ఇజాబెల్లె లైట్

బ్రెజిల్ దేశానికి చెందిన సినిమా నటి, మోడల్

ఇజాబెల్లె లైట్ ( 1990 సెప్టెంబరు 2)[1] బ్రెజిల్ దేశానికి చెందిన సినిమా నటి, మోడల్.[2] హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది.

ఇజాబెల్లె లైట్
Izabelle Leite.jpg
జననంఇజాబెల్లె డి ఫారియాస్
(1990-09-02) 1990 సెప్టెంబరు 2 (వయస్సు 31)
జోనో పెసోవా, పారాబా, బ్రెజిల్
వృత్తినటి, మోడల్

జీవిత విశేషాలుసవరించు

ఇజాబెల్లె లైట్ 1990, సెప్టెంబరు 2న బ్రెజిల్ దేశంలోని పారాబాలోని, జోనో పెసోవాలో జన్మించింది.

సినిమారంగంసవరించు

లాక్మే బ్యూటీ ప్రొడక్ట్స్, ప్రొక్టర్ & గాంబుల్, బిగ్ బజార్, పాకిస్తాన్ బ్రాండ్ నిషాత్ లినెన్‌ వంటి వస్తువుల ప్రచార చిత్రాలలో నటించింది.[3] 2012లో తలాష్: ది ఆన్సర్ లైస్ వితిన్ సినిమాతో బాలీవుడ్‌ సినిమారంగంలోకి అడుగుపెట్టిన ఇజాబెల్లె, 2013లో సిక్స్‌టీన్ సినిమాలో ప్రధానపాత్రలో నటించింది. 2014లో పురానీ జీన్స్ సినిమాలో నటించింది.[4] సిక్స్‌టీన్ చిత్రానికి ఉత్తమ తొలిచిత్ర నటిగా లైఫ్ ఓకే స్క్రీన్ అవార్డ్స్-2014కి నామినేట్ చేయబడింది.

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2012 తలాష్: ది ఆన్సర్ లైస్ వితిన్ వేశ్య హిందీ
2013 సిక్స్‌టీన్ అను హిందీ
2014 పురానీ జీన్స్ నయనతార సప్రు హిందీ
2018 నరేంద్ర తెలుగు
2019 మిస్టర్ మజ్ను మాధవి తెలుగు
2020 వరల్డ్ ఫేమస్ లవర్[5] ఇజ తెలుగు

ఇతర వివరాలుసవరించు

  1. ఇజాబెల్లె లైట్ భారత క్రికెటర్ విరాట్ కోహ్లితో కూడా డేటింగ్ చేసింది.[6][7]
  2. లాహోర్ మ్యూజిక్ వీడియోలో గురు రాంధవాతో కలిసి నటించింది. ఇది యూట్యూబ్‌లో 785 మిలియన్ వీక్షణలను చేరుకుంది.

మూలాలుసవరించు

  1. "Izabelle Leite". Twitter.
  2. "Archived copy". Archived from the original on 13 November 2013. Retrieved 3 March 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Izabelle Leite ~ Nishat Linen 2013 Ad/Commercial". MANJANPK. Archived from the original on 1 December 2017. Retrieved 7 March 2020.
  4. Bollywood Hungama. "Purani Jeans".
  5. The Hindu, Entertainment (10 February 2020). "'World Famous Lover has an incredible script and is nothing like Arjun Reddy', says Izabelle Leite". Y. Sunita Chowdhary. Archived from the original on 12 February 2020. Retrieved 7 March 2020.
  6. "Izabelle Leite reveals her past relationship with Virat Kohli".
  7. India Today, Movies (10 July 2019). "Is Arjun Reddy star Vijay Deverakonda dating Virat Kohli's ex Izabelle Leite? What we know". Archived from the original on 18 July 2019. Retrieved 7 March 2020.

ఇతర లంకెలుసవరించు