ప్రధాన మెనూను తెరువు

ఉచ్చారణ అనేది ఒక పదాన్ని గానీ భాషను గానీ మాట్లాడే విధానాన్ని, లేదా ఎవరైనా ఒక పదాన్ని పలికే పద్ధతిని సూచిస్తుంది. ఎవరైనా ఇది "సరైన ఉచ్చారణ" అన్నారంటే, అది ఒక నిర్దిష్టమైన మాండలికంలో ఉన్న పై రెండు విధానాలను సూచిస్తుంది.

ఒకే పదాన్ని వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు సముదాయాలు, ఎన్నో అంశాలను బట్టి, ఉదాహరణకు: వాళ్ళు పెరిగిన ప్రదేశాన్ని బట్టి, వాళ్ళు ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశాన్ని బట్టి, వారి మాటలు లేదా స్వరంలోని అవకతవకలను[1]బట్టి, వారి జాతి సముదాయం, సామాజిక అంతస్తు, లేదా వాళ్ళ యొక్క విద్యార్హతలను[2] బట్టి, వైవిద్యంగా పలికే అవకాశం ఉంటుంది.

భాషా సంబంధ పరిభాషసవరించు

వారి వారి భాషల్లో ఉపయోగించే అక్షరాలను శబ్ద (భాషా ధ్వని) ప్రమాణాలుగా లెక్కిస్తారు. భాష యొక్క ఈ శబ్ద ప్రమాణాలను అధ్యయనం చేసే శాఖను ఫోనెటిక్స్ అంటారు. ఇలాంటి విధినే నిర్వర్తించే భాషా సంబంధ ధ్వనులను కూర్చి, తరగతులుగా విభజించి వాటిని ఫోనెమ్స్‌గా పిలుస్తారు; ఈ అధ్యయనాన్ని ఫోనెమిక్స్ లేదా ఫోన్‍మాటిక్స్ లేదా ఫోనాలజీ అంటారు. స్పష్టమైన ఉచ్చారణలోని భాగాలైన ఈ భాషా ధ్వనులను సాధారణంగా ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అల్ఫాబెట్ (IPA)[3] ను ఉపయోగించి వివరిస్తారు.

వీటిని కూడా చూడండిసవరించు

  • Wikipedia:IPA for English — వికీపీడియా శీర్షికలలోని ఆంగ్ల పదాల యొక్క ఉచ్చారణను ప్రతిలిఖించడానికి ఉపయోగించే ప్రధానమైన మీట
  • Wikipedia:Pronunciation respelling key — ఆంగ్ల లేఖన శాస్త్రాన్ని ఉచ్ఛారణలో అనుకరించే ద్వితీయ ప్రాధాన్యత గల మీట
  • Wikipedia:United States dictionary transcription — సంప్రదాయ యూఎస్ నిఘంటువుల వాడుకదార్లకు సుపరిచితమైన మరో మీట

సూచనలుసవరించు

  1. Beech, John R.; Harding, Leonora; Hilton-Jones, Diana (1993). Assessment in speech and language therapy. CUP Archive. p. 55. ISBN 0415078822.CS1 maint: multiple names: authors list (link)
  2. Labov, William (2003). "Some Sociolinguistic Principles". In Paulston, Christina Bratt; Tucker, G. Richard (సంపాదకుడు.). Sociolinguistics: the essential readings. Wiley-Blackwell. pp. 234–250. ISBN 0631227172.CS1 maint: multiple names: editors list (link)
  3. Schultz, Tanja; Kirchhoff, Katrin (2008). Multilingual speech processing. Academic Press. p. 12. ISBN 0120885018.CS1 maint: multiple names: authors list (link)

బయటి లంకెలుసవరించు

  • ఫోర్వో — ప్రాంతీయ వక్తలు ఉచ్చరించే ప్రపంచంలోని సమస్త పదాలు. ఫోర్వో కూడా చూడండి.
  • ఇనోగోలో — అమెరికా ఆంగ్ల శబ్దోచ్చారణ గైడ్
  • సౌండ్స్ ఫెమిలియర్? — యూకే ప్రాంతానికి చెందిన ప్రాంతీయ భాషోచ్చారణలకు, మాండలికాలకు సంబంధించిన ఉదాహరణలను బ్రిటిష్ లైబ్రరీ యొక్క ’సౌండ్స్ ఫెమిలియర్’ వెబ్ సైట్‍లో వినండి
  • హౌజ్‍సే — ఏదైనా పదాన్ని వినడానికి ఎంటర్ చేయండి. బ్రిటిష్ ఆంగ్లంలోని దాదాపు 100,000 పదాలు ప్రత్యామ్నాయ ఉచ్చారణలతో.

మూస:Linguistics-stub

"https://te.wikipedia.org/w/index.php?title=ఉచ్ఛారణ&oldid=1512208" నుండి వెలికితీశారు