ఉర్దూ షాయిరి

షాయిరి ఉర్దూ, పంజాబీ, హిందీ భాషలలో 'షాయిరి' లేక కవిత్వం ప్రధానంగా షేర్ లేక రెండు పంక్తుల కవితలపై ఆధారపడి వుంటుంది. షేర్ కు బహువచనము 'అషార్'. నజమ్ లేక గజల్ అషార్ లపై ఆధారపడివుంటుంది, ప్రతి షేర్ సంపూర్ణమయిన సారాంశాన్ని కలిగి వుంటుంది. నజమ్ లోని ప్రతి షేర్ ఒకే అంశంపై వర్ణింపబడివుంటుంది. గజల్ లో ప్రతి షేర్ స్వంతసారాంశాన్ని గలిగివుంటుంది.

షేర్సవరించు

చూడుము షేర్

బైత్సవరించు

షేర్ కు ఇంకొక నామము 'బైత్', షేర్-ఒ-షాయిరికి మరో పేరు బైత్-బాజి

బైతుల్ గజల్సవరించు

గజల్ లోని ఉన్నత ప్రామాణికాలు గల షేర్ ను 'బైతుల్ గజల్' అంటారు.

గజల్సవరించు

చూడుము గజల్

ఫర్ద్సవరించు

షాయిరీలో కేవలం ఒకే 'షేర్' ను రచిస్తే దాన్ని 'ఫర్ద్' అని అంటారు.

హమ్ద్సవరించు

చూడుము హమ్ద్

హజల్సవరించు

హాస్యభరితమయిన కవితను 'హజల్' అని అంటారు.

హిజ్వ్సవరించు

ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వ్రాయబడ్డ కవిత 'హిజ్వ్'. చక్కగా చెప్పాలంటే 'మద్దాహ్' కు వ్యతిరేకం ఈ 'హిజ్వ్'. నిజంచెప్పాలంటే హిజ్వ్ వ్రాసే కవులు బహు అరుదు.

హుస్న్-ఎ-మత్లాసవరించు

ఒక గజల్ లో ఒక మత్లా తరువాత ఇంకో మత్లా రచిస్తే, ఈ రెండవ మత్లాను 'హుస్న్-ఎ-మత్లా' అంటారు..

మద్దాహ్సవరించు

రాజులు, పోషకులు గూర్చి శ్లాఘిస్తూ వ్రాసే కవితలను 'మద్దాహ్' అని అంటారు.

మన్ ఖబత్సవరించు

మహమ్మదు ప్రవక్త గారి వంశం, వారి సంతానాన్ని లేదా ఔలియాలను స్తుతిస్తూ, పొగుడ్తూ వ్రాయబడ్డ కవిత.

 
ముహమ్మద్ ప్రవక్త సమాధి కల మస్జిదె నబవి

మఖ్ తాసవరించు

చూడుము మఖ్ తా

మర్సియాసవరించు

చూడుము మర్సియా

మస్నవిసవరించు

చూడుము మస్నవి

మత్లాసవరించు

గజల్ లోని మొదటి షేర్ను 'మత్లా' అని అంటారు.

మిస్రాసవరించు

షేర్ లోని ఒక పంక్తిని 'మిస్రా' అని అంటారు.

చూడుము మిస్రా

మునాజాత్సవరించు

ఈశ్వరున్ని (అల్లాహ్) ను స్తుతిస్తూ, ప్రార్థిస్తూ పాడే కవిత (లు) . ముఖ్యంగా ఇవి 'ప్రార్థనలు'.

ముసద్దస్సవరించు

ఆరు మిస్రాలు గల కవితలను 'ముసద్దస్' అంటారు. ముసద్దస్ వ్రాయడంలో అల్తాఫ్ హుసేన్ హాలి ప్రసిధ్ధుడు.

నాత్సవరించు

చూడుము నాత్

నజమ్సవరించు

సాహిత్యంలో నజమ్ అనగా పద్యం లేక కవిత. కవిత ఒక అంశంపై గాని ఒక ఆలోచనపై గాని రచింపబడి వుంటుంది.

ఖాఫియాసవరించు

చూడుము ఖాఫియా

ఖసీదాసవరించు

కీర్తిస్తూ రచింపబడ్డ కవితను 'ఖసీదా' అంటారు.

చూడుము ఖసీదా

ఖతాసవరించు

రెండు అషార్ ల కవితను ఖతా అని అంటారు.

రదీఫ్సవరించు

చూడుము రదీఫ్

రుబాయిసవరించు

చూడుము రుబాయి

సలామ్సవరించు

మహమ్మదు ప్రవక్త, హుసేన్ ఇబ్న్ అలీ, ఇతర ఔలియా లను శ్లాఘిస్తూ సమర్పించే వందనాన్ని సలామ్ అంటారు.

సెహ్రాసవరించు

వివాహ సందర్భాలలో చదివే గేయాలను, పాటలను, కవితలను సెహ్రా అని అంటారు.

షెహ్ర్-ఎ-ఆషూబ్సవరించు

పాడుబడ్డ నగరం గురించి వ్రాసే కవితలను షెహ్ర్-ఎ-ఆషూబ్ అని అంటారు.

తహ్-తుల్-లఫ్జ్సవరించు

కవితలను 'రాగయుక్తంగా' గాక 'సాదా' గా వినిపించడాన్ని 'తహ్-తుల్-లఫ్జ్' అని అంటారు.

తఖల్లుస్సవరించు

కవులు తమ కవితలలో ఉపయోగించే 'కలం పేరు' లను తఖల్లుస్ అంటారు.

తరన్నుమ్సవరించు

కవితను 'రాగయుక్తం' గా పాడడాన్ని 'తరన్నుమ్' అంటారు.

వాసోఖ్త్సవరించు

బేజారు పడడాన్ని 'వాసోఖ్త్' అని అంటారు. విరక్తి చెంది వ్రాసే కవితలు, ప్రేమించినవారిపట్ల ఏహ్యతాభావాలు ఏర్పడినపుడు వ్రాసే కవితలను 'వాసోఖ్త్' అని అంటారు.

గీత్సవరించు

పాట, గీతం లేక నేపథ్యం

ముషాయిరాసవరించు

కవిసమ్మేళనము. చూడుము ముషాయిరా

ఖవ్వాలీసవరించు

ఖౌల్ అనే పదం నుండి ఉద్భవించిన పదం ఈ ఖవ్వాలి. ఖౌల్ అనగా సద్వచనం. సద్వచనాలు గల గీతాలాపనను ఖవ్వాలీ అంటారు. ఖవ్వాలీ గీతాలాపన చేసేవారిని ఖవ్వాల్ అని అంటారు. ఖవ్వాలీలలో సాధారణంగా హమ్ద్, నాత్, మన్ ఖబత్, గజల్లు వుంటాయి.