కంగుంది

ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు జిల్లా కుప్పం మండలం లోని గ్రామం

కంగుంది , చిత్తూరు జిల్లా, కుప్పం మండలానికి చెందిన గ్రామం.[1]

కంగుంది
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం కుప్పం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,369
 - పురుషుల 579
 - స్త్రీల 557
 - గృహాల సంఖ్య 250
పిన్ కోడ్ Pin Code : 517425
ఎస్.టి.డి కోడ్: 08570

ఇది 2011 జనగణన ప్రకారం 854 ఇళ్లతో మొత్తం 3960 జనాభాతో 813 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన పుంగనూరు 56 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1962, ఆడవారి సంఖ్య 1998గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 811 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 275. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596915[1].మొత్తం అక్షరాస్య జనాభా: 2188 (55.25%),అక్షరాస్యులైన మగవారి జనాభా: 1213 (61.82%),అక్షరాస్యులైన స్త్రీల జనాభా: 975 (48.8%)

గ్రామ చరిత్రసవరించు

కంగుంది పాలెగాళ్లుసవరించు

కంగుంది గ్రామం చిత్తూరు జిల్లా కుప్పం మండంలోనిది చిత్తూరుకి పడమర 90 కిలో మీటర్ల దూరంలో వుంది. పూర్వం కంగుంది కుప్పం రామకుప్పం మండలాల మధ్య ఉన్న ప్రాంత మంతా దట్టమైన చెట్లతో మానవ సంచారానికి వీలుకాని అరణ్యం. ఈ అరణ్యంలో ఎరుకలు యానాది కులాలకు చెందిన బందిపోటు దొంగలు అక్కడక్కడ స్థావరాలను ఏర్పరచుకొన్నారు వీరి ముఖ్య వృత్తి ప్రజలను దోచుకోవడం వీరు కొండ చెరియలపై నున్నటి పర్వత శిఖరాలపై ఉన్న తేనె పట్టులనుండి జుంటి తేనెను తీయటలో మంచి ప్రావీణ్యం కలవారు. యానాది కులానికి చెందిన 'కంగడు' దారి దోపిడీ ముఠాలకు నాయకుడు ఇతని భార్యపేరు 'కంగి' వీరి ఆధీనంలో కొన్ని గూడేలు ఉండేవి. ఈ అరణ్యంలో జరిగే దోపిడీలన్నింటికి కంగడే నాయకత్వం వహంచేవాడు. ఇతని భార్య కంగి అరణ్యంలో ఉన్నయానాది ప్రజలందరికి పెద్దదిక్కు ఆగూడేల్లో ఏశుభకార్యాం జరగాలన్నా పూజలు చేయాలన్నా కంగి చేతులు మీదగానే జరిగేవి. కంగడికి కంగి హృదయం లాంటిది. కంగడితోపాటు కంగికూడా అరణ్య ప్రాంతంలో గుట్టలెక్కడం, తీగల సాయంతో లోయలు దాటడం వంటి సాహస కార్యాలేకాక కత్తియుద్ధం లోనూ దిట్ట. అలా వారి శక్తియుక్తులతో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో నిలుపుకొని మకుటం లేని మహారాజు మహారాణిలా కొనసాగుతు న్నారు. కృష్ణానదికి దక్షిణ తీరంలో గుత్తికి సమీపాన 'ప్యాపిలి' అనే సంస్థానం ఉండేది. దీనికి సమీపంలో అరణ్యం వుంది. ఈ అరణ్య ప్రాంతంలో 'మల్లినాయడు' అనే బోయనాయకుడు ఆధ్వర్యం లో దారి దోపిడీలు జరిగేవి. వీరు దివిటల దొంగలుగా ప్రసిద్ధి మల్లినాయడి కుమారుడు కంబినాయడు కూడా తన తండ్రి ఎంచుకున్న దోపిడి వృత్తినే చేపట్టాడు. ఇతనికి రెండవ కంబి నాయడు ఇతని కుమారుడు మూడవ కంచినాయడు కూడా దోపిడీ వృత్తినే కులవృత్తిగా స్వీకరించాడు. క్రీ.శ. 1066వ సంవత్సరంలో దారి దోపిడీ ముఠాలలో వివా దాలు చెలరేగి ఒకరినొకరు చంపు కొంటున్న తరుణంలో మూడవ కంబినాయడు తన భార్య బిడ్డలతో కలసి కొంతమంతి అనుచరులను వెంట బెట్టు కొని కంగుంది సమీపంలోని 'మహా రాజ్‌ఘర్‌' అను గుట్టను చేరి, ఆగుట్ట ప్రాంతంలో కొన్ని ఇండ్లను నిర్మించి నివాసముంటూ ఆ ప్రాంతానికి 'అంగనమల' అనే పేరు పెట్టాడు. అరణ్య ప్రాంతంలో దారిదోపిడీలు చేస్తూ ఆర్థికంగా బలవంతుడయ్యాడు. ఒకనాడు కంబినాయడు అరణ్యంలో వేటకు వెళ్లి మరొక ప్రాంతంలో ఒక గుట్టను చూచి అంగనమలకన్నా తన నివాసా నికి అనువైన ప్రదేశమని తలచి ఆ గుట్టమీద ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో బేతరాయస్వామిని ప్రతిష్ఠించి తనకులదై వంగా పూజించాడు. ఆ గుట్ట అడుగు భాగాన ఒక చిన్నకోట నిర్మించి నివాసముంటూ ఈ కోటలోనే ఒక గ్రామాన్ని నిర్మించి 'గోనుగూరు' అనే పేరు పెట్టాడు. కంబినాయడు స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని దారి దోపిడీలు చేస్తున్న విషయం కంగడు తెలుసుకొని తన అనుచరులను వెంటబెట్టుకొని కంబినాయుడిపై పోరుకి వెళ్లాడు. కానీ అక్కడ కంగడు, ఆనాటి నుండి కంబినాయడు కంగడి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. కంగి, కంగడు ద్వారా కంబినాయడు అరణ్యంలో శత్రువులు కూడా ప్రవేశించడానికి, వీలుకాని అనేక రహస్య మార్గాలను తెలుసుకొన్నాడు. తీగల సహా యంతో లోయలు దిగడంలొ పట్టుసాధించాడు. పూర్తి రహస్యాలను తెలుసుకొన్న కంబినాయకుడు ధైర్యంతో పాటు బుద్ధిబలం సంస్థాన విస్తరణా కాంక్షగలవాడు. ఒకనాడు కంగి, కంగడు తీగల సహాయంతో లోయలు దాటుతున్నపుడు తీగలను నరికించి లోయలో పడేట్లు చేసాడు. ఆ తరువాత కంగి, కంగడు ప్రమాదవ శాత్తు మరణం చారని ప్రజలను నమ్మించాడు. అక్కడొక దుర్గాన్ని కట్టించి దానికి కంగుంది దుర్గమని పేరు పెట్టి తన రాజధానికి చేసుకొని సంస్థానాన్ని విస్తరింప జేసాడు. కంబినాయడు పరిపాలన 66 సంవత్సరాలు కొనసాగింది. ఇతని పాలనాకాలంలో సంస్థాన విస్తరణకాక, అడవులను నరకి వ్యవసాయభూములుగా మార్చడం గ్రామాలను నిర్మించడం వంటి ప్రజాహిత కార్యక్రమాలు జరిగాయి. కంగుంది పాళెగాళ్ల, వంశీయుల కథనం ప్రకారం తమ మూల పురుషుడైన కంబినాయడు ప్యాపిలి నుండి వలస వచ్చి మొట్టమొదట తమిళనాడు ఉత్తర ఆర్కాడు జిల్లాకు చెందిన జోలార్‌ పేట దగ్గర 'జవ్వాజి' కొండలలో నివాసం ఏర్పరచుకొన్నందున తమ పేర్లకు ముందు కె.జె అని పెట్టుకొన్నట్లు 'కె'. అంటే కంబినాయడు 'జె' అంటే 'జవ్వాజి' అని ఇదే గృహనామంగా ధరించినట్లు చెబుతారు. కంగుంది సంస్థానాన్ని 28 తరాలవారు 1066 నుండి 1950 వరకు పరిపా లనా బాధ్యతలు నిర్వహించారు. 1. కంబినాయడికి పెద వీరప్పనాయడు, తిరుమలనాయడు, చినవీరప్పనాయడు అనే ముగ్గురు కుమారులున్నారు. కంబినాయడి తరువాత క్రీ.శ. 1132లో పెదవీరప్ప నాయడు సంస్థాన పరిపాలనా బాధ్యతలు స్వీకరించాడు. అనేక కోటలు నిర్మించి సైనిక బలగాలను పెంచి బ్రాహ్మణులకు, ఇతరులకు గ్రామాలు మాన్యాలు ఇనాములిచ్చి క్రీ.శ. 1185 వరకు సుభిక్షమైన పరిపాలన చేసాడు. క్రీ.శ. 1185 - నుండి 1231 వరకు 3. మోముర్ధి చిన వీరప్పనాయడు కంగుంది సంస్థాన పాలనా బాధ్యతలు నిర్వహిం చాడు చిన వీరప్పనాయడు మంచి ధైర్యశాలి, కళలను ప్రోత్సహించి నాటక సమాజాలలో కృష్ణస్వామి ఆలయం, విరూపాక్ష ఆలయం నిర్మించాడు. ఇతని తరువాత 4. పెద వెంకటపతి నాయడు 5. తాతా వీరప్ప నాయడు 6. వరమల నాయడు 7. వెంకటపతి నాయడు 8. పెద వెంకట పతి నాయడు 9. వరహ మూర్తి నాయడు 10. అచ్యుతనాయడు 11. రామభద్ర నాయడు 12. పెద్ద ఒమ్మప్పనాయడు 13. వెంకటపతి నాయడు 14. వెంకటగిరి నాయడు 15. రామభద్రనాయడు 16. వరమూర్తి నాయడు 17. వెంకటపతి నాయడు 18. వరమలనాయడు 19. వీరప్పనాయడు 20. వెంకటగిరినాయడు 21. సీతప్పనాయడు 22. వెంకపటి నాయడు 23.రామప్ప నాయడు 24.సుబ్బరాజు నాయడు 25. వెంకటపతినాయడు 26. రామప్పనాయడు 27. సుబ్బరాజు నాయడు వంటి పాలకులు కంగుంది సంస్థాన పాలనా బాధ్యతలు నిర్వహించారు.క్రీ.శ. 1891 నుండి 1910 సుబ్బరాజు నాయడు సంస్థాన పరిపాలనాధికారం చేపట్టాడు. ఇతను శిస్తు వసూళ్లలో మధ్యవర్తులు రైతులను ఇబ్బంది పెట్టేపద్ధతికి స్వస్తి పలికి రైతులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకొని శిస్తు వసూళ్లు కచ్చితంగా నిర్ణయించి రైతులకు శాశ్వత పట్టాలిచ్చాడు. వీరి పూర్వీకులు పరాధీనం చేసిన గ్రామాలను తిరిగి కొని తన ఆస్తిని పెంచాడు. వాస్తు శాస్త్రాలలో అభిరుచి గల సుబ్బరాజు నాయుడు కుప్పంలో ఆకర్షణీయమైన నగరు నిర్మించి పన్నగ శయన భవనమని పేరు పెట్టాడు. ఇతని మరణానంతరం అతని కుమారుడు వెంకటపతినాయడు మైనర్‌ అయినందున కోర్టు ఆఫ్‌ వార్డ్సు వారి స్వాధీనంలో ఉండి మద్రాసు పట్టణంలో చదువుకొన్నాడు. మైనారిటి తీరిన తరువాత 10.12.1918 సంవత్సరంలో జమిందారుగా బాధ్యతలు చేపట్టాడు. తెలుగు, తమిళ ఆంగ్ల భాషలను అనర్గళంగా మాట్లాడేవాడు. సాహిత్య ప్రియుడు 'తిరుప్పావై' అనే తమిళ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించినట్లు తెలుస్తుంది. కేటెల్‌ బ్రీడింగ్‌ బుక్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ అనే రెండు గ్రంథాలను ఆంగ్లంలో రాశాడు తన సంస్థాన పరిధిలోని 360 గ్రామాలపేర్లు ఆ గ్రామా లలోని ప్రముఖుల పేర్లు సునాయాసంగా చెప్పగల సమర్థుడు, మంచి పరిపాలనాధక్షుడు ప్రజలకు జమీందారులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రాజా కె.జె. వెంకటపతినాయడు జీవించి ఉండగానే ప్రజలు అతనిపై గల అభిమానంతో 60 వేల రూపాయలు చందాలుగా వసూలు చేసి అతని కాంశ్య విగ్రహాన్ని కుప్పంలో ప్రతిష్టించారు. ఇతని జీవితకాలంలోనే ఆ విగ్రహప్రతిష్ట జరిగి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భాన్ని ఘనంగా రజతోత్సవాలు నిర్వహించారు. జమిందారీ వ్యవస్థ రద్దు చేయబడిన తరువాత 'కంగుంది దుర్గాన్ని' వదలి కుప్పంలో తన తండ్రి నిర్మించిన పన్నగశయన భవనానికి తన నివాసాన్ని మార్చాడు. కంగుంది పాలకుల కాలంలో శాస్త్రీయ సంగీత పోషణకంటే ఎక్కువగా జానపద కళల పోషనే జరిగినట్లు కనిపిస్తుంది కోలాటాలు, తోలుబొమ్మ లాటలు, గొబ్బిపాటలు, వీధి నాటకాలు మొదలైన జాన పదకళా రూపాలకే ఆదరణ లభించింది. కాల క్రమంలో వీధినాటకాలకే ఎక్కువ ప్రజాదరణ ఏర్పడింది. కనుకనే నాటి నుండి నేటి వరకు చిత్తూరు జిల్లాలో కంగుంది వీధి నాటకాలకే విశిష్ట స్థానం వుంది. కంగుంది రాజులు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల సౌకర్యార్థం రహదారులు, బాటసారులకు సత్రాలు, విద్యనభ్యసించడానికి పాఠశాలలు నీటిసౌకర్యార్థం అనేక చెరువులు తటాకాలు తాగు నీటి బావులు నిర్మిం చారు. ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెంచేం దుకు అనేక దేవాలయాలను నిర్మిం చారు. వ్యవసాయదారులకు ఉపయోగ పడే పశు శాస్త్రం 'చెరకు 'అనే గ్రంథాలను ఈ పాలకులు రచిం చారు. 'కంగుంది' పాళె గాళ్ల పాలనా కాలంలో వైభవోపేతంగా వెలుగొందింది. ఈ సంస్థానానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. (చిత్తూరు జిల్లా వీధి నాటకాలు - ఒకపరిశీలన - గోవిందరెడ్డి) కంగుంది పాళెగాళ్ల వంశంలోని వెంకపతినాయడు కుప్పంలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఈ వంశంలోని కొందరు వ్యవసాయంలోనూ మరి కొందరు వ్యాపార, ఉద్యోగ రంగాలలో స్థిరపడి జీవనం సాగిస్తున్నారు. వీరు రామాయణ గంథ్ర రచయిత వాల్మీకిమహర్షి సంతతివారమని, వాల్మీకి నాయకులమని చెప్పుకొంటారు.

సమీప గ్రామాలుసవరించు

ఉంసిగానిపల్లె 5 కి.మీ. శివరామపురం 6 కి.మీ. కెంచనబల్ల 6 కి.మీ. విజలాపురం 7 కి.మీ నూలకుంట 8 కి.మీ. దూరములో వున్నవి.

విద్యా సౌకర్యాలుసవరించు

ఈ గ్రామములో 5 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ సీనియర్ మాధ్యమిక పాఠశాల, ఉన్నాయి. సమీప పాలీటెక్నిక్ , ఈ గ్రామానికి 5 కి.మీ. లోపు ఉన్నది. సమీప బాలబడి (కుప్పం లో, సమీప ఆర్ట్స్, సైన్స్, కామర్సు డిగ్రీ కళాశాల, సమీప ఇంజనీరింగ్ కళాశాలలు , సమీప వైద్య కళాశాల , సమీప మేనేజ్మెంట్ సంస్థ, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, సమీప అనియత విద్యా కేంద్రం (కుప్పం లో, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల (శెట్టిపల్లెలో ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో ఉన్నాయి.[2]ఈ గ్రామములో ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలదు.[3]

ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు

ఈ గ్రామములో 1 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం , సమీప మాతా శిశు సంరక్షణా కేంద్రం , సమీప ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సమీప అలోపతీ ఆసుపత్రి, సమీప టి.బి వైద్యశాల, సమీప ఆసుపత్రి, సమీప పశు వైద్యశాల, సమీప సంచార వైద్య శాల, సమీప కుటుంబ సంక్షేమ కేంద్రం ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో ఉన్నాయి.

త్రాగు నీరుసవరించు

రక్షిత మంచినీటి సరఫరా గ్రామంలో లేదు. గ్రామంలో మంచినీటి అవసరాలకు చేతిపంపుల నీరు, గొట్టపు బావులు / బోరు బావుల నుంచి నీటిని వినియోగిస్తున్నారు.

పారిశుధ్యంసవరించు

గ్రామంలో మూసిన డ్రైనేజీ వ్యవస్థ లేదు. మురుగునీరు నేరుగా నీటి వనరుల్లోకి వదలబడుతోంది. ఈ ప్రాంతం పూర్తి పారిశుధ్య పథకం కిందికి వస్తుంది. సామాజిక మరుగుదొడ్ల సౌకర్యం ఈ గ్రామంలో లేదు.

కమ్యూనికేషన్, రవాణా సౌకర్యంసవరించు

ఈ గ్రామములో టెలిఫోన్ (లాండ్ లైన్) సౌకర్యం , పబ్లిక్ ఫోన్ ఆఫీసు సౌకర్యం, మొబైల్ ఫోన్ కవరేజి, పబ్లిక్ బస్సు సర్వీసు, ఆటో సౌకర్యం, ఉన్నాయి. సమీప ట్రాక్టరు, ఈ గ్రామానికి 5 కి.మీ. లోపు ఉన్నది. సమీప ప్రైవేట్ బస్సు సర్వీసు, ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ దూరములో ఉన్నది. సమీప పోస్టాఫీసు సౌకర్యం, సమీప ఇంటర్నెట్ కెఫెలు / సామాన్య సేవా కేంద్రాల సౌకర్యం, సమీప రైల్వే స్టేషన్, సమీప ప్రైవేటు కొరియర్ సౌకర్యం, సమీప టాక్సీ సౌకర్యం, ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో ఉన్నది. సమీప జాతీయ రహదారి గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది. సమీప రాష్ట్ర రహదారి గ్రామానికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోపు ఉంది.. గ్రామంప్రధాన జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది. గ్రామంఇతర జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది.ఈ గ్రామానికి పరిసర ప్రాంతంలో వున్న అన్ని ప్రదేశాలకు రోడ్డు కలుపబడి వున్నది బస్సుల సౌకర్యము కూడ వున్నది. ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైల్వే స్టేషను లేదు.

మార్కెట్, బ్యాంకింగ్సవరించు

ఈ గ్రామములో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, ఉన్నాయి. సమీప ఏటియం, సమీప వాణిజ్య బ్యాంకు , సమీప సహకార బ్యాంకు, సమీప వ్యవసాయ ఋణ సంఘం, సమీప వారం వారీ సంత, సమీప వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు

ఈ గ్రామములో అంగన్ వాడీ కేంద్రం (పోషకాహార కేంద్రం), ఇతర (పోషకాహార కేంద్రం), ఆశా కార్యకర్త (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త), వార్తాపత్రిక సరఫరా, అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీప ఏకీకృత బాలల అభివృద్ధి పథకం (పోషకాహార కేంద్రం), సమీప ఆటల మైదానం, సమీప సినిమా / వీడియో హాల్, సమీప పబ్లిక్ రీడింగ్ రూం, సమీప గ్రంథాలయం, ఈ గ్రామానికి 10 కి.మీ కన్నా ఎక్కువ దూరములో ఉన్నాయి.

విద్యుత్తుసవరించు

ఈ గ్రామములో విద్యుత్తు ఉన్నది.

భూమి వినియోగంసవరించు

గ్రామంలో భూమి వినియోగం ఇలా ఉంది (హెక్టార్లలో):

 • అడవి: 211.9
 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 19.1
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 173
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 6
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 18
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 150
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 15
 • బంజరు భూమి: 24
 • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 196
 • నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 190
 • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూ క్షేత్రం: 45[4]

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

గ్రామంలో వ్యవసాయానికి నీటి పారుదల వనరులు ఇలా ఉన్నాయి (హెక్టార్లలో): బావులు/గొట్టపు బావులు: 45

తయారీసవరించు

ఈ గ్రామం ఈ కింది వస్తువులను ఉత్పత్తి చేస్తోంది (పై నుంచి కిందికి తగ్గుతున్న క్రమంలో):వేరుశనగ, రాగి, వరి

మూలాలుసవరించు

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-09-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-10-01. Cite web requires |website= (help)
 2. https://github.com/IndiaWikiFiles/Andhra_Pradesh/blob/master/Chittur-Villages-Telugu/Kangundi_596915_te.wiki
 3. "http://www.onefivenine.com/india/villages/Chittoor/Kuppam/Kangundi". Retrieved 16 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
 4. https://github.com/IndiaWikiFiles/Andhra_Pradesh/blob/master/Chittur-Villages-Telugu/Kangundi_596915_te.wiki

వెలుపలి లంకెలుసవరించు"https://te.wikipedia.org/w/index.php?title=కంగుంది&oldid=2904537" నుండి వెలికితీశారు