ఈతచెట్టు పుష్పించే మొక్కలలో పామ్ కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'. ఈ చెట్టును పండ్లు కోసం పెంచుతారు. వీటి నుండి కల్లు తీస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు.

ఈత చెట్టు

ఈత చెట్టు ఖర్జూర చెట్టు చూడడానికి ఓకే లాగా ఉంటాయి.ఆకులు కాండం వేర్లు మొదలైనవన్నీ కూడా ఖర్జూర ఈత చెట్టు ఒకే విధంగా ఉంటాయి.ఈతాకుల చివరలో సూది వంటి సన్నని ముళ్లుంటాయి ఇవి పశువుల నుండి రక్షణగా ఉంటాయి.ఈత పండ్లు కొద్దిగా వగరు, తీపి కలిపిన రుచిగా కలిగి ఉంటాయి.ఈత చెట్టు నుండి ఈతకల్లు,బెల్లం తయారు చేస్తారు

ఈత కాయల గెల

లక్షణాలుసవరించు

ఈత చెట్టు సుమారు 4 నుండి 15 మీటర్ల ఎత్తు పెరిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని ఆకులు సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి.ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో కలిగివుంటాయి.[1]

ఉపయోగాలుసవరించు

  • ఈతచెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
  • ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.
  • ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెంగాల్ లో వీటినుండి బెల్లం తయారౌతుంది.

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

  1. Riffle, Robert L. and Craft, Paul (2003) An Encyclopedia of Cultivated Palms. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈత_చెట్టు&oldid=3388775" నుండి వెలికితీశారు