ఆశిష్ నందకిషోర్ జైస్వాల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు రాంటెక్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2018లో మహారాష్ట్ర స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.[1]

ఆశిష్ జైస్వాల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
ముందు ద్వారం మల్లికార్జున్ రెడ్డి
నియోజకవర్గం రాంటెక్

పదవీ కాలం
1999 – 2014
ముందు అశోక్‌కుమార్ గుజార్
తరువాత ద్వారం మల్లికార్జున్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

ఆశిష్ జైస్వాల్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాంటెక్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దేశ్‌ముఖ్ ఆనందరావుజీ రామ్‌జీపై 7,315 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004, 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాంటెక్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

ఆశిష్ జైస్వాల్ 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాంటెక్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ద్వారం మల్లికార్జున్ రెడ్డి చేతిలో 12081 ఓట్ల తేడాతో ఓడిపోగా 2018లో మహారాష్ట్ర స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు. ఆయనకు 2019 ఎన్నికలలో శివసేన పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి ద్వారం మల్లికార్జున్ రెడ్డిపై 24,413 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

ఆశిష్ జైస్వాల్ తిరిగి శివసేన పార్టీలో చేరి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాంటెక్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి రాజేంద్ర ములక్ పై 26,555 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. Loksatta (1 September 2018). "महामंडळांवरील रखडलेल्या नियुक्त्यांना मुहूर्त!" (in మరాఠీ). Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Ramtek". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
  5. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)