ఆనందరాజ్
ఆనందరాజ్ (అక్టోబరు 12) ఒక ప్రముఖ తమిళ నటుడు. ప్రధానంగా ప్రతినాయక పాత్రలు పోషించాడు. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా నటించిన యాక్షన్ జాక్సన్ అనే సినిమాతో ప్రతినాయక పాత్రలో బాలీవుడ్ లో ప్రవేశించాడు. దక్షిణాది భాషలన్నీ కలిపి సుమారు వందకు పైగా సినిమాల్లో నటించాడు.
ఆనందరాజ్ | |
---|---|
జననం | ఆనందరాజ్ 12 October పుదుచ్చేరి |
విద్యాసంస్థ | ఎంజీఆర్ ప్రభుత్వ నట శిక్షణా కేంద్రం |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1988 – ప్రస్తుతం |
ఆనందరాజ్ పుదుచ్చేరిలో పుట్టి పెరిగాడు. తండ్రి ఒక వ్యాపారి. చదువు అయిపోయిన తర్వాత ఆనందరాజ్ ఓ పోలీస్ ఆఫీసర్ కావాలని కోరిక. కానీ ఆనందరాజ్ కి మాత్రం సినిమాలంటే మక్కువ. కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించారు. దాంతో ఆయన చెన్నైలోని ఎంజీఆర్ ప్రభుత్వ నటనా శిక్షణా సంస్థలో చేరాడు. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ అతని సహాధ్యాయి.
శిక్షణ పూర్తయిన వెంటనే అవకాశాలు వస్తాయనుకున్నాడు కానీ అందుకు కష్టపడాల్సి వచ్చింది. 1988లో వచ్చిన ఒరువర్ వాళుం ఆలయం అనే సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించాడు. ప్రభు, శివకుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఆ సినిమాలో ఆనందరాజ్ ఓ విలన్ పాత్ర పోషించాడు. తరువాత ఉరిమై గీతమ్ అనే సినిమాలో నటించాడు. ఇవి రెండు మంచి విజయాన్ని సాధించాయి. పి.వాసు దర్శకత్వం వహించిన ఎన్ తంగచ్చి పడిచవా అనే సినిమా మంచి బ్రేక్ నిచ్చింది.[1] తరువాత అప్పటి ప్రముఖ కథానాయకులైన రజనీకాంత్, విజయకాంత్, శరత్ కుమార్, మమ్ముట్టి, చిరంజీవి, బాలక్రిష్ణ, విజయ్ లాంటి వారి పక్కన ప్రతినాయకుడిగా నటించాడు.
తెలుగు సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
1989 | బామ్మ మాట బంగారు బాట | అనసూయ భర్త | |
ముద్దుల మావయ్య | గజ | ||
పల్నాటి రుద్రయ్య | |||
లంకేశ్వరుడు | |||
ఒంటరి పోరాటం | గోవింద యాదవ్ | ||
టూ టౌన్ రౌడీ | రౌడీ | ||
1990 | ప్రాణానికి ప్రాణం | బహదూర్ | |
ఇద్దరు ఇద్దరే | తేజ | ||
1991 | శత్రువు | సత్య మూర్తి | |
గ్యాంగ్ లీడర్ | కనకాంబరం | ||
1993 | బావ బావమరిది | భూపతి | |
1995 | పెదరాయుడు | భూపతి | |
1996 | రాముడొచ్చాడు | గవరాజు | |
1997 | శుభకాంక్షలు | మోసెస్ | |
తారక రాముడు | గజపతికి బావమరిది | ||
1998 | సూర్యవంశం | సింగరాజు లింగరాజు | |
2002 | సీమ సింహం | పోలీస్ ఇన్‌స్పెక్టర్ | |
భరతసింహా రెడ్డి | దేవుడయ్య బావ | ||
శివ రామరాజు | వీర్రాజు వర్మ | ||
చెన్నకేశవ రెడ్డి | ధనుంజయ రెడ్డి | ||
2003 | రాఘవేంద్ర | అంకినీడు | |
టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ | కిల్లర్ కోటేశ్వరరావు | ||
2005 | 786 ఖైదీ ప్రేమకథ | హరిశ్చంద్ర ప్రసాద్ | |
2009 | అధినేత | మహేంద్ర భూపతి | |
2016 | పార్వతీపురం | అన్నా | తెలుగులో వీర ఖడ్గం (2023) గా డబ్ చేయబడింది |
2024 | ఇంటి నెం.13 |
మూలాలు
మార్చు- ↑ "My wife is happy that I am a villain Anand Raj". timesofindia. 2014-11-11. Retrieved 2014-11-12.