ఎటపాక రెవెన్యూ డివిజను
ఎటపాక రెవెన్యూ డివిజను, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 4 మండలాలు ఉన్నాయి. ఎటపాక పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1]
ఎటపాక రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పుగోదావరి |
ప్రధాన కార్యాలయం | ఎటపాక |
మండలాల సంఖ్య | 4 |
చరిత్ర
మార్చు2014 లో తెలంగాణ విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన ఖమ్మం జిల్లాలోని నాలుగు రెవెన్యూ మండలాలు ఎటపాక, కూనవరం, చింతూరు, వర రామచంద్రపురం మండలాలతో తూర్పుగోదావరి జిల్లాలో ఎటపాక కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో భాగంగా ఉన్న ఎటపాకను మండల కేంద్రంగా అప్‌గ్రేడ్ చేసారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కాకినాడ, పెద్దాపురం, రామచంద్రాపురం, అమలాపురం, రాజమండ్రి, రంపచోడవరం డివిజన్లు ఉండడంతో దీంతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఏడుకు చేరింది.[1]
పరిపాలన
మార్చుఎటపాక రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక రెవెన్యూ విభాగం. జిల్లాలోని 7 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలన పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. ఎటపాక పట్ణణం, ఈ డివిజనుకు కేంద్రం.
డివిజను లోని మండలాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "East Godavari district gets new revenue division - The Hindu". web.archive.org. 2022-09-07. Archived from the original on 2022-09-07. Retrieved 2022-09-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)