ఎల్.బి. నగర్ కుడివైపు ఫ్లైఓవర్

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్‌ మండలంలోని ఎల్.బి. నగర్ చౌరస్తాలో ఉన్న ఫ్లైఓవర

ఎల్.బి. నగర్ కుడివైపు ఫ్లైఓవర్ (మాల్ మైసమ్మ ఫ్లైఓవర్) అనేది తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్‌ మండలంలోని ఎల్.బి. నగర్ చౌరస్తాలో ఉన్న ఫ్లైఓవర్.[1] విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వారికి ఎల్బీనగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్ళే మార్గంలో విజయలక్ష్మి థియేటర్‌ ముందు ప్రారంభమై ఎల్బీనగర్‌ మహాల్‌ మైసమ్మ దేవాలయానికి 60 మీటర్ల ముందు వరకు 42 కోట్ల రూపాయలతో 960 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 3 లైన్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మించబడింది.[2] ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో పూర్తయిన 19వ ఫ్లైఓవర్ ఇది. దీనికి పక్కనే ఎల్.బి. నగర్ ఎడమవైపు ఫ్లైఓవర్ కూడా ఉంది.

ఎల్.బి. నగర్ కుడివైపు ఫ్లైఓవర్
మాల్ మైసమ్మ ఫ్లైఓవర్
ప్రదేశం
ఎల్.బి. నగర్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
జంక్షన్ వద్ద
రహదార్లు
విజయవాడ హైవే - హైదరాబాదు
నిర్మాణం
రకంఫ్లైఓవర్
లైన్స్3
నిర్మాణం చేసినవారునిర్మాణంలో ఉంది by హైదరాబాదు మహానగర పాలక సంస్థ
ప్రారంభం2023
గరిష్ట
వెడల్పు
960 మీటర్ల పొడవు

నిర్మాణం

మార్చు

ఎల్బీనగర్‌ మహాల్‌ మైసమ్మ దేవాలయం వెనుక భాగం నుంచి సరూర్‌నగర్‌ స్టేడియం వైపుకు నిర్మించడానికి 2019లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ మైసమ్మ దేవాలయం రోడ్డు మధ్యలోని రావడంతో పనులు ఆపేయబడ్డాయి. పలు చర్చల తరువాత దేవాలయం ముందుకే కుదించి ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించబడింది.

మొత్తం 13 ఫౌండేషన్‌లు, 12 స్లాబ్‌లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి 26.56 కోట్లు కాగా, ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం స్థల సేకరణ నిధులతో కలిసి 42 కోట్లు అయింది.[3]

ప్రారంభం

మార్చు

ఈ ఫ్లైఓవర్‌ను 2023 మార్చి 25న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, బొగ్గారపు దయానంద్, డిప్యూటి మేయర్ మోతే శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[4][5]

కొత్త ఫ్లైఓవర్ ప్రయోజనాలు

మార్చు
  • ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణంతో హయత్‌నగర్, చౌటుప్పల్ నల్గొండ, విజయవాడ వైపు నుండి దిల్ సుఖ్ నగర్, హైదరాబాదు వైపు వచ్చే ఎల్.బి. నగర్ జంక్షన్ లో ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకడంతోపాటు 65 శాతం మేర ట్రాఫిక్‌ తగ్గుతుంది.
  • చింతలకుంట వద్ద వాహనాల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గడంవల్ల వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది.

మూలాలు

మార్చు
  1. Dhatripriya (2023-01-19). "Hyderabad: పూర్తయిన ఎల్ బీ నగర్ ఫ్లై ఓవర్.. నెలాఖరులో ప్రారంభం కానున్న ఎల్ బీ నగర్ ఫ్లై ఓవర్". www.hmtvlive.com. Retrieved 2023-03-16.
  2. Today, Telangana (2023-03-07). "Hyderabad: RHS flyover at LB Nagar to open soon". Telangana Today. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-13.
  3. telugu, NT News (2022-04-18). "ఎల్బీనగర్‌లో మరో ఫ్లైఓవర్‌". www.ntnews.com. Archived from the original on 2023-03-16. Retrieved 2023-03-16.
  4. "ఎల్బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో". Sakshi. 2023-03-26. Archived from the original on 2023-03-25. Retrieved 2023-03-27.
  5. Telugu, 10TV; naveen (2023-03-25). "LB Nagar RHS Flyover : ఇక ఉండదు ట్రాఫికర్.. ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". 10TV Telugu. Archived from the original on 2023-03-27. Retrieved 2023-03-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)