ఎవరాస్త్రీ? కె.శంకర్ దర్శకత్వంలో 1966, మార్చి 26న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1958లో విడుదలైన అమెరికన్ సైకో థ్రిల్లర్ సినిమా వర్టిగో ఆధారంగా నిర్మించబడిన కలంగరై విలక్కం అనే తమిళ సినిమా దీనికి మూలం.[1]

ఎవరాస్త్రీ?
(1966 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.శంకర్
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
బి.సరోజా దేవి,
నగేష్
గీతరచన వడ్డాది
సంభాషణలు మహారథి
నిర్మాణ సంస్థ విశ్వశాంతి మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటలను వడ్డాది బుచ్చి కూర్మనాథం రచించగా, పామర్తి సంగీతసారథ్యం వహించాడు.[2]

పాటల వివరాలు
క్రమ సంఖ్య పాట గాయకులు
1 మల్లెవు మొల్లవు మాలతివే పున్నమి చంద్రుని చేరితివే ఘంటసాల
2 ఎన్ని వగలో ఎంత వలపో నాతో నాటకమాడెనే ఎంత మోసం ఎంతో సరసం ఎన్ని మాయలు నేర్చెనే ఘంటసాల
3 కాశీ వెళ్ళబోతే ఓ పడుచు వెంటబడెనే నెరజాణ వంటి పిల్లా నన్ను కన్నుగీటి పిలిచేనే ఘంటసాల
4 కదిలే హృదయం రగిలే శౌర్యం పోరాడి సమరాన ఎగిరేయ్ పతాకం మాధవపెద్ది, పి.లీల బృందం
5 పూజలు పండిన శుభవేళా వరములు కోరుము అలివేణీ పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
6 ఎంత పిలిచినా చెంతకే రావిక నా కథా వినవా పి.సుశీల

కథా సంగ్రహం మార్చు

ఆమె పేరు లీల. ఆకస్మికంగా తల్లి మరణించినందున ఆమెకు తీవ్రమైన మానసిక రుగ్మత వచ్చింది. ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఆమెను ప్రేమించిన లాయర్ రవి, ఆమెకు చికిత్స చేసిన డాక్టర్ గోపాల్ కళ్ళారా చూచారు. ఆమె మరణించిందని నిర్ధారణ చేసుకున్నారు. కానీ ఒకరోజు వారిద్దరూ ఒక నాట్యప్రదర్శనకు వెళతారు. ఆ నర్తకి ముమ్మూర్తులా మరణించిన లీల మాదిరిగానే ఉంటుంది. లీలకు ఉన్నట్టే ఆమెకు కూడా వీపు మీద మచ్చ ఉంటుంది. ఎవరా స్త్రీ? అని అనుకుంటాడు రవి. ఆమెను పలకరిస్తాడు. ఆమె గుర్తించదు. కానీ ఎలాగో ఆమె హృదయాన్ని చూరగొంటాడు. ఆమె రవిని పెళ్ళిచేసుకుంటుంది. మహాబలిపురంలో మరణించినది ఎవరు అనే రహస్యాన్ని ఛేదించడానికి లాయర్ రవి ఆమెను మహాబలిపురానికి తీసుకువెళతాడు. అక్కడ అతనికి రాజారావు ప్రియురాలు రహస్యం చెప్పబోతున్న సమయంలో రాజారావు అక్కడకు వస్తాడు. ఆమె ఆ రహస్యం వెల్లడించి విషం తాగి మరణిస్తుంది. చిత్రం చివరి వరకూ ఎవరా స్త్రీ? అనే విషయం ప్రేక్షకులకు సస్పెన్స్‌గా ఉంటుంది.[3][4]

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Evaraa Sthree (K. Shankar) 1966". ఇండియన్ సినిమా. Retrieved 19 December 2022.
  2. వడ్డాది (26 March 1966). Evaraa Sthree (1966)-Song_Booklet (1 ed.). మద్రాసు: విశ్వశాంతి.
  3. తుర్లపాటి (27 March 1966). "చిత్రసమీక్ష: "ఎవరా స్త్రీ?"" (PDF). ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original (PDF) on 20 డిసెంబరు 2022. Retrieved 20 December 2022.
  4. యం.యస్.యం. (27 March 1966). "రూపవాణి చిత్రసమీక్ష: యెవరాస్త్రీ?". ఆంంధ్రప్రభ దినపత్రిక. Retrieved 20 December 2022.[permanent dead link]