ఇంద్రద్యుమ్నుడు

భరతుడు మరియు సునందల పుత్రుడు

ఇంద్రద్యుమ్నుడు (సంస్కృతం: इन्द्रद्युम्न, IAST: ఇంద్రద్యుమ్ను), మహాభారతం, పురాణాల ప్రకారం భరత, సునందల జన్మించిన కుమారుడు. ఒక మాలవ రాజు.సజ్జనలు వారికి ఇబ్బందులు ఉన్నాయని చింతించకుండా, పరిస్థితిని ఉపయోగించుకుని, తమకు, సమాజానికి మంచి చేస్తారు. పాండవులు ఆరణ్యవాసం చేసే సమయంలో అనేక అపూర్వ కార్యాలు చేశారు.వారిలో ధర్మరాజు గొప్ప రుషులు, మునులు,మహాపురుషుల ద్వారా విభిన్న విషయాలు తెలుసుకుంటాడు. ఆ సమయంలో ఒకరోజు పాండవులకు శ్రీ మార్కండేయ మహర్షి దర్శనం లభించింది.ధర్మరాజు యధా విధిగా మహర్షికి అతిథి సేవలు చేసిన తరువాత సజ్జనులైన పాండవుల ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చినందుకు మార్కండేయ మహర్షి తన దుంఖాన్ని వ్యక్తపరచి, ధర్మాన్ని అనుసరించడం కోసం ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీ రామచంద్రుడుని, నల దమయంతిల కథలను మహర్షి చెపుతాడు.

ధర్మరాజు సందేహం మార్చు

ధర్మరాజు తన అలవాటు ప్రకారం మార్కండేయ మహర్షిని “మహర్షి! నాకు తెలియని చిన్న సందేహం ఒకటుంది అని మహర్షిముందు సంశయంతో ఉండగా, దానికి మార్కండేయ మహర్షి “ఎవరైనా వారికి తెలియని విషయాలు మరొకరిని అడిగి తెలుసుకోవాలి. దయచేసి మీరు సంకోచపడకుండా ముందుకు సాగి మీ “ప్రజ్ఞ”ను అడగండి ” అని ధర్మరాజుతో అంటాడు.అప్పుడు ధర్మరాజు “నాకు తెలిసినంతవరకు మీరు మాత్రమే చిరంజీవ,మీరు కాక ఇంకెవరైనా ఉన్నారా? అని తన సందేహాన్ని మహర్షి  ముందు బయటపెడతాడు. అప్పుడు మహర్షి  చిరునవ్యుతో ఇంద్రద్యుమ్నుని కథను పాండవులకు వివరిస్తాడు.[1]

ఇంద్రద్యుమ్నుడుకు స్వర్గలోక ప్రాప్తి మార్చు

 
ఇంద్రద్యుమ్నుడు రధంపై పయనించు ఆయిల్ పెయింటింగ్ చిత్రం

ఇంద్రద్యుమ్నుడు తన రాజ్యపాలనలో అడిగినవారికి  అడిగినట్లు దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందాడు. లెక్కగట్టలేనన్ని గోదానాలు, భూ దానాలు, హిరణ్య దానాలు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్యసంపదను పొందాడు.అంతేకాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసాడు.అతని రాజ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా ప్రజారంజకంగా పాలన చేసాడు.ఇంద్రద్యుమ్నుడు ఎన్నో పుణ్యకార్యాలతో, దానధర్మాలతో చాలా కాలం రాజ్యపాలనచేసి మరణించాక అతని పుణ్యనిధి ప్రభావంతో దేవదూతలు వచ్చి సరాసరి స్వర్గలోకానికి తీసుకువెళతారు.[2]

కొన్ని సంవత్సరాలు గడిచేసరికి భూలోకంలో ఇంద్రద్యుమ్నుడు కీర్తి మాసిపోయి, ఆ పేరుగల రాజు ఒకప్పుడుండేవాడన్న సంగతి కూడా ప్రజలకు జ్ఞప్తి లేకుండా పోయింది.[3]

ఇంద్రద్యుమ్నుడును తిరిగి భూలోకానికి పంపుట మార్చు

మీరు ఇప్పటివరకు స్వర్గంలో గడిపిన కాలానికి భూలోకంలో మీరు చేసుకున్న పుణ్యానికి సరిపోయింది.ఇక మీరు ఇక్కడి ఉండటానికి అవకాశంలేదు.పుణ్యం చేసుకుంటే మళ్ళీ రావచ్చు అని చెపుతారు.[4] చెప్పిన మరుక్షణం ఇంద్రద్యుమ్ను నిలువనీయకుండా భూలోకానికి పంపించేశారు. ఇంద్రద్యుమ్నుడు పుణ్యశీలుడు కనుక మార్కండేయ మహర్షి దగ్గరకు వెళ్ళి. ‘మహర్షీ’ నన్ను దేవతలు భూలోకానికి పంపించేశారు. నా పుణ్యం అయిపోయిందన్నారు. నేను ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానో చూడండి. నాకేదైనా మీరే దీనికి పరిష్కార మార్గం చూపండి’ అని వేడుకుంటాడు. దానికి మార్కండేయ మహర్షి, ‘మహారాజా ఇది సృష్టి వైచిత్య్రం.మానవులకు కొంత కాలం వెలుగు, కొంత కాలం చీకటి ఉంటాయి.దీని కోసం మీరు బెంగపడవద్దు అని చెపుతాడు. అంతేకాక, ‘ఓ రాజా! ఈ లోకంలో మీ కీర్తి ఉన్నంతకాలం మీరు పుణ్యాత్ములే అవుతారు. మీరు చేసిన పుణ్యకార్యాలనుబట్టి యశో వంతులుగా మీ కీర్తిఉంటుంది.దిగులు పడకండి. మీరు చేసిన పుణ్య కార్యాల గురించి చెప్పుకోవడం వల్ల పుణ్యం రాదు. అసలీ భూలోకంలో ఎవరైనా, మీరు చేసిన ఏ పుణ్య కార్యఫలాన్నైనా అనుభవించిన వారు ఉన్నారేమో చూడాలి అన్నాడు.[4]

ఇంద్రద్యుమ్నుడు తిరిగి స్వర్గలోకానికి పయనం మార్చు

అప్పుడు ఇంద్రద్యుమ్నుడు మహర్షితో మీకన్నా ముందుపుట్టిన ప్రాణిని ఉంటే తెలుపవలసిందని కోరతాడు. హిమాలయ పర్వత ప్రాంతలో ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉందని చెప్పగా వెంటనే దాని వద్దకు చేరి “అయ్యా! నేను తేలుసునా? అని ప్రశ్నిస్తాడు.నీవెవరో నాకు తెలియదు అని చెప్పి “ఇక్కడికి కొన్ని యోజనాల దూరంలో ఇంద్రద్యుమ్నము అనే సరోవరముంది. ఆ సరోవరంలో నాడీజంఘమనే కొంగ ఉందని ప్రావారకర్ణం చెప్పగా, ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీజంఘుని వద్దకు చేరి “ఓ బకరాజా! నన్ను మీరు గుర్తుపట్టారా”? అని ప్రశ్నిస్తాడు. “లేదని చెప్పి ఈ సరోవరంలో ఆకూపారమనే తాబేలు ఉంది. అది నాకంటే పెద్దది. దానికి నీవు తెలుసేమో కనుక్కో” అని చెప్పింది.సరోవరంలోని తాబేలు ఇంద్రద్యుమ్నుని చూడగానే చెమ్మగిల్లిన కళ్లతో  “అయ్యా! వెయ్యి యజ్ఞాలు సాంగంగా చేసి, వెయ్యి యూపస్తంభాలు కట్టించావు. ఆ యజ్ఞదానాలలో లెక్కకట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానం ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి యింత సరోవరం అయింది. ఇది అంతా నీ చలవే” అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పింది. మరుక్షణం దేవతలు దివ్యవిమానంలో ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకొని వెళ్ళారని మహర్షి ఇంద్రద్యుమ్నుని కీర్తిని గురించి చెపుతాడు.[1]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 October 6, On; said, 2010 at 6:50 pm Uma Kant (2006-06-03). "Indradyumna's story". Moral Stories (in ఇంగ్లీష్). Retrieved 2020-07-13.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "పాప,పుణ్యాల అనుభవం ఎంత కాలం". TeluguOne Devotional (in english). 2020-07-13. Retrieved 2020-07-13.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. "ఇంద్రద్యుమ్నుడు". GVRK Prasad (in ఇంగ్లీష్). 2014-01-24. Retrieved 2020-07-13.
  4. 4.0 4.1 "కీర్తి ఉన్నంతవరకూ స్వర్గప్రాప్తి – Andhra Prabha Telugu Daily" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-13.[permanent dead link]

వెలుపలి లంకెలు మార్చు