ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్

ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐఐటి హైదరాబాద్, త్రిబుల్ఐటి హైదరాబాద్ లేదా ఐఐఐటి-హెచ్) 1998లో స్థాపించబడిన, దేశంలోని ఐఐఐటిలలో తొలిగా ప్రారంభించిన జాతీయ గుర్తింపు పొందిన పరిశోధనా విశ్వవిద్యాలయం.[4] ఈ విశ్వవిద్యాలయం హైదరాబాద్ , తెలంగాణ లో ఉంది. ఇది సమాచార సాంకేతికాలు ( ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), కంప్యూటర్ విజ్ఞానం(కంప్యూటర్ సైన్స్), ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగాలలో పరిశోధన చేస్తుంది. ఇది లాభాపేక్షరహిత ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (ఎన్-పిపిపి) కింద స్థాపించబడింది.

ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్
IIIT logo
పూర్వపు నామము
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
రకండీమ్డ్-టు-బి విశ్వవిద్యాలయం, సాంకేతిక విశ్వవిద్యాలయం
స్థాపితం1998
అనుబంధ సంస్థయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి), నేషనల్ అసెస్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్,[1] ఆల్ ఇండియా కౌంసిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఈ)[2]
చైర్మన్రాజ్ రెడ్డి
డైరక్టరుపి జె నారాయణన్[1]
విద్యార్థులు1,553[3]
అండర్ గ్రాడ్యుయేట్లు1,146[3]
పోస్టు గ్రాడ్యుయేట్లు228[3]
డాక్టరేట్ విద్యార్థులు
179[3]
స్థానంహైదరాబాద్, తెలంగాణ, 500032, భారత్
17°26′44″N 78°20′59″E / 17.4456°N 78.3497°E / 17.4456; 78.3497
కాంపస్66 ఎకరాలు
భాషEnglish
Acronymఐఐఐటి-హెచ్
Nicknameఐఐఐటి-హెచ్
రంగులు     Dark Cerulean
మస్కట్జాగృతి - మర్రి చెట్టు

గత రెండు దశాబ్దాలుగా, ఈ సంస్థ వివిధ రంగాలలో పరిశోధనా కార్యక్రమాలను రూపొందించింది. ఇది పరిశ్రమకు, సమాజానికి ఉపయోగపడే అనువర్తిత పరిశోధనలకు బలమైన ప్రాధాన్యత ఇస్తుంది, వివిధ శాఖలవారు కలసి పనిచేసే(ఇంటర్ డిసిప్లినరీ) పరిశోధనను సులభతరం చేస్తుంది.[5]

చరిత్ర మార్చు

ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ 1998 లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా క్రింద స్థాపించబడింది. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చి, భవనాలు నిర్మించింది . ఆ సమయంలో, అజయ్ ప్రకాష్ సహానీ ఐఐఐటి హైదరాబాద్ ప్రత్యేక అధికారిగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఐటి కార్యదర్శిగా ఉన్నారు. సంభావిత నమూనాను రూపొందించడానికి, సంస్థ యొక్క ప్రారంభ అభివృద్ధిని పర్యవేక్షించడానికి అతను బాధ్యత వహించాడు[6][7] ప్రొఫెసర్ రాజీవ్ సంగల్ సిలబస్‌ను రూపొందించారు, ఈ సంస్థ యొక్క మొదటి డైరెక్టర్‌గా 10 ఏప్రిల్ 2013 వరకు పనిచేశాడు.[8]

పాలక మండలి మార్చు

ఐఐఐటీ హైదరాబాద్ పాలక మండలికి ప్రస్తుతం ట్యూరింగ్ అవార్డు గ్రహీత రాజ్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నాడు. మరో ట్యూరింగ్ అవార్డు గ్రహీత వింట్ సెర్ఫ్, నరేంద్ర అహుజా కూడా ఈ పాలక మండలిలో ప్రముఖ సభ్యులు. రోజువారీ కార్యకలాపాలు డైరెక్టర్, పి. జె. నారాయణన్ నిర్వహిస్తున్నాడు. దీనికి పరిశోధన డీన్, విద్యావిషయాల డీన్ సహకరిస్తారు.

విద్య మార్చు

ఐఐఐటి హైదరాబాద్ లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాములు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బిటెక్) లేదా బిటెక్ (ఆనర్స్) డిగ్రీలు ఇవ్వబడతాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములలో  మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్), మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) లేదా మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్.) ఇవ్వబడతాయి. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో బిటెక్ + ఎంఎస్ డిగ్రీ ఇవ్వబడుతుంది. డ్యూయల్ డిగ్రీ లో ఎం.ఎస్ స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ కంప్యూటేషనల్ నేచురల్ సైన్స్/ బిల్డింగ్ సైన్సెస్ [సివిల్ యొక్క ప్రత్యేక కోర్సులలో ఎంఎస్]/ కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ చెయ్యచ్చు. పీహెచ్‌డీ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు కూడా ఇస్తారు. అమెరికాలో కార్నెగీ మేలన్ విషవిద్యాలయం సహకారంతో ఐఐఐటీ ఎం ఎస్ ఐ టి ప్రోగ్రాం కూడా నడుపుతోంది. ఐఐఐటి "మానవ విలువలు", వృత్తిపరమైన నీతికి గొప్ప ప్రాముఖ్యతను ఇస్తుంది.

ప్రవేశం మార్చు

అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములలో అడ్మిషన్లు ఐదు రకాలుగా అవుతాయి :

  • జాయింట్ ఎంట్రన్స్ ఎక్సామ్ (జే ఈ ఈ)
  • ఐఐఐటి సొంత పరీక్ష (అండర్గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎక్సామ్ (యు జీ ఈ ఈ) ఇంకా ఇంటర్వ్యూ
  • XI, XII తరగతుల సమయంలో అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తే
    • ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మాటిక్స్ (IOI),
    • ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ (IPhO),
    • ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ (IChO),
    • ఇంటర్నేషనల్ బయాలజీ  ఒలింపియాడ్ (IBO),
    • ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామి ఒలింపియాడ్ (IAO),
    • ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ (IMO) ఇంకా
    • ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్  (IOL) / పాణినీయం  లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్ (PLO),
  • డైరెక్ట్ అడ్మిషన్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్ (డాసా) ఇంకా
  • ఎంట్రన్స్ పరీక్షా ఇంకా ఇంటర్వ్యూ ద్వారా డ్యువల్ డిగ్రీ ప్రోగ్రాములకు లాటరల్ ఎంట్రీ అడ్మిషన్

పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములకు ఐఐఐటి పోస్టుగ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎక్సమ్ (పి జి ఈ ఈ) నిర్వహిస్తుంది. ఎం ఎస్ ఐ టి ప్రోగ్రాంకు ఐఐఐటీ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే మధ్యలో పరీక్షల ద్వారా విద్యార్థులని చేర్చుకుంటుంది.

ర్యాంకింగ్ మార్చు

ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ 2019 లో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) చేత భారతదేశంలోని విశ్వవిద్యాలయాలలో 82 వ స్థానంలో ఇంజినీరింగ్ కాలేజీలలో 38 వ స్థానంలో ఉంది. ఇంజనీరింగ్ కళాశాలలలో, ఐఐఐటి హైదరాబాద్ 2017 లో ఇండియా టుడే చేత 14 వ స్థానంలో, 2019 లో ఔట్లుక్ ఇండియా చేత 16 వ స్థానంలో, 2018 లో ద వీక్ చేత 16 వ స్థానంలో పెట్టబడింది.

అధ్యాపకులు మార్చు

ఐఐఐటి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోసం అనేక రకాల పరిశోధనా ఆసక్తులతో ప్రపంచ స్థాయి అధ్యాపక బృందాన్ని కలిగి ఉంది. విద్యార్థి నిష్పత్తికి అధ్యాపకులు 1:15. 2017-18 సంవత్సరంలో, పద్దెనిమిది మంది అధ్యాపక సభ్యులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి అత్యంత ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపులను పొందారు.[9]

క్యాంపస్ మార్చు

 
పరిశోధనా కేంద్రాలు

ఐఐఐటి వైశాల్యం సుమారు 66 ఎకరాల ఉంటుంది. నాలుగు బిల్డింగ్లలో కార్పొరేట్ పాఠశాలలు, పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి.  అకాడెమిక్ బిల్డింగులో లెక్చర్ హాళ్లు, ట్యుటోరియల్ రూములు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లు ఇంకా పరిపాలన, అధ్యాపకుల ఆఫీసులు ఉన్నాయి.

బిల్డింగ్ పేర్లు పర్వతాల పేరులపై పెట్టారు, ఉదాహరణకి నీలగిరి, వింధ్య, హిమాలయా.  క్యాంపస్లో ఒక ఆంఫిథియేటర్ కూడా ఉంది, ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాశాల ఉత్సవాలు జరుగుతాయి.

ఇన్స్టిట్యూట్లో ఎయిర్ కండిషన్డ్ లాబులు ఉన్నాయి. వీటిని బ్యాచ్ క్రమం పద్దతిలో విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రతి రెండు విద్యార్థులకు ఒక కంప్యూటర్ ఉంది. ప్రతి కంప్యూటర్లో ఇంట్రానెట్ వస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్లో 24 గంటలు హై బ్యాండ్విడ్త్ (100 GB/s) ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. పరిశోధన చేసే విద్యార్థులు ఎప్పుడైనా ఈ సౌకర్యాలను వాడొచ్చు. అన్ని నోటీసులు, తక్కిన సమాచారం ఇమెయిల్ ద్వారా పంపబడతాయి. కొరియర్లు తీసుకోవడం నుంచి మెస్సు రిజిస్ట్రేషన్  దాకా ప్రతీది  ఇంట్రానెట్ పోర్టల్స్ ద్వారా జరుగుతుంది. క్యాంపస్ లో కొన్ని క్షేత్రాలలో (హిమాలయా , నీలగిరి, కేసిఐఎస్, లైబ్రరీ) వై-ఫై సిగ్నల్ వస్తుంది.

ఐఐఐటి లో టి-హబ్ కూడా ఉంది. టి-హబ్ భారత దేశంలో అతి పెద్ద ఇంక్యూబేషన్ సెంటర్. ఇందులో ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్, నల్సార్ లా విశ్వవిద్యాలయం సహకారం కూడా ఉంది. టి-హబ్ లక్ష్యం ఈ ప్రాంతంలోని కొత్త స్టార్టప్‌లకు ఆర్థిక, మార్గదర్శక సహకారంతో పాటు సహాయక వాతావరణాన్ని అందించడం.

ఐఐఐటి హైదరాబాద్ లోని చెరువు
ఐఐఐటి హైదరాబాద్ లో సూర్యాస్తమయం

హాస్టల్ మార్చు

ఐఐఐటి-హెచ్ కి ఐదు హాస్టల్ భవనాలు ఉన్నాయి:

  • పలాష్ నివాస్ (ఓల్డ్ బాయ్స్ హాస్టల్): మొదటి, రెండవ సంవత్సరం బి.టెక్‌, ఎం స్ ఐ టి కుర్రాళ్లకు, కేటాయించబడింది.  ఇది D, E బ్లాక్‌లుగా విభజించబడింది.  ఈ హాస్టల్ స్వంత మెస్సు కలిగి ఉంది.
  • న్యూ బాయ్స్ హాస్టల్ (ఎన్బిహెచ్): మూడవ, నాల్గవ సంవత్సరం విద్యార్థులకు కేటాయించబడింది ఈ హాస్టల్ స్వంత మెస్సు కలిగి ఉంది.
  • బకుల్ నివాస్: పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్‌డి విద్యార్థులకు కేటాయించబడింది.
  • పరిజాత్ నివాస్: మొదటి, రెండవ సంవత్సరం అమ్మాయిలకు కేటాయించబడింది.
  • న్యూ గర్ల్స్ హాస్టల్: మూడవ, నాల్గవ సంవత్సరం, ఎం స్ ఐ టి అమ్మాయిలకు కేటాయించబడింది.

విద్యార్థులందరికీ హాస్టల్ గదులు కల్పిస్తారు. బ్యాచిలర్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లో చేరిన మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు గదులు పంచుకోవలసి ఉంటుంది (డబుల్ ఆక్యుపెన్సీ) , అయితే మూడవ సంవత్సరం నుండి విద్యార్థులకు సింగిల్ ఆక్యుపెన్సీ ఉంటుంది. ఈ సంస్థలో నాలుగు ఎయిర్ కండిషన్డ్ సూట్లతో గెస్ట్ హౌస్ ఉంది. పురుషుల కోసం రెండు హాస్టళ్లు, మహిళలకు ఒకటి మొత్తం 1200 గదులు ఉన్నాయి. ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ క్యాంపస్‌లోని అన్ని భవనాలను హాస్టళ్లతో కలుపుతుంది.

ఆహార సౌకర్యాలు మార్చు

ఐఐఐటి-హెచ్ లో 4 రకాల మెస్ అందుబాటులో ఉన్నాయి :

  • సౌత్ మెస్
  • నార్త్ మెస్
  • కదంబ (శాఖాహారం/ మాంసాహారం)
  • యుక్తాహార్

ఈ మెస్ సౌకర్యాల తో పాటు క్యాంపస్ లో వివిధ కాంటీన్లు కూడా ఉన్నాయి. ఏ సమయం లో అయిన ఆహారం లభించేలా ఈ కాంటీన్ వ్యాసతిని రూపకల్పన చేసారు.

కార్యశాలలు మార్చు

  • IASNLP (ఐఐఐటి హైదరాబాద్ అడ్వాన్స్డ్ సమ్మర్ స్కూల్ ఆన్ NLP) ప్రతి సంవత్సరం రెండు వారాల పాటు జరుగుతుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన పరిశోధకులు పాఠాలు చెప్తారు.
  • రోబోక్యాంప్ అనేది జాతీయ స్థాయి వర్క్షాప్. దీనిని ఐఐఐటి హైదరాబాద్ రోబోటిక్స్ క్లబ్ నిర్వహిస్తుంది.
  • టెక్ ఈస్ అనే ఆవిష్కరణ, రూపకల్పన, వినియోగదారు అనుభవంపై విద్యార్థులు, నిపుణుల కోసం ఒక జాతీయ వర్క్‌షాప్.
  • ఆర్ అండ్ డి షోకేస్ అనేది ఇన్స్టిట్యూట్‌లో చేపట్టిన పరిశోధన పనులు, ప్రాజెక్టులను ప్రదర్శించే వేదిక.
  • ఎక్సోర్ (ఎక్సైట్మెంట్ ఆఫ్ రీసెర్చ్) విద్యార్థులను వృత్తిలో పరిశోధన చేయమని ప్రోత్సహిస్తుంది.

పరిశోధన కేంద్రాలు మార్చు

ఐఐఐటి హైదరాబాద్  విభాగాలకు విరుద్ధంగా పరిశోధనా కేంద్రాలు, ప్రయోగశాలల చుట్టూ నిర్మించబడింది. ప్రస్తుత పరిశోధనా కేంద్రాలు సాంకేతికతలు, డొమైన్‌లపై వారి పరిశోధన దృష్టి ఆధారంగా క్రింద ఇవ్వబడ్డాయి.

కలిపి మార్చు

కోహ్లీ సెంటర్ ఆన్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ (కెసిఐఎస్): విస్తృత ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ప్రాంతంలో పరిశోధన, బోధన, వ్యవస్థాపకతకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఫౌండేషన్ నిధులతో 2015 లో స్థాపించబడింది. అప్పటి నుండి, 3 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో ఇది తెలివైన వ్యవస్థలపై భారతదేశపు ప్రముఖ కేంద్రంగా అభివృద్ధి చెందింది.

టెక్నాలజీ మార్చు

  • సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్స్ రీసెర్చ్ సెంటర్
  • డేటా సైన్సెస్ అండ్ అనలిటిక్స్ సెంటర్
  • లాంగ్వేజ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్
  • రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్
  • సెంటర్ ఫర్ సెక్యూరిటీ, థియరీ అండ్ అల్గోరిథమ్స్
  • సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్
  • సెంటర్ ఫర్ విసువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  • సెంటర్ ఫర్ వి ఏల ఏస్ ఐ అండ్ ఎంబెడెడ్ స్య్స్తెంస్ టెక్నాలజీ
  • కంప్యూటర్ స్య్స్తెంస్ గ్రూప్
  • మెషిన్ లెర్నింగ్ ల్యాబ్

డొమైన్స్ మార్చు

  • ఐటి ఫర్ అగ్రికల్చరల్ అండ్ రురల్ డెవలప్మెంట్
  • సెంటర్ ఫర్ ఐటి ఇన్ బిల్డింగ్ సైన్స్
  • కొగ్నిటివ్ సైన్స్
  • సెంటర్ ఫర్ కంప్యూటేషనల్ నతురల్ సైన్సెస్ అండ్ బయోఇంఫార్మాటిక్స్
  • అర్త్క్వక ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్
  • సెంటర్ ఫర్ ఐటి ఇన్ ఎడ్యుకేషన్
  • హ్యూమన్ సైన్సెస్ రీసెర్చ్ గ్రూప
  • సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ లెర్నింగ్ సైన్స్
  • ల్యాబ్ ఫర్ స్పెషియల్ ఇన్ఫర్మాటిక్స్
  • రీసెర్చ్ సెంటర్ ఫర్ ఈగవర్నెన్స్

డెవలప్మెంట్ సెంటర్స్ మార్చు

  • సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రేప్రెన్యూఆర్షిప్
  • సెంటర్ ఫర్ ఓపెన్ సాఫ్ట్వేర్
  • హ్యూమన్ వాల్యూస్ సెల్

విద్యార్థుల జీవితం మార్చు

సుమారు 1800 మంది విద్యార్థులతో, ఐఐఐటి హైదరాబాద్లో  ప్రతి ఏడాది అనేక సాంస్కృతిక అథ్లెటిక్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. క్లబ్‌లలో క్విజ్ క్లబ్, లిటరరీ క్లబ్, మూవీ డిస్కషన్ క్లబ్, థియరీ రీడింగ్ క్లబ్, చెస్ క్లబ్, ఆస్ట్రానమీ క్లబ్, ఆర్ట్స్ సొసైటీ, క్యాంపస్ కనైన్ మేనేజ్‌మెంట్ సెల్ (సిసిసి), డ్రామాటిక్స్ క్లబ్, ప్రోగ్రామింగ్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్ , డాంస్ క్లబ్ ఉన్నాయి. విద్యార్థులు కళాశాలలో చేరిన తరువాత నాలుగు సమూహాలుగా (హౌస్) విభజించబడ్డారు: అగ్ని, ఆకాష్, పృథ్వీ, వాయు. అన్ని సాంస్కృతిక, క్రీడా పోటీలు వీటీ మధ్య జౌగుతాయి. విద్యార్థులు వారి హౌస్ అగ్రస్థానంలో నిలబెట్టడానికి పోటిపడుతారు.

పింగ్ మార్చు

విద్యార్థులు పింగ్! అనే స్వతంత్ర పత్రికని నడుపుతున్నారు. ఇందులో సృజనాత్మక రచన నుండి క్యాంపస్ సమస్యలపై జర్నలిస్టిక్ వ్యాసాలు వరకు వివిధ విషయాలు ఉంటాయి. ఇది 2009 లో స్థాపించబడింది. .

ఫెలిసిటీ మార్చు

ఫెలిసిటీ అనేది ఐఐఐటి యొక్క వార్షిక సాంస్కృతిక, టెక్ ఫెస్ట్. ఈ ఫెస్ట్ ప్రతి సంవత్సరం వసంత సెమిస్టర్ ప్రారంభంలో జరుగుతుంది. విద్యార్థులు ఈ ఫెస్ట్ కోసం సంవత్సరమంతా  ఎదురుచూస్తారు.

క్రీడలు మార్చు

ఈ సంస్థ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్న ఏవైనా కార్యకలాపాలు, నైపుణ్యాలలో రాణించడానికి తగిన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఐఐఐటిలో క్రికెట్, వాలీ బాల్, సాకర్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ మొదలైన వాటికి సౌకర్యాలు కల్పిస్తారు. బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్ వంటి ఇతర క్రీడా సౌకర్యాల కోసం విద్యార్థులు  సమీపంలోని స్టేడియంకి వెళ్తారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "NAAC IIIT-H Report". IIIT,Hyderabad. Retrieved 2021-02-26.
  2. "AICTE-Report". IIIT,Hyderabad. Retrieved 2021-02-26.
  3. 3.0 3.1 3.2 3.3 "NIRF report" (PDF). IIIT,Hyderabad. Retrieved 2021-02-26.
  4. "Hi-Tec City in Hyderabad shows Andhra Pradesh as most preferred destination for global majors". indiatoday. 30 November 1998. Retrieved 26 February 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "At a Glance | IIIT Hyderabad". www.iiit.ac.in. Retrieved 2020-05-19.
  6. "News Article". Archived from the original on 2018-09-07. Retrieved 2020-05-18.
  7. "Interview with Rajeev Sangal". Archived from the original on 2018-09-07. Retrieved 2020-05-18.
  8. "BRIEF BIO-DATA of Director of the Indian Institute of Technology (BHU)" (PDF). IIT BHU. Archived from the original (PDF) on 2018-09-28. Retrieved 2020-05-18.
  9. "Overview of IIIT-H as submitted to NIRF in 2019" (PDF). IIIT-H.{{cite web}}: CS1 maint: url-status (link)