ఆధునికత్వం (Modernism) ముఖ్యంగా సనాతన, మధ్య యుగ చరిత్ర తర్వాతి కాలానికి వర్తిస్తుందని చెప్పవచ్చు. భూస్వామ్య వ్యవస్థ (లేదా అగ్రయినిజమ్) నుంచి పెట్టుబడిదారీ విధానం, పారిశ్రామికీకరణ, లౌకికవాదం, సుస్థిరత, జాతి-రాజ్యం మరియు దాని అనుబంధ సంస్థలు మరియు నిఘా రూపాలు (బార్కర్ 2005, 444) ద్వారా ఆధునికతత్వానికి గుర్తింపు లభించింది. భావన పరంగా ఆధునికత అనేది ఆధునిక యుగం, ఆధునికత్వానికి సంబంధించినదైనప్పటికీ ఒక విశిష్ట భావనను రూపొందించింది. అయితే ఈ జ్ఞానోదయం పాశ్చాత్య తత్వంలో ఒక ప్రత్యేక ఉద్యమానికి ఆహ్వానం పలకడంతో.. పెట్టుబడి దారీ విధానం ఏర్పాటుతో సంబంధం ఉన్న సామాజిక అంశాలకే ఆధునికత్వం పరిమితమైంది. ఆధునికతను మేథో సంస్కృతి ధోరణులతో.. ముఖ్యంగా లౌకికవాదం మరియు మార్క్సిజం, అస్థిత్వం వంటి పారిశ్రామికీకరణ తర్వాత జీవితం, మరియు సామాజిక శాస్త్రా స్థాపనలతో ముడిపడి ఉన్న ధోరణులకు సంబంధించిందిగా చెప్పవచ్చు. ఒక సందర్భంగా చూసుకుంటే 1436-1789 మధ్య సాంస్కృతిక మరియు మేథో ఉద్యమాలతో ముడిపడి 1970 లు లేదా ఆ తర్వాత (టాలమిన్ 1992, 3-5) వరకు కొనసాగిన ఉద్యమాలతో ఆధునికత ముడిపడి ఉంది.

సంబంధిత పదాలుసవరించు

అయిదో శతాబ్దం రోజుల నుంచి మోడర్న్ అనే పదం (లాటిన్ లో మోడో నుంచి మోడర్నస్, ఇప్పుడే).. వాస్తవంలో పాగన్ యుగం నుంచి క్రిస్టియన్ యుగానికి భేదం చూపినా, 17వ శతాబ్దంలో మాత్రమే ఈ పదం విస్తృత వినియోగంలోకి వచ్చింది. పురాతన మరియు ఆధునిక వ్యక్తుల మధ్య వివాదాల నుంచి ఉత్పన్నమైంది. చర్చ: “ఆధునిక సంస్కృతి, ప్రాచీన సంప్రదాయ (గ్రీకో-రోమన్) సంస్కృతి కంటే గొప్పదా?’ అనే విషయమై 1690ల మొదట్లో విద్యావర్గాల్లో సాహిత్య, కళాత్మక వివాదాలు చోటు చేసుకున్నాయి.

ఈ ఉపయోగాలన్నిటి ద్వారా “ఆధునికత’ గత కాలపు లొంగుబాటును నిర్దేశించి, కొత్త ప్రారంభానికి నాంది పలికిందని, చారిత్రక ఆరంభానికి కొత్త అర్థాన్నిచ్చిందని చెప్పవచ్చు. 19వ శతాబ్దం వరకు “ఆధునికత’ మరియు “ఆధునిక’ మధ్య తేడా తలెత్తలేదు. (డెలాంటి 2007).

ఆధునిక దశలుసవరించు

మార్షల్ బెర్మన్స్ పుస్తకాల్లో ఒకదాని ప్రకారం (బెర్మన్ 1983[page needed]), ఆధునిక మూడు సంప్రదాయ దశలు (“ప్రారంభ’, “సాహిత్య’, “చివరి’) గా గుర్తించవచ్చు. – పీటర్ ఓస్బోర్న్ (1992, 25) :

 • తొలి ఆధునికత దశ: 1500-1789 (లేదా సనాతన చరిత్ర రచనల్లో 1453-1789)
 • ప్రామాణిక ఆధునికత: 1789-1900 ( హోబ్స్ బామ్స్ స్కీం ప్రకారం సుదీర్ఘమైన 19 వ సెంచరీ (1789-1914కు సంబంధించింది)
 • చివరి దశ: 1900-1989

లియోటార్డ్ మరియు బౌడ్రిల్లార్డ్ వంటి కొందరు వ్యాసకర్తలు 20వ శతాబ్దం మధ్యలో లేదా చివరలో ఆధునికత అంతరించిందని పేర్కొని.. ఆధునికత తర్వాత కాలాన్ని పోస్ట్ మోడర్నిటీ (1930లు/ 1950లు/ 1990ల నుంచి ఇప్పటివరకు) గా నిర్వచించారు. మరికొందరు సిద్ధాంత కర్తలు 20వ శతాబ్దం చివరి నుంచి ప్రస్తుత కాలాన్ని ఆధునికత మరో దశగా పరిగణిస్తున్నారు; ఈ దశను “లిక్విడ్ మోడర్నిటీ’గా బౌమన్ లేదా “హై మోడర్నిటీ’గా గిడెన్స్ పిలిచారు (చూడండి: ఆధునికత అనంతర వివరణలు)

ఆధునికతను నిర్వచించడంసవరించు

రాజకీయంగాసవరించు

రాజకీయంగా ఆధునికత తొలి దశ నికోలో నికోలో మఖావెల్లి తో మొదలైంది. వాస్తవంగా ప్రస్తుత సంఘటనలు ఎలా ఉన్నాయి అనేదానితో భవిష్యత్తులో సంఘటనలు ఎలా ఉండాలి అనే దానితో పోల్చి అతను తన చర్యల ద్వారా మధ్యయుగ మరియు కులీనమైన రాజకీయ విశ్లేషణలను వ్యతిరేకించాడు. రాజకీయాల లక్ష్యం ఒకరి అవకాశాన్ని అదృష్టాన్ని నియంత్రించేదిగా ఉండాలని, కరుణ, కటాక్షాల మీద ఆధారపడితే చెడుకు దారి తీస్తుందని పేర్కొన్నాడు. మఖావెల్లి వాదనకు ఉదాహరణ: రాజకీయ వర్గాల్లో హింసా వర్గాలు నిరోధించలేనివి. కానీ అవి వారి బలానికి ఒక మార్గం. వీటికి జవాబుదారీ అయిన న్యాయ నిర్ణేతలు, నాయకులే కొన్నిమార్గాల్లో వాటిని ప్రోత్సహిస్తున్నారు. (స్ట్రాస్ 1987)

మఖావెల్లి ప్రతిపాదనలు కొన్నిసార్లు రాజులు, రాజకుమారుల మీద ప్రభావం చూపాయి. క్రమంగా అవి పాలకుల కంటే గణతంత్రానికే మద్దతిచ్చేవిగా మారాయి.(Rahe 2006, p. 1) తర్వాతి క్రమంలో మఖావెల్లి ఫ్రాన్సిస్ బాకన్ (Kennington 2004, chpt. 4), మర్ఖామంట్ నీధమ్ (Rahe 2006, chpt. 1), హారింగ్టన్ ,(Rahe 2006, chapt. 1) జాన్ మిల్టన్ ,(Bock, Skinner & Viroli 1990, chapt. 11) డేవిడ్ హ్యూమ్, (Rahe 2006, chapt. 4)మరెందరినో మాఖవిల్లె ప్రభావితం చేశాడు. (స్ట్రాస్ 1958).

కొత్త మెఖావిలియన్ వాస్తవికత ద్వారా ఆవిర్భవించిన ముఖ్య ఆధునిక రాజకీయ సిద్ధాంతాల్లో మెండావెల్లి ప్రభావపూరిత ప్రతిపాదన అయినటువంటి “సమర్థ రాజకీయ నాయకుడు మంచి దక్షతతో చేసే అవినీతిని ప్రజా అవసరాలకు మళ్లించాలి.’ (ఆయన రాసిన ఫ్యాబిల్ ఆఫ్ ది బీస్ లోని చివరి వాక్యం). ప్రభుత్వంలో రాజ్యాంగ పరంగా “పదవుల విభజన’ సిద్ధాంతాన్ని మొదట మాంటెస్య్కూ ప్రతిపాదించాడు. ఈ రెండు సిద్ధాంతాలకు ఆధునిక ప్రజాస్వామ్యాల్లో ఎన్నో రాజ్యాంగాల్లో చోటు కల్పించారు. మిఖావెల్లి వాస్తవికత యుద్ధానికి, రాజకీయ హింసకు కూడా విలువనిచ్చింది. చిరకాలం నిలిచే అతని ప్రభావం ఎందరికో మచ్చికైంది. అందువల్ల రాజకీయ పోరాటాలు మరియు స్వేచ్ఛా, ప్రైవేట్ ఎంటర్ ప్రైజెస్ మధ్య ఆర్థికపరమైన సిద్ధాంత వైరుధ్యాలను వీలైనంత మేర లాంఛనప్రాయం చేయడానికి సాధ్యమైన.. ఉపయోగకరమైన సామాజిక వైరుధ్య సిద్ధాంతంగా ఉద్దేశపూర్వకంగా మారింది. Rahe 2006, chapt. 5 (మాన్స్ ఫీల్డ్ 1989)

థామస్ హాబ్స్ తో మొదలై కొత్త ఆధునిక భౌతిక శాస్త్రాల పద్ధతుల వినియోగానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ విధానాన్ని బేకన్ మరియు డిస్క్రేట్స్ మానవత్వానికి రాజకీయాలకు (1987) అనువర్తిస్తూ ప్రతిపాదించారు. హాబ్స్ మెథడలాజికల్ తీరును అభివృద్ధి చేయడానికి గుర్తించదగిన విధంగా ప్రయత్నాలు చేసిన వారిలో లోక్ (Goldwin 1987), స్పినోజా (Rosen 1987), గియాంబట్టిస్టా వికో (1984 ఎక్స్ఎల్ఐ), మరియు రూసో (1997 భాగం -1). డేవిడ్ హ్యూమ్ మాత్రం తాను.. రాజకీయ విషయాల్లో బేకన్స్ శాస్త్రీయ విధానాని అనుసరించడమే సరైన ప్రయత్నంగా చెప్పాడు. (హ్యూమ్ 1896 [1739]), ఇంట్రో ). హాబ్స్ దృక్పథంలోని కొన్ని అంశాలను తిరస్కరించాడు.

ఆధునిక గణతంత్రస్యామ్యం.. డచ్ విప్లవం (1568-1609) (Bock, Skinner & Viroli 1990, chpt. 10,12), ఇంగ్లిష్ పౌర యుద్ధం (1642-1651) (Rahe 2006, chpt. 1), అమెరికా విప్లవం (1775-1783) (Rahe 2006, chpt. 6-11) మరియు ఫ్రెంచ్ విప్లవం (1789-1799) (Orwin & Tarcov 1997, chpt. 8) సమయాల్లో గణతంత్రాల ఆవిష్కరణకు ప్రభావం చూపింది.

ఆధునిక రాజకీయ ఆలోచనల రెండో దశ రూసోతో మొదలైంది. ఆయన మానవత్వంలోని వాస్తవ హేతుబద్ధతను, సామ్యవాదంపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాడు. అంతేకాకుండా గతంలో భావించిన దానికంటే ఎక్కువగా మానవ నైజం అనుకూలంగా ఉండాలన్నాడు. ఈ తర్కాన్ని బట్టి చూస్తే.. మంచి రాజకీయ వ్యవస్థ లేదా ప్రతి వ్యక్తి పూర్తిగా అవకాశాల దారిపైనే ఆధారపడి ఉన్నాడు. ఈ భావన ఇమ్మాన్యుయేల్ కాంట్, ఎడ్మండ్ బ్రూక్ మరియు ఇతరుల రాజకీయ ఆలోచనలపై ప్రభావం చూపింది. ఆధునికత్వ రాజకీయాల విమర్శనాత్మక సమీక్షకు దారి తీసింది. ఇలాంటి మార్పులు ప్రజల్లో అప్రమత్తతకు దారి తీస్తాయని, విప్లవాత్మక మార్పులను నిరోధిస్తాయని కన్జర్వేటివ్ పక్షాన బ్రూక్ వాదించాడు. ఏదేమైనప్పటికీ ప్రథమంగా మానవ సంస్ర్కతిలో రొమాంటిసిజమ్, హిస్టారిసిజమ్ వంటి ఎన్నో లక్ష్యపూరిత ఉద్యమాలు ఈ రకమైన ఆలోచన ధోరణితోనే చోటు చేసుకున్నాయి, కార్ల్ మార్క్స్ కమ్యూనిజం కూడా మొదలైంది. జాతీయత యొక్క ఆధునిక రూపాలకు ఫ్రెంచ్ విప్లవం, జర్మన్ నాజీ ఉద్యమాలే ప్రేరేపించాయని చెప్పొచ్చు.(Orwin & Tarcov 1997, chpt. 4)

సామాజికంగాసవరించు

 
మార్క్స్ వెబర్స్ “ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజమ్’ జర్మన్ ప్రచురణ కవర్.

సామాజిక శాస్త్ర పరంగా… ఆధునికత్వంలో సామాజిక సమస్యలకు స్పందనగా తెర తీసిన విభాగమే సామాజిక శాస్త్రం . (హేరిస్ 2000, 325) విజ్ఞానదాయక తరానికి తర్వాత కాలంలోని సామాజిక పరిస్థితులు, విధానాలు, విద్యా విషయ చర్చలకు ఆధునికత్వం అనే పదం వర్తిస్తుంది. చాలా సాధారణ పదాల్లో ఆంథోని గిడెన్స్ ఆధునికతను..

...ఆధునిక సమాజానికి షార్ట్ హ్యాండ్ పదంగా లేదా పారిశ్రామిక నాగరికతగా వర్ణించాడు. ఇంకా సమగ్రంగా వర్ణించాలంటే.. (1) మానవ జోక్యంతో ప్రపంచానికి అనుగుణంగా ఏర్పడిన ధోరణుల నిర్దిష్ట సమూహంగా, మార్పులకు తెరదీసిన ఆలోచనగా ;(2) ఆర్థిక సంస్థల సముదాయం ప్రధానంగా పారిశ్రామిక ఉత్పత్తి మరియు మార్కెట్ ఎకానమీ; (3) జాతి-రాజ్యం మరియు ప్రజాస్వామ్య సమూహంగా కలిసి ఉన్న రాజకీయ సంస్థల నిర్దిష పరిమితి గా వర్ణించవచ్చు. ఇలాంటి విశిష్ట ధర్మాలన్నింటి ఫలితంగా గతంలో ఉన్న సామాజిక విధానం కంటే ఆధునికతను మరింత శక్తిశీలతగా చెప్పవచ్చు. ఇది ఒక సమాజం- సాంకేతికంగా, సంస్థల సముదాయం- గతంలోని సంస్కృతి మాదిరి కాకుండా, గతంలో కంటే భవిష్యత్తులో జీవించేది. (గిడెన్స్ 1998, 94).

అమాయకంగా హేతు విరుద్ధంగా ఉండే మానవజాతిని విశాలభావాలుగల జాతిగా రూపొందిచే ప్రగతిశీల శక్తికి హామీ ఇవ్వడమే ఆధునికత్వం లక్ష్యం. సామాజిక, తాత్విక పరిస్థితుల్లోని మార్పుల కారణంగా కొన్ని కొత్త ప్రాథమిక సవాళ్లు కూడా తెరలేచాయి. ఆధునికత్వ యుగం సామాజికంగా.. పారిశ్రామికీకరణ, శ్రామిక వర్గీకరణతో, తాత్విక పరంగా “నిశ్చితత్వ లోపం, ఆ నిశ్చితత్వంను మళ్లీ ప్రతిష్టించలమేనే అవగాహన’ అనే ధర్మాలతో రూపొందింది. (డెలాంటి 2007). ఈ నిశ్చితత్వ లోపానికి ప్రధానం ఆచారాల్లో లోపం. మతాల్లోని లోపం. అగస్టీ కామ్టే నుంచి కార్ల్ మార్క్స్ నుంచి సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి 19వ శతాబ్దానికి చెందిన విద్యావేత్తలు లౌకిక వాదానికి నాంది పలకడానికి ఎన్నో శాస్త్రీయ, రాజకీయ సిద్ధాంతాలను ప్రతిపాదించే ప్రయత్నం చేశారు. ఆధునికత్వాన్ని “సిద్ధాంతాల యుగం’గా వర్ణించవచ్చు.[ఉల్లేఖన అవసరం]

For Marx, what was the basis of modernity was the emergence of capitalism and the revolutionary bourgeoisie, which led to an unprecedented expansion of productive forces and to the creation of the world market. Durkheim tackled modernity from a different angle by following the ideas of Saint-Simon about the industrial system. Although the starting point is the same as Marx, feudal society, Durkheim emphasizes far less the rising of the bourgeoisie as a new revolutionary class and very seldom refers to capitalism as the new mode of production implemented by it. The fundamental impulse to modernity is rather industrialism accompandied by the new scientific forces. In the work of Max Weber, modernity is closely associated with the processess of rationalization and disenchantment of the world. (Jorge Larraín 2000, 13)

థియోడర్ అడర్నో మరియు జిగ్మంట్ బౌమన్ వంటి సిద్ధాంత కర్తలు ఆధునికత్వం ఆధ్యాత్మిక భావాల నుంచి వైదొలగి.. వస్తువుల మాయాజాలయం, అణుయుద్ధాలు వంటి దుర్మార్గమైన విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. (అడర్నో 1973; బౌమన్ 1989). సమకాలీన విమర్శనాత్మక సిద్ధాంతం.. వెబర్ వాస్తవంగా నిర్వచించిన దానికంటే విరుద్ధంగా చాలా ఎక్కువగా హేతుబద్ధత భావనను ప్రతికూల పదజాలంలో చూపించింది. హేతుబద్ధత విధానం ప్రగతి కోసం ప్రగతి- ఆధునిక సమాజంపై చాలా సందర్భాల్లో ప్రతికూల మరియు అమానవీయ ప్రభావం చూపించొచ్చు.

ఆర్థిక ప్రపంచీకరణపై జరిగిన చర్చలు, నాగరికతల మధ్య పోలికలతో కూడిన విశ్లేషణ, మరియు వలస వాద విధానం తర్వాతి కాలపు ప్రత్యామ్నాయ ఆధునికతలకు పర్యవసానంగా శామ్యూల్ ఈసెన్ స్టాట్ బహుళ ఆధునికతలు అనే భావాన్ని పరిచయం చేశాడు. (2003; డెలాంటి 2007 కూడా చూడండి). “బహు విధానం’అనే దృక్పథంలో ఆధునికత అనేది సామాజిక మార్పు, భావాలకు మూల భావనగా.. “ఆధునికత్వం’ నిర్వచనాన్ని పాశ్చాత్య ఐరోపా సంస్కృతి నుంచి విశ్వజనీన నిర్వచనంగా విస్తృతం చేసేదిగా పేర్కొనవచ్చు. ఆధునికత్వం అనేది పాశ్చాత్య విధానం మాత్రమే కాదు. దీని కీలక విధానాలు, విశిష్టతలు అన్ని సమాజాల్లో కనిపిస్తాయి. (డెలాంటి 2007).

శాస్త్రీయంగాసవరించు

14వ శతాబ్దంలో కొపర్నికస్, కెప్లర్, గెలీలియో ఇంకా ఎందరో శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రాలలో కొత్త విధానాలను వృద్ధి చేసి… అనేక అంశాలపై ప్రజల ఆలోచన విధనాల్లో మార్పు తెచ్చారు. సౌర కుటుంబంలో భూమి మధ్యలోఉందన్న వాదనను కాదని సరికొత్త పద్ధతుల్నికోపర్నికస్ ప్రవేశపెట్టాడు. భౌతిక శాస్త్రాన్ని చర్చించడానికి కెప్లర్ గణితాన్ని ఉపయోగించి.. ఆ తీరులోనే ప్రకృతి ధర్మాలను వర్ణించాడు. వాస్తవానికి గెలీలియో తనకెంతో పేరు తెచ్చిన వేగత్వరణ ప్రమాణానికి తన ఉదాహరణకు కూడా గణితాన్ని ఉపయోగించాడు.(Kennington 2004, chpt. 1,4)

ఫ్రాన్సిస్ బాకన్ తన నోవన్ ఆర్గానమ్ లో డెమొక్రిటస్ మరియు ఎపికరస్ ల పురాతన తత్వశాస్త్రం మాదిరిగా సైన్స్ కు కూడా సంప్రదాయ కారణాలు కాకుండా వాస్తవ విషయాలతో కూడిన కొత్త ప్రయోగాత్మక ప్రతిపాదనలు చేయాలని ప్రతిపాదించాడు. మానవుడి కోసం మానవుల కోసం ప్రకృతిని ఆధీనంలో ఉంచుకోవాలని కూడా ప్రతిపాదించాడు. అంతేకాక ప్రకృతిని అర్థం చేసుకోవడం కోసమే అవగాహన చేసుకోకూడదని చెప్పాడు. ఈ రెండు విషయాల్లో అతడు.. మఖావెల్లి యొక్క మధ్యయుగ స్కొలాస్టిజమ్ పై విమర్శలు, నాయకుడు తన సొంత అదృష్టాలను నియంత్రించుకునే లక్ష్యంతో ఉండాలనే వాదనల ప్రభావాన్ని కలిగున్నాడు. (Kennington 2004, chpt. 1,4)

గెలిలియో యొక్క కొత్త భౌతిక శాస్త్రం మరియు బేకన్ ల ద్వారా ప్రభావితమైన రెనెడెస్కార్టస్.. గణితం మరియు రేఖా గణితాలు, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని చిన్న అంచెల్లో నిర్మించడానికి ఎలా ఆదర్శంగా నిలిచాయో వాదించాడు. అనేక సంక్లిష్ట భావాలుగల యంత్రాలుగా మానవులను అర్థం చేసుకోవచ్చని వాదించాడు.(Kennington 2004, chpt. 6)

డెస్కార్టస్ మరియు బేకన్ ల చే ప్రభావితమైన ఐజాక్ న్యూటన్ ప్రయోగాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఉదాహరణగా కార్టీసియన్ గణితం, రేఖా గణితం మరియు సిద్ధాంతాల తగ్గింపు ఒకవైపు, బేకన్ యొక్క ప్రయోగాత్మక పరిశీలన మరియు వాటిని తీసుకురావడం.. అనే ఈ రెండు విధానాలు ప్రకృతిలోని సాధారణ నియమాలను అర్థం చేసుకోవడంలో వచ్చిన గొప్ప మార్పులకు ఎలా కారణమవుతాయో ఉదాహరణతో చూపించాడు.

కళాత్మకంగాసవరించు

ఫ్రాన్స్ లో అప్పటికే రాజకీయ ఆలోచనా ధోరణిలో ఆధునికత ఆవిష్కృతమైన తర్వాత.. రూసో యొక్క మానవ లక్షణాల పునఃపరిశీలన.. ఆలోచనా విలువలపై కొత్త విమర్శలకు దారి తీసింది. తద్వారా కళలలో మానవుల యొక్క హేతుబద్ధత లేమిని అర్థం చేసుకోవడానికి దారి తీసింది. 18, 19వ శతాబ్దాల్లోని జర్మన్ సిద్ధాంతం, రొమాంటిసిజమ్ వంటి ఉద్యమాలపై ప్రాథమిక ప్రభావాన్ని చూపింది. అందువల్ల ఆధునిక కళ.. ఆధునికత్వం తర్వాతి దశలకు మాత్రమే వర్తిస్తుంది. (Orwin & Tarcov 1997, chpt. 2,4)

ఈ కారణంగా కళ చరిత్ర.. ఆధునిక అనే పదాన్ని ఆధునిక కాలం మరియు ఆధునికత్వం అనే పదాల నుంచి వేరుగా ఉంచింది. జీవితంలో, పనిలో, ఆలోచనలో కచ్చితంగా తీసుకు రావాల్సిన విధానాల యొక్క అవసరాన్ని వాటి సాంస్కృతిక పరిస్థితులను ఈ పదం తెలియజేస్తుంది. కళల్లో ఆధునికత్వం అనేది ఆధునికంగా ఉండటం లేదా పాత, కొత్త ల మధ్య వ్యతిరేకత కంటే ఎక్కువేనని చెప్పొచ్చు. (స్మిత్ 2009).

“ది పెయింటర్ ఆఫ్ మోడ్రన్ లైఫ్ (1864)’ అనే వ్యాసంలో ఛార్లెస్ బౌడెలెయిర్ సాహిత్య నిర్వచనం అందించాడు. “నా దృష్టిలో ఆధునికత్వం అంటే కదిలే, తక్కువ కాలం ఉండే, అప్పటి పరిస్థితిపై ఆధారపడిన’ (బౌడెలెయిర్ 1964, 13).

ఆధునికత్వం నిర్వచనాలుసవరించు

సామాజిక శాస్త్రంలో అందుబాటులో ఉన్న భావనా పరమైన నిర్వచనాలు.. ఆధునికతను దీర్ఘకాలంగా మనసులో ఆవరించి ఉన్న సాక్ష్యంగా నిర్వచించవచ్చు. చూడదగిన సంస్కృతి, వ్యక్తిగతంగ చూడదగినది. (లెప్పెర్ట్ 2004, 19). సాధారణంగా ఆధునికతను పెంపొందించే సమగ్రత ఎక్కువగా కనిపించే అంశాలు.

 • వస్తువులు, మూలధనం, ప్రజల కదలికల్లో ఉన్నతి, విభిన్న జనాభా వర్గాల మధ్య సమాచారం, మరియు స్థానిక ప్రాంతాలకు మించి తదనుగుణ ప్రభావం.
 • వలస ప్రజల సామాజిక ఏకీకరణ విస్తృతి, వారి ప్రభావం ఉండే సమూహాల అభివృద్ధి, మరియు, సామాజిక ఆర్థిక మార్పులకు కదలికలకు దోహదపడే సామాజిక స్థిరీకరణ.
 • శ్రమ వర్గీకరణ, పరస్పర ఆధార ప్రాంతం వంటి సమాజంలో విస్తరించిన పలు వర్గాలు.

వీటిని కూడా చూడండిసవరించు

 • ఆధునీకరణ
 • హేతుబద్ధత (సామాజిక శాస్త్రం)
 • నగరీకరణ
 • పారిశ్రామికీకరణ
 • జన సమాజం
 • ఆధునికత్వం తదనంతరం
 • శక్తిమంతమైన ఆధునికత్వం
 • ట్రాన్స్ మోడర్నిటీ
 • లేట్ మాడర్నిజం
 • ద్వితీయ ఆధునికత్వం
 • ఇస్లాం మరియు ఆధునికత్వం

సూచనలుసవరించు

 • ఆడమ సైఫుద్దీన్. 2004 “డికలోనైజింగ్ మోడర్నిటీ: ఐబీఎన్- ఖల్దున్ అండ్ మోడర్న్ హిస్టోరియోగ్రఫీ’ ఇన్ ఇస్లాం: పాస్ట్, ప్రజెంట్, అండ్ ఫ్యూచర్, ఇస్లామిక్ థాట్ ప్రొసీడింగ్స్ పై ఇంటర్నేషనల్ సెమినార్, ఎడిటెడ్ బై అహ్మద్ సునావరీ లాంగ్, జఫ్రీ అవాంగ్, అండ్ కమారుద్దీన్ సలేహ్, 570-87. సాలాంగర్ దారుల్ ఎహ్ సాన్, మలేషియా: డిపార్ట్ మెంట్ ఆఫ్ థియరీ అండ్ ఫిలాసఫీ, ఫ్యాకల్టీ ఆఫ్ ఇస్లామిక్ స్టడీస్, యూనివర్సిటీ కెబాంగ్ససాన్ మలేషియా.
 • అడర్నో, థియోడర్ డబ్ల్యు. 1973. నెగెటివ్ డైయాలెక్టిక్స్ , అనువాదం- ఇ.బి. ఆస్టన్. లండన్: రౌట్లెడ్జ్ (మాతృక – నెగెటివ్ డైయాలెక్టిక్ , ఫ్రాంక్ ఫర్ట్ ఎ.ఎం. : సుర్కాంప్, 1966)
 • డి’అలెంబర్ట్, జీన్ లె రాండ్. 2009 (1751). “ప్రిలిమినరీ డిస్ల్కోజర్’, ది ఎన్ సైక్లోపిడియా ఆఫ్ డిడెరాట్ అండ్ డి’ అలెంబర్ట్ కొలాబరేటివ్ ట్రాన్స్ లేషన్ ప్రాజెక్ట్. అనువాదకుడు రిచర్డ్ ఎన్. స్క్వాబ్ అండ్ వాల్టర్. యాన్న్ ఆర్బర్ “స్కాలరీ పబ్లిషింగ్ ఆఫీస్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ లైబ్రరీ 2008 డిసెంబరు 27న అందుబాటులోకి వచ్చింది.
 • బార్కర్, క్రిస్. 2005. కల్చరల్ స్టడీస్ : థియరీ అండ్ ప్రాక్టీస్. లండన్: సేజ్ ఐఎస్ బిఎన్ 0-7619-4156-8
 • బౌడెలెయిర్, ఛార్లెస్. 1964. ది పెయింటర్ ఆఫ్ మోడర్న్ లైఫ్ అండ్ అదర్ ఎస్సేస్, కూర్పు మరియు అనువాదం జొన్నాథన్ మేన్. లండన్ : ఫైడన్ ప్రెస్.
 • బౌమన్, జిగ్మంట్. 1989. మోడర్నిటీ అండ్ హాలోకాస్ట్. కేంబ్రిడ్జి : పాలిటి ప్రెస్ .ఇథాకా, ఎన్.వై.: కార్నెల్ యూనివర్సిటీ ప్రెస్. ఐఎస్ బిఎన్ 0745606857 (పాలిటీ, క్లాత్) ; ఐఎస్ బిఎన్ 0745609309 (పాలిటీ, 1991 పిబికె), ఐఎస్ బిఎన్ 0801487196 (కార్నెల్, క్లాత్), ఐఎస్ బిఎన్ 080142397ఎక్స్ (కార్నెల్ పిబికె).
 • బెర్మన్, మార్షల్. 1983. ఆల్ దట్ ఈజ్ సాలిడ్ మెల్ట్స్ ఇన్ టు ఎయిర్ : ది ఎక్స్ పీరియన్స్ ఆఫ్ మోడర్నిటీ లండన్:[full citation needed]
 • బెర్న్స్, లారెన్స్. 1987. థామస్ హాబ్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ, థర్డ్ ఎడిషన్, ఎడిటెడ్ బై లియో స్ట్రాస్ అండ్ జోసఫ్ క్రాప్సీ, 369-420. చికాగో: చికాగో విశ్వవిద్యాలయ ప్రచురణాలయం.
 • బాక్, గిసెలా, క్వెంటిన్ స్కిన్నర్, అండ్ మైరిజియో విరోలి. 1990. మిఖావెల్లి అండ్ రిపబ్లికనిజమ్. ఐడియాస్ ఇన్ కాంటెక్స్ట్. కేంబ్రిడ్జ్ మరియు న్యూ యార్క్: కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ముద్రణ. ఐఎస్ బిఎన్ 0521383765
 • డెలాంటి, గెరార్డ్. 2007. “మోడర్నిటీ’ బ్లాక్ వెల్ ఎన్ సైక్లోపీడియా ఆఫ్ సోషియాలజీ, ఎడిటడ్ బై జార్జ్ రిట్జర్. 11 వాల్యూమ్స్. మాల్డెన్, మాస్: బ్లాక్‌వెల్ పబ్లిషర్స్. ఐఎస్ బిఎన్ 1405124334
 • ఐసన్ స్టాడ్స్, షామ్యూల్ నోవ్. 2003. కంపేరిటివ్ సివిలైజేషన్స్ అండ్ మల్టిపుల్ మోడర్నిటీస్, 2 వాల్యూమ్స్. లైడెన్ అండ్ బోస్టన్: బ్రిల్
 • గిడెన్స్, ఆంథోనీ. 1998. కన్సర్వేషన్స్ విత్ ఆంథోని గిడెన్స్: మేకింగ్ సెన్స్ ఆఫ్ మోడర్నిటీ. స్టాన్ ఫోర్డ్, కాలిఫ్.: స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఐఎస్ బిఎన్ 0804735689 (క్లాత్) ఐఎస్ బిఎన్ 0804735697 (పిబికె)
 • గోల్డ్ విన్, రాబర్ట్, 1987. “జాన్ లోక్’. ఇన్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ ఫిలాస ఫీ, థర్డ్ ఎడిషన్, ఎడిటెడ్ బై లియో స్ట్రాస్ అండ్ జోసెఫ్ క్రాస్పీ, 476-512. చికాగో: చికాగో విశ్వవిద్యాలయ ప్రచురణాలయం. ఐఎస్ బిఎన్ 0226777081 (క్లాత్) : 0226777103 (పిబికె).
 • హారిస్, జాన్ 2000. “ది సెకండ్ గ్రేట్ ట్రాన్స్ ఫర్మేషన్? క్యాపిటలిజమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ట్వంటీయెత్ సెంచరీ.’ ఇన్ పావర్టీ అండ్ డెవలప్ మెంట్ ఇన్ టు ది ట్వంటీఫస్ట్ సెంచరీ, రివైజ్డ్ ఎడిషన్, ఎడిటెడ్ బై టిమ్ అలెన్ అండ్ అలాన్ థామస్, 325-42. ఆక్స్ ఫర్డ్ అండ్ న్యూయార్క్: ఓపెన్ యూనివర్సిటీ ఇన్ అసోసియేషన్ విత్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఐఎస్ బిఎన్ 0198776268
 • హెన్రీ, జాన్. 2004. “సైన్స్ అండ్ ది కమింగ్ ఆఫ్ ఎన్ లైటెన్మెంట్’ ఇన్ ది ఎన్ లైటెన్ మెంట్ వరల్డ్, ఎడిటెడ్ బై మార్టిన్ ఫిట్జ్ పాట్రిక్ ఎట్ అల్..
 • హ్యూమ్, డేవిడ్, 1896 (1739). ఎ ట్రీటీజ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ . ఎడిటెడ్ బై సర్ కె.సి.బి. లూయిస్ అమ్ హెర్స్ట్ సెల్బీ బిగ్. ఆక్స్ ఫర్డ్ : క్లారెండన్ ప్రెస్
 • కెన్నింగ్ టన్, రిచర్డ్. 2004. ఆన్ మోడర్న్ ఆరిజన్స్ : ఎస్సేస్ ఇన్ ఎర్లీ మోడ్రన్ ఫిలాసఫీ, ఎడిటెడ్ బై పమేలా క్రాస్ అండ్ ఫ్రాంక్ హంట్. లన్ హామ్, ఎండి.: లెక్సింగ్ టన్ బుక్స్. ఐఎస్ బిఎన్ 073910814ఎక్స్ (క్లాత్). ఐఎస్ బిఎన్ 0739108158 (పిబికె).
 • లరైన్, జార్జ్. 2000. “ఐడెంటిటీ అండ్ మోడర్నిటీ ఇన్ లాటిన్ అమెరికా’. కేంబ్రిడ్జ్, యుకె: పాలిటీ; మాల్డెన్, ఎంఎ: బ్లాక్ వెల్. ఐఎస్ బిఎన్ 0745626238 (క్లాత్) ఐఎస్ బిఎన్ 0745626246 (పిబికె).
 • లెప్పర్ట్, రిచర్డ్. 2004 “ది సోషల్ డిసిప్లయిన్ ఆఫ్ లిజనింగ్’ ఇన్ ఆరల్ కల్చర్స్, ఎడిటెడ్ బై జిమ్ డ్రోబ్నిక్, 19-35. టొరంటో: వైవైజెడ్ బుక్స్; బాన్ఫ్: వాల్టర్ ఫిలిప్స్ గ్యాలరీ ఎడిషన్స్. ఐఎస్ బిఎన్ 0920397808.
 • మాండెవిల్లె, బెర్నార్డ్. ది ఫ్యాబిల్ ఆఫ్ ది బీస్.
 • Mansfield, Harvey (1989), Taming the Prince, The Johns Hopkins University Press
 • నారిస్, క్రిస్టోఫర్. 1995. ఆధునికవాదం ఇన్ ది ఆక్స్ ఫర్డ్ కంపానియన్ టు ఫిలాసఫీ, ఎడిటెడ్ బై టెడ్ హాండెరిచ్,583. ఆక్స్ ఫర్డ్ అండ్ న్యూయార్క్: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఐఎస్ బిఎన్ 9780198661320
 • ఆర్విన్, క్లిఫోర్డ్, అండ్ నాథన్ టార్కోవ్. 1997. ది లెగసీ ఆఫ్ రూసో. చికాగో: చికాగో విశ్వవిద్యాలయ ప్రచురణాలయం. ఐఎస్ బిఎన్ 0226638553 (క్లాత్) ; ఐఎస్ బిఎన్ 0226638561 (పిబికె).
 • ఓస్బోర్న్, పీటర్. 1992. మోడర్నిటీ ఈజ్ ఎ క్వాలిటేటివ్, నాట్ క్రానలాజికల్, కేటగిరీ: నోట్స్ ఆన్ ది డైయాలెక్టిక్స్ ఆఫ్ డిఫరెన్షియల్ హిస్టారికల్ టైమ్. ఇన్ పోస్ట్ మోడర్నిజమ్ అండ్ రీ- రీడింగ్ ఆఫ్ మోడర్నిటీ. ఎడిటెడ్ బై ఫ్రాన్సిస్ బార్కెర్, పీటర్ హ్యూమ్ అండ్ మార్గరెట్ ఐవెర్సెన్. ఎసెక్స్ సింపోజియా, లిటరేచర్, పాలిటిక్స్, థియరీ. మాంఛెస్టర్: మాంఛెస్టర్ యూనివర్సిటీ ప్రెస్. ఐఎస్ బిఎన్ 071903745ఎక్స్.
 • రాహే, పౌల్ ఎ. 2006. మఖావెల్లిస్ లిబరల్ రిపబ్లికన్ లెగసీ. కేంబ్రిడ్జ్ మరియు న్యూ యార్క్: కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ముద్రణ. ఐఎస్ బిఎన్ 9780521851879.
 • రోజెన్, స్టాన్లీ. 1987. “బెనెడిక్ట్ సింపోజియా’. ఇన్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ . థర్డ్ ఎడిషన్. ఎడిటెడ్ బై లియో స్ట్రాస్ అండ్ జోసెఫ్ క్రాస్పీ, 456-475. చికాగో: చికాగో విశ్వవిద్యాలయ ప్రచురణాలయం.
 • రొసేనో, పౌలిన్ మేరీ. 1992. పోస్ట్ మోడర్నిజమ్ అండ్ ది సోషల్ సైన్సెస్: ఇన్ సైట్స్, ఇన్ రోడ్స్, అండ్ ఇన్ ట్ర్యూజన్స్ . ప్రిన్స్ టన్, ఎన్. జె.: ప్రిన్స్ టన్ యూనివర్సిటీ ప్రెస్. ఐఎస్బిఎన్ 0691086192 (క్లాత్) ఐఎస్బిఎన్ 0691023476 (పిబికె).
 • రూసో, జీన్- జాక్వెస్. 1997. ది డిస్కోర్సెస్ అండ్ అదర్ పొలిటికల్ రైటింగ్స్, ఎడిటెడ్, ట్రాన్స్ లేటెడ్ బై విక్టర్ గార్ విచ్. కేంబ్రిడ్జ్ టెక్స్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ పొలిటికల్ థాట్. కేంబ్రిడ్జ్ మరియు న్యూ యార్క్: కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ముద్రణ. ఐఎస్ బిఎన్ 0521413818 (క్లాత్) ; ఐఎస్ బిఎన్ 0521424453 (పిబికె)
 • సౌల్, జాన్ రాల్ స్టన్. 1992. వోల్టయిర్స్ బస్టార్డ్స్: ది డిక్టేటర్ షిప్ ఆఫ్ రీజన్ ఇన్ ది వెస్ట్. న్యూయార్క్:ఫ్రీ ప్రెస్, మాక్స్ వెల్ మెక్ మిలన్ ఇంటర్నేషనల్. ఐఎస్ బిఎన్ 0029277256
 • స్మిత్, టెర్రీ. “మోడర్నిటీ’. గ్రోవ్ ఆర్ట్ ఆన్ లైన్. ఆక్స్ ఫర్డ్ ఆన్ లైన్. (సబ్ స్క్రిప్షన్ యాక్సెస్, యాక్సెస్డ్ 2009 సెప్టెంబరు 21)
 • స్ట్రాస్, లియో. 1958. థాట్స్ ఆన్ మిఖావెల్లి. చికాగో: చికాగో విశ్వవిద్యాలయ ప్రచురణాలయం. ఐఎస్ బిఎన్ 0226777022.
 • స్ట్రాస్, లియో. 1987. “నికోలో మిఖావెల్లి’. ఇన్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ, థర్డ్ ఎడిషన్, ఎడిటెడ్ బై లియో స్ట్రాస్ అండ్ జోసెఫ్ క్రాస్పీ, 296-317. చికాగో: చికాగో విశ్వవిద్యాలయ ప్రచురణాలయం. ఐఎస్ బిఎన్ 0226777081 (క్లాత్) ; ఐఎస్ బిఎన్ 0226777103 (పిబికె)
 • టాల్మిన్, స్టీఫెన్ ఎడెల్ స్టన్. 1990. కాస్మోపొలిస్: ది హిడెన్ ఎజెండా ఆఫ్ మోడర్నిటీ. న్యూయార్క్: ఫ్రీ ప్రెస్. ఐఎస్ బిఎన్ 0029326311. పేపర్ బ్యాక్ రీ ప్రింట్ 1992, షికాగో: యూనివర్సిటీ ఆఫ్ షికాగో ప్రెస్ ఐఎస్ బిఎన్ 0-226-80838-6
 • వికో, గియాంబాటిస్టా, 1984. ది న్యూ సైన్స్ ఆఫ్ గియాంబాటిస్టా వికో: అనాబ్రిడ్జ్ డ్ ట్రాన్స్ లేషన్ ఆఫ్ ది థర్డ్ ఎడిషన్ (1744), విత్ ది ఎడిషన్ ఆఫ్ (కలయికతో) “ప్రాక్టీస్ ఆఫ్ ది న్యూసైన్స్, ఎడిటెడ్ బై థామస్ గొడార్డ్ బెర్గిన్ అండ్ మాక్స్ హరోల్డ్ ఫిష్. కార్నెల్ పేపర్ బ్యాక్స్. ఇథకా: కార్నెల్ యునివర్సిటి ప్రెస్. ఐఎస్ బిఎన్ 0801492653 (పిబికె).

మరింత చదవండిసవరించు

 • ఆరెండ్ట్, హన్నా. 1958. “ది ఆరిజన్స్ ఆఫ్ టోటలిటేరియనిజమ్’ క్లీవ్ ల్యాండ్: వరల్డ్ పబ్లిషింగ్ కొ. ఐఎస్ బిఎన్ 0805242252
 • బెర్మాన్, మార్షల్. 1982. బెర్మన్, మార్షల్, ఆల్ దట్ ఈజ్ సాలిడ్ మెల్ట్స్ ఇంటు ఏర్ : ది ఎక్స్పీరిఎన్స్ ఆఫ్ మాడర్నిటి. సెకండ్ ఎడ్. న్యు యార్క్: సైమన్ అండ్ స్కస్టర్. ఐఎస్ బిఎన్ 067124602ఎక్స్. రీ ప్రింటెడ్ 1988, న్యూయార్క్: వికింగ్ పెంగ్విన్ ఐఎస్ బిఎన్ 0140109625
 • బూకి-గ్లూక్స్ మన్, క్రిస్టీన్. 1994. బారోక్ రీజన్: ది ఈస్తటిక్స్ ఆఫ్ మోడర్నిటీ. థౌజండ్ ఓక్స్, కాలిఫ్: సేజ్ పబ్లికేషన్స్. ఐఎస్ బిఎన్. 080398975ఎక్స్ (క్లాత్) ఐఎస్ బిఎన్. 080398978 (పిబికె)
 • కరోల్, మైఖేల్ థామస్. 2000. పాపులర్ మోడర్నిటీ ఇన్ అమెరికా: ఎక్స్ పీరియెన్స్, టెక్నాలజీ, మైథోహిస్టరీ. సునీ సిరీస్ ఇన్ పోస్ట్ మోడర్న్ కల్చర్. అల్బానీ: స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ ప్రెస్. ఐఎస్ బిఎన్ 0791447138 (హెచ్ సి) ఐఎస్ బిఎన్ 0791447146(పిబికె)
 • కొర్చియా, లూసా. 2008 “ఇల్ కన్కెట్టో డి మోడర్నిషియా ఇన్ జర్గన్ హబెర్ మస్.అన్ ఇండికె రాగియోనటో’. ది ల్యాబ్స్ క్వార్టర్లీ/ ఇల్ ట్రైమ్ స్ట్రాలె డెల్ లేబరేటొరియో 2:396 ఎఫ్ ఎఫ్ ఐఎస్ ఎస్ ఎన్

2035-5548.

 • క్రౌచ్, క్రిస్టోఫర్. 2000. “మోడర్నిజమ్ ఇన్ ఆర్ట్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్,’ న్యూయార్క్: సెయింట్ మార్టిన్స్ ప్రెస్. ఐఎస్ బిఎన్ 0312218303 (క్లాత్) ఐఎస్ బిఎన్ 031221832 ఎక్స్ (పిబికె)
 • ఎయిసన్ స్టాడ్ట్స్, శామ్యూల్ నోవా. 2003. కంపేరిటివ్ సివిలైజేషన్స్ అండ్ మల్టిపుల్ మోడర్నిటీస్ , 2 వాల్యూమ్ లు. లీడెన్ అండ్ బోస్టన్ : బ్రిల్.
 • గవోంకర్, దిలీప్ పరమేశ్వర్ (ఇడి). 2001. ఆల్టర్నేటివ్ మోడర్నిటీస్. ఎ మిలీనియల్ క్వార్టెట్ బుక్. డర్హామ్: డ్యూక్ యూనివర్సిటీ ప్రెస్. ఐఎస్ బిఎన్ 0822327031 (క్లాత్); ఐఎస్ బిఎన్ 0822327147 (పిబికె)
 • గిడెన్స్, ఆంథోనీ. 1990. ది కన్సీక్వెన్సెస్ ఆఫ్ మోడర్నిటీ. స్టాన్ ఫోర్డ్: స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఐఎస్ బిఎన్ 0804717621 (క్లాత్); ఐఎస్ బిఎన్ 0804718911 (పిబికె); కేంబ్రిడ్జ్ , యూకే: పాలిటీ ప్రెస్ ఇన్ అసోసియేషన్ విత్ బాసిల్ బ్లాక్ వెల్, ఆక్స్ ఫర్డ్. ఐఎస్ బిఎన్ 0745607934
 • జార్జోంబెక్, మార్క్ 2000. ది సైకాలజైజింగ్ ఆఫ్ మోడర్నిటీ. ఆర్ట్, ఆర్కిటెక్చర్, హిస్టరీ. కేంబ్రిడ్జ్: కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్
 • కొలాకోవ్ సీ, లెస్జెక్. 1990. మోడర్నిటీ ఆన్ ఎండ్ లెస్ ట్రయల్. చికాగో: చికాగో విశ్వవిద్యాలయ ప్రచురణాలయం. ఐఎస్ బిఎన్ 0226450457
 • లాటౌర్, బ్రూనో. 1993. వి హ్యావ్ నెవర్ బీన్ మోడర్న్ . ట్రాన్స్ లేటెడ్ బై క్యాథరీన్ పోర్టర్. కేంబ్రిడ్జ్, ఎంఎ: హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్. ఐఎస్ బిఎన్ 0674948386 (హెచ్ బి) ఐఎస్ బిఎన్ 0674948394 (పిబికె)
 • పెరూ – సాసిన్, ఎమైల్. 2005. “లెస్ లిబెరాక్స్ ఫేస్ ఆక్స్ రివొల్యూషన్స్: 1688, 1789, 1917, 1933.’ కామెంటైర్ నెం: 109 (స్ప్రింగ్) : 181-93. (27) మూస:PDF

బాహ్య లింకులుసవరించు