ఇళ్ల వెంకటేశ్వరరావు

ఇళ్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తూర్పు గోదావరి -పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

ఐ.వి. రావు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2019 - 29 మార్చి 2025
నియోజకవర్గం తూర్పు గోదావరి -పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం

2007 - 2010
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
ఎమ్మెల్సీ
నియోజకవర్గం కృష్ణా జిల్లా -గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 15 ఏప్రిల్ 1961
అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్‌ సంస్థ)
తల్లిదండ్రులు నాగభూషణం, దుర్గమ్మ
జీవిత భాగస్వామి వెంకట లక్ష్మి

రాజకీయ జీవితం మార్చు

ఐ.వి. రావు మార్చి 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో తూర్పు గోదావరి -పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచాడు. ఈ ఎన్నికల్లో 46 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఆయన తన సమీప ప్రత్యర్థి నల్లమిల్లి శేషారెడ్డిపై 60,069 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్సీగా శాసనమండలికి ఎన్నికయ్యాడు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,93,794 ఓట్లు నమోదు కాగా 1,92,024 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెల్లని ఓట్లు 13,852 కాగా, మిగిలిన 1,78,172 ఓట్లలో పీడీఎఫ్‌ అభ్యర్థి ఇళ్ల వెంకటేశ్వరరావుకు 98,193 ఓట్లు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి 38,124 ఓట్లు దక్కించుకున్నారు. ఆయన 60,069 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

మూలాలు మార్చు

  1. Sakshi (28 March 2019). "పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇళ్ల వెంకటేశ్వరరావు ఘన విజయం..!". Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.