ఐశ్వర్య రాయ్ సినిమాలు

ఐశ్వర్య రాయ్ ప్రముఖ నటి, మోడల్. ఐదు భాషల్లో దాదాపు 40 సినిమాల్లోనటించారు ఆమె. ఎక్కువగా హిందీతమిళ్ఇంగ్లీష్ భాషల్లో సినిమలు చేశారు. 1997లో మణిరత్నం దర్శకత్వంలో తమిళ్ లో  ఇరువర్ సినిమాతో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. అదే  ఏడాది బాలీవుడ్ లో ఔర్ ప్యార్ హో  గయా సినిమాలో నటించారు.[1][2] ఆమె నటించిన జీన్స్(1998) సినిమా పెద్ద హిట్ అవడమే కాక అకడమీ అవార్డులకు వెళ్ళిన మొదటి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. ఆ తరువాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆమె నటించిన హమ్ దిల్ దే చుకే సనమ్(1999) సినిమా బాలీవుడ్ లో ఆమెకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమాలోని నటనకు ఐశ్వర్య ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకోవడం విశేషం.[3][4][5] 1999లో సంగీత ప్రధానమైన సినిమా తాళ్ లో నటించారు ఐశ్వర్య ఈ సినిమా కూడా విజయవంతం కావడంతో ఆమె అగ్ర కథానాయికగా మారారు.[6]

Aishwarya Rai gently smiles at the camera
2010 విలన్ సినిమా ఫంక్షన్ లో ఐశ్వర్య

2000లో ఐశ్వర్య తమిళ్ లో కందుకొండైన్ కందుకొండైన్, హిందీలో మొహొబ్బతే తో సహా ఆరు సినిమాల్లో నటించారు.[7][8] 2002లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్ తో కలసి దేవదాస్ సినిమాలో నటించారు ఆమె.[9] ఈ సినిమా భారీ వసూళ్ళు సాధించడమే కాక, ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకున్నారు.[4][10] 2003లో బెంగాలీలో చోఖెర్ బాలీ సినిమాలో నటించారు ఐశ్వర్య. ఈ సినిమా కూడా హిట్ అయింది.[11][12] అదే ఏడాది ఆమె నటించిన దిల్ కా రిష్తా, కుచ్ నా కహో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె బాలీవుడ్ కెరీర్ కొంత వెనకపట్టింది.[13][14] ఆ తరువాతి ఏడాది జాన్ ఆస్టేన్ నవల ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ ను ఇంగ్లీష్ లో బ్రిటిష్ చిత్రం బ్రైడ్ అండ్ ప్రెజుడీస్ సినిమాలో ఎలిజబెత్ బెన్నెట్ పాత్రలో నటించారు ఐశ్వర్య.[15] 2004లోనే అజయ్ దేవగణ్ సరసన రైన్ కోట్ సినిమాలో నటించారు  ఆమె సర్బ్ జిత్.[16]

మూలాలు మార్చు

  1. Warrier, Shobha (3 September 2003). "25 years, 25 landmarks".
  2. Roy, Gitanjoli (1 November 2012).
  3. "Family values" Archived 2011-10-19 at the Wayback Machine.
  4. 4.0 4.1 "Best Actor in a Leading Role (Female) award winners down the years".
  5. Sharma, Anu (6 March 2011).
  6. "Box Office India report of 1999".
  7. Baskaran, S. Theodore (28 May 2000).
  8. "Box Office 2000".
  9. Chowdhury, Souvik (23 September 2002).
  10. "Box Office India report of 2002".
  11. Pillai, Shreedhar (13 November 2003).
  12. Saha, Sambit (10 January 2004).
  13. "Box Office 2003".
  14. Sharma, Neha (16 September 2012).
  15. Dargis, Manohla (11 February 2005).
  16. Verma, Sukanya (24 December 2004).