ఉదయగిరి కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలం,ఉదయగిరిలో ఉంది. ఇది నెల్లూరుకు సుమారు వంద మైళ్ల దూరంలో ఉంది.

ఉదయగిరి కోట


చరిత్ర మార్చు

నెల్లూరు జిల్లాలో వున్న ఈ ఉదయగిరి కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, రావెళ్ల కమ్మ నాయకులు, ఢిల్లీ సుల్తానులు దీనిని పాలించిరి. విజయనగర రాజుల కాలంలో రావెళ్ల కమ్మ నాయకులు పాలించిరి. చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి. చోళుల తర్వాత పల్లవ రాజులు పాలించారని జయదేవుని శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. 1235 వ సంవత్సరంలో ఈ ప్రాంతం కాకతీయుల వశమైంది. కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి శాసనం ప్రకారం ఈ దుర్గాన్ని కాకతీయ రాజైన గణపతి దేవుడు పాలించాడని తెలుస్తున్నది. 1343 నాటికి ఈ ప్రాంతాన్ని జయంచాడు. పోరు మామిళ్ల శాసనాన్ని బట్టి కడప మండలమంతా ఉదయగిరి పాలనకింద వున్నట్లు తెలుస్తుంది. 1471 నుండి 1488 వరకు ఈ దుర్గం విజయ నగర రాజుల ఆధీనంలో ఉండేదని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తున్నది. శ్రీకృష్ణదేవరాయలు 1514 వ సంవత్సరంలో జూన్ 9 న ఈ దుర్గాన్ని వశపరచు కున్నాడని చారిత్రకాధారం. 1540 వ సంవత్సరంలో రాయల అల్లుడు అశీయ రామ రాయలు ఉదయగిరి పాలకుడయ్యాడు. 1579 లో గోల్కొండ సేనాని ముల్కు ఉదయగిరిని ముట్టడించారని తెలుస్తున్నది. ఆ విధంగా ఉదయగిరి గోల్కొండ నవాబుల వశమైంది. ఆ తర్వాత ఢిల్లీ చక్రవర్తుల సేనాని మీర్ జుమ్లా దీన్ని 1626 లో వశపరచుకొని అక్కడ అనేక మసీదులను నిర్మించి స్థానికంగా వుండే ఒకరికి ఆదిపత్యాన్నిచ్చి ఢిల్లీ వెళ్లి పోయాడని చరిత్ర చెపుతున్నది. ముస్లిం పాలకులలో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఈ దుర్గాన్ని పాలించాడు. అతను వాడిన ఖడ్గం ఈ నాటికీ ఉదయగిరిలో ఉంది. ఆ తర్వాత ఈ దుర్గం ఆంగ్లేయుల వశమైంది. ఆంగ్లేయుల పాలనలో డైకన్ దొర కలెక్టరుగా వున్నప్పుడు రాజ మహల్ సమీపంలో అద్దాల మేడను ఇంకా అనేక భవనాలను నిర్మించాడు. ఇలా అనేక రాజులు పాలించిన ఈ ఉదయగిరి దుర్గంలో ఆయా రాజుల కాలంలో నిర్మించిన అనేక కట్టడాలు ఆలయాలు, మసీదులు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు