ఆహా

1998 సినిమా
(ఆహా! నుండి దారిమార్పు చెందింది)

ఆహా 1998 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం.[1] ఇందులో జగపతి బాబు, సంఘవి ముఖ్యపాత్రల్లో నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంలో వచ్చిన ఆహా చిత్రానికి పునర్నిర్మాణం.

ఆహా
దర్శకత్వంసురేష్ కృష్ణ
నిర్మాతఅక్కినేని నాగార్జున
తారాగణంజగపతి బాబు,
భానుప్రియ ,
సంఘవి
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1998 అక్టోబరు 25 (1998-10-25)
సినిమా నిడివి
144 నిమిషాలు
భాషతెలుగు

కథ మార్చు

శ్రీరాం పెప్సి పరశురాం గా పేరొందిన ఒక వ్యాపారవేత్త కొడుకు. ఇతను జీవితంలో ఓ లక్ష్యం అంటూ ఏమీ లేకుండా తిరుగుతుంటే తండ్రి అతన్ని ఎప్పుడూ తిడుతూ ఉంటాడు. ఇతని అన్న రఘురాం తండ్రికి ఇష్టమైన కొడుకు. రఘురాం అన్ని బాధ్యతలు చక్కగా నెరవేరుస్తుంటాడు. ఇతని భార్య రాజేశ్వరి. ఇంటికి ఒద్దికైన ఇల్లాలు. వీళ్ళకి ఓ బాబు అజయ్. శ్రీరాం రామారావు అనే వంట మాస్టరు కూతురైన జానకి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ పరశురాం వారి అంతస్తులో తేడా వల్ల ఆ సంబంధానికి అంగీకరించడు. రఘురాం కాలేజీ స్నేహితురాలైన గీత మరణానికి చేరువలో ఉంటుంది. చివరి దశలో రఘురాం కొద్ది రోజులు కలిసి ఉండాలనుకుంటుంది. రఘురాం ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆమెను కలిసి వస్తుంటాడు. శ్రీరాం ఈ విషయాన్ని పసిగట్టి గీతను నిలదీస్తాడు. అప్పుడు ఆమె అసలు కారణం చెబుతుంది. ఆమె పరిస్థితికి జాలిపడి ఇంట్లో అన్నయ్య రఘురాం మీదకు మాట రాకుండా తప్పులన్నీ తన మీద వేసుకుంటూ ఉంటాడు. రఘురాం గురించి చివరికి అందరికీ తెలుస్తుందా? శ్రీరాం తను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడా అన్నది మిగతా కథ.

తారాగణం మార్చు

పాటలు మార్చు

పాటల రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి

  • ప్రియురాలి అడ్రెస్సేమిటో చెప్పమ్మా గానం: వందేమాతరం శ్రీనివాస్
  • ఆహ్వానమండి అందం , గానం.రమణి, మహర్షి, హరిణి
  • మనసైన , గానం.వందేమాతరం శ్రీనివాస్
  • సువ్వి సువ్వి, గానం.ఉన్నికృష్ణన్ , మలేషెయా వాసుదేవన్, సుజాత
  • అంత్యాక్షరి ,

మూలాలు మార్చు

  1. "Aaha Telugu Movie Review". thecinebay.com. Archived from the original on 21 సెప్టెంబరు 2021. Retrieved 13 March 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆహా&oldid=4026288" నుండి వెలికితీశారు