుంటే జట్టుకు బ్యాకప్‌గా భారత్‌ వెళ్లే అవకాశం మాత్రం ఉంది.[6]

తర్వాత స్ట్రాస్‌ కొంతకాలం ఇంగ్లండ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. న్యూజిలాండ్‌ పర్యటనకు మళ్లీ జట్టులోకి వచ్చాడు. తొలి వార్మప్‌ మ్యాచ్‌లో హిట్‌ వికెట్‌గా అవుట్‌ కావడానికి ముందు కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు.[131] 25 టెస్టు ఇన్నింగ్స్‌ సెంచరీ లేకుండా గడిపిన స్ట్రాస్‌ను, ఒవైస్‌ షా (వార్మప్‌ మ్యాచ్‌లో 96 పరుగులు చేశాడు) కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి రెండో వార్మప్‌ మ్యాచ్‌కు జట్టులోకి ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో స్ట్రాస్‌కు స్థానం ఉందని వార్తలు వచ్చాయి.[132] అయితే స్ట్రాస్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానానికి పంపారు. మైకేల్‌ వాన్‌, కుక్‌శ్రీలంక పర్యటనలో మాదిరిగానే ఓపెనర్ల జోడీగా ఆడారు.[132] తొలి ఇన్నింగ్స్‌లో స్ట్రాస్‌ బ్యాటింగ్‌ చాలా పేలవంగా ఉంది. కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తన పాత స్థానం ఓపెనింగ్‌లో వచ్చి బెల్‌తో కలిసి ఆడి అజేయంగా 104 పరుగులు చేశాడు.[133]

తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ స్ట్రాస్‌ చెప్పుకోదగ్గ ఆట ఆడలేదు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ డకౌట్‌ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 226 బంతుల్లో సెంచరీ చేశారు. తన కెరీర్‌లో అది నెమ్మదిగా చేసిన సెంచరీ అయినా, ఆగస్టు 2006 తర్వాత ఇదే తనకు సెంచరీ. ఇదే క్రమంలో టెస్టుల్లో తన అత్యధిక స్కోరు 177ను సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌ ద్వారా స్ట్రాస్‌ తిరిగి గాడిలో పడ్డాడు. ఇంగ్లిష్‌ దేశవాళీ సీజన్‌లో మిడిలెసెక్స్‌ జట్టు తరఫున భారీగా పరుగులు చేశాడు. సర్రేతో దేశవాళీ వన్డేలో కేవలం 130 బంతుల్లోనే 163 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్‌లో న్యూజిలాండ్‌ మరియు దక్షిణాఫ్రికా పర్యటనసవరించు

ఈ 177 పరుగుల తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లో స్ట్రాస్‌ స్థానం ఖరారయింది. వన్డేలకు తనను వదిలేసినప్పటికీ, టెస్టుల్లో మాత్రం తన పూర్వపు ఓపెనర్‌ స్థానం తిరిగి లభించింది. కుక్‌తో కలిసి ఓపెనింగ్‌ ఆడాడు. దీనివల్ల వాన్‌ మూడో స్థానానికి వెళ్లాడు. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో నెమ్మదిగా ఆడినా, 63 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం కలగడంతో ఇంగ్లండ్‌కు ఒక్క ఇన్నింగ్స్‌ మాత్రమే ఆడే అవకాశం లభించింది. రెండో టెస్టులోనూ స్ట్రాస్‌ మరో 60 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చి భారీ స్కోరుకు పునాది వేశాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్‌ చేయడం కష్టంగా ఉన్న వికెట్‌పై 106 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో నెగ్గి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఓల్డ్‌ ట్రాఫర్డ్‌లో స్ట్రాస్‌కు ఇది రెండో సెంచరీ. గతంలో 2005లో ఆస్ట్రేలియాపై కూడా శతకం చేశాడు. ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో జరిగిన మూడో మరియు ఆఖరి టెస్టులో ఇంగ్లండ్‌ ఆడిన తొలి మరియు ఒకే ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఇంగ్లండ్‌ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో 66.50 సగటుతో 266 పరుగులు చేసి ఇంగ్లండ్‌ తరఫున మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు.[134]

తన ఫామ్‌ సెలక్టర్లను ఆకట్టుకుంది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా అతడి స్థానం పదిలంగా ఉంది. తొలి టెస్టులో సాధారణంగా ఆడి 44 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కేవలం ఒక్క ఇన్నింగ్స్‌ మాత్రమే ఆడింది. హెడింగ్లీలో జరిగిన రెండో టెస్టులోనూ ఇబ్బంది పడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయ్యాడు. మూడో టెస్టులోనూ దక్షిణాఫ్రికా పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడి, రెండు ఇన్నింగ్స్‌లోనూ 20ల్లో అవుటయ్యాడు. చివరి టెస్టుకు ఇంగ్లండ్‌ 2-0 లోటుతో వెళ్లింది. కనీసం పరువు దక్కించుకోవడానికి ఆఖరి మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి. తొలి ఇన్నింగ్స్‌లో స్ట్రాస్‌ విఫలమయ్యాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయితే బౌలర్లు ఇంగ్లండ్‌ను మ్యాచ్‌ గెలిచే స్థితిలోకి తీసుకొచ్చారు. తర్వాత స్ట్రాస్‌ పుంజుకున్నాడు. కుక్‌తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు 58 పరుగులు సాధించాడు. దీంతో తన స్థానం గురించి మరోసారి ఒత్తిడి ఏర్పడింది.

2008 భారత పర్యటనసవరించు

భారత పర్యటనకు కూడా స్ట్రాస్‌కు స్థానం లభించింది. దీని ప్రతిఫలాన్ని వెంటనే అందించాడు. మొత్తం జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ అంతా కుప్పకూలిన సమయంలో తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. తర్వాత ఇన్నింగ్స్‌లోనూ 43కు ఇంగ్లండ్‌ మూడు వికెట్లు కోల్పోయిన దశలో కాలింగ్‌వుడ్‌తో కలిసి డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు. కాలింగ్‌వుడ్‌, స్ట్రాస్‌ ఇద్దరూ 108 పరుగుల చొప్పున సాధించారు. 2004లో మార్కస్‌ ట్రెస్కోథిక్‌ తర్వాత రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించిన ఘనతను స్ట్రాస్‌ సాధఙంచాడు. ఈ ఘనతను సాధించిన పదో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ స్ట్రాస్‌.[135]

సారథ్యంసవరించు

2009 జనవరి 7న స్ట్రాస్‌ను కెప్టెన్‌గా నియమించారు. కెవిన్‌ పీటర్సన్‌, పీటర్‌ మూర్స్‌ మధ్య బాహాటంగా గొడవలు వచ్చాయి. దీంతో పీటర్సన్‌ కెప్టెన్సీకి కేవలం మూడు టెస్టుల తర్వాత రాజీనామా చేశాడు. మూర్స్‌ను తొలగించారు. భారత్‌లో 2008 టెస్టు సిరీస్‌లో బాగా రాణించిన తర్వాత ఈ పరిణామాలుజరగడంతో స్ట్రాస్‌ కెప్టెన్‌ అయ్యాడు. భారత్‌ పర్యటనలో ఇంగ్లండ్‌ ఒక మ్యాచ్‌ ఓడి, ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌పై పూర్తి స్థాయి కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో స్ట్రాస్‌ కేవలం 7 మరియు 9 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌ జట్టు కూడా విఫలమైంది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 51 పరుగులకు ఆలౌటై ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయింది.[136] రద్దయిన టెస్టు మ్యాచ్‌ వివాదం తర్వాత, స్ట్రాస్‌ సిరీస్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. వరుసగవ 169, 142 మరియు 142 పరుగులతో మిగిలిన మూడు టెస్టుల్లోనూ రాణఙంచాడు. ఈ సిరీస్‌లో 67.62 సగటుతో మొత్తం 541 పరుగులు చేశాడు.[137] అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా ఇంగ్లండ్‌ గెలవలేదు. దీంతో సిరీస్‌ను 1-0తో కోల్పోయింది. తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లోనూ తన కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది.[138] గయానాలో 105 పరుగులు చేసిన స్ట్రాస్‌ కెన్సింగ్టన్‌ ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో అజేయంగా 79 పరుగులు చేశాడు.[139] ఆరు వికెట్ల తేడాతో ఓడిన ట్వంటీ 20 మ్యాచ్‌లోనూ జట్టుకు సారథ్యం వహించాడు.[140] 2009 యాషెస్‌ సిరీస్‌ సమయానిక సారథ్యానికి సంబంధించిన వివాదాలేవీ ఉండవని స్ట్రాస్‌ బిబిసితో చెప్పాడు.

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లలో వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ 2-0తో ఓటమికి స్ట్రాస్‌ బాధ్యత వహించాడు. ఈ సిరీస్‌ తర్వాత ప్రపంచ ట్వంటీ 20 జరుగుతున్నందున స్ట్రాస్‌ అంతర్జాతీయ సర్క్యూట్‌ నుంచి కొంత విరామం తీసుకున్నాడు. ఈ సమయంలో రెండు కౌంటీ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగులు చేశాడు.[141]

ది యాషెస్‌ (2009)సవరించు

2007లో 5-0 వైట్‌ వాష్‌ తర్వాత తిరిగి యాషెస్‌ను సాధించగలమనే నమ్మకంతో ఇంగ్లండ్‌ సిరీస్‌ను ప్రారంభించింది.

సోఫియా గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో స్ట్రాస్‌కు రెండు ఇన్నింగ్స్‌లోనూ 30 మరియు 17 పరుగులతో మంచి ఆరంభాలు లభించినా, వాటిని భారీస్కోర్లుగా మలచలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో హారిట్జ్‌ బౌలింగ్‌లో టాప్‌ ఎడ్జ్‌తో క్యాచ్‌ ఇచ్చి అవుటైన విధానం మరీ పేలవంగా ఉంది.[ఉల్లేఖన అవసరం] మంచి బ్యాటింగ్‌ వికెట్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 674 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. సైమన్‌ కాటిచ్‌ (122), రికీ పాంటింగ్‌ (150), మార్కస్‌ నార్త్‌ (125 నాటౌట్‌) మరియు బ్రాడ్‌ హాడిన్‌ (121) సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో పాల్‌ కాలింగ్‌వుడు దాదాపు ఐదుముప్పావు గంటల పాటు క్రీజులో నిలబడి 74 పరుగులతో పోరాడాడు. చివరి వరుస ఆటగాళ్లు కూడా పోరాడటంతో ఇంగ్లండ్‌ డ్రాతో గట్టెక్కింది. ఆఖరి జోడీ జేమ్స్‌ అండర్సన్‌, మాంటీ పనేసర్‌ మ్యాచ్‌లో చివరి పదకొండున్నర ఓవర్లను సమర్ధంగా ఆడారు.[142]

1934లోహెడ్లీ వరిటీ మ్యాచ్‌ తర్వాత యాషెస్‌లో ఇంగ్లండ్‌ జట్టులార్డ్స్‌లో ఒక్క టెస్టులోనూ గెలవలేదు. ఇలాంటి రికార్డుతో రెండో టెస్టు ఆడేందుకు ఇంగ్లండ్‌ సిద్ధమైంది. తన సొంత మైదానంలో స్ట్రాస్‌ తొలి రోజు మొత్తం బ్యాటింగ్‌ చేసి 161 పరుగులు చేశాడు. అలిస్టర్‌ కుక్‌ (95)తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 196 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తర్వాతి రోజు ఉదయం తన ఓవర్‌నైట్‌ స్కోరుకు పరుగులేమీ జత చేయకుండా రెండో బంతికే హిల్ఫెన్హాస్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. స్ట్రాస్‌ ఇన్నింగ్స్‌ ఈ సిరీస్‌లో రెండు జట్లలోనూ కలిపి అత్యధిక స్కోరు. దీనివల్ల ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగుల ఆధిక్యం వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో స్ట్రాస్‌ 32 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియాకు విజయానికి 522 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. సాధిస్తే ఇది పెద్ద రికార్డు. మైకేల్‌ క్లార్క్‌ (136), బ్రాడ్‌ హాడిన్‌ (80), మిషెల్‌ జాన్సన్‌ (63) కొద్దిసేపు పోరాడటంతో లక్ష్యం ఛేదించదగినదిగా కనిపించింది. కానీ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ (5/92) మరియు గ్రేమ్‌ స్వాన్‌ (4/87) రాణించడం వల్ల ఇంగ్లండ్‌ 115 పరుగుల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది.[143]

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మూడో టెస్టులో, ఆస్ట్రేలియా సాధించిన తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 263 పరుగులకు స్ట్రాస్‌ దీటుగా స్పందించి రెండో రోజు ముగిసే సమయానికి అజేయంగా 64 పరుగులు చేశాడు. తర్వాతి ఉదయం 69 పరుగుల స్కోరు వద్ద హిల్ఫెన్హాస్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే ఇంగ్లండ్‌ యొక్క బలమైన లోయర్‌ ఆర్డర్‌ రాణించి, జట్టుకు 113 పరుగులు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని తెచ్చింది. అయితే ఆస్ట్రేలియా కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను అధిగమించి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మైకేల్‌ క్లార్క్‌ (103 నాటౌట్‌) మరియు మార్కస్‌ నార్త్‌ (96) రానించడం వల్ల ఒకటిన్నర రోజుల్లో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి గట్టెక్కింది.[144]

హెడింగ్లీలో జరిగిన నాలుగో టెస్టులో మ్యాచ్‌ ఆరంభానికి ముందు జట్టు ఎంపికకు సంబంధించిన అంశాలతో స్ట్రాస్‌ ఏకాగ్రత దెబ్బతింది. పీటర్సన్‌, ఫ్లింటాఫ్‌ ఇద్దరూ గాయపడ్డారు. మాట్‌ ప్రయర్‌ వెన్నునొప్పితో ఆడేదీ లేనిదీ అనుమానంగా మారింది. ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశాలలో స్పష్టత లేకపోవడంతో మ్యాచ్‌ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.[145] అదే రోజు ఉదయం ఐదు గంటలకు జట్టు హోటల్‌లో ఫైర్‌ అలారమ్‌ మోగడం కూడా స్ట్రాస్‌ను ఏకాగ్రతను దెబ్బతీసినట్లుంది. ఇదే సమయంలో బ్యాటింగ్‌ ఆరంభించడానికి ముందు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చింది. మ్యాచ్‌లో తొలి బంతికే ఎల్బీగా అవుట్‌ కావాల్సింది కానీ అదృష్టవశాత్తు అంపైర్‌ ఇవ్వలేదు.[ఉల్లేఖన అవసరం]అయితే కేవలం మూడు పరుగులకే అవుటయ్యాడు.[146] ఇంగ్లండ్‌ కేవలం 102 పరుగులకు ఆలౌటయింది. పీటర్‌ సిడిల్‌, స్టువర్ట్‌ క్లార్క్‌ల ధాటికి ఇంగ్లండ్‌ బదులు ఇవ్వలేకపోయింది. మైకేల్‌ క్లార్క్‌, మార్కస్‌ నార్త్‌ మరోసారి రాణించడంతో ఆస్ట్రేలియా 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్ట్రాస్‌, కుక్‌ కలిసి తొలి వికెట్‌కు 58 పరుగులుజోడించి ఇన్నింగ్స్‌ను దీటుగానే ప్రారంభించారు. అయితే హిల్ఫెన్హాస్‌ 32 పరుగుల వద్ద స్ట్రాస్‌ను అవుట్‌ చేశాడు ఈసారి హిల్ఫెన్హాస్‌తో పాటు జాన్సన్‌ చెలరేగడంతో ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పలేదు.[147]

ఓవల్‌లో జరిగిన ఐదో టెస్టుకు ఇరు జట్లు 1-1తో వెళ్లాయి. కేవలం విజయం సాధిస్తేనే యాషెస్‌ను సాధించగల స్థితిలో ఇంగ్లండ్‌ ఉంది. ఒకవేళ సిరీస్‌ డ్రాగా ముగిస్తే గత విజేతకే యాషెస్‌ను ఇవ్వడం అనేది ఆది నుంచి ఉన్న సంప్రదాయం. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసింది. ఇందులో స్ట్రాస్‌ 55 పరుగులు చేశాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ (5/37), గ్రేమ్‌ స్వాన్‌ (4/38) చెలరేగడంతో ఊహించని విధంగా ఆస్ట్రేలియా 160 పరుగులకు ఆలౌటయింది. రెండో ఇన్నింగ్స్‌లో స్ట్రాస్‌ 75 పరుగులు చేయడంతో పాటు అరంగేట్రం చేసిన జోనాథన్‌ ట్రాట్‌ (119)తో కలిసి 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ఆస్ట్రేలియాకు 546 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. సిరీస్‌ ఆఖరి రోజున స్ట్రాస్‌ లెగ్‌స్లిప్‌లో అద్భుతంగా ఫీల్డింగ్‌ చేసి మైకేల్‌ క్లార్క్‌ను డకౌట్‌గా రనౌట్‌ చేశాడు. ఇదే ఇన్నింగ్స్‌లో క్యాచ్‌ కూడా పట్టాడు. ఆస్ట్రేలియా 348 పరుగులకు ఆలౌటయింది. ఇంగ్లండ్‌కు 197 పరుగుల విజయం లభించింది. దీంతో సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1తో గెలుచుకుని యాషెస్‌ను తిరిగి దక్కించుకుంది.

ఈ సిరీస్‌లో స్ట్రాస్‌ను ఇంగ్లండ్‌ తరఫున మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఆస్ట్రేలియా కోచ్‌ టిమ్‌ నీల్సన్‌ ఎంపిక చేశారు. సిరీస్‌లో స్ట్రాస్‌ మొత్తం 474 పరుగులు చేశాడు. (రెండు జట్లలోనూ కలిపి ఇవే అత్యధిక పరుగులు. ఇంగ్లండ్‌ జట్టులో స్ట్రాస్‌ తర్వాత ఉత్తమ పరుగులు 261 మాత్రమే) సిరీస్‌లో అతడి సగటు 52.66 (ఇంగ్లండ్‌ జట్టులో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడిన ట్రాట్‌ మినహా ఏ ఆటగాడు కూడా 40 సగటుతో పరుగలు చేయలేదు). ఈ సిరీస్‌లో స్ట్రాస్‌ బ్యాట్‌తో ఆధిపత్యం కొనసాగించడం వల్ల ఆస్ట్రేలియా సిరీస్‌ను కోల్పోయింది. అత్యధిక పరుగుల జాబితాలో ఏడుగురులో ఆరుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లున్నా ఓటమి తప్పలేదు.[148]

దీని తర్వాత జరిగిన ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో స్ట్రాస్‌ ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో కీలకంగా వ్యవహరించాడు. దీని ముందు జరిగిన టెస్టు సిరీస్‌ గురించి ఆండ్రూ మిల్లర్‌ ఇలా వ్యాఖ్యానించారు. ఈ వేసవిలో ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ దిక్కుతోచని స్థితిలో ఆడింది. ఆండ్రూ స్ట్రాస్‌ వికెట్‌ గనక పడితే తల్లిని కోల్పోయిన కోడిపిల్లల్లా కనిపించారు అని అన్నారు.[149] వన్డేల్లో స్ట్రాస్‌ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. వరుసగా 12, 47, 63, 63, 35, 0, 47 పరుగులతో తన భూమికను పోషించాడు. ఈ సిరీస్‌ సెప్టెంబరు 4 నుంచి సెప్టెంబరు 20 వరకూ జరిగింది.[150] అనేక సార్లు జట్టు ప్రదర్శన గురించి ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. సిరీస్‌లో ఇంగ్లండ్‌ 6-1 తేడాతో ఓడిపోయింది.[151]

2009 - 10 మరియు 2010సవరించు

యాషెస్‌ తర్వాత ఇంగ్లండ్‌ జట్టు 2009 చాంపియన్స్‌ ట్రోఫీ ఆడింది. శ్రీలంక, దక్షిణాఫ్రికాలను ఓడించి ఊహించని విధంగా సెమీఫైనల్‌కు చేరింది. అయితే ఇందులో స్ట్రాస్‌ చేసిన అత్యధిక పరుగులు 25 మాత్రమే. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లోనూ పెద్దగా ఆట్టుకోలేదు. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1తో నెగ్గింది. టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఈ సిరీస్‌లో స్ట్రాస్‌ ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును అధిగమించాడు.

దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత బంగ్లాదేశ్‌లో జరిగిన పర్యటనకు వివాదాస్పదంగా స్ట్రాస్‌కు విశ్రాంతి ఇచ్చారు.[152] తన స్థానంలో ఆలిస్టర్‌ కుక్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఓపెనర్‌గా స్ట్రాస్‌ స్థానంలో మైకెల్‌ కార్‌బెర్రీని ఎంపిక చేశారు. (అయితే రెండో టెస్టుకు కార్‌బెర్రీ స్థానంలో ట్రాట్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేశారు). తర్వాత ఇంగ్లండ్‌ జట్టు 2010లో పాల్‌ కాలింగ్‌వుడ్‌ సారథ్యంలో వెస్టిండీస్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచ ట్వంటీ 20 చాంపియన్‌షిప్‌లో విజయం సాధించింది.

స్ట్రాస్‌ తిరిగి బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధసెంచరీలు చేశాడు, ఇంగ్లండ్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. టెస్టులు, వన్డే సిరీస్‌కు మధ్యలో ఇంగ్లండ్‌ జట్టు ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ ఆడింది. (జూన్‌లో బంగ్లాదేశ్‌ జట్టు ఆసియాకప్‌లో ఆడాల్సి ఉన్నందున ఈ విరామంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఆడారు). సిరీస్‌ను ఇంగ్లండ్‌ గెలుచుకుంది. రెండు, మూడు మ్యాచ్‌ల్లో స్ట్రాస్‌ అర్ధసెంచరీలు చేశాడు. బంగ్లాదేశ్‌ జట్టు తిరిగి వన్డేల కోసం వచ్చాక, తొలి మ్యాచ్‌లో స్ట్రాస్‌ అర్ధసెంచరీ చేశాడు. మూడో వన్డేలో కెరీర్‌లోనే ఉత్తమంగా 154 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మరో ఆటగాడు జనాథన్‌ ట్రాట్‌తో కలిసి 250 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1తో గెలుచుకుంది. స్ట్రాస్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపిక చేశారు. దీని తర్వాత సిరీస్‌లో స్ట్రాస్‌ రెండో మ్యాచ్‌లో 126 పరుగులు చేశాడు.[153]

దీని తర్వాత వివాదాస్పద పాకిస్థాన్‌ సిరీస్‌ జరిగింది. ఇంగ్లండ్‌ 3-1తో టెస్టు సిరీస్‌ను గెలిచినప్పటికీ స్ట్రాస్‌ ఫామ్‌ లేక ఇబ్బంది పడ్డాడు. కేవలం ఒక్క అర్ధసెంచరీ మాత్రమే చేశాడు. పాకిస్థాన్‌ను మూడుసార్లు వంద పరుగుల లోపు ఆలౌట్‌ చేశారు. ఐదు వన్డేల సిరీస్‌ ద్వారా మళ్లీ స్ట్రాస్‌ ఫామ్‌లోకి వచ్చాడు. ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేశాడు. ఇంగ్లండ్‌ జట్టు 3-2తో సిరీస్‌ గెలిచి 2010-11 యాషెస్‌ సిరీస్‌కు సిద్ధమైంది.

ది యాషెస్‌ (2010-11)సవరించు

యాషెస్‌ సిరీస్‌ను స్వదేశంలో, బయటా గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్లు మైక్‌ బ్రేర్‌లీ, లెన్‌ హుటన్‌ల రికార్డును చేరుకోవడం లక్ష్యంగా 2010-11 యాషెస్‌ సిరీస్‌ను స్ట్రాస్‌ ప్రారంభించాడు. ది గబ్బా (బ్రిస్బేన్‌)లో తొలి టెస్టులో స్ట్రాస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే మూడో బంతికే గల్లీలో క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయ్యాడు. ఇంగ్లండ్‌ సాధించిన తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 260 మంచి స్కోరు కాదు. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ లోటు ఉన్నప్పటికీ, ఇంగ్లండ్‌ తిరిగి పోరాడింది. స్ట్రాస్‌, కుక్‌ తొలి వికెట్‌కు 188 పరుగులు జోడించారు. స్ట్రాస్‌ కెరీర్‌లో 19వ సెంచరీ సాధఙంచాడు. తర్వాత 110 పరుగులకు అవుటయ్యాడు. తన టెస్టు కెరీర్‌లో తొలిసారి స్ట్రాస్‌ స్టంపౌట్‌ కావడం విశేషం. సహచర ఓపెనర్‌ కుక్‌ అజేయంగా 235 పరుగులు, జోనాథన్‌ ట్రాట్‌ అజేయంగా 135 పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌ 517/1 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 107/1 స్కోరు సాధించాక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.[154]

అడిలైడ్‌ ఓవర్‌లో జరిగినరండో టెస్టులో రికీ పాంటింగ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కానీ ఇంగ్లండ్‌ బౌలర్లు రాణించి 245కు ఆలౌట్‌ చేశారు. జేమ్స్‌ అండర్సన్‌ 51/4తో చెలరేగిపోయాడు. తర్వాత ఇంగ్లండ్‌ ఐదు వికెట్లకు 620 పరుగుల భారీస్కోరు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో స్ట్రాస్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. తర్వాత ఇంగ్లండ్‌ జట్టు ఆస్ట్రేలియాను 304 పరుగులకు ఆలౌట్‌ చేసింది. గ్రేమ్‌ స్వాన్‌ 91 పరుగులకు ఐదు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 71 పరుగుల తేడాతో గెలిచింది.

పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో స్ట్రాస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలి రోజే ఇంగ్లండ్‌ బౌలర్లు ఆస్ట్రేలియాను 268 పరుగులకు ఆలౌట్‌ చేశారు. స్ట్రాస్‌ అజేయంగా 12 పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. రెండో రోజు తొలి గంట స్ట్రాస్‌ చక్కగా ఆడి ఇంగ్లండ్‌ స్కోరు 78కి చేర్చాడు. అయితే ఆ తర్వాత మిషెల్‌ జాన్సన్‌ (6/38) చెలరేగడంతో ఇంగ్లండ్‌ కేవలం 187 పరుగులకు ఆలౌటయింది. అయితే రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ మూడు ఆస్ట్రేలియా వికెట్లను పడగొట్టడంతో స్కోరు 119/3గా ఉంది. తర్వాత స్ట్రాస్‌సేన 309 పరుగులకు ఆసీస్‌నుఆలౌట్‌ చేసింది. అంటే ఇంగ్లండ్‌ గెలవాలంటే 391 పరుగులు చేయాలి. అయితే ఒక్కరు కూడా సరిగా బ్యాటింగ్‌ చేయలేదు. ఆసీస్‌ బౌలర్‌ రియాన్‌ హారిస్‌ (6/49) చెలరేగడంతో ఇంగ్లండ్‌ 123 పరుగులకు ఆలౌటయింది. 267 పరుగుల తేడాతో ఓడిపాయింది.

ఎంసిజిలో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో స్ట్రాస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం వల్ల లాభం పొందిన ఇంగ్లండ్‌ కేవలం 98 పరుగులకు ఆసీస్‌నుఆలౌట్‌ చేసింది. దీనికి బదులుగా కుక్‌, స్ట్రాస్‌ కలిసి తొలి వికెట్‌కు 159 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో స్ట్రాస్‌ టెస్టుల్లో ఆరువేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 69 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్‌ జట్టు 513 పరుగులు చేసిన తర్వాత, ఆస్ట్రేలియా 258 పరుగులకు ఆలౌటయింది. దీంతో ఇన్నింగ్స్‌ 157 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్‌ యాషెస్‌ను నిలబెట్టుకుంది.

సిడ్నీలోని ఎస్‌సిజిలో జరిగిన ఆఖరి మరియు ఐదో టెస్టులో మైకేల్‌ క్లార్క్‌కు స్ట్రాస్‌ టాస్‌ ఓడిపోయాడు. పాంటింగ్‌క గాయం కావడంతో ఈ మ్యాచ్‌లో క్లార్క్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. క్లార్క్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు రాణించి ఆస్ట్రేలియాను 280 పరుగులకు ఆలౌట్‌ చేశారు. దీనికి బదులుగా స్ట్రాస్‌ కేవలం 58 బంతుల్లోనే 60 పరుగులు సాధించి హిల్ఫెన్హాస్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇంగ్లండ్‌ జట్టులోని మిగిలిన బ్యాట్స్‌మెన్‌ కూడా రాణించడంతో 644 పరుగుల భారీస్కోరు సమకూరింది. ఆస్టేల్రియా గడ్డపై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక స్కోరు. అలిస్టర్‌ కుక్‌, బెల్‌, ప్రయర్‌ సెంచరీలు చేయడంతో ఇది సాధ్యమైంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటయింది. దీంతో సిరీస్‌లో ఇంగ్లండ్‌కు మూడోసారి ఇన్నింగ్స్‌ విజయం లభించింది. మొత్తం మీద 3-1తో యాషెస్‌ సిరీస్‌ను గెలిచింది.

ఐసీసీ ప్రపంచ కప్ 2011సవరించు

ఇంగ్లండ్‌ జట్టు తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో ఆడింది. స్ట్రాస్‌ బంతికి ఒకటి కంటే ఎక్కువగా 88 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తర్వాతి మ్యాచ్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిన్ చాడు. భారత్‌ జట్టు నిర్దేశించిన అసాధ్యమైన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 145 బంతుల్లో 158 పరుగులచేశాడు. ఈ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగి టైగా ముగిసింది.[155] మూడో మ్యాచ్‌లో స్ట్రాస్‌ 37 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ జట్టు ఐర్లాండ్‌పై 327 పరుగులు చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. కెవిన్‌ ఓబ్రియాన్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడి 50 బంతుల్లోనే సెంచీర చేయడంతో పాటు ఆరో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఐర్లాండ్‌ గెలిచింది.[156] చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తక్కువ స్కోరు చేసినా ఇంగ్లండ్‌ 165 పరుగులకు ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి గెలిచింది. మార్చిన 6న జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫిక్రా 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. స్టువర్ట్‌ బ్రాడ్‌కు నాలుగు కీలక వికెట్లు లభించాయి. ఇంగ్లండ్‌ బౌలర్లు ప్రొటీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కుప్పకూల్చారు. ఒక దశలో వికెట్‌ నష్టపోకుండా 63 పరుగలుతో ఉన్న జట్టును కాస్తా 102 పరుగుల వ్యవధిలో ఆలౌట్‌ చేశారు.[157]

విజయాలుసవరించు

 
స్ట్రాస్‌ టెస్టు మ్యాచ్‌ బ్యాటింగ్‌ కెరీర్‌లో ఇన్నింగ్స్‌ల వారీగా విశ్లేషణ, చేసిన పరుగులు (ఎర్ర బార్స్‌) మరియు చివరిపది ఇన్నింగ్స్‌లో సగటు (నీలి రంగు గీత)

ప్రతి ప్రత్యర్థిపై టెస్టు రికార్డులుసవరించు

ప్రత్యర్థి మ్యాచ్‌లు ఇన్నింగ్స్ నాట్ అవుట్ పరుగులు బంతులు అత్యధిక స్కోరు 100 50 సగటు Strike Rate
  ఆస్ట్రేలియా 15 29 0 1,200 2,217 161 4 5 38.41 50.25
  Bangladesh 4 5 0 263 385 83 0 3 52.60 68.31
  [[భారత్ {{{altlink}}}|భారత్]] 8 16 1 700 1,200 128 3 2 46.66 72.88
  New Zealand 9 16 0 813 1,200 177 3 4 50.81 47.04
  పాకిస్తాన్ 8 15 1 595 1003 128 2 1 42.50 59.32
  South Africa 13 24 1 1006 2092 147 3 3 43.73 48.08
  శ్రీలంక 3 5 0 156 341 55 0 1 31.20 45.74
  వెస్ట్ ఇండీస్ 15 27 3 1082 2045 169 4 2 45.08 52.90
మొత్తం 75 137 6 5,729 11,406 177 19 21 43.73 50.22

ఏడాది వారీగా టెస్టు విశ్లేషణసవరించు

ఏడాది మ్యాచ్‌లు ఇన్నింగ్స్ నాట్ అవుట్ పరుగులు అత్యధిక స్కోరు సగటు Strike Rate 100 50
2004 9 18 2 971 137 60.68 50.89 4 4
2005 12 22 0 789 147 35.86 52.18 3 1
2006 14 26 0 1031 128 39.65 49.95 3 3
2007 8 15 0 432 96 28.80 47.21 0 3
2008 12 21 1 972 177 48.60 43.54 4 3
2009 14 24 2 1172 169 53.27 54.13 4 4
2010 12 20 1 657 110 34.57 52.06 1 5

వీటిని కూడా చూడండిసవరించు

 • ఆండ్రూ స్ట్రాస్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో చేసిన సెంచరీల జాబితా
 • దక్షిణాఫ్రికాలో జన్మించిన అంతర్జాతీయ క్రికెటర్లు

సూచనలుసవరించు

 1. "Andrew Strauss". Cricinfo. Retrieved 2011-03-09. Cite web requires |website= (help)
 2. "ఇంగ్లండ్‌-న్యూస్‌-ఈసీబీ". మూలం నుండి 2007-03-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-04-21. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 3.2 3.3 క్రిక్‌ఇన్ఫో - ఆటగాళ్లు మరియు అధికారులు - ఆండ్రూ స్ట్రాస్‌
 4. "New Zealand in England Test Series - 1st Test England v New Zealand". CricInfo. 24 May 2004. Retrieved 2009-06-22. Cite web requires |website= (help)
 5. మొదటి టెస్టు: పోర్ట్‌ ఎలిజబెత్‌లో దక్షిణాఫ్రికా వర్సెస్‌ ఇంగ్లండ్‌, 17-21 డిసెంబరు 2004
 6. 6.0 6.1 6.2 క్రికెట్‌ నుంచి విరామం కొరకు స్ట్రాస్‌ ప్రణాళిక బిబిసి న్యూస్‌, 22 అక్టోబరు 2007 నుంచి తీసుకోబడింది
 7. ది యాషెస్‌ 2009 - అత్యధిక పరుగులు
 8. ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, లార్డ్స్‌, 2009
 9. Brett, Oliver (2001-11-01). "Strauss calls the tune". BBC. Retrieved 2009-03-13. Cite news requires |newspaper= (help)
 10. Penrose, Helen (2006). Outside the Square: 125 Years of Caulfield Grammar School. Melbourne University Publishing. ISBN 0522853196.
 11. "Biography of Andrew Strauss". Spiritus Temporis. మూలం నుండి 2011-03-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-03-11. Cite web requires |website= (help)
 12. "Caldicott School Academic Results 1989-1990". Caldicott School. మూలం నుండి 2010-05-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-08-29. Cite web requires |website= (help)
 13. Viner, Brian (2006-09-15). "Andrew Strauss: 'I like to think I will have an opportunity to captain the England team again'". London: The Independent. Retrieved 2009-03-11. Cite news requires |newspaper= (help)
 14. Miller, Andrew (2008-07-14). "Hot water and towels". Cricinfo. Retrieved 2008-07-15. Cite web requires |website= (help)
 15. "Andrew Strauss takes the blind cricket challenge" (PDF). Primary Club. 2006-05-22. మూలం (PDF) నుండి 2006-12-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-03-11. Cite web requires |website= (help)
 16. "Middlesex County Cricket Club Profile". Middlesex County Cricket Club. మూలం నుండి 2012-04-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-03-09. Cite web requires |website= (help)
 17. హాంప్‌షైర్‌ వర్సెస్‌ మిడిలెసెక్స్‌, 1998
 18. 18.0 18.1 సీజన్ల వారీగా ఆండ్రూ స్ట్రాస్‌ బ్యాటింగ్‌ సగటులు
 19. మిడిలెసెక్స్‌ వర్సెస్‌ నార్తాంప్టన్‌షైర్‌, 2000
 20. "Cricket Archive profile". Cricket Archive. Retrieved 2009-03-09. Cite web requires |website= (help)
 21. "England in Bangladesh, Oct - Nov 2003 squads". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 22. Auld, Freddie (2006-11-06). "Strauss - ' I was expecting a Test call-up, not a one-day one'". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 23. Randall, Nicholas (2003-11-05). "Solanki and Strauss star in England stroll". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 24. Miller, Andrew (2003-11-15). "Strauss puts the pressure on Solanki". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 25. "1st ODI: Sri Lanka v England at Dambulla, Nov 18, 2003". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 26. "Strauss called up to England Test squad". Cricinfo. 2004-03-05. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 27. "1st ODI: West Indies v England at Georgetown, April 18, 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 28. "5th ODI: West Indies v England at Gros Islet, May 1, 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 29. Auld, Freddie (2004-05-02). "West Indies cruise to victory". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 30. "7th ODI: West Indies v England at Bridgetown, May 5, 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 31. Walters, Mike. "First Test Match England v New Zealand". Wisden Cricketers' Almanack. Cricinfo. Retrieved 2009-03-09.
 32. Miller, Andrew (2004-05-19). "England braced for loss of Vaughan". Cricinfo. Retrieved 2009-03-09. Cite web requires |website= (help)
 33. "Trescothick to lead England". Wisden Cricketers' Almanack. Cricinfo. 2004-05-19. Retrieved 2009-03-09.
 34. 34.0 34.1 "1st Test: England v New Zealand at Lord's, May 20–24, 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 35. "Hussain seals victory". BBC. 2004-05-24. Retrieved 2009-03-09. Cite news requires |newspaper= (help)
 36. Fraser, Angus (2004-05-22). "Century on Test debut gives Strauss his place in history". London: The Independent. Retrieved 2009-03-12. Cite news requires |newspaper= (help)
 37. Brown, Gavin (2006-03-06). "Cook comes to boil". BBC. Retrieved 2009-02-28. Cite news requires |newspaper= (help)
 38. Cook, Alastair (2006-03-07). "Still buzzing after a dream debut". London: The Daily Telegraph. Retrieved 2009-03-03. Cite news requires |newspaper= (help)
 39. "Hussain ponders future". BBC. 2004-05-24. Retrieved 2009-03-12. Cite news requires |newspaper= (help)
 40. "2nd Test: England v New Zealand at Leeds, July 3–7, 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 41. "3rd Test: England v New Zealand at Nottingham, Jun 10-13 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 42. "5th Match: England v West Indies at Leeds, Jul 1, 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 43. "8th Match: England v West Indies at Lord's, July 6, 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 44. "1st Test: England v West Indies at Lord's, Jul 22-26 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 45. "3rd Test: England v West Indies at Manchester, Aug 12-16 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 46. "1st Match: England v India at Nottingham, Sep 1 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 47. 47.00 47.01 47.02 47.03 47.04 47.05 47.06 47.07 47.08 47.09 47.10 47.11 47.12 "One Day Internationals analysis". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 48. "1st Match: England v Zimbabwe at Birmingham, Sep 10-11 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 49. "1st Semi-Final: England v Australian at Birmingham, Sep 21 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 50. "Final: England v West Indies at The Oval, Sep 25 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 51. "4th ODI: Zimbabwe v England at Bulawayo, Dec 5 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 52. Brett, Oliver (2004-12-18). "Strauss waltzes into record books". BBC. Retrieved 2009-03-12. Cite news requires |newspaper= (help)
 53. "1st Test: South Africa v England at Port Elizabeth, Dec 17-21 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 54. "2nd Test: South Africa v England at Durban, 26-30 2004". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 55. "South Africa rock England batsmen". BBC. 2005-01-03. Retrieved 2009-03-13. Cite news requires |newspaper= (help)
 56. 56.0 56.1 "4th Test: South Africa v England at Johannesburg, Jan 13-17 2005". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 57. "5th Test: South Africa v England at Centurion, Jan 21-25 2005". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 58. "England in South Africa, 2004-05 Test Series Averages". Cricinfo. Retrieved 2009-03-13. Cite web requires |website= (help)
 59. Langer, Justin (2005-01-25). "Strauss adds substance to style". BBC. Retrieved 2009-03-12. Cite news requires |newspaper= (help)
 60. "1st Test: England v Bangladesh at Lord's, May 26–28, 2005". Cricinfo. Retrieved 2009-03-12. Cite web requires |website= (help)
 61. "NatWest Series 2005". BBC. 2005-07-02. Retrieved 2009-03-13. Cite news requires |newspaper= (help)
 62. "4th Match: England v Bangladesh at Nottingham, Jun 21 2005". Cricinfo. Retrieved 2009-03-13. Cite web requires |website= (help)
 63. "Twenty20 International: England v Australia at Southampton, Jun 13 2005". Cricinfo. Retrieved 2009-03-13. Cite web requires |website= (help)
 64. "Ponting wary of improved England". BBC. 2005-03-30. Retrieved 2009-03-13. Cite news requires |newspaper= (help)
 65. "1st Test: England v Australia at Lord's, Jul 21-24 2005". Cricinfo. Retrieved 2009-03-13. Cite web requires |website= (help)
 66. 66.0 66.1 "2nd Test: England v Australia at Birmingham, Aug 4-7 2005". Cricinfo. Retrieved 2009-03-13. Cite web requires |website= (help)
 67. Haigh, Gideon. "Standing the Test of time". Cricinfo. Retrieved 2009-03-13. Cite web requires |website= (help)
 68. Selvey, Mike (2005-08-06). "England hold sway but still fear the genius of Warne". London: The Guardian. Retrieved 2009-03-13. Cite news requires |newspaper= (help)
 69. "England take control at Edgebaston". BBC. 2005-08-05. Retrieved 2009-03-13. Cite news requires |newspaper= (help)
 70. "3rd Test: England v Australia at Manchester, Aug 11-15 2005". Cricinfo. Retrieved 2009-03-13. Cite web requires |website= (help)
 71. Eager, Patrick. "The abiding image of the summer". Cricinfo. Retrieved 2009-03-18. Cite web requires |website= (help)
 72. "4th Test: England v Australia at Nottingham, Aug 25-28 2005". Cricinfo. Retrieved 2009-03-13. Cite web requires |website= (help)
 73. 73.0 73.1 73.2 "5th Test: England v Australia at The Oval, Sep 8-12 2005". Cricinfo. Retrieved 2009-03-13. Cite web requires |website= (help)
 74. 74.0 74.1 74.2 "Australia in England, 2005 Test Series Averages". Cricinfo. Retrieved 2009-03-13. Cite web requires |website= (help)
 75. "Writer tops Oxfordshire honours". BBC. 2005-12-31. Retrieved 2009-03-13. Cite news requires |newspaper= (help)
 76. "Honours for Ashes and 2012 heroes". BBC. 2005-12-31. Retrieved 2009-03-13. Cite news requires |newspaper= (help)
 77. "Series results England - Test matches". Cricinfo. Retrieved 2009-03-16. Cite web requires |website= (help)
 78. 78.0 78.1 "Tour Match: Pakistan A v England XI at Lahore, Nov 6-8 2005". Cricinfo. Retrieved 2009-03-16. Cite web requires |website= (help)
 79. "Tour Match: Patron's XI v England XI at Rawalpindi, Oct 31-Nov 2 2005". Cricinfo. Retrieved 2009-03-16. Cite web requires |website= (help)
 80. "Strauss dismisses batting crisis". BBC. 2005-11-06. Retrieved 2009-03-16. Cite news requires |newspaper= (help)
 81. "Batting and bowling averages England in Pakistan Test Series, 2005/06 - England". Cricinfo. Retrieved 2009-03-16. Cite web requires |website= (help)
 82. "England unlikely to opt for Cook". BBC. 2005-11-25. Retrieved 2009-03-16. Cite news requires |newspaper= (help)
 83. "Tour Match: Pakistan A v England XI Lahore 7 Dec 2005". Cricinfo. Retrieved 2009-03-16. Cite web requires |website= (help)
 84. "1st ODI: Pakistan v England at Lahore, Dec 10 2005". Cricinfo. Retrieved 2009-03-16. Cite web requires |website= (help)
 85. "5th ODI: Pakistan v England at Rawalpindi, Dec 21 2005". Cricinfo. Retrieved 2009-03-16. Cite web requires |website= (help)
 86. "Batting and bowling averages England in Pakistan ODI Series, 2005/06 - England". Cricinfo. Retrieved 2009-03-16. Cite web requires |website= (help)
 87. "1st Test: India v England at Nagpur, Mar1-5 2006". Cricinfo. Retrieved 2009-03-16. Cite web requires |website= (help)
 88. "3rd Test: India v England at Mumbai, Mar 18-22 2006". Cricinfo. Retrieved 2009-03-16. Cite web requires |website= (help)
 89. "Vaughan set to miss rest of tour". BBC. 2006-03-02. Retrieved 2009-03-17. Cite news requires |newspaper= (help)
 90. "Violence follows England wash-out". BBC. 2006-04-09. Retrieved 2009-03-17. Cite news requires |newspaper= (help)
 91. "Strauss leads way in England win". BBC. 2006-04-12. Retrieved 2009-03-17. Cite news requires |newspaper= (help)
 92. "6th ODI: India v England at Jamshedpur, 12 Apr 2006". Cricinfo. Retrieved 2009-03-17. Cite web requires |website= (help)
 93. "7th ODI: India v England at Indore, 15 Apr 2006". Cricinfo. Retrieved 2009-03-17. Cite web requires |website= (help)
 94. "1st Test: England v Sri Lanka, 11–15 May 2006". Cricinfo. Retrieved 2009-03-17. Cite web requires |website= (help)
 95. "England seal second Test triumph". BBC. 2006-05-28. Retrieved 2009-02-28. Cite news requires |newspaper= (help)
 96. "2nd Test: England v Sri Lanka at Birmingham, May 25–28, 2006". Cricinfo. Retrieved 2009-02-28. Cite web requires |website= (help)
 97. "3rd Test: England v Sri Lanka at Nottingham, Jun 2-5 2006". Cricinfo. Retrieved 2009-03-17. Cite web requires |website= (help)
 98. "Only T20I: England v Sri Lanka at Southampton, Jun 16 2007". Cricinfo. Retrieved 2009-03-18. Cite web requires |website= (help)
 99. "Batting and bowling averages NatWest Series [Sri Lanka in England], 2006 - England". Cricinfo. Retrieved 2009-03-18. Cite web requires |website= (help)
 100. McGlashan, Andrew (2006-07-02). "From bad to hopeless". Cricinfo. Retrieved 2008-02-27. Cite web requires |website= (help)
 101. "Strauss named as England captain". Cricinfo. 2006-07-04. Retrieved 2009-03-19. Cite web requires |website= (help)
 102. "1st Test: England v Pakistan at Lord's, Jul 13-17 2006". Cricinfo. Retrieved 2009-03-19. Cite web requires |website= (help)
 103. "Inzamam helps earn Pakistan draw". BBC. 2006-07-17. Retrieved 2009-03-19. Cite news requires |newspaper= (help)
 104. 104.0 104.1 "2nd Test: England v Pakistan at Manchester, Jul 27-29 2006". Cricinfo. Retrieved 2009-03-19. Cite web requires |website= (help)
 105. "3rd Test: England v Pakistan at Leeds, Aug 4-8 2006". Cricinfo. Retrieved 2009-03-19. Cite web requires |website= (help)
 106. "Lengthy talks fail to save Test". BBC. 2006-08-20. Retrieved 2009-03-19. Cite news requires |newspaper= (help)
 107. "Oval Test result changed to a draw". BBC. 2008-06-03. Retrieved 2009-03-19. Cite news requires |newspaper= (help)
 108. "Result U-turn for 2006 Oval Test". BBC. 2009-02-01. Retrieved 2009-03-19. Cite news requires |newspaper= (help)
 109. "4th Test: England v Pakistan at The Oval, Aug 17-21 2006". Cricinfo. Retrieved 2009-03-19. Cite web requires |website= (help)
 110. "Most runs Pakistan in England Test Series, 2006". Cricinfo. Retrieved 2009-03-19. Cite web requires |website= (help)
 111. "Only T20I: England v Pakistan at Bristol, Aug 28 2006". Cricinfo. Retrieved 2009-03-19. Cite web requires |website= (help)
 112. "3rd Match: England v Pakistan at Southampton, Sep 5 2006". Cricinfo. Retrieved 2009-03-19. Cite web requires |website= (help)
 113. "4th Match: England v Pakistan at Nottingham, Sep 8 2006". Cricinfo. Retrieved 2009-03-19. Cite web requires |website= (help)
 114. "5th Match: England v Pakistan at Birmingham, Sep 10 2006". Cricinfo. Retrieved 2009-03-19. Cite web requires |website= (help)
 115. "ICC Champions Trophy Group Tables, 2006/07". Cricinfo. Retrieved 2009-03-19. Cite web requires |website= (help)
 116. "Flintoff named skipper for Ashes". BBC. 2006-09-12. Retrieved 2009-03-19. Cite news requires |newspaper= (help)
 117. "Strauss denies row over captaincy". BBC. 2006-12-10. Retrieved 2009-03-20. Cite news requires |newspaper= (help)
 118. "Cook hits century in warm-up draw". BBC. 2006-12-10. Retrieved 2009-03-20. Cite news requires |newspaper= (help)
 119. Thompson, Anna (2006-12-16). "Awesome Gilchrist savages England". BBC. Retrieved 2009-03-20. Cite news requires |newspaper= (help)
 120. 120.0 120.1 "Test match analysis". Cricinfo. Retrieved 2009-03-20. Cite web requires |website= (help)
 121. Soni, Paresh (2006-12-26). "Warne landmark as England crumble". BBC. Retrieved 2009-03-20. Cite news requires |newspaper= (help)
 122. "Strauss cleared after scans". Cricinfo. 2007-01-04. Retrieved 2009-03-20. Cite web requires |website= (help)
 123. "Fletcher apologises for big loss". BBC. 2007-01-27. Retrieved 2009-03-20. Cite news requires |newspaper= (help)
 124. Smyth, Lance. "Wisden 2007 - The Wisden Forty". Cricinfo. Retrieved 2009-03-20. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); Cite web requires |website= (help)
 125. Lillywhite, Jamie (2007-02-06). "England beat Kiwis to reach final". BBC. Retrieved 2009-03-20. Cite news requires |newspaper= (help)
 126. "'We can't rest Strauss' - Fletcher". Cricinfo. 2007-01-25. Retrieved 2009-03-20. Cite web requires |website= (help)
 127. "2nd Final: Australia v England at Sydney, Feb 11 2007". Cricinfo. Retrieved 2009-03-20. Cite web requires |website= (help)
 128. Miller, Andrew (2007-04-03). "Uncertain England once again underprepared". Cricinfo. Retrieved 2009-03-20. Cite web requires |website= (help)
 129. Mitchener, Mark (2007-04-08). "Aussies win despite Pietersen ton". BBC. Retrieved 2009-03-20. Cite news requires |newspaper= (help)
 130. Agnew, Jonathan (2007-10-19). "Test Match Special: Strauss pays price for a poor year". BBC. Retrieved 2009-03-20. Cite web requires |website= (help)
 131. టూర్‌ మ్యాచ్‌: ఇన్విటేషన్‌ ఎలెవన్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ బిబిసి న్యూస్‌ 24 ఫిబ్రవరి 2008న తీయబడింది
 132. 132.0 132.1 వార్మప్‌లో స్థానం స్ట్రాస్‌ ఆశలను పెంచింది బిబిసి న్యూస్‌, 27 ఫిబ్రవరి 2008 నుంచి తీయబడింది
 133. స్ట్రాస్‌ మరియు బెల్ సమయోచిత రాణింపు బిబిసి న్యూస్‌ నుంచి 1 మార్చ్ 2008న తీయబడింది
 134. స్ట్రాస్‌ శతకం ఇంగ్లండ్‌ విజయానికి స్ఫూర్తి బిబిసి న్యూస్‌ నుంచి 26 మే 2008న తీయబడింది
 135. "Records / Test matches / Batting records / Hundred in each innings of a match". CricInfo. Retrieved 2009-06-22. Cite web requires |website= (help)
 136. వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌, కింగ్‌స్టన్‌ 2009
 137. [1]
 138. వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ గయానా 2009
 139. వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ బ్రిడ్జిటౌన్‌ 2009
 140. వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ 2009
 141. హాల్ట్‌, నిక్‌.. "Ashes 2009: England squad form guide." telegraph.co.uk . 22 జూన్‌ 2009 (28 జూన్‌ 2009న యాక్సెస్‌)
 142. ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, కార్డిప్‌, తొలి టెస్టు 2009
 143. ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, లార్డ్స్‌, రెండో టెస్టు 2009
 144. ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, బర్మింగ్‌ హామ్‌, మూడో టెస్టు 2009
 145. క్రిక్‌ఇన్ఫో: ఆధిపత్యం చూపిన ఆస్ట్రేలియా నియంత్రణ తెచ్చుకుంది.
 146. ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, లీడ్స్‌, నాలుగో టెస్టు 2009: క్రిక్‌ఇన్ఫో కామెంటరీ
 147. ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, లీడ్స్‌, నాలుగో టెస్టు 2009
 148. క్రిక్‌ఇన్ఫో నుంచిస్ట్రాస్‌ యొక్క అత్యుత్తమ గంట
 149. Miller, Andrew (September 20, 2009). "Swann saves England from whitewash". CricInfo. Retrieved 2009-09-20. Cite web requires |website= (help)
 150. "Statistics / Statsguru / AJ Strauss / One-Day Internationals". CricInfo. Retrieved 2009-09-20. Cite web requires |website= (help)
 151. Brown, Alex (September 17, 2009). "Strauss laments England's 'horror show'". CricInfo. Retrieved 2009-09-20. Cite web requires |website= (help)
 152. "Cook to captain in Bangladesh Tests". CricInfo.co.uk. 18 January 2010. Cite news requires |newspaper= (help)
 153. Lillywhite, Jamie (18 January 2010). "Strauss makes 5th Career ODI Century against Pakistan". BBC Sport. Cite news requires |newspaper= (help)
 154. [2]
 155. "India vs England, ICC World Cup 2011". Text " Cricket News " ignored (help); Cite web requires |website= (help)
 156. "Ireland vs England, ICC World Cup 2011". Text " Cricket News " ignored (help); Cite web requires |website= (help)
 157. "England vs South Africa, ICC World Cup 2011". Text " Cricket Archives " ignored (help); Cite web requires |website= (help)

బాహ్య లింకులుసవరించు

Sporting positions
అంతకు ముందువారు
Angus Fraser
Middlesex County Cricket Captain
2002–2004
తరువాత వారు
Ben Hutton
అంతకు ముందువారు
Andrew Flintoff
Kevin Pietersen
English national cricket captain
(deputised 2006)
2009–
తరువాత వారు
Andrew Flintoff
Incumbent

మూస:Englishmen with 100 or more ODI caps మూస:England Squad 2007 Cricket World Cup మూస:England Squad 2011 Cricket World Cup మూస:Middlesex County Cricket Club squad