ఉమామహేశ్వరి సంస్కృత హరికథ కళాకారిణి.[1]

జననం మార్చు

ఉమామహేశ్వరి సంగీత విద్యాంసుల కుటుంబంలో 1965లో జన్మించింది.

కళారంగం మార్చు

చిన్నతనంలోనే కర్నాటక సంగీతం అభ్యసించిన ఉమామహేశ్వరి, హరికథపై అభిరుచిని పెంచుకుంది. 1975లో తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురంలోని శ్రీసర్వారాయ హరికథా పాఠశాలలో చేరి సంగీత నాట్యాలతో పాటు సంస్కృతమూ అభ్యసించింది.

1985 నవంబరు 26న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో జరిగిన కాళిదాసు జయంతి మహా సభలలో ప్రసిద్ధ సంస్కృత పండితుల సమక్షంలో ఉమామహేశ్వరి కాళిదాసు కుమార సంభవాన్ని సంస్కృత హరికథ గానం చేసింది. ఈమె పాండిత్యానికి కాళిదాస అకాడమి ప్రియపాత్రమైంది. నాటి నుంచి ఉమామహేశ్వరి ఆరేళ్ల పాటు వరుసగా కాళిదాసు కావ్య నాటకాలను అకాడమిలో హరికథలుగా ప్రదర్శించింది.

ఉమామహేశ్వరి సంస్కృత కీర్తలను ప్రముఖ సంగీత విద్యాంసులు నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు రచించేవాడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంకి పొట్టి శ్రీరాములుపై హరికథ, రామకృష్ణ మిషన్కి రామకృష్ణ పరమహంస పై హరికథ రచించింది.

హరికథా ప్రదర్శనలు మార్చు

సత్కారాలు - గుర్తింపులు మార్చు

మూలాలు మార్చు

  1. దామెర, వేంకట సూర్యారావు. విశిష్ట తెలుగు మహిళలు. రీమ్ పబ్లికేషన్స్. p. 204. ISBN 978-81-8351-2824.