ఆత్మ-రక్షణ (Self-defense) లేదా ఆత్మరక్షణ (self-defence) (ఆత్మ-రక్షణ అని రెండుసార్లు రాసినప్పటికీ వాటి అక్షరక్రమం ఒకే విధంగా ఉండగా, వాటికి సమానార్థకాలైన ఆంగ్ల పదాల మధ్య మాత్రం చిన్నపాటి అక్షరక్రమ వ్యత్యాసం ఉండడాన్ని గమనించండి) లేదా వ్యక్తిగత రక్షణ అనేది భౌతిక హాని నుంచి స్వీయ రక్షణ, ఒకరి ఆస్తి రక్షణ లేదా వేరొక సంక్షేమ రక్షణతో ప్రమేయం కలిగిన ఒక దాడిని నిరోధించే ప్రతిదాడి చర్య.[1] ప్రమాద సమయాల నుంచి బయటపడేందుకు బలం ఉపయోగించడం కోసం ఆత్మ-రక్షణ హక్కును వినియోగించడాన్ని అనేక అధికార పరిధిల్లో చట్టప్రకారం సమర్థించడం జరుగుతున్నప్పటికీ, ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యత్యాసాలున్నాయి.[2] ఆత్మ-రక్షణ సమర్థనను ఉపయోగించడం ద్వారా ఏదేని భౌతిక హాని-సంబంధిత నేరం (దౌర్జన్యం మరియు దాడి మరియు హత్య లాంటివి)నుంచి నిర్దోషిగా బయటపడాలంటే, అతను చట్టబద్ద రూపంలో రెచ్చగొట్టబడిన విషయాన్ని ఒక వ్యక్తి తప్పనిసరిగా నిరూపించాలి, అంటే దాని అర్థం తాము ఆత్మ-రక్షణ కోసం ప్రయత్నించని పక్షంలో మరణం, తీవ్రమైన గాయాలు ఏర్పడడం, ఆస్తి నష్టం వాటిల్లడం లాంటి పరిస్థితి చోటు చేసుకుని ఉండవచ్చని సదరు వ్యక్తి తప్పకుండా నిరూపించాలి.

రాజకీయాల విషయానికొస్తే, దురాక్రమణ యుద్ధంను అడ్డుకునేందుకు జాతీయ లేదా పరస్పర ఆత్మ-రక్షణ అనే భావం, రాజ్యం ద్వారా నిర్వహించబడే రక్షణార్థ యుద్ధంను సూచించడంతో పాటు సముచితమైన యుద్ధ సిద్ధాంతంలో అది ఒక సంభవించగల ప్రమాణంగా ఉంటోంది.

శారీరకసవరించు

భౌతిక ఆత్మ-రక్షణ భాగాలుసవరించు

మెళుకవలు, శిక్షణ పద్ధతులు, మరియు వ్యూహాలు అని భౌతిక ఆత్మ-రక్షణలో మూడు భాగాలున్నాయి. మెళుకవలనేవి చలనం, అడ్డుకోవడాలు, మరియు ఎదుర్కోవడాలని కలిగి ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక అంశాలు పోరుకు ముందు జరుగుతాయి, అలాగే తోసిపుచ్చడం సాధ్యం కానట్టైతే, మిమ్మల్ని కొట్టగల దాన్ని అడ్డుకోవాలి, మరియు అటుతర్వాత ప్రత్యర్థి శరీరంలోని ఆయువు పట్టులపై దెబ్బకొట్టాలి. మెళుకవలను ఆచరణలో పెట్టడాన్ని నేర్చుకునేందుకు శిక్షణ పద్ధతులనేవి ఆత్మ రక్షణ విద్యార్థుల అభ్యసనను నిర్వహిస్తాయి. అలాగే, మెళుకవలను ఎలా మరియు ఎప్పుడు ఉపయోగించాలనే విషయాన్ని వ్యూహం సూచిస్తుంది. ఈ మూడు రకాల భాగాలు లేకుంటే, భౌతిక ఆత్మ రక్షణ విఫలమైయ్యేందుకు దారితీయవచ్చు.

నిరాయుధంసవరించు

ఆత్మ-రక్షణ లేదా ఆత్మ-రక్షణ మెళుకవలను జోడించడం కోసం మార్షల్ ఆర్ట్స్ యొక్క అనేక విధానాలు అభ్యసించబడుతాయి. ప్రాథమికంగా ఆత్మ-రక్షణ కోసం కొన్ని విధానాలు శిక్షణ అందిస్తాయి, అదేసమయంలో ఇతర మార్షల్/పోరాట క్రీడలు మాత్రం ఆత్మ-రక్షణ కోసం ప్రభావవంతంగా అనువర్తితమవుతాయి.[ఉల్లేఖన అవసరం] మరింత వాస్తవ ఆత్మ-రక్షణ కల్పించేందుకు, ఆధునిక కాలపు మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలు ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ విధానాలు మరియు మెళుకవలు కలగలిసిన విధానాన్ని ఉపయోగిస్తున్నాయి, దీంతోపాటు ఆత్మ-రక్షణ శిక్షణ కోసం వచ్చే వ్యక్తుల జీవన విధానాలు, వృత్తులు, వయసు వర్గాలు మరియు లింగత్వంలతో పాటు భౌతిక మరియు మానసిక సామర్థ్యాలకు సరిపడే విధంగా తరచూ శిక్షణ విధానాన్ని విశిష్టీకరించడానికి సైతం సిద్ధంగా ఉంటున్నాయి.

అత్యుత్తమమైన నిరాయుధ రక్షణ మెళుకవలు (UDT) అనేవి చాలావరకు ఒత్తిడి పరిస్థితుల్లో నశించిపోయే అత్యంత క్లిష్టతతో కూడిన శ్రేష్టమైన యంత్ర నైపుణ్యాల కంటే 'కొట్టేందుకు మరియు ఢీకొనేందుకు' ఉపయోగపడే సాధారణమైన మొత్తంగా ఉండే యంత్ర నైపుణ్యాలను కలిగి ఉంటోంది. UDT శిక్షణ అనేది విశ్వాసం మరియు అవగాహనను పెంచడానికి సంబంధించిందే తప్ప దాడిచేసిన వారిని 'కొట్టడానికి' సంబంధించినది కాదు. ఉత్తమమైన UDT పాఠాలనేవి దాడి చేసిన వ్యక్తిని అడుగడుగునా తికమక పెట్టగల లేదా పట్టు కోల్పోయేలా చేయడం ద్వారా బాధిత వ్యక్తి ప్రమాద పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన సాధారణ, అత్యధిక ప్రభావపూరిత మెళకవలను బోధిస్తాయి. మరోరకమైన మెళుకవ ఏమిటంటే, ప్రమాదకరమైన పరిస్థితి లేదా దాడికి తెగించిన వ్యక్తి అత్యంత నైపుణ్యవంతుడైన పక్షంలో, తీవ్రంగా కొట్టడం మరియు సాధారణంగా కొట్టడం లాంటి చర్యలకు బదులుగా ప్రత్యర్థి ఏదో ఒక చర్యకు ఉపక్రమించే వరకు మీరు తప్పకుండా వేచి చూడాలి, అలాగే ఎదుటివారి నుంచి ఏదో ఒక రకమైన చర్య వ్యక్తమైన తర్వాతనే మీరు ప్రాథమిక ప్రతిదాడికి ఉపక్రమించాలి, సదరు ప్రతిదాడి అనేది ఎదుటివారిని దాడి నుంచి తప్పించుకోలేని పరిస్థితిలోకి నెట్టేదిగా ఉండాలి. క్లోజ్ క్వార్టర్స్ కాంబాట్ (CQC) వ్యూహాలైన కపాప్ లాంటివి ముందస్తు దాడులకు సంబంధించినది, ఎదురైన పరిస్థితి నుంచి తప్పించుకోవడం వీలుకాదని మరియు భౌతిక ముఖాముఖీ పోరు తప్పనిసరని స్పష్టమైనపుడు ఎదుటివారు దాడికి దిగే లోపే మనమే ముందస్తు దాడికి దిగడం ఎలా అనే విషయాన్ని ఇందులో భాగంగా భోదిస్తారు. ఆత్మ-రక్షణలో భాగంగా ముందస్తు దాడికి దిగడమే ఎల్లప్పుడూ ఉత్తమమైన మార్గం, దాడికి తెగబడిన వారిపై వీలైనంత తక్కువ సమయంలో వరుసగా తేలికపాటి పిడిగుద్దులు కురిపించడంతో పాటు ఎదుటి వ్యక్తి తేరుకునే లోపే అక్కడి నుంచి తప్పించుకు పోవాలి.

సాయుధసవరించు

ఇది కూడా చూడండి: క్యాస్టెల్ డాక్ట్రైన్
ఇది కూడా చూడండి: నాన్-లెథల్ వెపన్

ఆత్మ-రక్షణలో భాగంగా ఆయుధాలు (ఉదాహరణకు కత్తులు, తుపాకీలు లేదా దండాలు) ఉపయోగించడం కొన్ని దేశాల్లో చట్టబద్ధంగా ఉంటోంది. ఇవికాక మిగిలిన దేశాల్లో, ఆయుధాలు ధరించడమన్నది చట్ట వ్యతిరేక చర్య లేదా ఆయుధాలు ధరించాలంటే తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండాలి, అదేసమయంలో కొన్ని రకాల మారణాయుధాలను ధరించడం చట్టబద్ధమే అయినప్పటికీ, తుపాకుల వంటి ఆయుధాలు ధరించే వారు మాత్రం లైసెన్స్ కలిగినవారై ఉండాలి లేదంటే వాటిని ధరించడం కుదరదు. వ్యక్తిగత రక్షణ కోసం ఆయుధాలను ఉపయోగించడంపై పరిమితులు విధించడమనేది కొన్ని దేశాల్లో వివాదానికి కారణమవుతోంది, ఆయుధాలను ఉపయోగించనీయకుండా అడ్డుకోవడమనేది, సాధారణ ఆయుధాల ద్వారా జరిగేందుకు అవకాశమున్న హింసాత్మక నేరాన్ని ఎదుర్కొనేందుకు ఆత్మ-రక్షణ హక్కులను ఉపయోగించకుండా అడ్డుకోవడమే అనే వాదన ఈ వివాదానానికి ఆధారంగా నిలుస్తోంది.[ఉల్లేఖన అవసరం]

బేస్‌బాల్ బ్యాట్‌లు లేదా ఏరోసోల్ స్ప్రే క్యాన్లు లాంటి రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువులను ఆత్మ-రక్షణ కోసం అభివృద్ధిపర్చబడిన ఆయుధాలుగా ఉపయోగించవచ్చు, అయితే మారణాయుధాలుగా ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా తయారైన ఆయుధాలతో పోలిస్తే అవి అంత ప్రభావవంతమైనవి కావు. కుబోటాన్ లాంటి కొన్ని ఘాతుక-రహిత ఆయుధాలను రోజువారీ జీవితంలో ఉపయోగించే కీచైన్‌ లాంటి వస్తువుల రూపంలో తయారు చేస్తున్నారు.[3]

పెప్పర్ స్ప్రే మరియు వ్యక్తిగత స్టన్ గన్‌లు లాంటివి ఘాతుక-రహిత ఆత్మరక్షణ ప్రత్యామ్నాయాలుగా ఉంటున్నాయి, కొన్ని దేశాల్లో ఇవి చట్టబద్ధమైనవి కూడా. పెప్పర్ స్ప్రేలనేవి 5–20 అడుగుల దూరం వరకు పనిచేస్తాయి, అలాగే స్ప్రే లేదా ఫోం లాంటి ఆత్మ-రక్షణ ఆయుధాలు అత్యధికంగా ఇబ్బందిపెట్టగల రసాయనాలను కలిగి ఉంటాయి. చేతిలో ఇమిడే స్టన్ గన్లు ఎదుటివారిని నిశ్చేష్టులను చేయగల విద్యుత్ ఘాతాన్ని విడుదల చేయడం ద్వారా పనిచేస్తాయి, కానీ ఇవి దాడికి యత్నించే వ్యక్తి సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే వాస్తవంగా ప్రభావవంతమైన రీతిలో పనిచేస్తాయి, అయితే ఈ విషయంలో టేసర్లుకు మినహాయింపు ఉంది, ఎందుకంటే వీటిలో ఘాతాన్ని కలిగించేందుకు ఉపయోగపడే తీగ గ్యాస్‌తో పనిచేసే గొట్టాలతో సంబంధం కలిగి ఉంటుంది.

ఇతర రూపాలుసవరించు

డీ-ఎస్కలేషన్సవరించు

వెర్బల్ సెల్ఫ్ డిఫెన్స్ లేదా 'వెర్బల్ జూడో'[4] అనేది ఒక వ్యక్తి మాటలను ఉపయోగించడం ద్వారా తనపై తలపెట్టిన ముట్టడిని నిరోధించడం, తగ్గించడం, లేదా సదరు ప్రయాత్నాన్ని ముగించడమనే రూపంలో నిర్వచించబడుతుంది.[5] మాటలనే ఆయుధాలుగా ఉపయోగించడంలో ఇదొక మార్గం. హింస వాస్తవంగా చోటు చేసుకోవడానికి ముందుగా శక్తివంతమైన హింసాత్మక పరిస్థితి చోటు చేసుకోకుండా ప్రశాంతపర్చడం కోసం గాత్రం, స్వరం, మరియు శారీరక భాష లాంటివి ఉపయోగించడం ద్వారా ఈ రకమైన 'ఘర్షణ నిర్వహణ' జరుగుంది. విరామం తీసుకోవడం, మరియు బృందంలో తక్కువ ఉద్రేకంతో పాలుపంచుకున్న వ్యక్తుల దిశగా సంభాషణ మళ్లించడం లాంటి రూపాల్లో ఈ రకమైన మెళుకవలు ఉపయోగించడం జరుగుతంది.

 • ఒకరి వ్యవహారాన్ని సున్నితంగా వారించడం లేదా పదేపదే ఒక అభ్యర్థనను తోసిపుచ్చడం లేదా మీరు కోరుకుంటున్న హద్దుని అతిక్రమిస్తున్న వారిని హెచ్చరించడం, లేదా ఒకరి హస్తలాఘవంతో మీరు పాలుపంచుకోవడానికి నిరాకరించే ఒక విషయాన్ని మరింత సంక్లిష్టమైన పరిస్థితిగా అనివార్యం చేయడం, పరిమితులను ఏర్పరచడం, మరియు సంభాషణకు ముగింపు పలకడం ద్వారా సాధారణంగా శాబ్దిక ఆత్మ-రక్షణ వ్యక్తీకరించబడుతుందని రచయిత కెటీ మ్యాటింగ్లీ పేర్కొన్నారు.[5]
 • ది జెంటిల్ ఆర్ట్ ఆఫ్ వెర్బల్ సెల్ఫ్-డిఫెన్స్ రచయిత సుజెట్ హెడెన్ ఎల్గిన్ ప్రకారం, శాబ్దిక ఆత్మరక్షణ అనేది ఎనిమిది అత్యంత సాధారణ రకాల శాబ్దిక హింస, మరియు మార్పుచేయడం మరియు శక్తివంతమైన శాబ్దిక తగాదాలను తగ్గించడంపై ఆధారపడి ఉంటుంది.[6]

తప్పించుకోవడంసవరించు

జాగురుకతతో ఉండడం మరియు శక్తివంతమైన ప్రమాదకర పరిస్థితి నుంచి తప్పించుకోవడం అనేది ఆత్మ రక్షణ విధానంలో చాలా ముఖ్యమైనది. దాడికి పాల్పడేవారు ప్రత్యేకించి భారీకాయులుగా, బలవంతులుగా ఉండడంతో పాటు చాలా సమయాల్లో వారు ఆయుధాలు ధరించి లేదా తోడుగా మరో వ్యక్తిని కూడా కలిగి ఉంటుంటారు. ఈ రకమైన అంశాల కారణంగా దాడికి ప్రయత్నించే వ్యక్తితో పోరాడి అతన్ని ఓడించడమనే ఆలోచన చాలా వరకు విజయం సాధించదు. అదేసమయంలో దాడికి ప్రయత్నించే వ్యక్తిపై ప్రతిదాడి జరపాలంటే అవసరం, దూరం, మరియు నిర్ణయం అనే మూడు అంశాలు తప్పకుండా ఉండాలి. ఈ మూడు అంశాల్లో ఏదేని ఒకటి తొలగించబడినట్టైతే, భౌతిక ఆత్మ రక్షణ కోసం దాడి చేసే ఆలోచన నుంచి విరమించుకోవాలి.[7] తప్పించుకోవడం సాధ్యంకాని పరిస్థితిలో, పారిపోయేందుకు పోరాడడమనేది చాలావరకు ఒక చక్కని అవకాశం కాగలదు, ఆ రకమైన విధానాలనేవి 'విడిపోయే' మెళుకవలుగా పరిగణించబడవచ్చు.[8]

వ్యక్తిగత అలారంలుసవరించు

వ్యక్తిగత అలారంలనేవి నిష్క్రియా ఆత్మ రక్షణ అభ్యసనానికి ఒక మార్గంగా ఉపకరిస్తాయి. వ్యక్తిగత అలారం అనేది ఒక చిన్న, చేతిలో తీసుకుపోగల పరికరం, అది శక్తివంతమైన, బిగ్గరగా ఉండే, అత్యధిక స్థాయి శబ్ధాలను చేయడం ద్వారా దాడికి ప్రయత్నించే వారిని భయపెడుతుంది, అలారం శబ్ధానికి దారిన వెళ్లేవారు తమను పట్టుకునే అవకాశముందని దాడికి యత్నించేవారు భయపడడమే అందుకు కారణం. పిల్లల అలారంలు చాలావరకు స్థాన గుర్తింపును తెలిపేవిగా లేదా దాడికి యత్నించేందుకు ప్రయత్నించే వారికి ప్రతిబంధకంగా కూడా పనిచేయడం ద్వారా ఈత కొలను ఉపయోగిస్తున్న సమయంలో ప్రమాదకర పరిస్థితులను నిరోధించేందుకు సాయపడగలిగిన పరికరంగానూ ఉపయోగపడుతాయి.[9][unreliable source?]

వీటిని కూడా చూడండిసవరించు

 • రిక్త హస్తాలతో పోరాటం
 • యుద్ధ కళలు
 • స్ఫూర్తి పోరాటం
 • వ్యక్తిగత రూపు
 • ఆత్మ-రక్షణ హక్కు
 • చెంప పగులగొట్టడం
 • శాబ్దిక ఆత్మ రక్షణ

సూచనలుసవరించు

 1. Dictionary.com యొక్క "ఆత్మ-రక్షణ" నిర్వచనాలు
 2. Kopel, David B. (2008). "The Human Right of Self-Defense". BYU Journal of Public Law. BYU Law School. 22: 43–178. Retrieved 2009-09-13. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 3. "బహుళ ఉపయోగాలను అందించే కుబోటన్లు". మూలం నుండి 2009-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-24. Cite web requires |website= (help)
 4. "Urban Dictionary". Retrieved 2010-07-28. Cite web requires |website= (help)
 5. 5.0 5.1 Self-defense: steps to survival By Katy Mattingly. Retrieved 2010-07-28.
 6. The Gentle Art of Verbal Self-Defense. Retrieved 2010-07-28.
 7. "ఆత్మ రక్షణ అవగాహన మరియు నిరోధం". మూలం నుండి 2010-12-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-24. Cite web requires |website= (help)
 8. సెల్ఫ్ డిఫెన్స్ బిగెనర్స్ హ్యాండ్‌బుక్ ఫ్రం పొటెన్సియా సెల్ఫ్ డిఫెన్స్ సెంటర్, ~300 పుటలు
 9. లవ్‌టునో సేఫ్టీ వద్ద చైల్డ్ సేఫ్టీ అలారమ్స్
"https://te.wikipedia.org/w/index.php?title=ఆత్మరక్షణ&oldid=2821607" నుండి వెలికితీశారు