ఔపవిభక్తికాలు
ద్వితీయ మొదలైన విభక్తుల ఏకవచన శబ్దాలకు ముందు (సమీపంలో) చేరేవి కనుక వీటిని ఉపవిభక్తులు అంటారు. ‘ఇ, టి, తి’ అనే వర్ణాలు ఉపవిభక్తులు. వీటినే ఔపవిభక్తికాలు అంటారు. ఇవి చేరే పదాలను కూడ ఔపవిభక్తికాలు అనే అంటారు.
ఇ-టి-తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తికంబులు
మార్చుముందు చెప్పబోయే ఆయా సూత్రాలచేత విధింపబడే ఇ, టి, తి వర్ణాలు ఔపవిభక్తికాలు. ద్వితీయ మొదలైన విభక్తుల కారణంగా ఇవి వచ్చిచేరుతాయి. ఇవి కొన్ని చోట్ల పదాల తుది అక్షరాలకు ఆదేశం గాను, మరికొన్ని చోట్ల ఆగమం గాను చేరుతూ ఉంటాయి.
ఇవి ద్వితీయాద్యేకవచనంబులు పరంబు లగునపుడు నామంబులకుం గొన్నింటికిం బ్రాయికంబుగ నగు
మార్చుఈ ఇ, టి, తి వర్ణాలు ద్వితీయనుండి అన్ని విభక్తులలో ఏకవచనం పరమైనపుడు కొన్ని శబ్దాలకు తరచుగా చేరుతూ ఉంటాయి.
‘కాలు’కు ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ‘కాలు + ను’ అవుతుంది. దానికి ‘ఇ’ చేరగా ‘కాలు + ఇ + ను = కాలి +ను’ అవుతుంది. ‘ఇకారం మీది కు, ను, వు అనే క్రియావిభక్తుల ఉత్వానికి ఇత్వం అవుతుంది’ అనే సూత్రం వల్ల ‘కాలి + ని = కాలిని’ అవుతుంది. అదే విధంగా ‘కాలు + చే = కాలిచే’ అవుతుంది.
‘నాగలి’కి ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ’నాగలి + ను’ అవుతుంది. దానికి ‘టి’ ఆదేశమై ‘నాగటి + ను -> నాగటిని’ అవుతుంది.
‘నేయి’కి ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ‘నేయి + ను’ అవుతుంది. దానికి ‘తి’ చేరగా ‘నేతి + ను -> నేతిని’ అవుతుంది.
టివర్ణంబు గొన్నింటి యంతాక్షరంబున కాదేశంబును, గొన్నింటి కంతాగమంబును, గొన్నింటికిం బర్యాయంబున రెండును బ్రాయికంబుగ నగు
మార్చు‘టి’ వర్ణం కొన్ని శబ్దాల తుది అక్షరానికి ఆదేశంగాను, కొన్నింటికి ఆగమంగాను, కొన్నింటికి రెండూ వస్తాయి. ఆదేశానికి ....
త్రాడు + ను -> త్రాటి + ను -> త్రాటిని
కాడు + ను -> కాటి + ను -> కాటిని
నోరు + ను -> నోటి + ను -> నోటిని
ఆగమానికి ....
అన్ని + ను -> అన్ని + టి + ను -> అన్నిటిని
ఎనిమిది + ను -> ఎనిమిది + టి + ను -> ఎనిమిదిటిని
వేయి + ను -> వేయి + టి + ను -> వేయిటిని
ఉభయానికి (ఆదేశ, ఆగమాలు రెండూ) ....
ఏమి + ను -> (ఆదేశం) ఏటి + ను -> ఏటిని;
.......................... (ఆగమం) ఏమి + టి + ను -> ఏమిటిని.
పగలు + ను -> (ఆదేశం) పగలు + ను -> పగటిని;
............................. (ఆగమం) పగలు + ఇ + టి + ను -> పగలిటిని.
మొదలు + ను -> (ఆదేశం) మొదలు + టి + ను -> మొదటిని;
.................................. (ఆగమం) మొదలు + ఇ + టి + ను -> మొదలిటిని.
రెండు + ను -> (ఆదేశం) రెండు + టి + ను -> రెంటిని;
............................ (ఆగమం) రెండు + ఇ + టి + ను -> రెండిటిని.
మూఁడు + ను -> (ఆదేశం) మూఁడు + టి + ను -> మూఁటిని;
................................. (ఆగమం) మూఁడు + ఇ + టి + ను -> మూఁడిటిని.
నూఱు + ను -> (ఆదేశం) నూఱు + టి + ను -> నూటిని;
.............................. (ఆగమం) నూఱు + ఇ + టి + ను -> నూఱిటిని.
హ్రస్వము మీఁది ‘టి’ వర్ణంబునకు ముందు పూర్ణబిందువు బహుళముగా నగు
మార్చుహ్రస్వాంతమైన శబ్దానికి పరమైన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న బహుళముగా అవుతుంది. అన్ని+ను -> అన్ని+టి +ను -> అన్నింటిని, అన్నిటిని.
‘అన్ని+టి+ని’ అన్నప్పుడు ‘న్ని’ అనే హ్రస్వానికి పరమైన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న వచ్చి ‘అన్నింటిని’ అవుతుంది. బహుళం అనడం వల్ల సున్నా రానప్పుడు ‘అన్నిటిని’ అవుతుంది. ఎనిమిది+టి+ను -> ఎనిమిదింటిని, ఎనిమిదిటిని.
పగలు+టి+ను -> పగటి+ను -> పగంటిని, పగటిని
రెండు+టి+ను -> రెండిటి+ను -> రెండింటిని, రెండిటిని
మూఁడు+టి+ను -> మూఁడుటి+టి+ను -> మూఁడింటిని, మూఁడిటిని.
‘హ్రస్వముమీఁది’ అనడం వల్ల దీర్ఘముమీఁది ‘టి’ వర్ణమునకు నిండుసున్న రాదు. ఉదా... త్రాడు+ను -> త్రాటిని, ఏఱు+ను -> ఏటిని మొ.
ఇదే విధంగా ... కుందేలు+టి+ను -> కుందేటిని.
పదాద్యంబగు హ్రస్వంబుమీఁది టివర్ణంబునకు ముందు పూర్ణబిందు వగు
మార్చుపదంలోని మొదటి హ్రస్వాక్షరానికి ముందు ఆదేశంగా వచ్చిన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న నిత్యంగా వస్తుంది. కన్ను+ను -> కంటిని
‘కన్ను+ను’ అని ఉండగా ‘న్ను’కు ‘టి’ ఆదేశంగా రాగా ‘క+టి+ను’ అయి ఈసూత్రం వల్ల ‘కంటిని’ అవుతుంది.
మిన్ను+ను -> మిటి+ను -> మింటిని
ఇల్లు+ను -> ఇటి+ను -> ఇంటిని
పల్లు+ను -> పటి+ను -> పంటిని.
టితివర్ణంబులు పరంబు లగునపు డుత్వంబున కిత్వంబగు
మార్చుఆగమాలుగా వచ్చిన ‘టి, తి’ వర్ణాలకు ముందున్న ఉత్వం ఇత్వం అవుతుంది.
రెండు+టి+కు -> రెండి+టి+కు -> రెండిటికి
మూఁడు+టి+కు -> మూఁడి+టి+కు -> మూఁడిటికి
నాలుగు+టి+కు -> నాలుగి+టి+కు -> నాలుగిటికి
పగలు+టి+కు -> పగలి+టి+కు -> పగలిటికి
మొదలు+టి+కు -> మొదలి+టి+కు -> మొదలిటికి
పెక్కు+టి+కు -> పెక్కి+టి+కు -> పెక్కిటికి
నెత్తురు+టి+కు -> నెత్తు+టి+కు -> నెత్తుటికి (ఇక్కడ మాత్రం ఇత్వం రాదు).
టివర్ణంబు పరంబగునపుడు క్రిందు, మీఁదు, ముందు, పువర్ణంబుల కత్వంబగు
మార్చు‘టి’వర్ణం పరమైనపుడు క్రిందు, మీఁదు, ముందు శబ్దాల తుది అచ్చుకు, శబ్దాల చివర ఉన్న ‘పు’ వర్ణానికి అత్వం వస్తుంది.
క్రిందు+టి+ను -> క్రిందటిని
మీఁదు+టి+ను -> మీఁదటిని
ముందు+టి+ను -> ముందటిని
మాపు+టి+ను -> మాపటిని
అప్పుడు+టి+ను -> అప్పు+టి+ను -> అప్పటిని.