సర్ ఫిలిప్ ఆంథోనీ హాప్కిన్స్, CBE (1937 డిసెంబరు 31 న జన్మించారు) చలన చిత్రములు, రంగస్థలం మరియు దూరదర్శన్ లలో నటించే ఒక వెల్ష్ నటుడు. ప్రస్తుతం ఉన్న గొప్ప చలనచిత్ర నటులలో ఒకడుగా పరిగణించబడే,[1][2][3] ఈయన బహుశా ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్, దానికి కొనసాగింపుగా వచ్చిన హన్నిబాల్, మరియు దాని ప్రీక్వెల్, రెడ్ డ్రాగన్ లలో నరమాంసభక్షకుడైన వరుస హత్యలు చేసే హన్నిబాల్ లెక్టర్గా తను పోషించిన పాత్రకు బాగా గుర్తింపు పొందాడు. ఇతను నటించిన ఇతర ప్రముఖ చిత్రములలో మాజిక్, ది ఎలిఫెంట్ మాన్, 84 చారింగ్ క్రాస్ రోడ్, డ్రాక్యులా, లెజెండ్స్ ఆఫ్ ది ఫాల్, ది రిమైన్స్ ఆఫ్ ది డే, అమిస్టాడ్, నిక్సన్ మరియు ఫ్రాక్చర్ మొదలైనవి ఉన్నాయి. హాప్కిన్స్ వేల్స్ లోనే పుట్టి పెరిగాడు. తన బ్రిటిష్ పౌరసత్వాన్ని ఉంచుకుని, 2000 ఏప్రిల్ 12 లో అతను U.S. పౌరుడు అయ్యాడు.[4] 2003 లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్లో అతను గొప్ప పురస్కారాన్ని (స్టార్) అందుకున్నాడు మరియు 2008 లో బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ యొక్క ఫెల్లో అయ్యాడు.

ఆంథోనీ హాప్కిన్స్
Anthony Hopkins-Tuscan Sun Festival.jpg
Hopkins at the Tuscan Sun Festival, Cortona, 2009
జన్మ నామంPhilip Anthony Hopkins
జననం (1937-12-31) 1937 డిసెంబరు 31 (వయస్సు: 82  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1967–present
భార్య/భర్త Petronella Barker
(1967–1972; divorced)
Jennifer Lynton
(1973–2002; divorced)
Stella Arroyave
(2003–present)

బాల్య జీవితంసవరించు

హాప్కిన్స్ పోర్ట్ టాల్బోట్, వేల్స్ లోని మర్గంలో జన్మించాడు, ఇతను మురిఎల్ అన్నే (née Yeats) మరియు బేకర్ అయిన, రిచర్డ్ ఆర్థర్ హాప్కిన్స్ యొక్క కుమారుడు.[5] అతని పాఠశాల చదువు బాగా సాగలేదు; చదువుకోవటం కన్నా, రంగులు వేయటం, బొమ్మలు గీయటం లేదా పియానో వాయించటం వంటి కళలలో తను తాదాత్మ్యం చెందుతానని అతను గ్రహించాడు. 1949 లో, క్రమశిక్షణ నేర్పించటానికి, అతఃని తల్లిదండ్రులు అతనిని పోంటిపూల్ లోని జోన్స్' వెస్ట్ మొన్మౌత్ బాయ్స్' స్కూల్లో చేర్పించారు. అతను అక్కడ ఐదు టర్మ్స్ (నియత కాలము) ఉన్నాడు, తరువాత వేల్స్ లోని వేల్ ఆఫ్ గ్లామోర్గన్లో ఉన్న కౌబ్రిడ్జ్ గ్రామర్ స్కూల్లో విద్యాభ్యాసం చేసాడు.

స్వదేశీయుడైన రిచర్డ్ బర్టన్, నటుడవటానికి హాప్కిన్స్ కు ప్రేరణగా నిలిచాడు మరియు అతనిని ప్రోత్సహించాడు, తనకి పదిహేను సంవత్సరముల వయస్సులో హాప్కిన్స్ అతనిని సంక్షిప్తంగా కలుసుకున్నాడు. చివరకి, అతను కార్డిఫ్ఫ్ లోని రాయల్ వెల్ష్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ & డ్రామాలో చేరాడు, ఈ కళాశాల నుండే అతను 1957 లో పట్టా పుచ్చుకున్నాడు. దేశ సేవ చేస్తూ బ్రిటిష్ ఆర్మీలో రెండు సంవత్సరములు గడిపిన తరువాత, అతఃను లండన్ వెళ్లి, అక్కడ రాయల్ అకాడమి ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్లో శిక్షణ పొందాడు.

వృత్తిసవరించు

నాటక సంస్థలో పలు సంవత్సరములు ఉన్న తర్వాత, 1965 లో, సర్ లారెన్స్ ఆలివర్ అతనిని గుర్తించాడు, ఈయన అతనిని రాయల్ నేషనల్ థియేటర్లో చేరటానికి ఆహ్వానించాడు. హాప్కిన్స్ ఆలివర్ యొక్క అండర్ స్టడీ (ప్రత్యామ్నాయ అభ్యర్థి) అయ్యాడు, మరియు ఆగస్ట్ స్ట్రిండ్బర్గ్ యొక్క ది డాన్స్ ఆఫ్ డెత్ చిత్రీకరణ సమయంలో ఆలీవర్ అపెండిసైటిస్కి గురైనప్పుడు అతనికి బదులుగా అతని పాత్ర పోషించాడు. తరువాత ఆలీవర్ తన చరిత్ర, కన్ఫెషన్స్ ఆఫ్ యన్ యాక్టర్లో ఈ విధంగా వ్రాసుకున్నాడు, "అద్భుతమైన భవిష్యత్తు కలిగిన ఆంథోనీ హాప్కిన్స్ అనే నూతన యువ నటుడు నా వద్ద ప్రతిక్షేపకునిగా పనిచేస్తున్నాడు మరియు ఎలుకను నోటకరుచుకున్న పిల్లిలాగా అతను ఎడ్గార్ పాత్రను అవలీలగా పోషించాడు."[6]

నేషనల్ థియేటర్ లో విజయాన్ని సాధించినప్పటికీ, ప్రతిరాత్రీ అవే పాత్రలు మళ్ళీ మళ్ళీ పోషించటంతో హాప్కిన్స్ విసుగెత్తిపోయాడు మరియు చలనచిత్రాలలో నటించాలని ఆత్రుత పడ్డాడు. 1967 లో BBC ప్రసారంచేసిన అ ఫ్లీ ఇన్ హర్ ఇయర్లో నటించటం ద్వారా అతను తన బుల్లి-తెర జీవితానికి నాంది పలికాడు. 1968 లో, ది లయన్ ఇన్ వింటర్లో రిచర్డ్ I పాత్ర పోషించటం అతని సినీ జీవితంలో గొప్ప మలుపు, ఈ చిత్రంలో అతనితో పాటు పీటర్ ఓ'టూలే, కాథరీన్ హెప్బర్న్, మరియు భవిష్యత్తు జేమ్స్ బాండ్ నటుడు టిమొతీ డాల్టన్ నటించారు, టిమొతీ డాల్టన్ ఫిలిప్ II ఆఫ్ ఫ్రాన్స్ పాత్ర పోషించాడు.

హాప్కిన్స్ రంగస్థలంపై నటన కొనసాగిస్తున్నప్పటికీ (మరింత ముఖ్యంగా నేషనల్ థియేటర్ లో డేవిడ్ హేర్ మరియు హోవార్డ్ బ్రెంటన్ దర్శకత్వం వహించిన ప్రవడలో లాంబర్ట్ లే రౌక్స్ గా మరియు జూడి డెంచ్తో కలిసి ఆంటోనీ అండ్ క్లియోపాత్రాలో ఆంటోనీగా, అదేవిధంగా జాన్ డెక్స్టర్ దర్శకత్వం వహించిన బ్రాడ్వే నిర్మాణసంస్థ యొక్క పీటర్ షాఫర్'స్ ఈక్వస్లో నటించాడు) దూరదర్శన్ మరియు చలన చిత్రములలో నటుడిగా మరింత స్థిరపడటానికి అతను క్రమేపీ దీని నుండి వైదొలిగాడు. అప్పటి నుండి అతను తన నటనకు అనేక పొగడ్తలు మరియు పురస్కారములు అందుకుంటూ, ఒక సుదీర్ఘ వృత్తి జీవితాన్ని అనుభవించాడు. హాప్కిన్స్ 1987 లో కమాండర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE), మరియు 1993 లో నైట్ బాచిలర్ పురస్కారములను అందుకున్నాడు[7] 1996 లో, హాప్కిన్స్ యూనివర్సిటీ ఆఫ్ వేల్స్, లాంపేటర్ నుండి గౌరవనీయమైన ఫెలోషిప్ అందుకున్నాడు.

2005 లో వచ్చిన ది వరల్డ్'స్ ఫాస్టెస్ట్ ఇండియన్ చిత్రంలో తను పోషించిన బర్ట్ మున్రో పాత్ర తనకు అత్యంత ఇష్టమైందని హాప్కిన్స్ పేర్కొన్నాడు. తను పోషించిన పాత్రలన్నింటిలోకి మున్రో చాలా సులువైనదని కూడా ఆటను నొక్కి వక్కాణించాడు ఎందుకనగా వారిద్దరూ జీవితంపై ఒకే దృక్పధాన్ని కలిగిఉన్నారు.[8]

2006 లో, హాప్కిన్స్ జీవితకాల సాఫల్యత కొరకు గోల్డెన్ గ్లోబ్ సెసిల్ B. డేమిల్లె అవార్డు అందుకున్నాడు. 2008 లో, అతను BAFTA అకాడమి ఫెల్లోషిప్ అవార్డు అందుకున్నాడు.

మార్వెల్ కామిక్స్ వారి తార్ యొక్క చిత్రానువాదంలో రాబోతున్న చలనచిత్రంలో హాప్కిన్స్ తార్ తండ్రి అయిన ఓడిన్, పాత్ర పోషించబోతున్నాడు.[9] త్వరలో విడదలవబోతున్న అతీంద్రీయ శక్తుల ఉత్కంఠభరిత చిత్రం The Rite: The Making of a Modern Day Exorcistలో హాప్కిన్స్ నటించినట్లు 2010 ఫిబ్రవరి 24 న ప్రకటించబడింది. అతను "భూతవైద్యములో నిష్ణాతుడై, సాంప్రదాయ విధానములను అవలంబించని" ఒక పూజారి పాత్ర పోషిస్తాడు.[10]

నటన తీరుసవరించు

 
Isabella Rossellini and aఆంథోనీ హాప్కిన్స్ in Berlin to shoot some scenes for The Innocent (1993)

పాత్రల కొరకు సంసిద్దుడవటంలో హాప్కిన్స్ సుప్రసిద్ధుడు. తను ఒకసారి ఒక ప్రాజుక్టుకు బద్ధుడైతే, దానిలోని సంభాషణలు తనకు సహజంగా అనిపించేవరకు, ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు వాటిని వల్లెవేస్తానని (కొన్నిసార్లు 200 కన్నా ఎక్కువసార్లు) అతను ముఖాముఖీలలో అంగీకరించాడు, దానివలన అతను "దానిని ఆలోచించకుండా చేయగలడు". దీనితో అతను సంభాషణలు పలికే తీరు చాలా సహజంగా ఉంటుంది, ఇది ముందుగా చేసుకున్న సన్నాహములను మరుగుపరుస్తుంది. ఇది కొంత అప్రమత్తమైన మెరుగుదలకు సమ్మతించగలిగినా, స్క్రిప్ట్ నుండి ప్రక్కకు వెళ్ళే నైమిత్తిక దర్శకునితో అతనికి వివాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది లేదా ఆ నటుని దృష్టిలో అత్యధిక టేకులను కోరుతుంది. ఒక సన్నివేశం ముగిసిన వెంటనే, ఆ సంభాషణలను తరువాత జ్ఞాపకం ఉంచుకోకుండా, వాటిని వదిలిపెట్టేస్తానని హాప్కిన్స్ పేర్కొన్నాడు. ఇది చాల అసంవత్సరముల తర్వాత కూడా సాధారణంగా ఒక చిత్రంలోని సంభాషణలను జ్ఞాపకం చేసుకునే ఇతరులకు విరుద్ధమైనది.[11] ఐదు సందర్భములలో హాప్కిన్స్ చిత్రములకు దర్శకత్వం వహించిన రిచర్డ్ అటెన్ బరో, షాడోలాండ్స్ (1993) చిత్రీకరణ సమయంలో ఆ చిత్రంలోని అనేక సన్నివేశములలో కలిసి నటించిన ఇద్దరు నటుల (హాప్కిన్స్ మరియు డెబ్ర వింజర్) విభిన్న విధానములను సర్దుబాటు చేయటానికి తను చాలా సమయాన్ని శ్రమను వెచ్చించవలసి వచ్చిందని గుర్తించాడు. యదేచ్చగా ఒక కొత్త టేకును తీయటానికి ప్రాధ్యాన్యమిస్తూ, రిహార్సల్ కు అతి తక్కువ సమయం కేటాయించటానికి హాప్కిన్స్ ఇష్టపడగా, వింజర్ విరామం లేకుండా రిహార్సల్స్ చేసింది. దీనికి అనుమతించటానికి, విన్జర్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలో అటెన్ బరో హాప్కిన్స్ కొరకు నిరీక్షిస్తూ, టేక్ కి ముందు ఆఖరి రిహార్సల్ కొరకు మాత్రమే అతనిని తీసుకు వచ్చేవాడు. ఆ దర్శకుడు హాప్కిన్స్ ను ఈవిధంగా ప్రశంసించాడు "మీరు అతని సంభాషణలను విన్నప్పుడు అతను వీటిని చెప్పటం ఇదే మొదటిసారి అని మిమ్మల్ని నమ్మించే అసామాన్య సామర్ధ్యం కలిగి ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైన బహుమానం."[6]

దానికితోడు, హాప్కిన్స్ తన దేశవాళీ వెల్ష్ యాసను పాత్రకు అవసరమైనట్లుగా మలుచుకోగలిగిన ప్రావీణ్యం ఉన్న ఒక అనుకరణ కళాకారుడు. 1991 లో స్పార్టకస్ పునస్థాపనలో, దానిలో అదనపు సన్నివేశముల కొరకు, అతను తన గురువైన స్వర్గీయ లారెన్స్ ఆలివర్ గాత్రాన్ని అనుకరించాడు. బ్రిటిష్ TV టాక్ షో పార్కిన్సన్ యొక్క 1998 పునఃప్రారంభ సంచికలో వచ్చిన ముఖాముఖీకి ఆయన హాస్యనటుడు టామీ కూపర్ యొక్క అవతారములో హాజరయ్యాడు. తన సాహసోపేత చిత్రములలో విశ్వసనీయ నటనను ప్రదర్శించటానికి నటన "ఒక సబ్ మరైన్ లాగా" సహాయపడిందని హాప్కిన్స్ పేర్కొన్నాడు. అతను ఈవిధంగా చెప్పాడు, "ఒక నటునికి దీనిని తప్పించుకోవటం చాలా కష్టం, నీకు కొద్దిగా అయినా ప్రదర్శించాలని ఉంటుంది. కానీ నా దృష్టిలో ఒకరు ఎంత తక్కువ ప్రదర్శిస్తే అంత మంచిది."[12]

హన్నిబాల్ లెక్టర్సవరించు

ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ చిత్రంలో నరమాంస భక్షకుడైన సీరియల్ కిల్లర్ (వరుస హత్యలు చేసే) హన్నిబాల్ లెక్టర్గా తను పోషించినపాత్ర హాప్కిన్స్ యొక్క అత్యంత జనరంజక పాత్ర, ఈ పాత్రకు అతను 1992 లో ఉత్తమ నటుడిగా అకాడమి అవార్డు గెలుచుకున్నాడు, ఈ చిత్రంలో అతఃనికి జోడీగా క్లారిస్ స్టార్లింగ్ పాత్రలో జోడీ ఫాస్టర్ నటించింది, ఆమె ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు మరియు యోగ్యమైన ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రంలో హాప్కిన్స్ కేవలం 24 నిమిషముల పాటు తెరపై కనిపించటంతో, ఈ పాత్ర అతి తక్కువ సమయం తెరపై కనిపించి ఆస్కార్ గెలుచుకున్న ప్రముఖ పాత్రలలో ఒకటి అయింది. లెక్టర్ గా తన పాత్రను హాప్కిన్స్ రెండు సార్లు పోషించాడు (2001 లో హన్నిబాల్, 2002 లో రెడ్ డ్రాగన్ ). ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్లో అతను పోషించిన పాత్రను అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చలనచిత్రములలో అతి గొప్ప ప్రతినాయక పాత్రగా అభివర్ణించింది.[13] అతనిని ఆ పాత్ర పోషించమని అడిగినప్పుడు, హాప్కిన్స్ M. బటర్ ఫ్లైలో నటిస్తూ, లండన్ రంగస్థలంలోనికి తిరిగి ప్రవేశిస్తూ ఉన్నాడు. హాలీవుడ్ లో అనేక సంవత్సరములు జీవించిన తర్వాత, అన్నీ ఉండి కూడా అక్కడ తన వృత్తిని వదులుకుని, బ్రిటన్ కు తిరిగి వచ్చేసాడు, దాని గురించి ఆయన ఈ విధంగా పేర్కొన్నారు, "నా జీవితంలో ఆ భాగం పరిసమాప్తమైంది; ఒక అధ్యాయం ముగిసింది. నా మిగిలిన జీవితమంతా వెస్ట్ ఎండ్ చుట్టూ తిరుగుతూ మరియు గౌరవనీయమైన BBC పని చేస్తూ గౌరవనీయుడైన ఒక నటునిగా స్థిరపడాలని అనుకుంటున్నాను."[6]

థామస్ హారిస్ రచించిన మొదటి మూడు లెక్టర్ నవలల యొక్క చిత్రానువాదములలో హాప్కిన్స్ విలక్షణమైన ప్రతినాయక పాత్ర పోషించాడు. తన ప్రతినాయక పాత్రను హాప్కిన్స్ పోషించిన తీరుపై ఆ రచయిత చాలా సంతోషించాడని తెలిసింది. అయినప్పటికీ, రెడ్ డ్రాగన్లో తను ఆఖరుసారి ఆ పాత్రను పోషించటం జరిగిందని, మరియు ఆ చిత్రాల వరుసలో ఇటీవలే చేరిన హన్నిబాల్ రైజింగ్లో కనీసం వ్యాఖ్యాత పాత్రను కూడా తను తిరిగి పోషించనని హాప్కిన్స్ ప్రకటించాడు.

వ్యక్తిగత జీవితంసవరించు

 
హాప్కిన్స్ at the Toronto International Film Festival in 2005

2007 నాటికి హాప్కిన్స్ యునైటెడ్ స్టేట్స్లో నివసించేవాడు. అంతకు ముందు ఒకసారి 1970 లలో సినీ రంగంలో అవకాశముల కొరకు ఆ దేశానికి వెళ్ళాడు, కానీ 1980ల చివరలో బ్రిటన్ కు తిరిగి వచ్చాడు. అయినప్పటికీ, 1990లలో తన విజయం తర్వాత U.S.కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. 2000 ఏప్రిల్ 12 న అతనికి ఆ దేశ పౌరసత్వం వచ్చింది మరియు అతను ఆ ఆనందాన్ని దేశ మంతటా 3,000-మైళ్ళు రహదారి యాత్ర చేస్తూ వేడుక చేసుకున్నాడు.

హాప్కిన్స్ మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. పెట్రోనెల్ల బార్కర్ (1967–1972) మరియు జెన్నిఫర్ లింటన్ (1973–2002) అతని మొదటి ఇద్దరు భార్యలు. ప్రస్తుతం అతను కొలంబియాలో జన్మించిన స్టెల్లా అర్రోయవేని వివాహం చేసుకున్నాడు. అతనికి మొదటి వివాహంలో ఒక కుమార్తె ఉంది, అబిగైల్ హాప్కిన్స్ (జననం. 1968 ఆగష్టు 20), ఈమె ఒక నటి మరియు గాయని.

నేషనల్ ట్రస్ట్'స్ స్నోడోనియా అప్పీల్ కు ప్రెసిడెంటు అయ్యి, స్నోడోనియా నేషనల్ పార్క్ సంరక్షణకు మరియు స్నోడాన్ లోని కొన్ని భాగములను కొనటానికి ట్రస్ట్ చేస్తున్న ప్రయత్నములకు సహాయం అందించటానికి విరాళములు సేకరించి అతను వివిధ స్వచ్ఛంద సంస్థలకు తన మద్దతును అందించాడు. ఈ ప్రయత్నములను పొందుపరిచిన, ఆంథోనీ హాప్కిన్స్' స్నోడోనియా, అనే పుస్తకం గ్రాహం నోబుల్స్ తో కలిసి ప్రచురితమైంది. వివిధ లోకోపకార వర్గములకు మద్దత్తు ఇవ్వటానికి కూడా హాప్కిన్స్ సమయం కేటాయించేవాడు. గాలా ఫండ్ రైజర్ ఫర్ ఉమెన్ ఇన్ రికవరీ, ఇంక్.,కు ఈయన గౌరవ అతిథి, ఈ సంస్థ వెనిస్, కాలిఫోర్నియాలో ఉంది మరియు మాదక ద్రవ్యాల వినియోగం నుండి బయటపడటానికి మహిళలకు పునరావాస సహకారాన్ని అందించే ఒక లాభాపేక్ష లేని సంస్థ . ఆయన మలిబు, కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నప్పటికీ, శాంత మోనికా, కాలిఫోర్నియాలోని రస్కిన్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ లో వాలంటీరు శిక్షకుడు కూడా.

మధ్యానికి బానిసఅయిన వారి కోసం జరిగే 12-పర్వాల సభలకు హాప్కిన్స్ హాజరయ్యాడు,[14] మరియు 1975 లో అకస్మాత్తుగా మద్యాన్ని సేవించటం నిలిపివేశాడు. 2007 ఏప్రిల్ 9 న ప్రసారమయ్యే, టునైట్ షో ముఖాముఖీ ప్రకారం, సెట్లో ఉన్నప్పుడు నిర్మాణ సమయంలో ఒక సన్నివేశ చిత్రీకరణ ముందు కుక్కలాగా మొరగటం ద్వారా వాతావరణాన్ని తేలిక పరుస్తూ, హాప్కిన్స్ ఒక జోకర్ లాగా ఉండేవాడని తెలిసింది.

గ్రీన్ పీస్ అనే ఒక పర్యావరణ పరిరక్షణ సంఘంలో హాప్కిన్స్ ఒక ప్రముఖ సభ్యుడు మరియు 2008 ప్రారంభంలో జపాన్ కొనసాగిస్తున్న తిమింగలముల వేట గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, ఒక దూరదర్శన్ ప్రచార ప్రకటనలో పాల్గొన్నాడు.[15] RAPt (రీహాబిలిటేషన్ ఫర్ అడిక్టెడ్ ప్రిసనర్స్ ట్రస్ట్) ప్రారంభమైన నాటి నుండి హాప్కిన్స్ దానికి ప్రాపకునిగా ఉన్నాడు మరియు 1992 లో డౌన్ వ్యూ (HM ప్రిసన్) వద్ద మాదక ద్రవ్యములు మరియు మధ్యానికి బానిసైన వారికి పునరావాసం అందించటానికి వారి మొదటి విభాగాన్ని ప్రారంభించటంలో సహాయం చేసాడు.

అతను హాస్యనటుడు టామీ కూపర్కు అభిమాని. 2008 ఫిబ్రవరి 23 న, టామీ కూపర్ సొసైటీ పోషకునిగా, ఆ నటుడు ఆ విదూషకుని యొక్క సొంత ఊరైన కార్ఫిల్లీలో అతని జ్ఞాపకార్ధం ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆ వేడుకకు, హాప్కిన్స్ కూపర్ ఎల్లప్పుడూ ధరించే ఫెజ్ (టోపీ) ధరించి ఒక హాస్య ప్రహసనాన్ని ప్రదర్శించాడు.[16]

ఇతర కార్యక్రమాలుసవరించు

హాప్కిన్స్ నిపుణుడైన పియానో వాద్యగాడు. 1986 లో, అతను "డిస్టాంట్ స్టార్" అనే సింగిల్ ను విడుదలచేసాడు. అది UK చార్టులలో 75వ స్థానానికి చేరుకుంది. ప్రపంచయాత్ర చేయటానికి తను నటన నుండి తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంటానని 2007 లో ఆయన ప్రకటించారు.[17] స్టీఫెన్ బార్టన్ వాద్యసమ్మేళనకర్తగా, హాప్కిన్స్ అతనితో కలిసి కచేరీ మందిరానికి సంగీతాన్ని కూడా రచించాడు. ఈ రచనలలో ' మరియు స్కిజాయిడ్ సల్సా ఉన్నాయి, ది మాస్క్ ఆఫ్ టైం అక్టోబరు 2008 న డల్లాస్ సింఫొనీ ఆర్కెస్ట్రాతో కలిసి తన మొదటి ప్రపంచ ప్రదర్శన ఇచ్చింది.[18]

1996 లో, హాప్కిన్స్ వేల్స్ భూమికగా చెఖోవ్ రచించిన అంకుల్ వన్య చిత్రానువాదం అయిన ఆగస్ట్కు మొదటిసారి దర్శకత్వం వహించాడు. అతను దర్శకత్వం వహించి సంగీతాన్ని అందించిన అతని మొదటి స్క్రీన్ ప్లే, స్లిప్ స్ట్రీమ్ అని పిలవబడే ఒక ప్రయోగాత్మక నాటిక 2007 లో సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మొదటిసారి ప్రదర్శించబడింది.

BBC ప్రసారంచేసే ఓన్లీ ఫూల్స్ అండ్ హార్సెస్, హాప్కిన్స్ కు అభిమాన ధారావాహిక, మరియు ఒక ముఖాముఖీలో అతను తనకు ఆ ధారావాహికలో నటించాలని ఉన్నట్లు పేర్కొన్నాడు. రచయిత జాన్ సుల్లివన్ ఆ ముఖాముఖీని వీక్షించి, హాప్కిన్స్ ను దృష్టిలో ఉంచుకుని ఒక స్థానిక ప్రతినాయకుడు, డానీ డ్రిస్కాల్ పాత్రను సృష్టించాడు. అయినప్పటికీ, ఆ కొత్త ధారావాహిక చిత్రీకరణ ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ చిత్రీకరణ సమయంలోనే ఉండటంతో, హాప్కిన్స్ ఆ ధారావాహికలో నటించలేదు. ఇతనికి బదులుగా ఆ పాత్రను అతని స్నేహితుడు రాయ్ మార్స్డెన్ పోషించాడు.[19]

హాప్కిన్స్ పలు చారిత్రిక మరియు కాల్పనిక పాత్రలు పోషించాడు, వాటిలో కొన్ని:

అవార్డులుసవరించు

ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ చిత్రం కొరకు పురస్కారం గెలుచుకోవటంతో పాటు, హాప్కిన్స్ ది రిమైన్స్ ఆఫ్ ది డే (1993), నిక్సన్ (1995) మరియు అమిస్టాడ్ (1997) చిత్రములకు ఆస్కార్ పురస్కారం కొరకు ప్రతిపాదించబడ్డాడు.

1973 లో హాప్కిన్స్ BBC సమర్పించిన వార్ అండ్ పీస్ చిత్రంలో పియరీ బెజుఖోవ్గా తన నటనకు ఉత్తమ నటుడిగా BAFTA అవార్డు గెలుచుకున్నాడు, అది కాకుండా ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ మరియు షాడోలాండ్స్ చిత్రములకు కూడా అవార్డులు గెలుచుకున్నాడు. అతను మాజిక్ మరియు ది రిమైన్స్ ఆఫ్ ది డే చిత్రములకు అదే విభాగంలో మరియు ది లయన్ ఇన్ వింటర్ చిత్రం కొరకు ఉత్తమ సహాయ నటుడిగా నామినేషన్లు పొందాడు.

ది లిండ్బర్గ్ కిడ్నాపింగ్ కేస్ మరియు ది బంకర్ చిత్రములలో తన పాత్రలకు అతను ఎమ్మి అవార్డులు గెలుచుకున్నాడు, మరియు ది హంచ్ బ్యాక్ ఆఫ్ నోట్రే డేమ్ మరియు గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ చిత్రములకు ఎమ్మి-పురస్కారానికి నామినేట్ చేయబడ్డాడు.[20] స్విట్జర్ల్యాండ్ లో జరిగిన లొకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్లిప్ స్ట్రీమ్ చిత్రం కొరకు అతను దర్శకత్వ మరియు నటన విభాగములు రెండింటిలోనూ అవార్డులు గెలుచుకున్నాడు.

ఫిబ్రవరి 2008 లో ఆరెంజ్ బ్రిటిష్ అకాడమి ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో హాప్కిన్స్ బ్రిటిష్ అకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA) కు ఫెల్లోగా గౌరవం అందుకున్నాడు.[21]

1979 లో, ఆంథోనీ హాప్కిన్స్ లండన్ లోని రాయల్ అకాడమి ఆఫ్ మ్యూజిక్కు గౌరవ సభ్యుడు అయ్యాడు.[22]

ఫిల్మోగ్రఫీసవరించు

సంవత్సరం చలనచిత్రం పాత్ర గమనికలు
1967 అ ఫ్లీ ఇన్ హర్ ఇయర్ ఎటేన్నే ప్లుచూక్స్ TV
ది వైట్ బస్ బ్రెచ్టియన్
1968 ది లయన్ ఇన్ వింటర్ రిచర్డ్ ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటునికి BAFTA అవార్డు
1969 ది లుకింగ్ గ్లాస్ వార్ జాన్ అవెరి
హామ్లెట్ క్లాడియస్
డిపార్ట్మెంట్ S గ్రెగ్ హల్లిడే TV
1970 ది గ్రేట్ ఇనిమిటబుల్ Mr. డికెన్స్ చార్లెస్ డికెన్స్ టెలివిజన్ ఫిల్మ్
హార్ట్స్ అండ్ ఫ్లవర్స్ బాబ్ TV – ప్లే ఫర్ టుడే
ప్రతిపాదన — ఉత్తమ నటునికి బ్రిటిష్ అకాడమి టెలివిజన్ అవార్డు
1971 వెన్ ఎయిట్ బెల్స్ టోల్ ఫిలిప్ కాల్వర్ట్
1972 యంగ్ విన్స్టన్ డేవిడ్ లాయిడ్ జార్జ్
వార్ అండ్ పీస్ పియరీ బెజుఖోవ్ ఉత్తమ నటునికి బ్రిటిష్ అకాడమి టెలివిజన్ అవార్డు
అ డాల్'స్ హౌస్ టోర్వాల్డ్ హెల్మర్
1974 ది గర్ల్ ఫ్రం పెట్రోవ్క కోస్త్య
QB VII Dr. ఆడం కెల్నో
జగ్గర్నాట్ Supt. జాన్ మాక్ క్లియోడ్
ఆల్ క్రీచర్స్ గ్రేట్ అండ్ స్మాల్ సీగ్ఫ్రీడ్ ఫర్నాన్ TV
ది చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ తష్కోవ్ TV – ప్లే ఫర్ టుడే
1976 డార్క్ విక్టరీ Dr. మైఖేల్ గ్రాంట్ TV
ది లిండ్బర్గ్ కిడ్నాపింగ్ కేస్ బ్రూనో రిచర్డ్ హాప్ట్మాన్ అద్భుతమైన ప్రముఖ నటునికి ఎమ్మి అవార్డు – లఘుదారావాహిక లేదా ఒక చలనచిత్రం
విక్టరీ ఎట్ ఎంటేబ్ ప్రైమ్ మినిస్టర్ యిట్జాక్ రాబిన్
1977 అ బ్రిడ్జ్ టూ ఫార్ లెఫ్టినెంట్ కల్నల్ జాన్ D. ఫ్రాస్ట్
ఆడ్రీ రోజ్ ఎల్లియట్ హూవర్ ప్రతిపాదన— ఉత్తమ నటుడిగా సాటర్న్ పురస్కారం
1978 మేజిక్ చార్లెస్ "కార్కి" వితర్స్/వాయిస్ ఆఫ్ ఫాట్స్ ప్రతిపాదన — ముఖ్య పాత్రలో ఉత్తమ నటుడుకి BAFTA అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటుడుకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటకం
ఇంటర్నేషనల్ వెల్వెట్ కాప్టెన్ జాన్సన్
1979 మేఫ్లవర్: ది పిల్గ్రిమ్స్' అడ్వెంచర్ కాప్టెన్ జోన్స్ TV
1980 ది ఎలిఫెంట్ మాన్ Dr. ఫ్రెడరిక్ ట్రేవ్స్
అ చేంజ్ ఆఫ్ సీజన్స్ ఆడం ఎవాన్స్
1981 ది బంకర్ అడాల్ఫ్ హిట్లర్ అద్భుతమైన ప్రముఖ నటునికి ఎమ్మి అవార్డు – లఘుదారావాహిక లేదా ఒక చలనచిత్రం
పీటర్ అండ్ పాల్ పాల్ ఆఫ్ టార్సాస్ TV
ఒథెల్లో ఒథెల్లో TV
1982 ది హంచ్‌బ్యాక్ ఆఫ్ నోట్రే డేమ్ క్వాసిమాడో TV
ప్రతిపాదన - అద్భుతమైన ప్రముఖ నటునికి ఎమ్మి అవార్డు – లఘుదారావాహిక లేదా ఒక చలనచిత్రం
1983 అ మ్యారీడ్ మాన్ జాన్ స్ట్రిక్ ల్యాండ్ TV
1984 ది బౌన్టీ లెఫ్టినెంట్ విలియం బ్లీ
1985 హాలీవుడ్ వైవ్స్ నీల్ గ్రే TV
ఆర్చ్ ఆఫ్ ట్రింఫ్ Dr. రావిక్ TV
గిల్టీ కన్సైన్స్ ఆర్థర్ జమిసన్ TV
ముస్సోలినీ అండ్ ఐ కౌంట్ గాలియాజ్జో సియానో TV
ఒక చలనచిత్రం లేదా లఘుధారావాహికలో నటునికి కేబుల్ ACE అవార్డు
ది గుడ్ ఫాదర్ బిల్ హూపర్
1987 84 చారింగ్ క్రాస్ రోడ్ ఫ్రాంక్ డోయల్ ఉత్తమ నటునికి మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు
1988 ది డానింగ్ ఆంగస్ బారీ
అక్రాస్ ది లేక్ డోనాల్డ్ కాంప్బెల్ CBE TV
అ కోరస్ ఆఫ్ డిస్అప్రూవల్ డాఫిడ్ అప్ లెవెలిన్
ది టెన్త్ మాన్ జేన్ లూయిస్ చావెల్ ప్రతిపాదన — ఉత్తమ నటునికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – లఘుధారావాహిక లేదా దూరదర్శన్ చిత్రం
1989 గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అబెల్ మాగ్విచ్ TV లఘుధారావాహిక
ప్రతిపాదన - అత్యద్భుత సహాయ నటునికి ఎమ్మి అవార్డు - లఘుదారావాహిక లేదా చలనచిత్రం
1990 డెస్పరేట్ అవర్స్ టిం కామెల్
1991 ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ Dr. హన్నిబాల్ లెక్టర్ ఉత్తమ నటుడికి అకాడమీ బహుమతి
ప్రధాన పాత్రలో నటించిన ఉత్తమ నటుడుగా BAFTA అవార్డు
ఉత్తమ సహాయ నటుడుగా బాస్టన్ సొసైటీ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్
ఉత్తమ నటుడుగా చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ నటుడుగా డల్లాస్-ఫోర్ట్ వొర్థ్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ నటునికి కాన్సాస్ సిటీ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
ఉత్తమ సహాయనటునికి నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డ్
ఉత్తమ నటుడుగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్
ఉత్తమ విదేశీ నటునికి సంట్ జోర్డి అవార్డు
ఉత్తమ నటుడికి సాటర్న్ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటుడుకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటకం
ప్రతిపాదన – ఉత్తమ నటుడుగా లండన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
వన్ మాన్'స్ వార్ జోఎల్ TV
1992 ఫ్రీజాక్ ఇయన్ మాక్ కాండ్లేస్
స్పాట్స్ వుడ్ ఎర్రోల్ వాలెస్
హోవర్డ్స్ ఎండ్ హెన్రీ J. విల్కాక్స్
బ్రామ్ స్టాకర్స్ డ్రాకులా ప్రొఫెసర్ అబ్రహం వాన్ హెల్సింగ్ ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటుడుగా శాటర్న్ అవార్డు
చాప్లిన్ జార్జ్ హేడన్
1993 ది ట్రయల్ ది ప్రీస్ట్
ది ఇన్నోసెంట్ బాబ్ గ్లాస్
ది రిమైన్స్ ఆఫ్ ది డే జేమ్స్ స్టీవెన్స్ ఉత్తమ విదేశీ నటునికి డేవిడ్ డి డోనటేల్లో పురస్కారం
ఉత్తమ నటునికి కాన్సాస్ సిటీ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
ఉత్తమ నటుడుగా లండన్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్
ఉత్తమ నటునికి లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు షాడోలాండ్స్ చిత్రానికి కూడా
ఉత్తమ నటునికి నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డు షాడోలాండ్స్ చిత్రానికి కూడా
ఉత్తమ నటునికి సౌత్ ఈస్ట్రన్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు షాడోలాండ్స్ చిత్రానికి కూడా
ప్రతిపాదన– ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు
ప్రతిపాదన — ముఖ్య పాత్రలో ఉత్తమ నటుడుకి BAFTA అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటుడుకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటకం
షాడోలాండ్స్ జాక్ లూయిస్ ప్రధానపాత్రలో నటించిన ఉత్తమ నటునికి BAFTA అవార్డు
ఉత్తమ నటునికి లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ది రిమైన్స్ ఆఫ్ ది డే చిత్రానికి కూడా
ఉత్తమ నటునికి నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డు ది రిమైన్స్ ఆఫ్ ది డే చిత్రం కొరకు కూడా
ఉత్తమ నటునికి సౌత్ ఈస్ట్రన్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ది రిమైన్స్ ఆఫ్ ది డే చిత్రం కొరకు కూడా
1994 ది రోడ్ టు వెల్విల్లె Dr. జాన్ హర్వే కెల్లోగ్
లెజెండ్స్ ఆఫ్ ది ఫాల్ కల్నల్ విలియం లడ్లో వెస్ట్రన్ హెరిటేజ్ అవార్డ్స్ — నాటకీయమైన చలనచిత్రం కొరకు బ్రాంజ్ రాంగ్లార్ ఎడ్వర్డ్ జ్విక్ (దర్శకుడు), విలియం D. విట్లిఫ్ఫ్ (రచయిత/నిర్మాత) మరియు బ్రాడ్ పిట్ (ప్రధాన నటుడు) లతో పంచుకోబడింది
1995 నిక్సన్ రిచర్డ్ నిక్సన్ ప్రతిపాదన – ఉత్తమనటుడిగా అకాడమీ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటుడుకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – చలన చిత్ర నాటకం
ప్రతిపాదించబడింది – ప్రధాన పాత్రలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన పురుష నటుడికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
ప్రతిపాదన — చలనచిత్రంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తారాగణానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ పురస్కారం
1996 ఆగస్ట్ యూవన్ డేవిస్ దర్శకత్వం వహించి సంగీతాన్ని కూడా సమకూర్చాడు
సర్వైవింగ్ పికాసో పాబ్లో పికాసో
1997 ది ఎడ్జ్ చార్లెస్ మోర్స్
అమిస్టాడ్ జాన్ క్విన్సీ ఆడమ్స్ ఉత్తమ సహాయనటునికి బ్రాడ్కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ సహాయనటునికి అకాడమీ అవార్డు
ప్రతిపాదన – ఉత్తమ సహాయ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు - చలన చిత్రం
ప్రతిపాదన — ఉత్తమ సహాయనటునికి ఆన్లైన్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్
ప్రతిపాదన – సహాయ పాత్రలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన పురుష నటుడికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు
1998 ది మాస్క్ ఆఫ్ జోరో డాన్ డీగో డే లా వెగా / జోర్రో
మీట్ జో బ్లాక్ విలియం పారిష్ ప్రతిపాదన— ఉత్తమ నటునికి సాటర్న్ పురస్కారం
1999 ఇన్స్టింక్ట్ ఈతన్ పొవెల్
టైటస్ టైటస్ ఆండ్రోనికస్ ప్రతిపాదన — ఆ సంవత్సరపు బ్రిటీష్ నటికి లండన్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
2000 Mission: Impossible II మిషన్ కమాండర్ స్వాన్బెక్ గుర్తింపులేనిది
ది గ్రించ్ లెక్టర్ గాత్రం
2001 హన్నిబాల్ Dr. హన్నిబాల్ లెక్టర్ ప్రతిపాదన — ఉత్తమ నటునికి సాటర్న్ పురస్కారం
హార్ట్స్ ఇన్ అట్లాంటిస్ టెడ్ బ్రాటిగాన్
౨౦౦౨ బాడ్ కంపెనీ ఆఫీసర్ ఓక్స్
రెడ్ డ్రాగన్ Dr. హన్నిబాల్ లెక్టర్
2003 ది హ్యూమన్ స్టెయిన్ కలెమన్ సిల్క్ నటనలో అద్భుత సాఫల్యత కొరకు హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు – నటుడు
2004 అలెగ్జాండర్ టాలమీ ఐ సాటర్
2005 ప్రూఫ్ రాబర్ట్
ది వరల్డ్'స్ ఫాస్టెస్ట్ ఇండియన్ బర్ట్ మున్రో ఒక ప్రముఖ పాత్రలో ఉత్తమ నటనకు న్యూజీలాండ్ స్క్రీన్ అవార్డు
2006 బాబీ జాన్ ఆ సంవత్సరానికి ఉత్తమ నటవర్గంగా హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు
ప్రతిపాదన — చలనచిత్రంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తారాగణానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ పురస్కారం
ఆల్ ది కింగ్స్ మెన్ జడ్జ్ ఇర్విన్
2007 ది డెవిల్ అండ్ డేనియల్ వెబ్స్టర్ డేనియల్ వెబ్స్టర్ TV
స్లిప్ స్ట్రీమ్ ఫెలిక్స్ బోనఫార్
ఫ్రాక్చర్ థియోడోర్ "టెడ్" క్రాఫోర్డ్
బేవుల్ఫ్ హ్రాత్గర్
ది సిటీ ఆఫ్ యువర్ ఫైనల్ డెస్టినేషన్ ఆడమ్
2008 Where I Stand: The Hank Greenspun Story హాంక్ గ్రీన్స్పన్ స్వరం
ఇమ్మ్యూటబుల్ డ్రీం ఆఫ్ స్నో లయన్
2009 బేర్ నకిల్స్ జేవియర్ జోనాస్
2010 ది వోల్ఫ్మాన్ సర్ జాన్ టాల్బాట్
యు విల్ మీట్ అ టాల్ డార్క్ స్ట్రేంజర్ చిత్రీకరణ
2011 తార్ ఓడిన్ నిర్మాణాంతర పనులు
ది రైట్ ఎక్సార్సిస్ట్ చిత్రీకరణ

సూచనలుసవరించు

 1. "Hopkins 'greatest British actor'". London: News.bbc.co.uk. 16 August 2005. Retrieved 29 October 2008. Cite news requires |newspaper= (help)
 2. "Anthony Hopkins Biography". Tiscali.co.uk. 29 October 2008. మూలం నుండి 7 ఫిబ్రవరి 2009 న ఆర్కైవు చేసారు. Retrieved 29 October 2008. Cite web requires |website= (help)
 3. "Anthony Hopkins". London: guardian.co.uk. Retrieved 29 October 2008. Cite news requires |newspaper= (help)
 4. "Anthony Hopkins – A role to sink his teeth into". Retrieved 11 February 2010. I have dual citizenship, it just so happens I live in America. Cite web requires |website= (help)
 5. Stated in interview on Inside the Actors Studio , 2007
 6. 6.0 6.1 6.2 Falk, Quentin (2004). Anthony Hopkins: The Biography (4th సంపాదకులు.). Virgin Books. ISBN 0-7535-0999-7.
 7. Official announcement knighthood. The London Gazette. ఏప్రిల్ 23, 2006
 8. "The World's Fastest Indian". Solarnavigator.net. Retrieved 21 May 2007. Cite web requires |website= (help)
 9. Michael Fleming (30 October 2009). "Anthony Hopkins cast in 'Thor'". Variety. Retrieved 31 October 2009. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 10. "Anthony Hopkins takes demonic forces in 'The Rite'". HeatVision. The Hollywood Reporter. 24 February 2010. Retrieved 28 February 2010.
 11. "ఆంథోనీ హాప్కిన్స్: లెక్టర్ and Me" — Red Dragon DVD interview
 12. "Sir Anthony Hopkins acts 'like a submarine'". London: BBC News. 12 February 2010. Retrieved 7 March 2010. Cite web requires |website= (help)
 13. "AFI's 100 Years...100 Heroes & Villains". AFI.com. Retrieved 21 May 2007. Cite web requires |website= (help)
 14. Close (5 December 1998). "Unlimited: A dark and stormy knight". The Guardian. London. Retrieved 17 October 2009.
 15. "Green Peace anti-whaling video". Greenpeace.org. 17 March 2003. Retrieved 17 October 2009. Cite web requires |website= (help)
 16. "Tommy Cooper statue is unveiled". London: BBC News. 23 February 2008. Retrieved 17 October 2009. Cite news requires |newspaper= (help)
 17. Associated Press (3 December 2007). "De gira como pianista". Cite web requires |website= (help)
 18. Chris Shull (19 October 2008). "Anthony Hopkins brings Hollywood to Dallas Symphony Orchestra". Dallas Star-Telegram. Retrieved 25 October 2008.[permanent dead link]
 19. Clark, Steve (1998). The Only Fools and Horses Story. BBC Books. p. 125. ISBN 0-563-38445-X.
 20. "Anthony Hopkins: Awards". IMDb. Retrieved 21 May 2007. Cite web requires |website= (help)
 21. "Orange British Academy Film Awards". BAFTA. మూలం నుండి 11 జూన్ 2008 న ఆర్కైవు చేసారు. Retrieved 17 June 2008. Cite web requires |website= (help)
 22. "Honorary Members of the Royal Academy of Music (Oct.14, 2009)". Royal Academy of Music. 14 October 2009. Retrieved 14 October 2009. Cite web requires |website= (help)

బాహ్య లింకులుసవరించు