ఆదితి పోహంకర్

మహారాష్ట్రకు చెందిన సినిమా నటి.

ఆదితి పోహంకర్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. 2014లో మరాఠీలో వచ్చిన లై భారీ యాక్షన్ సినిమాలో రితీష్ దేశ్‌ముఖ్‌తో కలిసి అద్భుతమైన పాత్రను పోషించింది.[1][2] షీ, ఆశ్రమ్ అనే హిందీ వెబ్ సిరీస్‌లలో నటించి గుర్తింపు పొందింది.[3]

ఆదితి పోహంకర్
ఆదితి పోహంకర్ (2015)
జననం1994 డిసెంబరు 31
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

జననం మార్చు

ఆదితి పోహంకర్ 1994 డిసెంబరు 31న సుధీర్ - శోభా పోహంకర్ దంపతులకు మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.[4]

క్రీడారంగం మార్చు

ఆదితి తల్లిదండ్రులిద్దరూ అథ్లెట్లు. ఆదితి పాఠశాలలో ఉన్నప్పుడు, అథ్లెటిక్స్‌లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించింది. 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో పతకాలు కూడా సాధించింది.[5]

ప్రకటనలు మార్చు

షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన క్యాడ్‌బరీ మంచ్, గోద్రెజ్, ఎయిర్‌టెల్, లెన్స్‌కార్ట్, శామ్‌సంగ్‌తో సహా ఇరవైకి పైగా బ్రాండ్ ప్రకటనలు, వాణిజ్య ప్రకటనలలో నటించింది.[1][6]ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 2020లో 47వ ర్యాంక్‌ని పొందింది.[7]

సినిమారంగం మార్చు

నాటకరంగంలో తన నటనను ప్రారంభించింది. కునాసతి కునిటారిలో అనే సినిమాలో తొలిసారిగా నటించింది.[8][9] ఆదితి నటించిన టైమ్ బాయ్ అనే నాటక ప్రదర్శన చూసిన దర్శకుడు నిషికాంత్ కామత్, తన మరాఠీ సినిమా లై భారీ (2014)లో అవకాశం ఇచ్చాడు.[10] ఆ సినిమాలో తన నటనకు సానుకూల సమీక్షలకు అందుకుంది.[11][12]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2014 లై భారీ నందిని మరాఠీ
2017 జెమినీ గణేశనుం సురుళి రాజనుమ్ సరోజా దేవి తమిళం
2020–ప్రస్తుతం షీ భూమికా పరదేశి/భూమి హిందీ నెట్‌ఫ్లిక్స్ సిరీస్
2020–ప్రస్తుతం ఆశ్రమం పర్మీందర్/పమ్మి హిందీ ఎంఎక్స్ ప్లేయర్ సిరీస్

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Lai Bhaari star Aaditi to make Bollywood Khans her mentors : Bollywood Helpline". Archived from the original on 2022-11-08. Retrieved 2022-06-16.
  2. Singh, Suhani (February 27, 2021). "The OTT Generation". India Today. Retrieved 2021-03-22.
  3. "Aaditi Pohankar: I want people to remember my roles". Hindustan Times. 2021-01-30. Retrieved 2021-03-22.
  4. Santhosh, K. (28 October 2012). "Straddling stage, screen and stadium". The Hindu. Archived from the original on 23 March 2020. Retrieved 23 March 2020.
  5. Ramnath, Nandini (Mar 25, 2020). "'I have arrived': How web series 'She' has given Aaditi Pohankar the role of a lifetime". Scroll.in. Retrieved 2021-03-22.
  6. "When Aaditi Pohankar went fishing with the King - Sushant Singh Rajput!". Urban Asian. 6 October 2015. Archived from the original on 23 March 2020. Retrieved 23 March 2020.
  7. "The Times Most Desirable Women of 2020". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 8 June 2021. Retrieved 2021-08-07.
  8. Santhosh, K. (28 October 2012). "Straddling stage, screen and stadium". The Hindu. Archived from the original on 23 March 2020. Retrieved 23 March 2020.
  9. "Aaditi to debut in Mollywood - Times of India". The Times of India. Archived from the original on 4 December 2017. Retrieved 23 March 2020.
  10. "Lai Bhaari star Aaditi to make Bollywood Khans her mentors : Bollywood Helpline". Archived from the original on 2022-11-08. Retrieved 2022-06-16.
  11. "Review: Lai Bhaari is awesome". Rediff. Archived from the original on 23 March 2020. Retrieved 23 March 2020.
  12. "Interview : Aditi Pohankar : Vile Yet beautiful". Satarblockbuster. Archived from the original on 25 April 2017.

బయటి లింకులు మార్చు