ఎల్.బి. నగర్ అండర్ పాస్

ఎల్.బి. నగర్ అండర్ పాస్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్‌ మండలంలోని ఎల్.బి. నగర్ చౌరస్తాలో ఉన్న అండర్ పాస్. ఎల్.బి నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చౌరస్తాకి కుడివైపున 40 కోట్ల రూపాయలతో ఈ అండర్ పాస్ నిర్మించబడింది.[1][2]

ఎల్.బి. నగర్ అండర్ పాస్
LB Nagar Underpass and Bairamalguda PlyOver Inaguration by Minister KTR.jpg
ఎల్.బి. నగర్ అండర్ పాస్ ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్
మార్గ సమాచారం
Existed16 మార్చి 2022–present
ప్రదేశము
Statesతెలంగాణ

ప్రారంభం

మార్చు

2022 మార్చి 16న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు ఈ అండర్ పాస్ ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.[3][4]

నిర్మాణ వివరాలు

మార్చు

హైదరాబాద్ నగరంలో ఎల్.బి నగర్ చౌరస్తా అనేది అత్యంత ప్రధానమైనది. వరంగల్, నల్గొండ, ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలతో ఇక్కడి ప్రాంతమంతా రద్దీగా ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణకు, నివారణకు ఈ ప్రాంతంలో అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టబడ్డాయి. 40 కోట్ల రూపాయలతో 490 మీటర్ల పొడవు, 12.875 మీటర్ల వెడల్పు, 72.50 మీటర్ల బాక్స్ పోర్షన్ 3 లేన్ల యునీ డైరెక్షన్ లో ఈ అండర్ పాస్ నిర్మాణం జరిగింది.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Telugu, TV9 (2022-03-16). "Hyderabad: వాహనదారులకు గుడ్‌‌న్యూస్.. నేడు అందుబాటులోకి రానున్న ఎల్బీనగర్ అండర్‌పాస్, ఫ్లై ఓవర్". TV9 Telugu. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (16 March 2022). "సాగర్ చౌరస్తా TO ఉప్పల్‌ రయ్‌..రయ్‌.. మెరుగు పడిన ప్రజా రవాణా". EENADU. Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  3. telugu, NT News (2022-03-16). "ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకే ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.
  4. "KTR: ఆ నిధులు తెస్తే కిషన్‌రెడ్డిని సన్మానిస్తాం: కేటీఆర్‌". EENADU. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.