ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (Indian Union Muslim League (IUML) (మలయాళం : ഇന്ത്യൻ യൂണിയൻ മുസ്ലിം ലീഗ്; ఉర్దూ: انڈین یونین مسلم لیگ) భారతీయ జాతీయ భావాలు గల ఒక ముస్లిం రాజకీయ పార్టీ. ఈ పార్టీకి ప్రధాన మైదానం కేరళ రాష్ట్రం.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
Chairpersonఇ. అహ్మద్
లోక్‌సభ నాయకుడుఇ.అహ్మద్
స్థాపన తేదీ1948
Preceded byఆల్ ఇండియా ముస్లిం లీగ్
ప్రధాన కార్యాలయంమరైకయార్ లబ్బాయి వీధి, చెన్నై, తమిళనాడు
పార్టీ పత్రికచంద్రిక
విద్యార్థి విభాగంAIMSF
యువత విభాగంముస్లిం యూత్ లీగ్
మహిళా విభాగంMWL
కార్మిక విభాగంSTU
International affiliationKMCC
ECI StatusState Party[1]
కూటమిUnited Democratic Front
లోక్‌సభ స్థానాలు
2 / 543
శాసన సభలో స్థానాలు
20 / 141
Election symbol
IUML Election Symbol
Website
indianunionmuslimleague.in

పార్టీ చరిత్ర మార్చు

ఈ పార్టీకి మూలాలు పాకిస్తాన్ ఆవిర్భావానికి తోడ్పడిన ముస్లిం లీగ్తో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ వేరుపడిన తరువాత, 1948 మార్చి 30 న "ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్" పార్టీ భారత్ లోని తమిళనాడులో స్థాపించబడింది. ఇది ప్రధానంగా కేరళ రాష్ట్రంలోని ఉత్తరప్రాంతాలు పట్టుగొమ్మలు. ఇతర ప్రాంతాలలోనూ అత్యల్పంగా ప్రాతినిధ్యమూ గలదు. ఉదాహరణకు తమిళనాడు, మహారాష్ట్రలు.

ఈ పార్టీ, ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు సాగిస్తూ తన మనుగడ సాధిస్తూ వస్తున్నది.

ప్రస్తుతం యూ.పీ.ఏ. ప్రభుత్వంలో భాగస్వామ్యం గలది. ఈ పార్టీకి చెందిన ఇ. అహ్మద్, కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కలిగి ఉన్నాడు. ఈ పార్టీకి చెందిన సి.హెచ్. ముహమ్మద్ కోయా 1979లో కేరళ ముఖ్యమంత్రిగానూ పనిచేశాడు.

ఈ పార్టీ ప్రతినిధులలో ఈ మధ్య మృతి చెందిన బన్నాత్ వాలా పార్లమెంటు సభ్యుడు ముఖ్యుడు.

దస్త్రం:C. H. Mohammed Koya.jpg
C.H.Mohammed Koya.

1980 ఎన్నికలు మార్చు

రెండు రాజకీయ ఫ్రంట్‌లు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లలో, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ విడిపోయి ఈ గ్రూపులలో 1980 ఎన్నికలలో పాల్గొన్నాయి. ఆల్ ఇండియా ముస్లింలీగ్ LDF తోనూ, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ UDF తోనూ చేరాయి. 1985 లో ఈ రెండు గ్రూపులూ మరలా ఏకమై ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పేరుతో UDF తో భాగస్వామ్యమయ్యాయి.

దస్త్రం:Banatwala.JPG
బనాత్ వాలా.
 
పానక్కడ్ షిహాబ్ తంగళ్.

సంస్థ వ్యవస్థ మార్చు

ఈ పార్టీ విద్యార్థి సంఘం "ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్" పేరుతో ఉంది. ఈ పార్టీకి మహిళా విభాగమూ "ముస్లిం వుమెన్స్ లీగ్" పేరుతో ఉంది. కేరళలో వేరువేరు ట్రేడ్‌యూనియన్లూ కలవు, "స్వతంత్ర తోజిలాలి యూనియన్" (S.T.U., Independent Workers Union),, రైతు సంఘాలు, స్వతంత్ర కర్షక సంఘం, న్యాయవాదుల ఫోరం, "KMCC" పేరుతో ఎక్స్‌పాట్రియేట్స్ సహాయకులూ ఉన్నారు.

పార్టీ నేటి స్థితి మార్చు

ఈ పార్టీ, ప్రస్తుత యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియెన్స్తో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. పార్టీ అధ్యక్షుడు ఇ. అహ్మద్, విదేశాంగ రాజ్యమంత్రి. (భారత్ స్వాతంత్ర్యం పొందిన తరువాత, ఈ పార్టీ నుండిప్రథమ మంత్రి). ఈ పార్టీ కేరళలో, "ముస్లింలీగ్ కేరళ స్టేట్ కమిటీ" అనే పేరుతో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందినది.

కేరళలో ఈ పార్టీకి చెందిన నలుగురు మంత్రులు, యూ.డీ.ఎఫ్. ప్రభుత్వంలో భాగస్వామ్యులు. ఖాదర్ మొహియుద్దీన్ (ఈ పార్టీ జాతీయ సెక్రటరీ) తమిళనాడులోని వేలూరు పార్లమెంటు సభ్యుడు (ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అభ్యర్థిగా). [1] Archived 2009-03-06 at the Wayback Machine

కేరళ రాష్ట్రమే కాకుండా, తమిళనాడులో ఈ పార్టీ "డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలియెన్స్"తో సంబంధాలు కలిగి ఉంది.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Archived from the original (PDF) on 24 అక్టోబరు 2013. Retrieved 9 May 2013.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు