ఆంధ్రప్రదేశ్ జలవనరులు

సహజ సిద్ధమైన జలవనరుల విషయంలో భారతదేశంలోని సుసంపన్నమైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులతో పాటు, శబరి నది, పెన్న, నాగావళి వంటి చిన్న నదులు రాష్ట్రానికి నీటి అవసరాలను తీరుస్తున్నాయి. వందలాదిగా ఉన్న వాగులు, వంకలు కూడా సహజ సిద్ధ జలవనరులలో ముఖ్యమైనవి. వీటికి తోడు వేలాది మానవ నిర్మిత జలవనరులు కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. శతాబ్దాల క్రితం ఆనాటి పాలకులు త్రవ్వించిన చెరువులు ఈనాటికీ ప్రజావసరాలను తీరుస్తున్నాయి. కాకతీయులు, విజయనగర రాజులు త్రవ్వించిన చెరువులు ఈనాటికీ ఉపయోగంలో ఉన్నాయి.ఆధునిక కాలంలో సహజ సిద్ధమైన జలవనరులను ప్రభావవంతంగా వాడుకొనేందుకు ప్రభుత్వాలు ఎన్నో బృహత్పథకాలను చేపట్టి విజయం సాధించాయి. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు ఇటువంటి పెద్ద ప్రాజెక్టులే. ఇంకా ఎన్నో ఇతర ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్నాయి. అలాగే వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా చిన్న ఆనకట్టలు కట్టి ప్రజల త్రాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చే మార్గాలను కూడా అనుసరిస్తున్నారు. చెక్‌డాములు, వాటర్‌షెడ్లు ఈ కోవ లోకి వస్తాయి.

ఆంధ్రప్రదేశ్ ఉపరితల జలవనరులు, పారుదల వ్యవస్థ

విభజన మార్చు

జలవనరులను ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి:

  • సహజ వనరులు
నదులు, వాగులు, వంకలు
  • మానవ నిర్మిత వనరులు
చెరువులు, దొరువులు, బావులు, నూతులు, చెక్‌డాంలు, వాటర్‌షెడ్లు, కాలువలు, నదీలోయ ప్రాజెక్టులు

2019-20 ప్రాధాన్యతలు మార్చు

2019-20 సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల కొరకు రూ.13,139.13 కోట్ల బడ్జెట్ ప్రాధాన్యతలు.[1]

ప్రాజెక్టులు మార్చు

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ 106 ప్రాజెక్టులు నిర్వహిస్తుంది.[2]

అందులో కొన్ని

  1. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు
  2. హంద్రీ నీవా సుజల స్రవంతి - దశ 1
  3. హంద్రీ నీవా సుజల స్రవంతి - దశ 2
  4. కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు
  5. కెఎల్ రావు సాగర్ పులిచింతల
  6. నాగార్జునసాగర్ ప్రాజెక్టు
  7. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు
  8. పోలవరం ప్రాజెక్టు
  9. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
  10. ప్రకాశం బ్యారేజీ
  11. శ్రీశైలం కుడి కాలవ
  12. తెలుగు గంగ ప్రాజెక్టు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1.   ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20. వికీసోర్స్.   29. 
  2. "Projects". AP Water Resources department. 2019-07-16.

వెలుపలి లంకెలు మార్చు