ఇరుగు గిరిధర్, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. 1997లో వచ్చిన శుభ ముహూర్తం సినిమాకు దర్శకత్వం వహించాడు.[1]

ఇరుగు గిరిధర్
జననం(1957-05-21)1957 మే 21
మరణం2021 ఆగస్టు 1(2021-08-01) (వయసు 64)
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, నటుడు

గిరిధర్ 1957, మే 21న చిత్తూరు జిల్లా, పాకాల మండలం, ఇరంగారిపల్లెలో జన్మించాడు.[2]

సినిమారంగం

మార్చు

1982లో సినిమారంగానికి వచ్చిన గిరిధర్, తెలుగు దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈ.వి.వి.సత్యనారాయణ మొదలైన వారిదగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 1997లో వినోద్ కుమార్, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రలలో నటించిన శుభముహూర్తం చిత్రంతో దర్శకుడిగా మారాడు. తరువాత మళ్ళీ అన్నవరం, గుడుంబా శంకర్, 1 - నేనొక్కడినే, సుప్రీమ్, వరుడు వంటి సినిమాలకు కో డైరెక్టర్ గా పనిచేశాడు. ఎక్స్‌ప్రెస్ రాజా, 100% లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, సుప్రీమ్ వంటి దాదాపు ఇరవై సినిమాలలో నటించాడు.[3]

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయిన గిరిధర్, 2021 ఆగస్టు 1న తిరుపతిలోని తన నివాసంలో మరణించాడు.[4]

మూలాలు

మార్చు
  1. ఈనాడు, తిరుపతి (2 August 2021). "దర్శకుడు, నటుడు గిరిధర్‌ మృతి". EENADU. Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.
  2. సాక్షి, సినిమా (2 August 2021). "టాలీవుడ్‌ దర్శకుడు, నటుడు గిరిధర్‌ కన్నుమూత". Sakshi. Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.
  3. టివి9 తెలుగు, టాలీవుడ్ (2 August 2021). "టాలీవుడ్‏లో విషాదం.. అనారోగ్యంతో శుభముహూర్తం దర్శకుడు మృతి". TV9 Telugu. Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andrajyothy (2 August 2021). "టాలీవుడ్ డైరెక్టర్ మృతి". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.