ఇదాలోకం 1973లో కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. శోభన్ బాబు, శారద జంటగా తీసిన ఈ చిత్రాన్ని ఆరు లక్షల పెట్టుబడితో నిర్మించారు.[1] ఈ సినిమాకు కె. చక్రవర్తి అందించిన సంగీతం బాగా విజయవంతమై ఆయనకు పేరు తెచ్చిపెట్టింది.[2] సినిమాలో జ్యోతిలక్ష్మి శృంగార నృత్యంతో చిత్రీకరించిన గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు పాట ప్రేక్షకాదరణ పొందడంతో తిరిగి అదే పాట రీమిక్సును 2009లో విడుదలైన కుబేరులు చిత్రంలో జ్యోతిలక్ష్మిపై తిరిగి చిత్రీకరించారు[3] ఈ సినిమా నిర్మాణంలో తండ్రి వద్ద సహాయదర్శకుడిగా, ఆ తరువాతి కాలంలో ప్రముఖ దర్శకుడైన కె.రాఘవేంద్రరావు పనిచేశాడు.[4]

ఇదా లోకం
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్. ప్రకాశరావు
నిర్మాణం వి.ఆర్.యాచేంద్ర (వెంకటగిరి రాజా)
తారాగణం శోభన్ బాబు,
శారద,
జ్యోతిలక్ష్మి
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
బి.వసంత
గీతరచన ఆరుద్ర,
ఆత్రేయ,
సి.నారాయణరెడ్డి
నిర్మాణ సంస్థ సమత చిత్ర
భాష తెలుగు
పెట్టుబడి 6 లక్షలు[1]
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

మార్చు
  • శోభన్ బాబు
  • శారద
  • ఆరతి
  • నాగభూషణం
  • చంద్రమోహన్
  • అల్లు రామలింగయ్య
  • రావు గోపాలరావు
  • జ్యోతిలక్ష్మి
  • ఏచూరి

పాటలు

మార్చు
  1. నిత్య సుమంగళి నీవమ్మా నీకు - ఘంటసాల, బి. వసంత - రచన: ఆచార్య ఆత్రేయ
  2. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు ... గుడి యెనక నా సామి గుఱ్ఱమెక్కి కూచున్నాడు - రచన: వీటూరి
  3. నీ మనసు నా మనసు ఏకమై - సి. నారాయణ రెడ్డి
  4. ఏటి గట్టున కూర్చుంటే
  5. ఓ..కోయిలా
  6. ఎందుకు నవ్వావంటే ఏమని చెప్పను - రచన: ఆరుద్ర

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-30. Retrieved 2009-10-01.
  2. http://www.indiaglitz.com/channels/telugu/article/33492.html
  3. http://www.indiaglitz.com/channels/telugu/article/43017.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-02-10. Retrieved 2009-10-01.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇదా_లోకం&oldid=4208463" నుండి వెలికితీశారు