ఉత్తరాషాఢ నక్షత్రము

Uttarashada okatava paadham dhanassu raasi

ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలాఅలా ఎదుగుకొనుచు పైపైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరిఁకెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువఁగా మాట్లాడెదరు, అణకువ కలిఁగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుఁగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుండఁదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నచ్చుకొనెదరు. కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకా నొకప్పుడు వీరు నేరప్రవృత్తి అయిన నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి, బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పేటందుకు సరి అయిన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు నిజం చెప్పారు. పై చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మంచిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, థన సహాయాన్ని చేస్తారు. తెలిసిన వారికి కూడా వీరు అప్పు కూడా ఇవ్వరు. ఆర్థికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు.ఉత్తరాషాఢ నక్షత్రపు అధిదేవత - విశ్వదేవుళ్ళు .వీరు మొత్తం పది మంది అన్నఁదమ్ముళ్ళు. వారు - వసు, సత్య, క్రతు, దక్ష, కాళ, కామ, ధ్రితి, కురు, పురురవ, మాద్రవ.

నక్షత్రములలో ఇది 21వ నక్షత్రం.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు చెట్టు నాడి పిట్ట అధిదేవత రాశి
ఉత్తరాషాఢ రవి మానవ పురుష ముంగిస పనస అంత్య విశ్వేదేవతలు 1, పాదం ధనసు, 2, 3, 4పాదాలు మకరం

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల నక్షత్రపు ఫలములు

మార్చు
నక్షత్రపు పేరు నక్షత్రములు ఫలం
పుట్టిన నక్షత్రము కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ ఒంటికి శ్రమ
సంపత్తు నక్షత్రము రోహిణి, హస్త, శ్రవణం డబ్బుల లాభం
ముంపు తెచ్చు నక్షత్రము మృగశిర, చిత్త, ధనిష్ఠ పనికి చేఁటు
సంపత్తు నక్షత్రములు ఆరుద్ర, స్వాతి, శతభిష బాగు
వేఱైన నక్షత్రములు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ప్రయత్నము పాడు అగుట
సాధన నక్షత్రములు పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర పని నెఱవేరుట, మంచిది
నైత్య నక్షత్రములు ఆశ్లేష, జ్యేష్ట, రేవతి బంధనం
వీరితో బాగా పడిన నక్షత్రములు అశ్విని, మఖ, మూల హాయి
మిక్కిలి బాగా పడిన నక్షత్రములు భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ హాయి, కలిసి వచ్చును

ఉత్తరాషాఢ నక్షత్రం నవాంశ

మార్చు
  • 1వ పాదము - ధనస్సు రాశి (ధనుర్రాశి) .
  • 2వ పాదము - మకర రాశి.
  • 3వ పాదము - మకర రాశి.
  • 4వ పాదము - మకర రాశి.

బొమ్మల పేర్పు

మార్చు

తక్కిన ఒనరులు,

మార్చు