ఇటిక్యాల మండలం

తెలంగాణ, జోగులాంబ గద్వాల జిల్లా లోని మండలం

ఇటిక్యాల మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

ఇటిక్యాల
—  మండలం  —
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, ఇటిక్యాల స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, ఇటిక్యాల స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, ఇటిక్యాల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°04′26″N 77°51′10″E / 16.073919°N 77.852808°E / 16.073919; 77.852808
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ జిల్లా
మండల కేంద్రం ఇటిక్యాల
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 302 km² (116.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 52,926
 - పురుషులు 27,308
 - స్త్రీలు 25,618
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.10%
 - పురుషులు 55.60%
 - స్త్రీలు 25.84%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన గద్వాల నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.7 వ నెంబరు జాతీయ రహదారి నుంచి 6 కిలోమీటర్లు లోపలికి ఉంది.ఈ గ్రామానికి రైలు సౌకర్యం ఉంది. రైల్వే స్టేషను గ్రామానికి ఒక కిలోమీటర్ దూరం ఉంది. ఈ గ్రామానికి రవాణా సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.ఈ మండలంలో 22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం ఇటిక్యాల.

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం52,926 - పురుషులు27,308 - స్త్రీలు 25,618

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 302 చ.కి.మీ. కాగా, జనాభా 52,926. జనాభాలో పురుషులు 27,308 కాగా, స్త్రీల సంఖ్య 25,618. మండలంలో 11,734 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
 
తహశీల్దార్ కార్యాలయం , ఇటిక్యాల మండలం
  1. గోపాల్‌దిన్నె
  2. మొగిల్‌రావల్‌చెరువు
  3. కొండేరు
  4. తిమ్మాపూర్
  5. సాసనూలు
  6. పుటన్‌దొడ్డి
  7. మునగాల
  8. ఇటిక్యాల
  9. పెద్దదిన్నె
  10. ఉద్దండాపూర్
  11. సాతర్ల
  12. వావిలాల
  13. షాబాద్
  14. చాగాపూర్
  15. వేముల
  16. బట్లదిన్నె
  17. వల్లూరు
  18. ధర్మవరం
  19. బోచువీరాపూర్
  20. కర్పాకుల
  21. ఆర్ గార్లపాడ్
  22. బీచుపల్లి

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు