ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
(ఎన్. టి. ఆర్. జాతీయ అవార్డు నుండి దారిమార్పు చెందింది)
ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది.[1] [2] 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పురస్కారం గౌరవ నంది పురస్కారం. ఈ పురస్కారం భారతీయ సినిమా నటులు, దర్శకులు, నిర్మాత, రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారి గౌరవార్థం యివ్వబడుతుంది. ఈ పురస్కారం నకు నగదుగా రూ. 500,000, మెమెంటో యివ్వబడుతుంది.[2][3]
ఎన్టీఆర్ పురస్కార విజేతలు
మార్చు- 1996: అక్కినేని నాగేశ్వరరావు
- 1997: దిలీప్ కుమార్
- 1998: శివాజీ గణేషన్
- 1999: లతామంగేష్కర్
- 2000: భానుమతి రామకృష్ణ
- 2001: హృషీకేశ్ ముఖర్జీ
- 2002: రాజ్‌కుమార్
- 2003: ఘట్టమనేని కృష్ణ[4]
- 2004:ఇళయరాజా[4]
- 2005: నూతన ప్రసాద్, అంబరీష్ [4]
- 2006: వహీదా రెహ్మాన్
- 2007: దాసరి నారాయణరావు, టి. భైరప్ప[5]
- 2008: జమున
- 2009: బి.సరోజాదేవి
- 2010: శారద
- 2011: అమితాబ్ బచ్చన్
- 2012: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- 2013: హేమా మాలిని [6]
- 2014: కమల్ హాసన్
- 2015: కె. రాఘవేంద్రరావు
- 2016: రజినీకాంత్
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "NTR National Award from 2003 to 2006".
- ↑ 2.0 2.1 "Governor gives away NTR awards". The Hindu. Archived from the original on 2010-02-16. Retrieved 2017-04-27.
- ↑ "Amitabh Bachchan receives NTR National film award". The Times of India.
- ↑ 4.0 4.1 4.2 "Ilayaraja, Ambarish, Krishna get NTR award". Hyderabad: The Hindu, Business Line. 30 Aug 2007. Retrieved 4 Jan 2012.
- ↑ "T Bhyrappa given NTR literary award". Online Webpage of The Hindu. Chennai, India: The Hindu. 29 May 2007. Archived from the original on 13 డిసెంబరు 2007. Retrieved 22 June 2007.
- ↑ Correspondent, Special. "S.P. Balasubrahmanyam, Hema Malini bag NTR awards".