ఎన్. అమర్‌నాథ్ రెడ్డి
నూతన కాల్వ అమర్‌నాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2017 నుండి 2019 వరకు రాష్ట్ర పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్, కామర్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రిగా పని చేశాడు.
ఎన్. అమర్‌నాథ్ రెడ్డి | |||
| |||
మాజీ పరిశ్రమల శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 - 2019 | |||
నియోజకవర్గం | పలమనేరు నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 2 జులై 1960 వీరపల్లె, పెద్దపంజాణి మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | నూతన కాల్వ రామకృష్ణారెడ్డి, తాయారమ్మ | ||
జీవిత భాగస్వామి | రేణుకా రెడ్డి | ||
సంతానం | ప్రసేన్‌రెడ్డి | ||
నివాసం | లింగాయత్ వీధి, పలమనేరు, చిత్తూరు జిల్లా |
జననం, విద్యాభాస్యం
మార్చుఎన్. అమర్‌నాథ్ రెడ్డి 2 జులై 1960లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, పెద్దపంజాణి మండలం, వీరపల్లె గ్రామంలో ఎన్ రామకృష్ణారెడ్డి, తాయారమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1980లో బికాం పూర్తి చేశాడు.[1][2]
రాజకీయ జీవితం
మార్చుఎన్. అమర్‌నాథ్ రెడ్డి తన తండ్రి నూతన కాల్వ రామకృష్ణ రెడ్డి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన వీరప్పల్లె గ్రామా సర్పంచ్‌గా రెండుసార్లు పని చేసి 1996లో పుంగనూరు నియోజకవర్గంకి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలై, 2004లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన డీసీసీబీ ఛైర్మన్‌గా, టీడీపీ పార్టీలో తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడిగా, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు.
ఎన్. అమర్‌నాథ్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.ఆయన రాష్ట్ర విభజన అనంతరం 2012లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[4] అమర్‌నాథ్ రెడ్డి 17 జూన్ 2016లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడి టీడీపీలో చేరాడు.[5] ఆయన 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా 2 ఏప్రిల్ 2017న పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్, కామర్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[6] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్. వెంకట గౌడ చేతిలో ఓడిపోయాడు.
మూలాలు
మార్చు- ↑ Andrabhoomi (3 April 2017). "కొత్త మంత్రుల పుట్టుపూర్వోత్తరాలు". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Suryaa (3 April 2017). "ఏపీ మంత్రివర్గంలో కొత్త వారి వ్యక్తిగత వివరాలు". Archived from the original on 2017-04-05. Retrieved 10 December 2021.
- ↑ eETV Bharat News (30 January 2021). "జమిందారీ పాలన.. జనం ఆదరణ". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Sakshi (17 June 2016). "టీడీపీలోకి పలమనేరు ఎమ్మెల్యే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Asianet News (2 April 2017). "ఇవీ ఆంధ్రా కొత్త మంత్రుల శాఖలు". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.