ఊరికి మొనగాడు (1981 సినిమా)

ఇది 1981లో విడుదలైన తెలుగు సినిమా. చాలా తెలుగు సినిమాలలాంటి కథే అయినా కథనంలో ఉన్న పట్టు వల్ల సినిమా బాగా విజయవంతమయ్యింది. ఒక ఇంజినీరు (కృష్ణ) పల్లెటూళ్ళో ప్రాజెక్టు కట్టడానికి వచ్చి ఒక కామందు (రావుగోపాలరావు) ఇంటితో పరిచయం ఏర్పరచుకొంటాడు. ఇంతకూ ఆ కామందు ఆ ఇంజినీరు మేనమామే. మేనమామ కూతురు (జయప్రద)తో ఇంజినీరు ప్రేమలో పడతాడు. తరువాత పతాక సన్నివేశాలలో మామకు బుద్ధి చెప్పి, అతను తన కుటుంబానికి చేసిన అన్యాయాన్ని ఒప్పిస్తాడు. మధ్యలో కథానాయకుడు వరద బాధితులకు సహాయం చేసే సన్నివేశాలలో అంతకు కొద్ది కాలం క్రితమే ఆంధ్ర ప్రదేశ్‌లో వచ్చిన వరదల నుండి నిజమైన సన్నివేశాలు చూపించారు. మంచి హుషారుగా సాగే "ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు" పాటలో కృష్ణ, జయ ప్రద స్టెప్పులు అచ్చం స్కూలులో డ్రిల్లు చేస్తున్నట్లుగా ఉంటాయి. కృష్ణ నటనను, డాన్సును మిమిక్రీ చేసే కళాకారులు ఎన్నుకొనే సీనులలో ఈ పాటకు చెందిన స్టెప్పులు తరచు ఉంటుంటాయి.

ఊరికి మొనగాడు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్ర రావు
తారాగణం కృష్ణ,
జయప్రద,
రావుగోపాలరావు
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
నిర్మాణ సంస్థ విశ్వచిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

పాటలు మార్చు

  1. బూజం బంతి బూజంబంతి, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  2. కదలిరండి మనుషులైతే, రచన: ఆరుద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  3. ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల
  4. అందాలజవ్వని మందార, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  5. మొగ్గ పిందే , రచన :వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  6. ఎర్ర తోలు , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల.