ఓబనపాలెము ( నాగులుప్పలపాడు మండలం)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


ఓబనపాలెం, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523183. ఎస్.టి.డి కోడ్:08593.

గ్రామం
నిర్దేశాంకాలు: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05అక్షాంశ రేఖాంశాలు: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంనాగులుప్పలపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08593 Edit this on Wikidata )
పిన్(PIN)523183 Edit this on Wikidata
ఓబనపాలెం గ్రామ దృశ్యం

సమీప గ్రామాలుసవరించు

  • నాగులుప్పల పాడు
  • ఉప్పుగుండూరు
  • మాచవరం
  • ఉప్పలపాడుఅమ్మనబ్రోలు

సమీప మండలాలుసవరించు

రవాణా సౌకర్యాలుసవరించు

బస్సు వసతి జిల్లా కేంద్రం ఒంగోలు నుండి మాత్రమే ఉంది.

మౌలిక వసతులుసవరించు

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

ఊరిలో చెఱువు చూడ ముచ్చట గొలుపును.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వక్కంటి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

గ్రామంలో మూడు దేవాలయములు ఉన్నాయి. రామాలయము, ఆంజనేయస్వామి ఆలయము, శివాలయము ఉన్నాయి.

ప్రధాన పంటలుసవరించు

వరి. అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

కట్టా రామకృష్ణ:భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో, ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రైతులకు అందజేసే అత్యుత్తమ పురస్కారం అయిన, జగజ్జీవనరాం అభినవ కిసాన్ పురస్కారం నకు, ఓబనపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కట్టా రామకృష్ణ ఎంపికైనారు. 2014, జూలై-29న భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ ముఖ్య అథిధిగా పాల్గొన్న సభలో, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శ్రీ రాధామోహన్ సింగ్ మరియూ వ్యవసాయోత్పత్తుల శాఖా మంత్రి శ్రీ బాలు నాయక్ బల్వాన్ చేతులమీదుగా, ఈయన ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారంతోపాటు వీరు 50 వేల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతిని గూడా అందుకున్నారు.[2]

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, దర్శి కృషి విఙానకేంద్రం ఆధ్వర్యలో ఇటీవల దర్శిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమంలో భాగంగా, ఒక కిసాన్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో వీరికి ఉత్తమ రైతు పురస్కారం అందజేసినారు. మినుములో పల్లాకు తెగులుకు తట్టుకుని, అధిక దిగుబడిని ఇచ్చే పాలిష్ రకాలు అభివృద్ధి చేయడం, పెసరలో కొత్త వంగడాలు అభివృద్ధి చేయడం, శనగలో కోతయంత్రం వెరైటీని అభివృద్ధి చేయడంలో వీరి కృషిని గుర్తించి, వీరికి ఈ పురస్కారాన్ని ఒంగోలు లోక్ సభ సభ్యులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి చేతులమీదుగా అందజేసినారు. [3] వీరు 2016,డిసెంబరు-3న, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, అభ్యుదయ రైతు కోటాలో, వ్యవసాయ పరిశోధన, విస్తరణ కేంద్రం సభ్యులుగా నియమితులైనారు. నూతన వంగడాలతో వ్యవసాయంలో మేలైన ఉత్పత్తులు అందించినందుకు వీరికి ఈ అవకాశం లభించింది. [4]

గ్రామంలోని విశేషాలుసవరించు

గ్రామ జనాభాలో ఎక్కువ మంది కమ్మ కులము వారు.

గ్రామ జనాభాసవరించు

మొత్తము గ్రామ జనాభా సుమారుగా 500 ఉంటుంది.గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం; 2014,జులై-30; 7వపేజీ.[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఏప్రిల్-6; 3వపేజీ.[4] ఈనాడు ప్రకాశం; 2016,డిసెంబరు-4; 7వపేజీ.