ఆసఫ్ అలీ

భారతీయ రాజకీయనేత

అసఫ్ అలీ (1888 మే 11 - 1953 ఏప్రిల్ 2) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది. అతను అమెరికాలో మొట్టమొదటి భారతీయ రాయబారి . ఒడిశా గవర్నరుగా కూడా పనిచేశాడు.

ఆసఫ్ అలీ
ఆసఫ్ అలీ

ఆసఫ్ అలీ


స్విట్జర్లండులో భారత రాయబారి
ప్రధాన మంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ


అమెరికాలో మొదటి భారత రాయబారి
ప్రధాన మంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
జీవిత భాగస్వామి
పూర్వ విద్యార్థి సెంట్ స్టీఫెన్7స్ కాలేజీ, ఢిల్లీ
వృత్తి లాయరు

అసఫ్ అలీ, ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నాడు. ఇంగ్లాండ్‌లో చదివి, బారిస్టరయ్యాడు

1914 లో, ఒట్టోమన్ సామ్రాజ్యంపై బ్రిటిషు వారు చేసిన దాడి భారతీయ ముస్లిం సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపింది. అసఫ్ అలీ టర్కిష్ పక్షానికి మద్దతు ఇచ్చాడు. ప్రివీ కౌన్సిల్ నుండి రాజీనామా చేసాడు. అతను దీనిని సహాయ నిరాకరణ చర్యగా భావించాడు. 1914 డిసెంబరులో భారతదేశానికి తిరిగి వచ్చాడు. వచ్చాక, అసఫ్ అలీ జాతీయోద్యమంలో తీవ్రంగా పాల్గొన్నాడు.

అతను 1935 లో ముస్లిం నేషనలిస్ట్ పార్టీ సభ్యుడిగా కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. అప్పుడు అతను కాంగ్రెస్ సభ్యుడై, ఉప నాయకుడిగా నియమించబడ్డాడు.[1]

స్వాతంత్ర్యోద్యమంలో అసఫ్ అలీ అనుభవించిన జైలు శిక్షలలో చివరిది 1942 ఆగస్టులో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆమోదించిన 'క్విట్ ఇండియా' ఉద్యమంలో. అతను జవహర్‌లాల్ నెహ్రూ, తదితర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు అహ్మద్‌నగర్ కోట జైలులో నిర్బంధించబడ్డాడు.[2]

1946 తరువాత మార్చు

 
1949 లో అలీ

1946 సెప్టెంబరు 2 నుండి జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారతదేశ తాత్కాలిక ప్రభుత్వంలో ఆసఫ్ అలీ రైల్వేలు, రవాణా మంత్రిగా పనిచేసాడు. 1947 ఫిబ్రవరి నుండి 1947 ఏప్రిల్ మధ్య వరకు అమెరికాలో మొదటి భారతీయ రాయబారిగా పనిచేశాడు..అతను రెండు పర్యాయాలు ఒడిశా గవర్నర్‌గా నియమితుడయ్యాడు. తరువాత, స్విట్జర్లాండ్‌లో భారత రాయబారిగా నియమితుడయ్యాడు.

అసఫ్ అలీ దేశంలో అత్యంత గౌరవనీయమైన న్యాయవాదులలో ఒకరిగా ఎదిగాడు. షహీద్ భగత్ సింగ్, [3] బటుకేశ్వర్ దత్లు 1929 ఏప్రిల్ 8 న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు విసిరిన కేసులో వారికి లాయరుగా వాదించాడు. 1945 లో, 1945 నవంబరులో దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొన్న భారత జాతీయ సైన్యం యొక్క అధికారుల రక్షణ కోసం కాంగ్రెసు స్థాపించిన INA రక్షణ బృందానికి కన్వీనర్‌గా పనిచేసాడు.[4]

వ్యక్తిగత జీవితం మార్చు

1928 లో, అతను అరుణా (గంగూలీ) అసఫ్ అలీని వివాహం చేసుకున్నాడు. ఈ మతాంతర వివాహం (అసఫ్ అలీ ముస్లిం అయితే అరుణ హిందువు ) సమాజంలో ఆశ్చర్యం కలిగించింది. వయస్సు వ్యత్యాసం కూడా ఎక్కువ (అరుణ అతని కంటే 20 సంవత్సరాలు చిన్నది). 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన ఘటనలో ఆమె గురించి విస్తృతంగా తెలిసింది. తరువాతి కాలంలో ఆమె కృషికి గాను అరుణ అసఫ్ అలీకి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం- భారతరత్నతో ఆమెను సత్కరించింది.[4]

మరణం మార్చు

అలీ స్విట్జర్లాండ్‌లో భారత రాయబారిగా పనిచేస్తూండగా, 1953 ఏప్రిల్ 2 న, [5] బెర్న్‌లోని కార్యాలయంలో మరణించాడు. 1989 లో, భారత తపాలా శాఖ అతని గౌరవార్థం ఒక స్టాంప్‌ను విడుదల చేసింది.[2]

మూలాలు మార్చు

  1. M. Asaf Ali | Making Britain. Open.ac.uk. Retrieved on 7 December 2018.
  2. 2.0 2.1 Asaf Ali. Indianpost.com (2 April 1953). Retrieved on 2018-12-07.
  3. Historical Trials (2008). "The Trial of Bhagat Singh". India Law Journal. 1 (3).
  4. 4.0 4.1 Aruna Asaf Ali's 20th death anniversary: Some facts about the Grand Old Lady of Independence – Education Today News Archived 2017-12-11 at the Wayback Machine. Indiatoday.intoday.in (29 July 2016). Retrieved on 2018-12-07.
  5. "Asaf Ali Dead". The Indian Express. 3 April 1953. Retrieved 18 July 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆసఫ్_అలీ&oldid=3727077" నుండి వెలికితీశారు