ఆజం జాహి మిల్స్, వరంగల్

ఆజం జాహి మిల్స్, తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో స్థాపించబడిన వస్త్ర తయరీ పరిశ్రమ.[1][2] హైదరాబాద్ రాజ్య 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1934లో వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ అజం జాహీ మిల్స్ ను స్థాపించాడు. ఈ మిల్లుకు అలీఖాన్ మొదటి కుమారుడు ప్రిన్స్ అజామ్ జాహ్ పేరు పెట్టబడింది.[3]

ఆజం జాహి మిల్స్
ట్రేడ్ పేరు
ఆజం జాహి మిల్స్
రకం
మిల్స్
పరిశ్రమవస్త్రం పరిశ్రమ
విధిమూసివేత
స్థాపించబడింది1934 (వరంగల్, తెలంగాణ)
స్థాపకుడుహైదరాబాద్ రాజ్య 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
మూతబడిన1990లలో
ప్రధాన కార్యాలయం
వరంగల్
,
భారతదేశం

చరిత్రసవరించు

200 ఎకరాలకు పైగా భూములతో ఏర్పాటు చేయబడిన ఈ ఆజం జాహి మిల్లులు భారతదేశంలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమలలో ఒకటిగా నిలిచింది. స్వాతంత్య్రానికి ముందు, ఈ మిల్లు 10,000 మందికి పైగా ఉపాధిని కల్పించింది. ఇక్కడ తయారయిన వస్త్రాలు మిల్లులు వరంగల్ పట్టణం మొత్తానికి సరఫరా చేయబడ్డాయి. ఈ మిల్లు సైరన్ వరంగల్, చుట్టుపక్కల గ్రామాల నివాసితులకు ఉదయం వేక్-అప్ కాల్‌గా వచ్చేది. 1974లో బెంగళూరుకు చెందిన నేషనల్ టెక్స్‌టైల్ కార్పోరేషన్ ఈ కంపెనీని స్వాధీనం చేసుకుంది. 1980ల చివరి వరకు ఆరు దశాబ్దాలకు పైగా పనిచేసిన ఈ మిల్లు, 1990ల ప్రారంభంలో మూసివేయబడింది.[4]

ప్రస్తుతంసవరించు

2008లో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థకి ఈ భూమి ఇవ్వగా, దాన్ని ప్లాట్లుగా తయారుచేసి విక్రయించారు. మిల్లులో పనిచేసి రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతిఒక్కరికి 200 గజాల స్థలాలు కేటాయించబడ్డాయి.[5] మిల్లుకు చెందిన 200 ఎకరాలలో ప్రస్తుతం 30 ఎకరాలు మాత్రమే మిగిలింది. ప్రజల డిమాండ్ మేరకు ఈ స్థలంలో అపెరల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది.[6] 1970ల నుండి ఇది పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. ఫ్యాక్టరీల సాంకేతికతలను విద్యార్థులకు అందించేందుకు దీనిని ఉపయోగిస్తున్నారు. పార్సీ పెద్దమనిషి యాజమాన్యంలో ఐస్ ఫ్యాక్టరీ ఉంది. 

మూలాలుసవరించు

  1. "Archive News". The Hindu. 2010-10-25. Archived from the original on 2021-08-23.
  2. "Dharna against sale of Azam Jahi Mills". The Hindu. 2007-04-11. Archived from the original on 2021-08-23.
  3. "Azam Jahi Mills remains history".
  4. Rao, Gollapudi Srinivasa (2014-07-01). "Azam Jahi Mills remains history". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-08-23.
  5. "Allot plots to ex-staff of Azam Jahi Mills: Hyderabad High Court". Deccan Chronicle. 2016-04-16. Retrieved 2021-08-23.
  6. "Archived copy". Archived from the original on 2 October 2011. Retrieved 2021-08-23.{{cite web}}: CS1 maint: archived copy as title (link)