ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ

ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]

ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 23 మే 2019
ముందు వంగా గీత
తరువాత పెండెం దొరబాబు
నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1964
పి. దొంతమూరు గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రాఘవరాజు
జీవిత భాగస్వామి లక్ష్మి దేవి
సంతానం గిరీష్, కావ్యపద్మజ[1][2]

జననం, విద్యాభాస్యం

మార్చు

ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ 1964లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం మండలం, పి. దొంతమూరు గ్రామంలో జన్మించాడు. ఆయన కొత్తకోట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకు 2014లో టీడీపీ టికెట్ రాక స్వతంత్ర అభ్యర్థిగా (టీడీపీ రెబల్‌గా) పోటీ చేసి తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబుపై 47080 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4] ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో తిరిగి 22 మే 2014న టీడీపీలో చేరాడు. ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పోటీ చేసి తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో 14992 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితుడయ్యాడు.[5] 2024 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన, భాజపాలో జట్టు కట్టడంతో పిఠాపురం సీటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు వదులుకోవలసి వచ్చింది. పార్టీ కోరిక మేరకు కూటమి తరపున పనిచేసి పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశాడు.

మూలాలు

మార్చు
  1. Business Standard (22 July 2015). "TDP MLA SVSN Varma's daughter dies". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
  2. Sakshi (21 July 2015). "పిఠాపురం ఎమ్మెల్యే కుమార్తె మృతి". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. Sakshi (2019). "పిఠాపురం నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  5. Eenadu (17 October 2021). "గళానికి గుర్తింపు". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.