ఆస్తిక వాదం (ఆంగ్లం: Theism), సాధారణ నిర్వచనం ప్రకారం, "పరమేశ్వరుడున్నాడు" అనే ప్రగాఢ విశ్వాసం.[1] ఈ సాధారణ స్పృహ, ఈశ్వరవాదాన్నీ, ఏకేశ్వరవాదము, బహుఈశ్వరవాదమూ, ధార్మిక శాస్త్రమూ జనియించుటకు దోహదపడింది. ధార్మికశాస్త్రంలో, ధార్మికవాదము ఓ విశిష్ట ధర్మము. ఇది సృష్టికర్త (ఈశ్వర) ఉనికిని, సృష్టితో అతడికున్న సంబంధాన్ని తెలియదేస్తుంది.[2] ఆస్తికవాదం స్పృహతో కూడిన హేతువుల ఆధారంగా పరమేశ్వరుడు, అతడి అస్తిత్వం, సర్వవ్యాప్తి విశేషత, సకలజగత్తు యొక్క సృష్టి గురించి సహేతుకంగా చర్చించి విడమర్చి విశ్లేషించే మూల వస్తువు.[3]

గాడ్ ది ఫాదర్ 1860 లో జూలియస్ ష్నోర్ వాన్ కరోల్స్‌ఫెల్డ్ చేత చిత్రీకరించబడింది

ఆస్తికవాద విభజన

మార్చు

ఏకేశ్వరవాదం

మార్చు

ఏకేశ్వరవాదం పరమేశ్వరుడు ఒకడే అనే ప్రగాఢ విశ్వాసం.[4]

  • సమ్మిళత ఏకేశ్వరోపాసన: పరమేశ్వరుడు ఒక్కడే. ఇతర దేవతలను వారి పేర్లను, ఇతనికి అన్వయించినవే అనే విశ్వాసం. స్థూలంగా ఏకేశ్వరుడికే అనేక పేర్లతో అనేక రూపాలలో కొలవడం. హిందూ మతం లోని ఒక శాఖ అయిన సాంప్రదాయక అద్వైత వేదాంతం దీనికి ఒక ఉదాహరణ.
  • పరిపూర్ణ ఏకేశ్వరోపాసన: పరమేశ్వరుడు ఒక్కడే అనే విశ్వాసము. ఇతర దేవతలను కొలవడం అవిశ్వాసంతో సమానమైనదని అనే భావన. కొలవబడే ఇతర దేవతలు మానవ సృష్టితాలని లేదా తప్పిదమనే విశ్వాసం. దాదాపు అన్ని ఇబ్రాహీం మతములు, హిందూమతములోని ఒక శాఖ అయిన వైష్ణవం, ఇస్కాన్ విధానాలు, విష్ణువును (ఒకే దేవుడు) తప్పించి ఇతరులను కొలవడం తప్పిదము. ఈ విశ్వాసాలు పరిపూర్ణ ఏకేశ్వరవాదం అని భావింపబడుతుంది.

ప్రాచీన లేదా సనాతన ఏకేశ్వరవాద ధర్మాలకు ఉదాహరణలు, సనాతన ధర్మం, జొరాష్ట్రియన్ మతము, ఇబ్రాహీం మతము.

బహుఈశ్వరవాదం

మార్చు

బహుఈశ్వరవాదం పరమేశ్వడు ఒక్కడు గాదు, అనేకులు అనే విశ్వాసం. ఇంకనూ పరమేశ్వరుడు ఒక్కడే, అతడి రూపాలు అనేకం అనే విశ్వాసంతో, పరమేశ్వరుణ్ణి అనేక రూపాల్లో ఆరాధించడం.[5] ఆచరణలో బహుఈశ్వరవాదం, అనేక దేవతలను ఆరాధించడమేగాదు, అనేకానేక నిర్దిష్ట విషయాలకు అనేక నిర్దిష్ట దేవతలున్నారనే విశ్వాసం. ఈ బహు-ఈశ్వరవాదంలోనూ "కఠిన బహుఈశ్వరవాదం", "మృదు బహుఈశ్వరవాదం" అనే రెండు వర్గాలున్నవి.

  • కఠిన బహుఈశ్వరవాదం : దేవతలు వేరువేరు అని, వారి ఉనికి వేరువేరు అని, వారి అస్థిత్వం వేరు అనే భావించే విశ్వాసం. దీనికి ఉదాహరణ ప్రాచీన గ్రీకు-ధార్మికవిధానం (గ్రీకు ధర్మం).
  • మృదు బహుఈశ్వరవాదం : దేవతలు, ఆఖరుకు ఒకే ఈశ్వరునిలో లీనమౌతారనే విశ్వాసం. హిందూమతములోని అనేక శాఖలు ఈ విశ్వాసానికి ఉదాహరణలు.

బహుఈశ్వరవాదం, వైయుక్తిక ఈశ్వరులను భక్తి ప్రవృత్తులతో కొలిచే విధానంపై కొన్ని వర్గాలుగా విభజింపబడింది.

  • హెనోథీయిజం: బహు-దేవతలు ఉన్నారని, వారిలో ఒకడు అత్యున్నతుడు అనే విశ్వాసం.
  • మోనోలాట్రి: బహు-దేవతలు ఉండవచ్చని, కాని వారిలో ఒకడిని మాత్రమే ఆరాధించాలి అనే విశ్వాసం.
  • కాథెనోథీయిజం: బహు-దేవతలు ఉన్నారని, సమయానుసారం ఒక్కొక్కరు అత్యున్నతులని, సమయానుసారం అత్యున్నతులైన వారిని మాత్రమే ఆరాధించాలనే విశ్వాసం.

సహజసిద్ధత అనుసారం దేవతల విభజన

మార్చు

పాంథీఇజం యొక్క రూపాలు

మార్చు
  • పాంథీఇజం: "భౌతిక విశ్వం పరమేశ్వరునితో సమానం" అనే విశ్వాసం. ఈ విశ్వాసంలో విభజనలు లేవు.[6]
  • పానెంథీఇజం: పాంథీఇజంలో లాగా, ఈ విశ్వాసం ప్రకారం, భౌతిక విశ్వం పరమేశ్వరునిలో జోడించబడింది. కానీ, ఈ విశ్వాసంలో పరమేశ్వరుడు భౌతికవిశ్వం కన్నా గొప్పవాడు.

డీఇజం యొక్క రూపాలు

మార్చు
  • డీఇజం ఈ విశ్వాసం ప్రకారం, పరమేశ్వరుడు లేదా దేవతలు అస్తిత్వం కలిగివుంటారు. ఇతను లేదా వీరు, విశ్వాన్ని సృష్టించారు గానీ, విశ్వపు మూలసూత్రాలను మార్పుచేసే నియంత్రణ కలిగివుండరు. దీనినే దేవవాదం అనికూడా వ్యవహరిస్తారు.[7] ప్రకృతికి అతీత కార్యక్రమాలైన, ప్రాఫెసీలు (కాలజ్ఞానం), అత్భుతాలను, ఈ వాదం అంగీకరించదు. పరమేశ్వరుని అవతరణలు (గ్రంధాలు), అవతారములు, మున్నగు వాటికినీ తిరస్కరిస్తుంది. దైవగ్రంధాలను వాటి విషయాలను, కూడా తిరస్కరిస్తుంది. అలా కాకుండా, మానవహేతువుల ఆధారంగా ఏర్పడ్డ విశ్వాసాలపై విశ్వాసముంచుతుంది. ప్రకృతి సిద్ధాంతాల ఆధారంగా, ప్రాకృతిక వనరుల ఆధారంగా పరమేశ్వరుని సృష్టిని, అతని ఉనికిని గుర్తిస్తుంది.[8]
    • పాండీఇజం: పరమేశ్వరుడు విశ్వాన్ని సృష్టించాడు ఆరంభించాడు, కాని విశ్వంతో సమానమైపోయాడు లేదా లీనమైపోయాడు అనే విశ్వాసాన్ని ప్రకటించే వాదం.
    • పానెన్‌డీయిజం, డీయిజాన్ని పానెంథీయిజంతో మమేకంచేస్తూ, విశ్వం పరమేశ్వరుడి అంతర్భాగమని, విశ్వం సర్వస్వం గాదని విశ్వసిస్తుంది.
    • పాలీడీఇజం: అనేక దేవతలున్నారని, కానీ వీరెవరూ విశ్వం, విశ్వపుకార్యక్రమాలలో వీరు జోక్యం చేసుకోరు.

ఇతరాలు

మార్చు
  • మిసోథీయిజం: దేవుడు లేదా కొందరు దేవతలు చెడ్డవారు అని ఈ వాదపు విశ్వాసం.

మూలాలు

మార్చు
  1. Oxford English Dictionary, Second Edition
  2. See note 3
  3. See, for example,The Oxford Dictionary of the Christian Church, Second Edition; The Oxford Dictionary of World Religions, 1997.
  4. "AskOxford: monotheism". Archived from the original on 2008-10-23. Retrieved 2009-01-02.
  5. "AskOxford: polytheism". Archived from the original on 2007-09-29. Retrieved 2009-01-02.
  6. Philosophical Dictionary: Pacifism-Particular
  7. "AskOxford: deism". Archived from the original on 2007-09-29. Retrieved 2009-01-02.
  8. Webster's New International Dictionary of the English Language (G. & C. Merriam, 1924) defines deism as belief in the existence of a personal God, with disbelief in Christian teaching, or with a purely rationalistic interpretation of Scripture...