ఆళ్ల నాని

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి

ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు .[3][4][5]

ఆళ్ల నాని

పదవీ కాలం
8 జూన్ 2019[1] – 2022 ఏప్రిల్ 10[2]

పదవీ కాలం
2019 జూన్ 8 – 2022 ఏప్రిల్ 10[2]

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 మే 23 - 2024
ముందు బడేటి కోట రామారావు
తరువాత బడేటి రాధాకృష్ణయ్య
నియోజకవర్గం ఏలూరు
పదవీ కాలం
2009 – 2014
తరువాత బడేటి కోట రామారావు
నియోజకవర్గం ఏలూరు
పదవీ కాలం
2004 – 2009
ముందు అంబికా కృష్ణ
నియోజకవర్గం ఏలూరు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు
పదవీ కాలం
2017 – 2019
నియోజకవర్గం ఎమ్మెల్యేల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం (1969-12-30) 1969 డిసెంబరు 30 (వయసు 54)
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (2013 నుండి 17 ఆగస్ట్ 2024)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (2013 వరకు)
జీవిత భాగస్వామి ఆళ్ల రేఖ
సంతానం ఆళ్ల కాళీకృష్ణ మణిచంద్ర, ఆళ్ల ఆశిష్
నివాసం ఏలూరు, ఆంధ్రప్రదేశ్

జననం, విద్యాభాస్యం

మార్చు

ఆళ్ల నాని 1969, డిసెంబరు 30న పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో ఆళ్ల సూర్యచంద్రరావు, నాగమణి దంపతులకు జన్మించాడు. ఆయన ఏలూరులోని కెపి హై స్కూల్ లో 1985లో పదవతరగతి, 1988లో సర్ సిఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. నాని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎ చదువుతూ మధ్యలోనే ఆపేసాడు.

రాజకీయ జీవితం

మార్చు

ఆళ్ల నాని 1994, 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబికా కృష్ణపై 33,053ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. నాని 2009లో గెలిచాడు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[6] 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[7] ఆయన 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి, ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[1][8]

ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు

మార్చు
ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు
సంవత్సరం నియోజకవర్గం పార్టీ ప్రత్యర్థి మెజారిటీ (ఓట్లు) ఫలితం
1994 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మరడాని రంగారావు (టీడీపీ) 9,247 ఓటమి
1999 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అంబికా కృష్ణ (టీడీపీ) 7,315 ఓటమి
2004 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మరడాని రంగారావు (టీడీపీ) 33,053 గెలుపు
2009 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బడేటి కోట రామారావు (టీడీపీ) 13,682 గెలుపు
2014 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడేటి కోట రామారావు (టీడీపీ) 24,603 ఓటమి
2019 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడేటి కోట రామారావు (టీడీపీ) 4,072 గెలుపు
2024 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడేటి రాధాకృష్ణయ్య (టీడీపీ) 62388[9] ఓటమి

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. The News Minute (8 June 2019). "Five Deputy CMs take oath in Andhra: Here's who Jagan has chosen". The News Minute. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.
  4. TV9 Telugu (8 June 2019). "మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్ - TV9 Telugu CM YS Jagan are allocated Departments to Cabinet Ministers". TV9 Telugu. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. The New Indian Express (8 June 2019). "Full list of Andhra Pradesh Ministers as YSRCP cabinet under Jagan sworn in". The New Indian Express. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
  6. Special Correspondent (2012-06-01). "States / Andhra Pradesh : Nani quits seat, three MLAs meet Vijayamma". The Hindu. Archived from the original on 5 July 2012. Retrieved 2013-01-16.
  7. Sakshi (27 November 2014). "టీడీపీ దాష్టీకాలను అడ్డుకుందాం". Sakshi. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.
  8. Sakshi (9 June 2019). "అగ్రతాంబూలం". Sakshi. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  9. Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Eluru". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆళ్ల_నాని&oldid=4357776" నుండి వెలికితీశారు