ప్రధాన మెనూను తెరువు

ఓలేటి శ్రీనివాసభాను తెలుగు రచయిత. ఆయన ప్రోలాన్సర్ గా పేరు గడించారు.

ఓలేటి శ్రీనివాసభాను
జననంమే 6, 1953
విజయనగరం జిల్లా పార్వతీపురం

జీవిత విశేషాలుసవరించు

ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలో మే 6 1953 న జన్మించారు. వీరు పార్వతీపురం, బొబ్బిలి, విశాఖపట్నం జిల్లా లలో విద్యాభ్యాసం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి ఎం.కాం పట్టా పొంది దక్షిణ మద్య రైల్వేలో సీనియర్ ట్రాఫిక్ ఇనస్పెక్టరుగా ఉద్యోగం చేసి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.

రచనా ప్రస్థానంసవరించు

చిన్ననాటి నుండి వివిధ సాహితీప్రక్రియల పట్ల మమకారం పెంచుకున్న వీరు పదిహేనో ఏటనే కధలు రాయటం ప్రారంభించారు. వీరి రచనలు వివిధ తెలుగు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైయ్యాయి. ఈనాడు ఆదివారం, ఆంధ్రభూమి ఆదివారం, విపుల, చతుర, సితార సంచికలకు ప్రీ లాన్సర్గా అనేక శీర్షికలు నిర్వహించారు. ఈనాడు ఆదివారం సంచికలో పదేళ్లపాటు ఇది కథకాదు శీర్షికను "తేజస్వి" కలం పేరుతో ప్రచురితమయ్యాయి. అనేక తెలుగు టీ.వీ సీరియళ్లకు హిందీ, ఇంగ్లీష్, కన్నడ ధారావాహికలకు తెలుగులో డబ్బింగ్ నిర్వహించారు. నవ్య విక్లిలో పాఠకాదరణ పొందిన వీరి 'పొగబండి కధలు' పుస్తకంగా వెలువడి 'తురగా కృష్ణమోహనరావు పురస్కారం - 2010' అందుకొంది. [1] కౌముది అకాడమీ నిర్వహిస్తున్న భరతనాట్య ప్రదర్శనలకు స్క్రిప్టులు కూడా వ్రాసారు.[2] ఆయన కొన్ని పత్రికలలో కవితలు కూడా వ్రాసారు.[3]

రచనలుసవరించు

  • కలకండ పలుకులు - శ్రీ సాయి కథలు [4]
  • గణపతి కథ [5]
  • ఎల్.వి.ప్రసాద్ జీవిత ప్రస్థానం.[6]
  • పొగబండి కథలు.[6]

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు